fvz

Friday, September 28, 2012

Wednesday, September 19, 2012

Tuesday, September 18, 2012

ప్రశాంతంగా గడిచిన రోజు లేదు . . .

జగన్ కోసం - 1
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే ఆయన చేసిన తప్పు అన్నట్టుగా జగన్‌పై కేసుల మీద కేసులు పెట్టారు. ఇళ్లు సోదాలు చేయించారు. అనుక్షణం వెంటపడ్డారు. అన్ని పార్టీలవాళ్లు కలిసి చేస్తున్న దాడి ఒకవైపు వారికి సపోర్టుగా విషం చిమ్ముతున్న కొన్ని పత్రికలు, కొన్ని చానెల్సు మరోవైపు. పాములు కూడా ఇంతగా పగపట్టవు.

ఈ రోజుకి మా మామగారు వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మా మధ్య నుంచి వెళ్లిపోయి 3 సంవత్సరాల 13 రోజులైంది. జగన్‌ను జెయిల్‌లో పెట్టి 112 రోజులైంది. కాని ఈ మూడు సంవత్సరాలలో ముప్ఫయి ఏళ్లకు సరిపడా కష్టాలు చూసినట్టుగా ఉంది.

మా మామగారు రాష్ట్రానికి పెద్ద దిక్కు. నా పార్టీ నీ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి పరిష్కరించడానికి చూసేవారు. ప్రతి ఒక్కరి కంటి తడి తుడవడానికి చూసేవారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటి పెద్దగా ఒక్కరోజు కూడా బాధ్యతను విస్మరించేవారు కాదు. మాకు సలహాలు ఇచ్చేవారు. ప్రతి పనిలో సూచనలు చేసేవారు. చిన్నా పెద్దా అని లేదు. అందరికీ ఆలోచనలో సాయం చేసేవారు. ఏదైనా సమస్య వస్తే ఆయన ధైర్యం చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేరు. అసలు ఆయన ఉండటమే పెద్ద ధైర్యం.

అలాంటి మనిషిని, మాకు కొండంత అండని, అంతపెద్ద ఆసరాని మా నుంచి అకస్మాత్తుగా దేవుడు తీసుకెళ్లాడు. మా కాళ్ల కింద నేల కదిలిపోయినట్టుగా అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సంతోషంగా ప్రశాంతంగా గడిచిన రోజు లేదు. ఈ కష్టంలో మేముంటే ఆదరించాల్సినవాళ్లే ఓదార్పు పలకాల్సినవాళ్లే పరాయివాళ్లయ్యారు. పగవారయ్యారు. మమ్మల్ని వేధించేవాళ్లయ్యారు. వాళ్లు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని సమస్యలు తెచ్చి పెట్టినా దేవుని దయవలన మా మామగారిని ప్రేమించిన ప్రజల అండ వలన జగన్ ముందుకు నడిచాడు. ప్రజలకు నేనున్నానన్న ధైర్యం ఇచ్చాడు. తన తండ్రిలానే వారిని గుండెలకు హత్తుకున్నాడు. ప్రజలూ వైఎస్‌ను అభిమానించినట్టే ఆయననూ అభిమానించారు. కాని దానిని వాళ్లు సహించలేకపోయారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే ఆయన చేసిన తప్పు అన్నట్టుగా జగన్‌పై కేసుల మీద కేసులు పెట్టారు. ఇళ్లు సోదాలు చేయించారు. అనుక్షణం వెంటపడ్డారు. అన్ని పార్టీలవాళ్లు కలిసి చేస్తున్న దాడి ఒకవైపు, వారికి సపోర్టుగా విషం చిమ్ముతున్న కొన్ని పత్రికలు, కొన్ని చానెల్సు మరోవైపు. పాములు కూడా ఇంతగా పగపట్టవు. మధ్యలో గులాంనబీ గారు ఉపఎన్నికల ప్రచారంలో ‘మా పార్టీలో జగన్ ఉంటే కేంద్ర మంత్రిని చేసేవాళ్లం, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లం’ అని అనడం చూస్తే, వాళ్ల మాటలతో విభేదించడం వల్లే జగన్‌ను జైలుపాలు చేశారని తెలుస్తోంది. ఆ మాటలు గుర్తుకువచ్చినప్పుడల్లా తూటాల్లా తగిలి గుండెను పిండివేస్తున్నంత బాధ కలుగుతుంది.

కాని ఇన్ని చేసినా ఇంత వేధించినా జగన్ భయపడలేదు. నమ్మినదారి విడువలేదు. ఆ సమయంలో మాతో అనేవాడు- నాయనను ప్రేమించిన ప్రతి గుండె తోడుగా ఉన్నంతవరకూ, పై నుంచి నాయన, దేవుడు నన్ను చూసి ఆశీర్వదిస్తున్నంత వరకూ నాకే భయం లేదు- అని! నిజమే. ప్రజలతో నడుస్తున్న జగన్ ప్రజల కోసం నడుస్తున్న జగన్ ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఇది వారికి నచ్చలేదనుకుంటా. అరెస్టు చేశారు. అలా చేస్తే అయినా జగన్ భయపడతాడేమోనని చూశారు. అలా జరగలేదు. జగన్ భయపడలేదు. చెదరలేదు. బెదరలేదు. కాబట్టి బెయిల్ రాకుండా చేయాలని ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారు. నానా రాతలు రాస్తున్నారు. ఒకరోజు మేము లాయర్‌ని మార్చామని. ఒకరోజు సిబిఐ లాయర్‌ని మార్చిందని. ఏం చేసినా ఎవరు చేసినా తప్పే. ఏం చేయకపోయినా తప్పే. వీళ్ల పెన్నుల్లో ఉన్నది ఇంకు కాదు. బురద.

రాష్ట్రంలో నిత్యం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. అయినా సరే టిడిపికి ఇవన్నీ పట్టవు. దానికి జగనే లక్ష్యం. వాళ్లు గనక జగన్ మీద మాట్లాడినన్ని మాటలు ప్రజాసమస్యలపై మాట్లాడి ఉంటే కొద్దో గొప్పో విశ్వసనీయత వచ్చి ఉండేది. కాంగ్రెస్‌లో తమ అధికారం కాపాడుకోవడం కోసం జగన్ మీద మాట్లాడినన్ని మాటలు జనం కోసం మాట్లాడి ఉంటే వారి స్థానం పదిలంగా ఉండేదేమో.

మా మామగారు కూడా 32 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. కాని ఏ రోజూ అవతలివాళ్లను దొంగదెబ్బ తీసి పైకి రావాలని అనుకోలేదు. ఆయన ఈరోజు ఉంటే ఇలా చేసేవారా? ఒక చంద్రబాబు కొడుకునో, ఒక కిరణ్‌కుమార్ కొడుకునో, ఒక బొత్స కొడుకునో, ఒక రామోజీ కొడుకునో లక్ష్యంగా చేసుకొని పీడించి ఉండేవారా అని ఆలోచిస్తే చేసేవారు కాదనే అనిపించింది. ఒక్కరిని చేసి చుట్టుముట్టి బాధ పెట్టి వికృత ఆనందం పొందే నీచత్వానికి దిగజారి ఉండేవారా? ముమ్మాటికి కాదు. ఆయనది అన్నం పెట్టిన చరిత్ర. చేయూతనిచ్చిన చరిత్ర. పగవారిని సైతం ప్రేమించిన చరిత్ర. అందుకే ఆయన చరిత్రకెక్కారు.

ఇవాళ మమ్మల్ని చుట్టుముట్టింది అందరూ పెద్దవాళ్లే. పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లే. కాని వారి కంటే ఏమీ చదువుకోని వాళ్లు ఏమీ లేని నిరుపేదలు తమ కుటుంబాలలో ఒకడిగా ఇవాళ జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. మానవత్వం చూపారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్‌ను చూసి రాజకీయాలు తెలియని అవ్వలు, తాతలు, అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు నువ్వు ఒంటరివి కాదు మేమున్నామని చెప్పారు. 17 ఎమ్మెల్యే స్థానాల్లో, 2 ఎంపి స్థానాల్లో జగన్ అభ్యర్థులను జయజయధ్వానాలతో గెలిపించారు. ఇవాళ ఇండియా టుడే, ఎన్‌డిటివి వంటి విశ్వసనీయ సంస్థల సర్వేల్లో మేమంతా జగన్ పక్షమే అని ఎలుగెత్తి చాటారు. జరుగుతున్నది అన్యాయమని పెద్దలకు వినపడేలా చెప్పారు. ఇంతకంటే ఏం కావాలి?

జగన్‌కు నీచ రాజకీయాలు కుమ్మక్కు ఆలోచనలు తెలియదు. అందుకే అనుకుంటా ఆయనను అందరూ కలిసి ఒంటరిని చేశారు.

- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్

Monday, July 09, 2012

INNOVATIVE YSR FANS FROM LOS ANGELES, USA

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతిని అమెరికాలోని లాస్ఏంజెలెస్ లో వినూత్నరీతిలో నిర్వహించారు. వైఎస్సార్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల ఆధ్వర్యంలో జూలై 8న భూమికి పదివేల అడుగుల ఎత్తులో అభిమాన నేత జయంతిని అపూర్వరీతిలో జరిపారు. వీరారెడ్డితో పాటు వైఎస్సార్ ఫ్యాన్ క్లబ్ సలహాదారు నగేష్, సభ్యులు శ్రీకాంత్ రెడ్డి కోమటిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరబాబు అంబటి లాస్ఏంజెలెస్ నుంచి హెలికాప్టర్ లో గాల్లోకి ఎగిరారు. హెలికాప్టర్ లో వైఎస్సార్ చిత్రపటం ముందు కేక్ ఉంచి కట్ చేశారు. వైఎస్సార్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు చేసిన నినాదాలతో హెలికాప్టర్ ప్రతిధ్వనించింది. రాజశేఖరరెడ్డి క్లాస్ మేట్ డాక్టర్ ప్రేమ్ రెడ్డికు చెందిన న్యూపోర్ట్ బీచ్ హౌస్ పై ఈ వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ ఫౌండేషన్ అవార్డు అందుకున్న వైఎస్సార్ సన్నిహితులు డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డిలకు వీరారెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహానేత జయంతి వేడుకలు నిర్వహించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Vijayamma, Sharmila Donated Blood

Thursday, June 21, 2012

YSR FANS CLUB CELEBRATIONS IN USA

ఉప ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ లోక్‌సభ స్ధానాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల లాస్ ఏంజిల్స్‌లోని వైఎస్‌ఆర్ ఫ్యాన్స్ క్లబ్ హార్షం వ్యక్తం చేసింది. లాస్ ఏంజిల్స్‌లో టోర్రన్స్‌లోని బాంబే తండూరీ బోకె హాల్‌లో శనివారం మధ్యాహ్నాం వైఎస్‌ఆర్ ఫ్యాన్స్ క్లబ్ విజయోత్సవాల సంబరాలు జరుపుకుంది.

ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ప్రజలు ఇచ్చిన కానుకగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నంద్యాల వీరారెడ్డి అభివర్ణించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయ్యాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు కాలగర్భంలో కలిసి పోతాయని హెచ్చరించారు.
ఈ ఉప ఎన్నికల తీర్పు ద్వారా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఈ వేడుకల్లో భాగంగా వైఎస్‌ఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నంద్యాల వీరారెడ్డి, సలహాదారులు ధర్మారెడ్డి గుమ్మడి, నగేష్‌లు కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమాని ఆర్థికంగా తోడ్పాటు అందించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్లాస్‌మెట్, అమెరిన్ బిలియనీర్ డాక్టర్ ప్రేమ్‌రెడ్డికి ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నంద్యాల వీరారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించిన ఆరు జెట్ విమానాలు, హెలికాప్టర్‌లతో ఆకాశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయోత్సవాలను జరుపుకుంది. ఇవి ఆకాశంలో విన్యాసం చూపరులను అకట్టుకుంది.
ఈ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ విజయం ప్రజా విజయమని లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ తెలుగు నాయకుడు నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాకోర్టు అసలు సిసలు తీర్పును వెలువరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విజయం చేకూర్చిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించిన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అక్రమంగా వైఎస్ జగన్ అరెస్ట్, విజయమ్మ, షర్మిలా ప్రసంగాలు ఈ ఉప ఎన్నికల విజయానికి దోహాదపడిన అంశాలని నాగేశ్వరరావు పేర్కొన్నారు.

లాస్ ఏంజిల్స్‌లోని తెలుగు మహిళ నాయకులు పుష్పారెడ్డి, దివ్యా రెడ్డి బొమ్మారెడ్డి, ఉమాదేవి, కిరణ్మయి. సంధ్యలతోపాటు వైఎస్‌ఆర్ ఫ్యాన్స్‌క్లబ్ సభ్యులు రాజశేఖర రెడ్డి కసిరెడ్డి, అనిల్ మనేపల్లి, లక్ష్మణ్ రెడ్డి, సందీప్, ఇనగంటి శ్రీను, శ్రీకాంత్ రెడ్డి, సుధీర్ ఒబులం, మాధవ్ రెడ్డి, గౌతమ్, సుధీర్, మోహన్ రెడ్డి, రాజరెడ్డిలు ఈ కార్యక్రమ నిర్వహాణకు కీలక పాత్ర పోషించారు.


Wednesday, June 20, 2012

NRI's Demanding For Jagan To Be Release

ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం తమకు సంతోషాన్ని కలిగించిందని ఫ్లోరిడాలోని ఎన్నారైలు తెలిపారు. ఈ సందర్భంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి దుర్దినాలు ప్రారంభమయ్యాయని వారు పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇంకా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బ్రిటీష్ వారి పరిపాలన సాగిస్తున్నారన్నారు. దీనిని అందరూ సమైక్యంగా అడ్డుకోవాలని వారు సూచించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయ్యాలని ఎన్నారైలు డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్, షర్మిలాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. పరకాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి భిక్షపతితో నువ్వానేనా అన్నట్లు తలపడ్డారని, అయితే చివరకు స్వల్ప తేడాతో సురేఖ ఓటమిని చవిచూడడంతో కొంత నిరాశకు గురైనట్లు ఫ్లోరిడా ఎన్నారైలు పేర్కొన్నారు. డాక్టర్ వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి, రామచంద్రరెడ్డి అక్కవరమ్, రఘు పాడి, డాక్టర్ శ్రీకాంత్ రామ్, పరంధామ రెడ్డి, చందు తల్లా, వీరారెడ్డి.కె, ప్రభాకర్, సుభాష్ వజ్జా, రామకృష్ణ, సయ్యద్ ఫాజిల్, షకీలా సయ్యద్, డాక్టర్ మోహన్ కొండా, జె.డి. ఏలేటి, విజయ్ కలకట్ట, మధు పొంగుమట్టి, రఘునాథ్ కొండా, లక్ష్మణ్ రెడ్డి కసి, అధినారాయణ లాగుడు, బొజ్జా ఆర్ కమలాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tuesday, June 19, 2012

BAL THAKRE EDITORIAL ON JAGAN

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని వీడినందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరాఠా దినపత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో సోమవారం పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలను కూడా ఈ ఎడిటోరియల్‌లో విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలు.. ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో స్పష్టం చేశాయని కుండబద్దలు కొట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక సానుభూతి ఒక్కటే లేదని, కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న ఆగ్రహం కూడా పనిచేసిందని తెలిపారు.

‘ఆంధ్ర మదిల్ భూమ్‌రంగ్’ శీర్షికతో ఠాక్రే రాసిన సంపాదకీయంలో కాంగ్రెస్ సహా ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీని కూడా ఎండగట్టారు. ఉపపోరులో కాంగ్రెస్ మట్టికరిచిందని వ్యాఖ్యానించారు. 18 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని ప్రజలు పక్కనబెట్టారని, వారి ఎన్నికల గుర్తు సైకిల్‌ను ప్రజలు పాత ఇనుపసామాన్లతో జమకట్టారని ఘాటుగా పేర్కొన్నారు. ‘ఉప తీర్పు కాంగ్రెస్‌కు ప్రమాదఘంటిక. అక్కడి ప్రజలు తమ పాలకులుగా ఎవరిని కోరుకుంటున్నారో ఓటు ద్వారా తెలియపరిచారు.’ అని ఠాక్రే రాశారు.

బెడిసికొట్టిన కాంగ్రెస్ కుట్ర..

జగన్‌పై కాంగ్రెస్ పన్నిన కుట్ర బెడిసికొట్టిందని బాల్ ఠాక్రే అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన దివంగత రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అనంతరం, ఆయన కుమారుడు జగన్‌కు కాంగ్రెస్ పార్టీలో ఆదరణ కరువైందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీనుంచి వెలుపలికి వచ్చి ప్రజలను ఆశ్రయించారని, వారి ఆదరణ చూరగొన్నారని విశ్లేషించారు. జగన్ ప్రజాదరణ పొందడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ అధిష్టానం అక్రమాస్తుల పేరుతో సి.బి.ఐ. దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు.

అరెస్టు కూడా కుట్రే!

ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉండేందుకు జగన్‌ను జైల్లో పెట్టించిందని కాంగ్రెస్‌పై బాల్ ఠాక్రే నిప్పులు చెరిగారు. అయితే, ఈ చర్య కాంగ్రెస్‌కే నష్టం తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మార్చే అవకాశం లేకపోలేదని ఠాక్రే రాశారు. అయితే, ఇది వారి పార్టీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు.

Saturday, June 16, 2012

YSRCP DETROIT NRI's CELEBRATIONS

ఉపఎన్నికల ద్వారా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వాసాన్ని ప్రకటించారని డెట్రాయిట్‌లోని ఎన్నారైలు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నిలకొన్నాయి. వీటిని అధిగమించి రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు వేళ్లేలా చేయగల సత్తా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని వారు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయాన్ని అర్ధం చేసుకుని అన్ని పార్టీలు వైఎస్‌జగన్‌కు మద్దతు పలకాలని వారు సూచించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన 15 మంది వైఎస్‌ఆర్ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు నెల్లూరు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన మేకపాటి రాజమోహన రెడ్డికి ఈ సందర్భంగా అభినందనలు తెలియచేశారు.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు శుక్రవారం తెల్లవారుజామున సంబరాలు జరుపుకున్నారు. అధికార, ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాతోపాటు సీబీఐ ఎన్ని కుట్రలు చేసిన, కక్ష సాధింపు చర్యలకు దిగిన ప్రజలే అసలు న్యాయనిర్ణేతలని ఈ ఎన్నికల ద్వారా రుజువు చేశారని డెట్రాయిట్ ఎన్నారైలు అభిప్రాయపడ్డారు.

ఎన్నారై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల హరి ప్రసాద్ రెడ్డి, యుంగధర్ భుమిరెడ్డి, వెంకట్ బీరం, సునీల్ మండుటి, వినోద్ ఆత్మకూర్,పురుషోత్తం కూకటి, టీ శ్రీధర్, జగన్, దేవనాథ్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, శ్రీనివాస్ పిడపర్తి, రమణ కొనుగంటి,శ్రీనివాస్ బర్ల, సాంబిరెడ్డి, బీవీరెడ్డి, నరేష్ పూల, వేణు కాగితాల, కొండారెడ్డి, ప్రదీప్, డాక్టర్ అశోక్ రెడ్డి ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

Sunday, June 10, 2012

Kola Krishnamohan Revealed The Truth


* బాబు సీఎంగా ఉన్నప్పుడు లోక్‌సభ సీటు ఇస్తానని రూ. 5.10 కోట్లు తీసుకున్నారు * అందులో రూ.10 లక్షలు మాత్రమే కోర్టుకు ఇచ్చారు * మిగతా డబ్బులు అడిగినందుకు నాపై మూడుసార్లు హత్యాయత్నం చేయించారు * లాటరీ కేసులో ఈడీకి చంద్రబాబు విదేశీ బ్యాంకు అకౌంట్ల ఆధారాలు లభించాయి * ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కు బాబు రూ. 50 లక్షలు లంచం ఇచ్చి మేనేజ్ చేశారు * బాబుకు చెందిన 4 విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలు బహిర్గతం చేసిన కోలా * తన వద్ద ఉన్న ఆధారాలతో త్వరలో హైకోర్టులో పిటిషన్ వేస్తానని ప్రకటన * బాబు కుటుంబ సభ్యుల 12 విదేశీ బ్యాంకు ఖాతాలనూ బయటపెడతానని వెల్లడి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అంతర్జాతీయంగా విస్తరించుకున్న ధన సామ్రాజ్యం గుట్టును ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన కోలా వెంకట కృష్ణమోహన్ రట్టు చేశారు. బాబు హవాలా బాగోతాలను ఒక్కొక్కటిగా పలు పత్రాల రుజువులతో సహా బయటపెట్టారు. చంద్రబాబుకు పలు విదేశాల్లో గల నాలుగు బ్యాంక్ అకౌంట్ల నంబర్లను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన విదేశీ బ్యాంకు ఖాతాకు తాను రూ. 4 కోట్లు ఎలా బదిలీ చేసిందీ బహిర్గతం చేశారు. బాబు విదేశీ బ్యాంకు అకౌంట్ల విషయం తెలుసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను రూ. 50 లక్షలు ఇచ్చి ఎలా మేనేజ్ చేసిందీ వివరించారు. ఆయన విదేశీ బ్యాంకుల్లో భారీ ఎత్తున డబ్బు ఉందని.. సింగపూర్‌లోని బ్యాంక్ అకౌంట్ ఇప్పటికీ ఆపరేట్ అవుతోందని చెప్పారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 112 హోటళ్లు కలిగి ఉన్న మారియట్‌లో చంద్రబాబుకు వాటా ఉందని.. అందుకే ఆయన ప్రతి ఏటా సింగపూర్, స్విట్జర్లాండ్‌లకు వెళ్తుంటారని వెల్లడించారు. బాబు హవాలా బాగోతాలకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలన్నింటితో కలిపి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేస్తానని కోలా తెలిపారు. ఆయనపై సీబీఐతో పాటు మరే ఇతర సంస్థల చేత విచారణకు ఆదేశించినా.. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ అందజేస్తానని కోలా వివరించారు. వారం రోజుల్లో మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించి చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెందిన 11 విదేశీ బ్యాంక్ అకౌంట్ల నంబర్లను బయటపెట్టనున్నట్లు కోలా చెప్పారు.
‘‘నాకు 1999 సంవత్సరంలో యూరో లాటరీ తగిలిందని ప్రకటన వెలువడగానే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. తన తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ నాకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. ఆయన దగ్గరికి వెళ్లిన తరా్వాత వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ సీటు ఇస్తానంటూ.. నా నుంచి పార్టీ ఫండ్‌గా డబ్బు డిమాండ్ చేశారు. అప్పుడు ఆయన సీఎంగా ఉండటంతో పాటు రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతుండటంతో అప్పట్లో ఐదు కోట్ల పది లక్షల రూపాయలు అందజేశా. అందులో పది లక్షలు చెక్కు రూపంలో ఇవ్వగా.. కోటి రూపాయలను రెండు ట్రంకు పెట్టల్లో తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చా. మిగతా నాలుగు కోట్లు లండన్‌లోని మిడ్‌ల్యాండ్ బ్యాంక్ (ప్రస్తుతం ఇది హెచ్.ఎస్.బి.సిలో విలీనం అయ్యిందని కోలా చెప్పారు)లో నాకున్న అకౌంట్ నుంచి నేరుగా చంద్రబాబుకు సింగపూర్‌లో ఉన్న డాయిషే బ్యాంకు అకౌంట్‌లో జమచేశా. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో నాకు సీటు ఇవ్వలేదు. ఇదేమని ప్రశ్నిస్తే రాజ్యసభ సీటు ఇస్తానని నమ్మబలికారు.
డబ్బులు తీసుకుని లేడీతో లోకేష్ జంప్ చంద్రబాబు కుమారుడు లోకేష్‌బాబు నాదగ్గర రూ. 60 లక్షలు తీసుకుని ఒక టీచర్‌తో జంపయ్యాడు. లోకేష్‌కు మా ఇంట్లో రూ. 25 లక్షలు, చంద్రబాబు ఇంట్లో మరో రూ. 35 లక్షలు ఇచ్చాను. మహిళతో వెళ్లిపోయిన లోకేష్‌ను వెతకటానికి చంద్రబాబే స్వయంగా నన్ను బెంగళూరు పంపించారు.

Friday, June 08, 2012

VIJAYAMMA SHARMILA BY-ELECTION CAMPAIGN

కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆ హెలికాప్టర్‌లో ఎందుకు ఎక్కలేదు

: షర్మిల

‘‘నాన్న తెచ్చిన అధికారాన్ని వాడుకుని కాంగ్రెస్ పెద్దలు మా కుటుంబాన్నే వేధిస్తున్నారు. సీబీఐ విచారణ పేరుతో జగనన్నను జైలుపాలు చేశారు. సింహం బోనులో ఉన్నా సింహమే అని వారు గుర్తెరిగేలా ఉప ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి’’ అని వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల.. ప్రజలకు పిలుపునిచ్చారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సీబీఐ.. జగన్ కేసులో ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ‘‘నాన్న సెప్టెంబర్ 2న హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లాకు పయనమయ్యారు. ఆ రోజు ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా నాన్నతో కలిసి ఆయన సొంత జిల్లాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన వెళ్లలేదు. మరి హెలికాప్టర్ ప్రమాదం తెలిసే వెళ్లలేదా? తెలియక వెళ్లలేదా?’’ అని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు.
మీ ఓట్లు వైఎస్సార్‌పైనే: ‘‘పేదల కోసం, రైతుల కోసం పదవులు త్యజించిన ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు వేసే ప్రతి ఓటు వైఎస్సార్‌కు వేసినట్లే. మీరు వేసే ప్రతి ఓటు జగన్‌కు వేసినట్లే. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుళ్లు, కుతంత్రాలను కడిగేసేందుకు మీ ఓటే ఆయుధం. జైలుగోడలు బద్దలయ్యేలా ఉప ఎన్నికల్లో మీరు తీర్పు చెప్పాలి. మా కుటుంబానికి అండగా నిలిచిన వారిని గెలిపించండి’’ అంటూ విజయమ్మ ప్రజలను అభ్యర్థించారు.

Sunday, June 03, 2012

Give Clear Verdict : Sharmila

Singapore NRI's Standing Support For Jagan

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దివంగత వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అణచివేత వైఖరులకు సింగపూర్ ఎన్నారైలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో 72 గంటలపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం నాయకులు చేసిన దీక్షలకు వారు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సింగపూర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు, నాయకులు అయిన జయప్రకాశ్ రెడ్డి, నరేష్, జయప్రకాశ్, సత్యంశేఖర్, శివకేశవ్, ఈశ్వరరావు, సూర్యనాయుడు, గుంటిరామ్, జానకీరాం, చిన్నా, సురేష్, చెన్నారెడ్డి, లక్ష్మణ్, రామచంద్ర, సుబ్బారెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు జగన్ కు తమ సంఘీభావాన్ని తెలిపారు.

హైదరాబాద్ లో దీక్ష చేసిన వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ కన్వీనర్ చల్లా మధుసూదన్ రెడ్డి, సభ్యుడు హర్షవర్థన్ రెడ్డి తదితరులకు తమ సంపూర్న మద్దతు ప్రకటించారు. జగన్ కు న్యాయం జరిగేంతర వరకు తాము కూడా పోరడతామని స్పష్టం చేశారు. ఆంధ్రా ప్రజలు ఇప్పటికీ, ఎప్పటికీ జగన్ తోనే కలసి నడుస్తారని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ లు చేస్తున్న కుట్రలకు రానున్న ఉప ఎన్నికల్లో ప్రజలు తమ బలం చూపించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే గెలుపు అని వారు పేర్కొన్నారు.
 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top