fvz

Thursday, May 31, 2012

AUSTIN YSRCP NRI's CONDEMNED JAGAN ARREST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికమని నారాయణరెడ్డి గండ్ర మండిపడ్డారు. జగన్ అరెస్ట్ కు నిరసనగా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు స్థానిక స్వాగత్ రెస్టారెంట్ లో సమావేశం జరిగింది. వైఎస్ జగన్ కు, వైఎస్ విజయమ్మకు వైఎస్ఆర్ సీపీ నాయకులకు సంఘీభావం ప్రకటించారు.
జననేత జగన్ అక్రమ అరెస్ట్ కాంగ్రెస్, TDP వారి కుట్ర అని, రాజకీయం అంటే ప్రజల్ని కన్విన్స్ చేయటమే, అలా చేయకుండా రాజకీయ కక్షలకు పాల్పడటం మంచిది కాదు అని అన్నారు.

న్యాయమూర్తులను, న్యాయవాదులను మేనేజ్ చేసి న్యాయ వ్యవస్థను కాంగ్రెస్ హై కమాండ్ అపహాస్యం చేసిందని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. సిబిఐ విచారణ కాంగ్రెస్ ఆదేశాలకనుగుణంగా జరగడం బాధాకరం, దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడ్డారు. పక్షపాతపూరితమైన దర్యాప్తు ఆధారంగా రాష్ట్ర ప్రభుతం ఆలోచనారహితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను గృహ నిర్భంధం చేయడం సమంజసం కాదన్నారు.

ప్రజాదరణ ఉన్న జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కాంగ్రెస్ హై కమాండ్ వేధిస్తోందని..గత రెండు సంవత్సరాలుగా ఒంటరి వాడిని చేయాలని చేయని ప్రయత్నం అంటూ లేదని, జగన్ అభిమానుల్ని, అనుకూలంగా ఉన్న ఎంఎల్ఏలను, ఎంపీలను పలు విధాలుగా బ్లాక్మెయిల్కు పాల్పడటం ప్రజలు గమనిస్తూనే వున్నారని వారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, రాజకీయ నాయకులను లొంగదీసుకోవచ్చునేమో కాని, ప్రజల్ని మభ్య పెట్టలేరని ఇటీవల కాలంలో రుజువైందన్నారు. కడప, కొవ్వూరులో ప్రజల తీర్పు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెంపపెట్టని వారన్నారు. త్వరలో జరుగనున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ప్రజలు అఖండమైన మెజారిటీతో గెలిపించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పై కుటుంబం ఫై వున్నా అభిమానాన్ని చాటుకొనున్నారని ఎన్నారైలు జోస్యం చెప్పారు.

జగన్ ను కస్టడీలోకి సీబీఐ తీసుకున్న రోజున విజయమ్మ, భారతి, షర్మిలా పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి జరిగిన అవమానంగా కాకుండా, తెలుగు ఆడపడుచులకు జరిగిన అవమానంగా భావించామని హిమబిందు బండ్లపల్లి, పద్మిని గూడ, సురేఖ మరియు జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే జగన్ నిర్దోషిగా బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రవి బల్లాడ, వెంకట్ గౌతం, శ్రీనివాస రెడ్డి చింత, అగ్గి రామయ్య, ప్రవర్ధాన్ చిమ్ముల, మురళీధర్ బండ్లపల్లి, శ్రీనివాస్ సన్నపు, రఘు సిద్దపు, రామ హనుమంతు, సచి ముత్తురులు హాజరై, తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. కార్యక్రమానికి హాజరు కాని మహిళలు ఫోన్ ద్వారా జగన్ కు, విజయమ్మకు, వైఎస్ఆర్ సీపీ నాయకులకు తమ సంఘీభావాన్నితెలియచేశారు.

Tuesday, May 29, 2012

NRI's Condemned

పేద ప్రజల పెన్నిధి డాక్టర్ వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలలో వికసించిన జగన్ ను ఆదిలోనే తుంచి వేయాలనే కక్షతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై సీఎం కిరణ్, సోనియా గాంధీలు కుట్ర పన్నారని ఎన్నారైలు మండిపడ్డారు. వ్యక్తిగత కక్షతో, అసూయతో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగిందన్నారు. రాజకీయ క్రీనీడలో భాగంగానే జగన్ అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వ్యవస్థలు కూడా ఈ కుట్రలో భాగం కావడం సభ్య సమాజం తల దించుకునేలా చేస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కి ప్రజా ప్రస్తానంతో జవసత్వాలు తొడిగి, స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం వినూత్న పథకాలతో పేద, బడుగు , బలహీన,మధ్య తరగతి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగు పరచిన ఘనత వైఎస్ఆర్ కు దక్కిందని ఎన్నారైలు అభిప్రాయ పడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్తు నిచ్చి, పండిన ధాన్యానికి మద్దతు ధరనిచ్చి, జల యజ్ఞం తో భగీరథ ప్రయత్నం చేసి, పథకాల పకడ్బందీ అమలుకై విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన రాజ శేఖరరెడ్డికి అవినీతిపరుడనే ముసుగు వేసి ప్రజల గుండెల్లోంచి చెరిపివేయాలి అనే ఆలోచన ఏరు దాటిన తరువాత తెడ్డు తగలేయడం లాంటిదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధికార దురహంకారంతో, అసూయతో జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను అడ్డుకొన్న తీరును ఎండగట్టారు. జగన్ పై జరుగుతున్న అధికార దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. నిజం నిలకడగా తెలుస్తుంది, అంతిమంగా న్యాయం విజయం సాధిస్తుంది, అంతవరకు ప్రజా స్వామ్య పరిరక్షణ పోరాటం కొన సాగించాలి. నిందలు తొలగి ప్రజా సేవ కోసం జగన్ సగర్వం గా బయటకు వచ్చే రోజు ఎంతో దూరం లేదు, అంత వరకు పేద వాడి చిరునవ్వు కోసం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకోసం ద్విగునీక్రుతమైన దీక్ష తో పని చేయాలని కార్యకర్తలకు ఎన్నారైలు పిలుపునిచ్చారు. ఈ మేరకు అట్లాంట నుండి గురవా రెడ్డి, ఆర్కాన్సా నుండి రంగ రాజు ఒక ప్రకటన రూపంలో తెలియజేసారు.
ప్రకటన విదుదల చేసిన వారిలొ

అట్లాంట నుండి
గోపినాథ్ రెడ్డి, వెంకట్ మొండెద్దు, రవి సింగారెడ్డి, శ్రీనివాస్ కొట్లూర్, వెంకట్రామి రెడ్డి, సత్యా ద్వారంపూడి, రాజ్ కాసిరెడ్డి, రవి కాకులవరం, డాక్టర్ గిరి, కిరణ్ కందుల, వెంకట్ మదన, క్రిష్నమోహన్

న్యూజెర్సీ నుండి
రామి రెడ్డి, శ్రీని ఆరికట్ల, సురేష్ రెడ్డి, రాజేష్ గంగసాని, డాక్టర్ రాఘవ రెడ్డి, బసివి రెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, ప్రభాకర్ రెడ్డి

డెట్రాయిట్ మిషిగన్ నుండి
లింగాల హరిప్రసాద్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, కుకునూర్ వినోద్, భూమిరెడ్డి యుగంధర్, యార్లగడ్డ శివరాం, కొనుగంటి రమణరెడ్డి, ఆత్మకూరు వినోద్, గుణశేఖర్ రెడ్డి

ఫ్లోరిడా నుండి
డాక్టర్ వాసుదేవ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్ తాల్ల, రఘు పాడి, డాక్టర్ సతీష్ కేసవ, డాక్టర్ బాలి రెడ్డి, రామచంద్ర ఆకవరం, డేనియల్ అడిపి

సైంట్ లూయిస్ నుండి
సుబ్బా రెడ్డి పమ్మి, గోపాల్ రెడ్డీ తాటిపర్తి, కిరణ్ ములుపూరు, సాయిక్రిష్న, దినేష్ బత్తుల, చనూ తారపరెడ్డి, నంద ముటాల, నరసిమ్హా కొండా

బ్లూమింగ్డేల్ నుండి
లింగా రెడ్డి గున్నపనేని, సుధీర్ కంచి, రఘుకరెడ్డి

రిచ్మండ్ వర్జీనియా నుండి
విస్వనాథ కిచ్చిలి, నరసిమ్హా రనబోతు, వెంకట్ కుందవరం, శేఖర్ రెడ్డి, రణధీర్ కాలవ

వర్జీనియా/వాషింగ్టన్ నుండి
భువనేష్ బూజాల, రమేష్ వల్లూరు, వెంకట్ కొండపోలు, రాజీవ్ రాజోలు

లాస్ ఏంజెల్స్ నుండి
వీరారెడ్డి నంద్యాల, రాజశేఖర్ కెసిరెడ్డి, శ్రీకాంత్ మండిపాటి, శివా వంగ, మధు కోలి, సందీప్ రెడ్డి
బే ఏరియా నుండి శ్రీ గోపి, రాఘవ యంగాల, మధు వంగా, సురేష్ వుయ్యూరు

టెక్సాస్ నుండి
నారాయణ రెడ్డి, రంగేష్ కోన. సుబ్బా రెడ్డి చింతగుంట , రవి బల్లడ, మురలీధర్ బండ్లపల్లి, ప్రవర్ధన్ చిమ్ముల, రఘు సిద్దపురెడ్డి, శ్రీధర్ కొర్సపాటి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ గుర్రం, మధు గూల్ల

డెమోయిన్ ఐయోవా నుండి
అమర్నాథ్ రెడ్డి తరిమెల, నిరంజన్ బోల్ల, యాదవ రెడ్డి

ఆస్ట్రేలియా నుండి రమణా రెడ్డి

ఐర్లాండ్ నుండి
జగన్నాధ రెడ్డి ముట్టుముల, శ్రీనివాస్ తెరా, రాజగోపాల్ తెరా, దీప జానెపల్లి, శ్రీధర్, సూరి, విజయేందర్ రెడ్డి, జయంత్ రెడ్డి మెట్టు

ఇంగ్లాండ్ నుండి
అబ్బయ్య చౌదరి, శ్రీనివాస్, జంగయ్య, జొసెఫ్, మహమద్ సమి

మిడ్డిల్ ఈస్ట్ నుండి
మహమ్మద్ అజర్, మహమ్మద్ నజీర్, మహమ్మద్ కరీం, మహమ్మద్ అజీజ్, షైక్ అక్తర్, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, శ్రీకాంత్, రాజేష్ రెడ్డి

Vijayamma To Campaign Further

బుధవారం నుంచి పార్టీ అభ్యర్థుల తరపున వై.ఎస్.విజయమ్మ ప్రచారం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘30న ఉదయం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విజయమ్మ ప్రచారం నిర్వహించి.. అదే రోజు సాయంత్రం విశాఖ జిల్లా పాయకరావు పేటలో ప్రచారం చేస్తారు. 31న ఉదయం పాయకరావుపేట, సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పర్యటిస్తారు. జూన్ 1వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, 2న పోలవరం, 3న గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో విజయమ్మ ప్రచారం చేస్తారు’ అని వివరించారు. ఆ తర్వాత ప్రచార కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామని రఘురామ్ పేర్కొన్నారు.

Saturday, May 26, 2012

OVER ACTION

పోలీసుశాఖ అత్యుత్సాహంతో రాష్ట్ర రాజధాని ప్రజలు శుక్రవారం మండుటెండలో నానా అవస్థలు పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరైన నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రోడ్డులో ఉన్న దిల్‌కుశ అతిథిగృహానికి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. ఖైరతాబాద్ జంక్షన్, సోమాజిగూడ నుంచి రాజభవన్‌రోడ్డుకు వెళ్లే మార్గాలను శుక్రవారం ఉదయం నుంచే పూర్తిగా మూసివేశారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. ఉదయం ఎనిమిది గంటలకే మొత్తం రోడ్లన్నీ దిగ్బంధనం చేయడంతో ఆఫీసులకు వెళ్లేవారు ఆందోళనకు గురయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి నివాసమైన లోటస్‌పాండ్‌కు వెళ్లే దారులనూ తెల్లవారు జామునుంచే పూర్తిగా మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండేవారిని సైతం వెళ్లనీయకుండా చెక్‌పోస్టులు పెట్టారు. గుర్తింపు కార్డులున్నవారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ఆ ప్రాంతంలో నివాసముండేవారు పోలీసులతో పలుచోట్ల వాగ్వివాదానికి దిగారు. దిల్‌కుశ, లోటస్‌పాండ్ ప్రాంతాల్లో భారీస్థాయిలో బారికేడ్లు ఏర్పాటుచేయడమేగాక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్), సాయుధ పారా మిలటరీ బలగాలను మోహరించారు. అంతేగాక ట్రాఫిక్‌ను పూర్తిగా మళ్లించడంతో చంటి పిల్లలతోసహా మండుటెండలో కాలినడకన కిలోమీటర్ల వరకు సామాన్యులు కొందరు నడిచి వెళ్లాల్సి వచ్చింది. విధి నిర్వహణకోసం దిల్‌కుశ అతిథిగృహం వద్దకు వెళ్లే మీడియా ప్రతినిధులకూ ఇబ్బందులు తప్పలేదు. మీడియాకు సంబంధించిన గుర్తింపు కార్డులను చూపినప్పటికీ కొందరు ప్రతినిధులను పోలీసులు ఆ రోడ్డులోకి అనుమతించలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్లే సమయంలో పోలీసులు మరింత హడావుడి సృష్టించారు.

Mysoora Reddy Joined Into YSR Congress Party

*జగన్ ఎదుగుతున్న నాయకుడు
*సీబీఐని అడ్డంపెట్టుకుని ఆయన్ను అడ్డుకోవాలని చూస్తున్నారు
* రాజకీయ కక్ష సాధింపులకే సీబీఐని వాడుతున్నారన్నది నిజం
*మోపిదేవిని సీబీఐ అరెస్ట్ చేసింది.. జగన్‌ను అరెస్ట్ చేయటానికే
*నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్పేందుకే మోపిదేవిని బలిచేశారు
*రాజకీయాలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలి కానీ ఇలా కాదు
* వైఎస్సార్ కాంగ్రెస్ కోసం కృషి చేస్తా.. సలహాలు, సూచనలు అందిస్తా
*పార్టీలో ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తా

వైఎస్సార్ కాంగ్రెస్‌కు అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. రాజకీయాల్లో ఏదైనా ఉంటే ప్రజ ల్లోకి వెళ్లి తేల్చుకోవాలే తప్ప పక్షపాతంతో కూడుకున్న విచారణలతో కాదని హితవుపలికారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎలాంటి బాధ్యతలను నిర్వహించబోతున్నారని ప్రశ్నించగా.. జగన్ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నిర్వహిస్తానని మైసూరా బదులిచ్చారు. జగన్‌కు ప్రజాదరణ పెరుగుతోందని ఉప ఎన్నికల్లో 18 స్థానాలూ వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Four People Passed Away, Coz Of The Media

సీబీఐ విచారణ పేరుతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే వదంతులు, ఓ మీడియాలో దుష్ర్పచారం నాలుగు నిండు ప్రాణాల ను బలిగొన్నాయి. వైఎస్ జగన్‌పై ప్రభుత్వం వేధిం పులకు గురిచేస్తోందని కలత చెందిన జగన్ అభిమానులు నలుగురు గుండెపోటుతో మృతిచెందారు. కర్నూలు, ఖమ్మం, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ వైఎస్‌ఆర్‌సీపీ నేత రాజగోపాల్‌రెడ్డి(48) శుక్రవారం జగన్ సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్న దృశ్యాలను వీక్షిస్తూ ఉద్వేగానికి లోనై కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యు లు చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
జగన్‌ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోందంటూ గురువారం రాత్రి టీవీల్లో వచ్చిన వార్తను చూసిన ఖమ్మం జిల్లా పాల్వంచలోని నెహ్రూనగర్‌కు చెందిన కాల్వ లక్ష్మయ్య (65) అదే విషయాన్ని భార్యాబిడ్డలతో చర్చిస్తూ కుప్పకూలిపోయాడు. దీంతో వారు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం గుడిపాడుకు చెందిన గరికిముక్కు రంగారావు (39) కూడా టీవీలో వార్తలు చూసి తీవ్ర మనోవ్యధకు గురయ్యూడు. దీంతో గురువారం రాత్రి గుండెపోటుకు గురయ్యూడని అతని తమ్ముడు రవి తెలిపాడు. బాధితుడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. మరో ఘటనలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సిద్దారెడ్డిపాళెం గ్రామానికి చెందిన సిగినం చినసుబ్బయ్య(42) కూడా జగన్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందన్న కథనాలకు కలతచెంది టీవీ చూ స్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందాడు.

Friday, May 25, 2012

Well Done Rajesh

Jagan Mohan Reddy's Questioning By CBI To Continue Tomorrow

Jagan Mohan Reddy, chief of the YSR Congress, emerged smiling from the Dilkusha Guest House in Hyderabad after nearly eight hours of questioning by the Central Bureau of Investigation (CBI) today in connection with a disproportionate assets case against him. He has been asked to return for more questioning at 10.30 am tomorrow.

Mr Reddy, who was on a hectic campaign tour ahead of by-elections to 18 assembly and one Lok Sabha seat on June 12, had returned to his Lotus Pond residence in Hyderabad on Thursday night. Friday morning he was given a send-off by his mother Vijayamma, wife Bharathi and sister Sharmila even as senior party leaders and supporters raised slogans as he left home.

Mr Reddy has been denied anticipatory bail and his supporters fear that he could be arrested. As he left home in the morning, Mr Reddy's mother, Vijaylakshmi, kissed and blessed him. He arrived at the CBI camp in a black SUV, smiled and greeted people who had gathered to show their support. He also asked supporters to stay calm.
The entire area around his home and the route from his home to the CBI camp office was sanitised of Mr Reddy's supporters and traffic, to avert any possible law and order trouble. The road from his Banjara Hills residence to the place of interrogation was fortified, lined with policemen. Personnel from the city police, Andhra Pradesh Special Police and Rapid Action Force (RAF) were deployed around the guest house and surrounding localities. Police kept water cannons and tear gas ready.

Prohibitory orders banning the assembly of five or more people have been imposed in the city and other parts of the state.

On Tuesday, Mr Reddy said in a letter to the Prime Minister that the Congress, the opposition Telugu Desam Party, and the CBI were conspiring to have him arrested ahead of by-elections in the state, scheduled for June 12. Mr Reddy's party is fielding candidates for all 18 constituencies which will vote. The Congress and the TDP are watching closely and anxiously how the YSR Congress fares in these by-elections.

There is a reason. When the 40-year-old MP arrived at the guest house, dressed in an off-white shirt, he was accompanied by Congress MP Sabbam Hari, and MLA Alla Nani. They face disciplinary action for being seen with him, but there are indications that at least half a dozen more Congress MLAs are ready to jump into the Jagan camp. Senior TDP leader Mysoora Reddy who contested against Jagan Reddy in May 2011, had breakfast him. He was immediately suspended by the TDP and immediately joined the YSR Congress party.

When the CBI asked him to make himself available for questioning today, Mr Reddy had asked the High Court to defer the appointment to June 15. Till then, he argued, he would be busy with by-elections. But the court refused his request. "If the CBI had waited for nine months, what is the hurry now? Why couldn't it wait for 20 more days," Mr Reddy told NDTV while campaigning in Guntur district. "I told them that after June 15, I will be available whenever they say. But the CBI did not approve this. I wanted this crucial time for campaigning," he added.

Mr Reddy has admitted that if he is arrested it could become an emotive issue. A couple of hours after he appeared before the CBI, unidentified persons set afire a bus of state-owned Road Transport Corp (RTC) at NGOs colony in Vanasthalipuram in Hyderabad.

Dozens of Jagan supporters were arrested in various districts since Thursday night while heading for the state capital. Jagan supporter Konda Murali was taken into preventive custody in Warangal.

The police have also imposed prohibitory orders in Jagan's native district Kadapa and several places in the state.

Mr Reddy is the son of former Andhra Pradesh Chief Minister YS Rajasekhara Reddy, who died in a helicopter crash in 2009. After his father's death he split with the Congress and formed his own party, the YSR Congress.

The CBI alleges that while YSR was in office, he conspired with other ministers to influence entrepreneurs to invest in his son's companies; in return, they were granted licences and other permissions required for their businesses.

The CBI inquiry into Mr Reddy's business empire and the source of its funds was ordered by the Andhra Pradesh High Court in August 2011.

The corruption case against Mr Reddy could affect not just his political fortunes, but that of several other leaders from the party he quit in a huff, the Congress. One of those leaders, a minister named M Venkatramana, was arrested after seven hours of interrogation on Wednesday. Mr Venkatramana has been remanded to judicial custody till June 7. He resigned soon after from the Congress government. Five other Congress ministers are also being studied for possible collusion.

Violence erupted last evening in his constituency of Repalle with his supporters attacking public buses. Mr Venkataramana was till yesterday the Excise Minister. But he has been arrested for allegedly violating rules to give land to industrialists when he was the Infrastructure Minister while YSR was Chief Minister.

Leader's Who Joined Officially Into YSRCP

Monday, May 21, 2012

Satirical Comedy Show On Andhra Pradesh Politics & Current Affairs

WE ARE ALL WITH JAGAN

సాక్షికి గోవుల ఆశీస్సులున్నాయి

సాక్షి పత్రిక మీద, ఛానెల్ మీద ప్రస్తుతం జరుగుతున్న దాడులను తల్చుకుంటుంటే గుండె తరుక్కుపోతోంది. విలువైన విషయాలను వెలుగులోకి తెచ్చే ఇలాంటి ప్రసారమాధ్యమాలు లేకపోతే సామాన్యుల బతుకు ఏమవుతుంది. విశాఖ జిల్లా అడవివరం గ్రామానికి చెందిన కె. శ్రీరామచంద్రమూర్తి, రత్నప్రభ దంపతులు ఆవేదనతో అంటున్న మాటలివి.
వీరిద్దరూ నోరులేని మూగప్రాణులను అక్కున చేర్చుకుని పోషిస్తున్న దయార్ద్రహృదయులు.
‘అంబా’ శీర్షికన 2010 ఏప్రిల్ 30న సాక్షి ఫ్యామిలీ మొదటిపేజీలో ఈ దంపతుల గోసేవను గురించిన వార్తాకథనం ప్రచురితమైంది.

‘తల్లిపాలు లేని పక్షంలో చంటిబిడ్డలకు ఆవుపాలు పట్టమంటారు. అలాంటి గోవులను చివరికాలంలో కోతకు పంపడం మాకెందుకో బాధ కలిగించింది. మేం మధ్యతరగతి జీవులం. అయినా ఆవులకు కొంతలో కొంతయినా బాసటగా నిలవాలనుకున్నాం. కబేళాకు వెళుతున్న గోమాతలను సింహాచలం తీసుకువచ్చాం. రాజవీధిలోని చిన్నజాగాలో వాటిని సాకడం మొదలెట్టాం’ రత్నప్రభ వివరించారు. చేస్తున్న సేవ మంచిదే అయినా ఆర్థికంగా చాల ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇలాంటి సమయంలో వీరు చేస్తున్న మంచి పనిని ప్రపంచానికి చూపించగలిగింది సాక్షి .

‘ఆరోజు ఇప్పటికీ మాకు గుర్తేనండీ. మేం చేస్తున్న గోసంరక్షణపై సాక్షి వెలువరించిన వ్యాసం మా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. వార్తా కథనం ప్రచురితమైననాటినుంచి రెండు మూడు నెలలపాటు ఫోన్లు వస్తూనే ఉండేవి. వందల్లో ఉత్తరాలొచ్చాయి. అంతేకాదు వంద, రెండు వందలు ఇలా కొంతమంది దాతలు మనీ ఆర్డర్లు కూడా చేశారు. ఆసమయంలో ఆ నిధి గోసంరక్షణకు ఎంతగానో ఉపకరించింది. అంతెందుకు. సాక్షి ఫ్యామిలీలో ఆ వ్యాసాన్ని చూశాకనే ఉదారంగా ఒక పెద్దాయన ముందుకు వచ్చారు. మిందివానిపాలెంలో తనకున్న స్థలాన్ని గోశాలకోసం తాత్కాలికంగా వాడుకోమని మాకిచ్చారు. ఇప్పుడు అక్కడే గోసేవ నిర్వహిస్తున్నాం. సాక్షి బలంతో పదహారు ఆవులు కాస్తా ఇప్పుడు ఏభై ఆవులయ్యాయి. వీటికి దాహం తీరుస్తున్నప్పుడు, వీటి మేను నిమిరినప్పుడు నాకు సాక్షి పత్రిక గుర్తుకొస్తూనే ఉంటుంది. సాక్షి ఫ్యామిలీలో వచ్చే కథనాలు మానవత్వానికి ప్రతీకలుగా ఉంటాయి. సామాజిక మార్పునకు దోహదపడతాయి’ శ్రీరామచంద్రమూర్తి వివరించారు.

‘సాక్షి పత్రిక, ఛానెల్ ఇటీవల ఎదుర్కొంటున్న అవరోధాలను తల్చుకుంటే మా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.మేం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు కూడా సాక్షికి న్యాయం జరగాలనే మాటను ఆ భగవంతునికి విన్నవించుకుంటున్నాం. రాజకీయంగా కక్షలుంటే రాజకీయంగానే తీర్చుకోవాలే తప్పనిచ్చి పత్రికలమీదికి వాటిని మళ్లించడం దురదృష్టకరం. గోవుల ఆశీస్సులు కూడా సాక్షికి నిండుగా ఉంటాయి. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా సాక్షి వాటిని ఛేదించుకుని జనం గుండె చప్పుడుగా ఎప్పటికీ మిగిలి ఉంటుంది.’ ఆర్ద్రమైన హృదయంతో రత్నప్రభ చెప్పుకొచ్చారు.

ఆమె మాట్లాడుతుంటే నోరులేని ఆవులు సైతం తమ ఆశీస్సులు సాక్షికి అందిస్తున్నట్టు మోరలు సాచి అంబారావాలు చేశాయి. గంగడోళ్లు కదిలిస్తూ సాక్షిని దీవించాయి.

NRI's Condemned The Attacks On Sakshi Media

రాజకీయ కక్ష సాధించేందుకే ప్రభుత్వం సాక్షి మీడియాపై దాడులు చేస్తోందని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియాను (సేవ్ సాక్షి) కాపాడండి అంటూ అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులు ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తున్నాయని అమెరికాలోని తెలుగువాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియా ఆస్తుల్ని అటాచ్ చేస్తూ నల్ల జీవోలను జారీ చేయడం సిగ్గు చేటని ప్రవాసాంధ్రులు విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్దని నినదిస్తూ.. లాస్ ఎంజిల్స్‌లో వైఎస్‌ఆర్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు నిరసన తెలిపారు. సాక్షిని రక్షించుకుంటామని నినదిస్తూ.. లాస్ ఎంజెలెస్‌లో వైఎస్‌ఆర్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు నిరసన తెలిపారు. సాక్షిని రక్షించుకుంటామని నినదిస్తూ సేవ్ సాక్షి అంటూ పోస్టర్లు పట్టుకొని సంఘీభావం తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరి కారణంగా పారిశ్రామిక వేత్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వైఎస్‌ఆర్ ఫ్యాన్ క్లబ్ సభ్యుడు నాగేశ్వరరావు అన్నారు.

Thursday, May 17, 2012

పత్రికాస్వేచ్ఛకు ఐటీ నిపుణుల మద్దతు.

Dallas NRI's Condemned

సాక్షి మీడియా బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింపజేయడాన్ని నిరసిస్తూ డల్హాస్‌లోని అవర్‌ప్లేస్ రెస్టారెంట్‌లో ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించినట్లు స్థానిక ఎన్‌ఆర్‌ఐ చిల్లకూరు గోపిరెడ్డి మంగళవారం ఈమెయిల్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఆదిబట్ల మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. చిల్లకూరు గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షం, అధికార పక్షాలు కుయుక్తులు పన్ని కేంద్రప్రభుత్వ అండదండలతో సీబీఐని అడ్డం పెట్టుకొని జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయన సాక్షి సంస్థలను దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. దీన్ని ప్రవాసాంధ్రులు అనేకమంది తీవ్రంగా ఖండించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అక్కడి ఎన్నారైలు కీర్తిపాటి రమణారెడ్డి, రేడియోకుషి అధినేత తిరుమల రెడ్డి, మల్లు ప్రసాద్‌రెడ్డి, డల్హాస్ ప్రముఖులు ఎన్‌ఎంఎస్‌రెడ్డి, నరేంద్రరావు, ప్రతాప్‌రెడ్డి, వెంపటి సత్యం, మధురెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHI GANDHI GIRI

జగమంతా ఒక్కటై

ఇది కాంతి లేని లోకం
ఇది అక్షరాల శోకం
ఇది ఉన్మాదుల రాజ్యం
ఇది సన్మార్గుల క్లేశం

ఇది సిరాచుక్క విలాపం
ఇది చిమ్మచీకట్ల విలాసం
ఇది దివాంధుల విహారం
ఇది నరాధముల పరిహాసం

వెలుగుల్లేవ్ జిలుగుల్లేవ్
చదువులమ్మ ఊసుల్లేవ్
ఆమె చేతి రాతల్లేవ్
నుదుట భాగ్యరేఖల్లేవ్

నీతికి చోటెక్కడుంది
జాతికి బలమెక్కడుంది
ఆకస్మిక అత్యయికం
ఎల్లెడలా అల్లుకుంది

సమాచార నిషేధం
అనాచార విషాదం
‘కలం’కారీ పనితనం
కొరగాని గ్రహతలం
సమన్యాయం చట్టుబండ
సుమగీతం ఓటికుండ
వెలుగులేని తెలుగునేల
విరిగిన బంగారుకల

ధర్మాన్నే బంధిస్తే
వాక్కులనే నిలిపేస్తే
ఆటవికం పాశవికం
అమ్మో ఇదేం నాగరికం

అదిగదిగో అదే అదే
అక్షరాలు తొక్కుకుంటు
విలువలనే నొల్లుకుంటు
వడివడిగా వెళుతోంది
సుడిలా చుట్టేస్తోంది
రాక్షస రథమే అది
సర్కారు సారథ్యమది

ఎదిరిద్దాం నిలదీద్దాం
మునుముందుకు అడుగేద్దాం
స్వేచ్ఛావాయువు కోసం
సకలం అర్పిద్దాం
ప్రభాతరువు కొమ్మల్లో
అగ్నిపూలు వెలిగిద్దాం
అంధకార రాష్ట్రంలో
ఐక్యగళం పలికిద్దాం

నూలుపోగులన్ని కలిసి ఏకమై కమ్మినట్టు
మదబల మత్తేభాన్ని నేలవాలు కుమ్మినట్టు
జగమంతా జనమంతా ఒక్కటై మురిసినట్టు
సాక్షి కేతనాలతో ధరణంతా మెరిసినట్టు...
- శ్రీనిజ, విశాఖపట్నం

YS JAGAN FAN VINOD SUICIDE May His Soul Rest In Peace

జగన్‌ను ప్రభుత్వం, కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ వేధిస్తున్నాయంటూ ఆవేదన
ఇది తనకెంతో బాధ కలిగించిందని, తట్టుకోలేకే చనిపోతున్నానని పేర్కొంటూ సూసైడ్ నోట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వ వేధింపులను చూసి తట్టుకోలేక వి.వినోద్‌కుమార్ అనే అభిమాని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అనేక రకాలుగా వేధిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఆయనపై వేధింపులకు పాల్పడుతున్నాయి. నా అభిమాన నేతను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుండటం నాకు తీవ్రంగా బాధ కలిగిస్తోంది. ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. అమ్మా నాన్న, అక్కా, చెల్లి, భార్య నన్ను మన్నించాలి’’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్నాడు. వినోద్ (32) హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని రాధాకృష్ణనగర్ వాసి. కాంగ్రెస్‌లో ఉండగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉండేవారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి చురుగ్గా పని చేస్తున్నారు. జగన్‌ను కేంద్రంగా చేసుకుని వారం రోజులుగా జరుగుతున్న పలు సంఘటనలతో కలత చెందిన ఆయన, బుధవారం సాయంత్రం తన ఇంటి మేడ పై గదిలో మెడకు తాడు బిగించుకొని ఉరేసుకున్నారు. సాయంత్రం ఏడింటికి కుటుంబ సభ్యులు చూసే సరికే విగత జీవుడై కన్పించారు. ఆయనకు భార్య ఇందిర, కుమారుడు స్టాలిన్ (4), కుమార్తె చుక్కీ (2) ఉన్నారు. స్టాలిన్‌ను ఇడుపులపాయలోని వసతిగృహంలో ఉంచి చదివించాలని సూసైడ్ నోట్‌లో వినోద్ పేర్కొన్నారు. సీబీఐ జగన్‌ను వేధిస్తోందని, ఇదేతీరు కొనసాగితే మరికొందరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారని నోట్‌లో ఆయన రాసినట్టు సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. ఎస్‌ఐ వెంకటరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారన్నారు.

Monday, May 14, 2012

Income Tax dept press release on raid on Chiranjeevi's daughter

Press Note

Detroit NRI's Condemned

సాక్షి దినపత్రిక, టీవీ చానెళ్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం,సీబీఐ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను స్థానిక ఎన్నారైలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు తీవ్రంగా ఖండించారు. సాక్షి ఖాతాలు స్తంభింపజేయడంతోపాటు ప్రభుత్వ ప్రకటనలు కూడా నిలిపివేసిన నేపథ్యంలో వారు శుక్రవారం సమావేశమయ్యారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేక.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సీబీఐకి మార్గ నిర్దేశనం చేస్తూ 'సాక్షి' గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
సీబీఐ కుట్ర వెనుక సోనియాగాంధీ, రామోజీరావు, చంద్రబాబు, అంబానీ సోదరులు ఉన్నారని ఆరోపించారు. ఈ అన్యాయంపై దృష్టి సారించాలని, విలువలు కాపాడాలని కోరుతూ భారత ప్రధానికి, రాష్ట్రపతికి, సుప్రీం కోర్టు జడ్జికి వినతి పత్రాలు పంపించామన్నారు. change.org వెబ్ సైట్ లో పొందుపరిచిన సాక్షి పిటిషన్.. http://www.change.org/petetions/supportsakshi పై సైన్ చేసి ముక్తకంఠంతో ఈ అన్యాయాన్ని ఆపేందుకు కృషి చేయాలని ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో లింగాల హరిప్రసాద్ రెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి, ఆత్మకూరు వినోద్, వెంకట్ బీరం, సునీల్ మండుటి, పిడపర్తి శ్రీనివాస్ రెడ్డి, టి.శ్రీధర్ రెడ్డి, భూమిరెడ్డి, యుగంధర్, యార్లగడ్డ శివరాం, కుకునూర్ వినోద్, చిత్తలూరి శ్రీనివాస్, పురషోతం కూకటి, రవికిరణ్, సాంబిరెడ్డి, కొండా జగన్మోహన్ రెడ్డి, బీవీ రెడ్డి, రమణారెడ్డి పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Sunday, May 13, 2012

MANA SAKSHI MANA ANDARI SAKSHI

ఎప్పుడూ ఏక ధ్యానంతో దీక్షగా, నిశ్శబ్దంగా పనిచేసుకుపోతుండే‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కొద్దిరోజులుగా... మోగిన ఫోను మోగినట్లే ఉంటోంది!
‘‘సార్... సాక్షిని మూసేస్తారా? నాలుగేళ్లుగా చూస్తున్నాం... ఏంట్సార్ మీకిన్ని కష్టాలు?’’ ‘‘అన్నా ఏందే ఇది! సాక్షి మీద ఏమేమో ఇంటున్నం!’’ ‘‘నాయ్‌నా పానంబోతా ఉంది. అంతా ఒక్కటై, ఒక్కన్నీ జేసి తుగులుకుంటా ఉండారు? బిడ్డని బతకనీయరా ఏంది?’’ ‘‘అంకుల్... సాక్షికి ఏమయింది? టీవీలో ఎందుకు చూపిస్తున్నారు?’’ ‘‘బాబూ... కావాలంటే నా పెన్షన్ డబ్బంతా ఇచ్చేస్తా. సాక్షి పేపర్ మాత్రం ఆగకూడదు.’’ ‘‘జగనన్న మీద కోపం సాక్షి పేపర్ మీద చూపిస్తున్నారు!’’ ‘‘మనసుకి కష్టంగా ఉందయ్యా. చిన్నపిల్లాడి మీద ఏమిటింత కసి! సాక్షికేంకాదు. ధైర్యంగా ఉండండి. మేమున్నాం. ఆ ప్రభువున్నాడు.’’ ఇంత అభిమానానికి, అత్మీయతకు, ఇంత అండకు, ఆదరణకు, ఇన్నీ దీవెనలకు, దైవ ప్రార్థనలకు ‘సాక్షి’ సిబ్బంది కదిలిపోతున్నారు. ‘‘థ్యాంక్యూ సార్’’ అంటున్నారు. ‘‘పెద్దమ్మా నీకు ధన్యవాదాలు’’ అని చెబుతున్నారు. ‘‘పాపా.. రేపు పేపర్ వస్తుంది. అందులో నీకిష్టమైన కిడ్స్ పేజీ కూడా ఉంటుంది. కావాలంటే చూడు’’ అని భరోసా ఇస్తున్నారు. ‘‘విరాళాలు వద్దు, మీ అభిమానం చాలు’’ అని నచ్చజెబుతున్నారు. నిజమే. ‘సాక్షి’కి ఇప్పుడు కాలూచెయ్యీ ఆడే పరిస్థితి లేదు. బ్యాంకు ఖాతాలను నిలిపేసింది సి.బి.ఐ. నిజమే. ‘సాక్షి’కి ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరులు లేవు. ప్రకటనల్ని ఆపేసింది ప్రభుత్వం. నిజమే. ‘సాక్షి’ని చంపే కుట్ర జరుగుతోంది. నాయుడు, ఈనాడు... ఆకూవక్క, పచ్చచొక్కా ఇచ్చిపుచ్చుకున్నారు. కానీ - ఈ పశు బలాలకు... ‘సాక్షి’ ఏనాటికీ తల వంచదు. తిరగబడి కొమ్ములు విరుస్తుంది. ఈ విష ప్రయోగాలకు, దుష్ర్పచారాలకు తలవాల్చదు. సత్యమేవ జయతే అని తిప్పికొడుతుంది. ‘సాక్షి’ - రెండక్షరాలే. నినదిస్తే, ‘ఏది నిజం?’ అని నిగ్గదీస్తే... ఆ ప్రతిధ్వని కోటీ నలభై లక్షల గళాక్షరాలు. అవి - కుట్రదారుల నిజస్వరూపాలను బట్టబయలు చేసే గవాక్షరాలు! నిన్నగాక మొన్న పుట్టి... కురువృద్ధ కాంగ్రెస్‌కు, దుర్బుద్ధ ‘దేశ ’శక్తులకు, ఎల్లో మీడియా అబద్ధాల ప్రబుద్ధులకు చెమటలు పట్టిస్తున్న ‘సాక్షి’కి ఇంత శక్తి ఎక్కడిది? ఇంత పాఠకబలం, ఇంత ప్రజాబలం ఎలా సాధ్యమైంది? ఇదే ఈవారం మన బయోగ్రఫీ.

‘సాక్షి’ పుట్టిన ఆనందంలో ఉన్నాం అందరం.
పురుటి గుడ్డు ఎలా ఉందంటే -
వెన్నెల్లో కాసిన హరివిల్లులా ఉంది.
కను కాటుకతో కొనగోట దిద్దిన కావ్యంలా ఉంది.
ఇంకా ఎలా ఉందంటే -
పుట్టడమే కనక కౌమారాలతో పుట్టినట్లుంది!
ఆనందం కాక ఏమిటి? అబ్బురం కాక మరేమిటి?
ఆవేళ -
మార్చి నెలాఖరు ఎండకు ఆకాశంలో ఎవరో అకస్మాత్తుగా మేఘవస్త్రం కప్పారు.
ఎవరో వెలుగు బూర ఊదారు. పశ్చిమాన ఎవరో తూర్పు వాకిళ్లను తెరిచారు!
చినుకులు శుభాశీస్సులై రాలాయి.
మెరుపులు మసక చీకట్లను చీల్చాయి.
ఉరుములు మంగళస్వరాలయ్యాయి.
నార్త్ - ఈస్ట్ - వెస్ట్ - సౌత్!
దిక్కులకు ప్రాణాలు లేచి వస్తున్నాయి.
సత్యమేవ జయతే! సత్యమేవ జయతే!
రెక్కలు ఆర్చుకుంటోంది ‘సాక్షి’!!
‘బై ఆర్డర్ అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్’... పది కోట్ల ప్రజానీకం - కొత్త సంతకంతో మర్నాటినుంచీ ఉదయాలన్నీ సూర్యుణ్ణి నిద్రలేపబోతుంటే...
ఇవాళ మాకెలా నిద్రపడుతుంది?
ఎదురు చూస్తున్నాం - తెల్లారడం కోసం.
ఎదురు చూస్తున్నాం - నిజంగా తెల్లారడం కోసం!
ఎదురు చూస్తున్నాం - పన్నెండు లక్షల పావురాలు ఒక్కసారిగా ఎగిరితే... రాబందులు, తీతువులు, గబ్బిలాలు, గుడ్లగూబలు, శకుని పక్షులు, అక్కు పక్షులు భయంతో కిటికీల్లోంచి నక్కి నక్కి తొంగి చూసే దృశ్యం కోసం.

*********

ఒకనాటి యాగమా? ఒకనాటి హోమమా?
ఒక ‘అతిరాత్రమా’?
అక్షర సైనికులు పదును తేలుతున్నారు. సుశిక్షిత సేనాపతులు అదను చూస్తున్నారు.
ఒక బిగ్ అరైజ్, ఒక బిగ్ అవేక్ కావాలి ‘సాక్షి’.
ఇదీ లక్ష్యం!
‘గోబెల్స్’ని గోడకు దిగ్గొట్టి, పైన సున్నం కొట్టాలి.
ఇదీ ధ్యేయం!
నిజాన్ని నిప్పులా ఊది రాజేయాలి. అబద్ధాన్ని ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టాలి. ఇదీ ిసిద్ధాంతం
రంగుల్లో ఉండాలి. ఫిరంగులై పేలాలి. ఇదీ వ్యూహం!
ఇంకా?!
దౌర్భాగ్యాలను తొలగించాలి. చీడపీడల్ని దులిపేయాలి. కొమ్ముల్ని వంచేయాలి. కోరల్ని పీకేయాలి. తోకల్ని కత్తిరించాలి.
ఇంకా?!
అడగలేనివారి మౌత్‌పీస్ అవ్వాలి. బడుగు బతుకుల మీదికొచ్చే బుల్‌డోజర్ల నడుములు విరగ్గొట్టాలి. ఆడపడుచులకు ధీమా ఇవ్వాలి.

కౌంట్ డౌన్ మొదలైంది!
‘సాక్షి’ ఎలా ఉండబోతోంది? పాఠకులలో కుతూహలం. ‘సాక్షి’ ఏలాంటి మార్పు తేబోతోంది? పాలకుల మౌన వీక్షణం. ‘సాక్షి’ ఏం చేయబోతోంది? ‘లార్జెస్ట్’ బోర్డ్ మీటింగుల్లో కలకలం.

కౌంట్ డౌన్ మొదలైంది!
లక్షల మంది ‘సాక్షి’కి చందాలు కడుతున్నారు.
లక్షల సర్యులేషన్ ఉన్నవాళ్లు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు.
పుట్టీపుట్టగానే ‘సాక్షి’ని చంపేయడానికి బ్లూప్రింట్ లాంటి ‘ఎల్లో ప్రింట్’ రెడీ అయింది!
హాకర్లొచ్చి చెబుతున్నారు. ప్యాకర్లొచ్చి చెబుతున్నారు.
‘‘సార్... సాక్షిని బైటికి రానివ్వరట. సార్... సాక్షిని లేట్ చేయిస్తారట. సార్... సాక్షిని మేము వెయ్యడానికి లేదట’’.

కౌంట్ డౌన్ మొదలైంది!
త్రీ... టూ... వన్...
23 మార్చి 2008.
సండే. ‘సాక్షి’ డే. ఎ బిగ్ డే.
సైమల్టేనియస్‌లీ ఫ్రమ్ -
హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, ముంబై, ఢిల్లీ, అనంతపూర్, గుంటూరు, కడప, ఖమ్మం, కరీంనగర్, కర్నూల్, మెహబూబ్‌నగర్, నల్గొండ,నెల్లూరు, నిజామాబాద్, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ - యువర్స్ లవింగ్‌లీ - ‘సాక్షి’.
మూడు రీజియన్‌లు, నాలుగు మెట్రోలు, పన్నెండు లక్షల లోగిళ్లు. కోట్లాది ఆశీర్వచనాలు.
సాక్షి మెయిన్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి స్పోర్ట్స్, సాక్షి బిజినెస్, సాక్షి లిటరేచర్, సాక్షి సినిమా, సాక్షి కెరియర్, సాక్షి టాబ్లాయిడ్, సాక్షి ఫన్ డే...
మాదాపూర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సంప్రదాయబద్ధంగా సాక్షి ఆవిర్భావ వేడుకలు.
ఎల్సీడీ ప్రొజెక్టర్ స్క్రీన్‌పై సాక్షి పేజీల ఆవిష్కరణలు.
సాక్షి పొలిటికల్ పేజీల్ని వీరప్ప మొయిలీ, సినిమా పేజీల్ని చిరంజీవి, మహిళల పేజీల్ని నాగార్జున, వెబ్ ఎడిషన్‌ని రామలింగరాజు, బిజినెస్ పేజీల్ని రాణిరెడ్డి, స్పోర్ట్స్ పేజీల్ని పుల్లెల గోపీచంద్, మిథాలీరాజ్... రిమోట్‌తో ఆన్ చేశారు.
అంతే!
ముప్పై నాలుగేళ్ల రొడ్డ కొట్టుడుకి, ముప్పై నాలుగేళ్ల అడ్డగోలు రాతలకి, ముప్పై నాలుగేళ్ల మసిపూతలకి, ముప్పై నాలుగేళ్ల రాజకీయ రాశి ఫలాలకు తెరపడింది!!

‘సాక్షి’ సామాజిక ఉద్యమ సారథి అవ్వాలి.
- గవర్నర్ ఎన్.డి.తివారీ.

‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకి సాక్షి అవుతుంది.
- ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి.


‘సాక్షి’ సమాజానికి అంతర్‌సాక్షి కావాలి.
- వీరప్ప మొయిలీ.

‘సాక్షి’ నిష్పక్షపాతంగా ఉంటుంది.
- బి.వి.రాఘవులు.

అసలు ఆవగింజంత, కొసరు కొండంత రాతలకు భిన్నంగా ఉండాలి ‘సాక్షి’.
- నారాయణ.

‘సాక్షి’ నిజాలకు ప్రతిబింబంగా ఉండాలి.
- బండారు దత్తాత్రేయ.

‘సాక్షి’ ఒక కొత్తదానికి సంకేతం.
- సచిన్ టెండూల్కర్.

‘సాక్షి’ అచ్చంగా మీరంతా ఆకాంక్షించినట్లే, ఆశించినట్లే, అభిలషించినట్లే, సూచించినట్లే ఉంటుందని, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన మాత్రమే ఉంటుందని ‘సాక్షి’ ఛైర్మన్ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ‘‘నేను కాంగ్రెస్ అయినా, నా తండ్రి సి.ఎం. అయినా ‘సాక్షి’ మాత్రం నిష్పక్షపాతంగా, పార్టీకి అతీతంగా స్వతంత్రంగా ఉంటుంది’’ అని చెప్పారు.
కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
ఏకకాలంలో 23 ఎడిషన్లలో దీపాలు వెలిగాయి!

***********
మార్చి 23 భగత్‌సింగ్ వర్థంతి.
అదే రోజు... ఈస్టర్.
‘‘భగత్‌సింగ్ అమరత్వాన్ని స్మరించుకుంటూ, సముజ్వలమైన ఆ దేశభక్తుని అకళంకిత చరిత్రను మననం చేసుకుంటూ, దేశ సేవకులందరినీ పేరుపేరునా కృతజ్ఞతాభావంతో తలచుకుంటూ ‘సాక్షి’ మీ దర్శనం చేసుకొంటోంది, ఆశీర్వదించండని’’ వై.ఎస్. జగన్ తన ప్రత్యేక సంపాదకీయంలో పాఠకులకు కోరారు.
‘‘ఇవాళ ఈస్టర్ పర్వదినం కూడా. కరుణామయుడైన ఏసుక్రీస్తు పునరుత్థానం పొందిన రోజు. లుప్తమయి పోతున్న పత్రికా సత్సంప్రదాయాలు, కొనప్రాణంతో ఉన్న వార్తా సంస్కృతీ ‘సాక్షి’ ద్వారా మళ్లీ జవశక్తులు పుంజుకుంటాయని మీరు నిశ్చయంగా ఆశించవచ్చు’’ అని జగన్ భరోసా ఇచ్చారు. పాఠకుల అభిమానాన్ని ఆపేక్షించారు.
భగత్‌సింగ్‌ను షహీద్ భగత్‌సింగ్ అంటారు. ‘షహీద్’కు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి: అమరవీరుడు. ఇంకోటి: సాక్షి.
సత్యంకోసం, ప్రజా స్వేచ్ఛ కోసం ‘సాక్షి’ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని...
‘సాక్షి’పై ఎన్ని విష ప్రచారాలు, ఎన్ని విష ప్రయోగాలు జరిగినా పునరుత్థానం చెందుతూనే ఉంటుందని ‘సాక్షి’ ఇవాళ్టికీ... ఇవ్వాళ్టికీ నిరూపిస్తూనే ఉంది!
నాలుగేళ్లుగా నాలుగు వైపుల నుంచి... దాడులను, దాష్టీకాలను, దౌర్జన్యాలను, దుష్ర్పచారాలను, అధికార దురహంకారాలను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్న ‘సాక్షి’కి ప్రతిరోజూ పునరుత్థాన దినమే! ‘సాక్షి’ దినదిన ప్రవర్థమానమే!!
మళ్లీ పదవిలోకి రావాలని చంద్రబాబు...
మరో పత్రిక మార్కెట్‌లోకి రాకూడదని రామోజీ...
తోడుగా ఒక చిల్లర పత్రిక...
దాని నీడగా ఒక చిలవల చానెల్...
పనికట్టుకుని, అధికారపక్షంతో నడుం కట్టుకుని ‘హమ్ ఏక్ హై’ అంటూ ‘సాక్షి’పై పదే పదే వేస్తున్న నిందలు,
‘సాక్షి’పై పదే పదే వేస్తున్న చిందులు నిష్కళంక ‘సాక్షి’ని ఏమీ చేయలేకపోయాయి. ‘సాక్షి’కి ఉన్న ప్రజాబలం, పాఠక బలం ముందు ఎంతోసేపు కుప్పిగంతులు వెయ్యలేకపోయాయి.

‘సాక్షి’ పై వీళ్లకు ఎందుకింత కక్ష?
ఎందుకింత కసి? ఎందుకింత ద్వేషం?
ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కారణం.
ఒక్కొక్కరిదీ ఒక్కొక్క స్వార్థం.

నెంబర్ 1 : చంద్రబాబు.
చంద్రబాబుకి మళ్లీ పదవి కావాలి. అందుకు వేదాలు వల్లించాలి. కానీ, తొమ్మిదేళ్లు భూముల్ని బీళ్లుగా మార్చి, ‘బూమ్’ల్ని పెంచిపోషించిన బాబు అసలు స్వరూపం ఏమిటో ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. బాబు కొత్త నీతుల్ని మాట్లాడినప్పుడల్లా పాత ఫైల్స్ తీసి చూపిస్తోంది. అందుకే ఆయన ‘సాక్షి’ ఉండకూడదని, ‘సాక్షి’ మిగలకూడదని కోరుకుంటున్నారు. తన మీద ‘సాక్షి’ కక్ష కట్టిందని, తనపై కార్పణ్యాలతోనే ‘సాక్షి’ ఆవిర్భవించిందని ఆరోపిస్తున్నారు. ‘సాక్షి’పై అక్కసును, ఆగ్రహాన్ని వై.ఎస్. కుటుంబం మీద చూపిస్తున్నారు.

నెంబర్ 2 : రామోజీ.
ఈ ఎల్లో మీడియా ముఠా మేస్త్రికి ఏం కావాలి?
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ‘సాక్షి’ మూత పడాలి.
బాబు సి.ఎం. అయితే రాష్ట్రం రామోజీదే. ‘సాక్షి’ మూత పడితే వేదం తను చెప్పిందే. విలువల్లేని వ్యాపారి ఆయన.
తన ముందు ఇంకో పేపర్ ఎదగ కూడదు. తన జర్నలిస్టు ఇంకో పేపర్‌లోకి ఎదగకూడదు. కానీ ఏమైంది?
‘సాక్షి’ గేట్లు తెరవగానే తెలుగు జర్నలిస్టుల వరద వెల్లువెత్తింది. నిజమైన పేపర్ ఏదో, నిజమైన జీతం ఏదో, నిజమైన జీవితం ఏదో, నిజమైన స్వేచ్ఛ ఏదో, నిజమైన ఆత్మగౌరవం ఏదో పాత్రికేయులకు తెలిసి వచ్చింది. నాన్ జర్నలిస్టు సిబ్బందికి కూడా ‘సాక్షి’ శుభ్రమైన జీవితాన్ని ఇచ్చింది. మరీ ముఖ్యంగా - పేపర్‌బాయ్ కమిషన్ పెంచింది.
ఇవేమీ లేని చోట ఎవరుంటారు? ఎంతకాలం ఉంటారు?
ముప్పై నాలుగేళ్లుగా చెలాయిస్తున్న మూడక్షరాల దురహంకార ఆధిపత్యానికి ‘సాక్షి’ అప్రమేయంగా, అసంకల్పితంగా ఇలా తగిన శాస్తి చేసింది!‘లార్జెస్ట్‌సర్క్యులేటెడ్ డెయిలీ’ని వదిలి వచ్చిన వాళ్ల జీతాలు పెరిగాయి. విధిలేక లోపలే ఉండిపోయిన వారి జీతాలూ పెరిగాయి! ‘సాక్షి’ ఎఫెక్ట్. ‘‘అవును. సాక్షి పుణ్యమే’ అని స్వయంగా ఆ పత్రిక ఉద్యోగులే చెప్పుకున్న సందర్భాలున్నాయి. ‘సాక్షి’కి కృతజ్ఞత తెలుపుకున్న క్షణాలున్నాయి.
అలాంటి ఒక ఉద్వేగ సందర్భం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. ఇప్పుడీ వ్యాసం రాస్తున్న ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధికి ఎదురైన ఒక అనూహ్యమైన ‘అప్రీసియేషన్’ అది!
ఆ రోజు ఆదివారం.
22 జనవరి 2012.
సోమాజిగూడా ప్రెస్‌క్లబ్ ప్రాంగణంలో జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతోంది. క్లబ్ ఆవరణలో చెట్టు కింద వేసిన కుర్చీలలో ఈ ప్రతినిధితో పాటు కొంతమంది జర్నలిస్టులు తమ వంతు పరీక్షల కోసం వేచి చేస్తున్నారు. ఎదురుగా ‘బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ వారి మొబైల్ క్యాంప్ వెహికల్. అందులో ఒక వైపు స్కానింగ్, ఇంకో వైపు ఎక్స్‌రే యూనిట్లు. పిలుపు రాగానే లోపలికి వెళ్లాలి.
ఈలోపు - పక్క కుర్చీలోంచి స్నేహపూర్వకంగా ఒక స్వరం.
‘‘సార్... మీరు సాక్షి ఎంప్లాయా?’’
అసలైతే -‘‘ఏం బాబూ... నువ్వు సాక్షి ఎంప్లాయా?’’ అని ఏకవచనంలో సంబోధించడానికి సంకోచ పడనవసరం లేని వయసులో ఉన్నారాయన. పక్కనే ఆయన భార్య.
‘‘అవును సర్’’ - ఈ ప్రతినిధి సమాధానం.
‘‘మీరు చల్లగా ఉండాలి. మీరు చల్లగా ఉంటే మేం సంతోషంగా ఉంటాం’’ అన్నారాయన!
ఎంత ఎమోషన్! ఎంత కృతజ్ఞత!! మళ్లీ ఆయనే అన్నారు. ‘‘సాక్షి వచ్చాక, నా జీతం ఒక్కసారిగా... నాలుగు వేలు పెరిగింది. నా-లు-గు-వే-లు!’’. ప్రెస్ క్లబ్ ఎదురుగానే వాళ్ల పత్రికా కార్యాలయం. ‘సాక్షి’కి తన పత్రిక దీవెనలూ అందుతుంటే - ఆ పత్రికాధిపతికి సెగ తగలకుండా ఉంటుందా?
ఆర్థిక వనరుల్ని దెబ్బతీసి, పైకొస్తున్న పత్రికల్ని మూత వేయించడంలో ఎక్స్‌పర్ట్ అయిన పెద్ద మనిషి ‘సాక్షి’ని మాత్రం వదిలిపెడతాడా? పైగా పక్కలో బల్లెం. అందుకే ‘సాక్షి’పై ఇన్ని దాడులు, దారుణమైన ఆరోపణలు, బ్యాంక్ అకౌంట్ల స్తంభనకు, ప్రకటనల నిలిపివేతకు ఇన్ని కుయుక్తులు.

నెంబర్ 3 : చిల్లర పత్రిక!
‘సాక్షి’ అంటే ఈ పత్రిక్కి ఎందుకంత ఏడుపు? ఇంతుంటే అంత రాయడం దాని నైజం అనుకున్నా... అసలేమీ లేకున్నా అబద్ధాలను వండి వార్చడమెందుకు? దాని దుష్ర్పచారానికి పరాకాష్ట... సర్కులేషన్ ప్రమోటర్ల చేత ‘సాక్షిని మూసి వేస్తున్నారని’ - ఫ్రమ్ ది డే వన్ - చెప్పించడం! దీనిపై ప్రభు గుప్తా అనే ‘సాక్షి’ కస్టమర్ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘నీ పత్రిక గురించి ఎంతైనా చెప్పుకో. సాక్షిని ఆపేయమని, మూసేస్తున్నారని చెప్పడం ఏంటి?’’ అని గుప్తా అన్నందుకు చిల్లర పత్రిక ప్రమోటర్ ఆయనతో గొడవకు దిగాడు.
వై.ఎస్.ఆర్. ప్రభుత్వం తనకు యాడ్స్ ఇవ్వలేదని ఆ పత్రిక యజమాని ‘సాక్షి’ వచ్చిన కొత్తల్లో చేసిన గొడవ కూడా అచ్చంగా ఈ స్థాయిలోదే! ఇప్పటికీ దానిది ‘చిల్లర’ గొడవే. ‘చిల్లర’ గగ్గోలే. సొంత టీవీలో ప్రతి ఆదివారం వచ్చే తన సొంత ప్రోగ్రామ్‌లో గెస్టుల్ని ఆ పత్రికాధిపతి అడిగే నేలబారు ప్రశ్నల్లాగే, చవకబారు నవ్వుల్లాగే, ఉంటాయి ‘సాక్షి’పై ఆ పత్రిక తీసే ఆరాలు, అది నూరే కారాలు మిరియాలు.
‘సాక్షి’ ప్రజ్వలన జ్యోతితోనే అది తన తోకకు నిప్పంటించుకుంది. ‘సాక్షి’ని ఏదో చేసేయాలని తన తోకకు కంకణం కట్టుకుంది.

నెంబర్ 4 : చిలవల చానెల్.
‘సాక్షి’పై కత్తి కట్టిన నాలుగో క్యారెక్టర్ - ఈ చిలవల చానెల్.
నాలుగు డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసే ఏ దిగజారుడు చానెల్‌కూ తక్కువ గానీ ఈ చిలవల చానెల్... ‘సాక్షి’ కుటుంబ ప్రయోజనాలను దెబ్బతీయడమే ధ్యేయంగా రోజుకో ‘మెరుగైన’ అబద్ధాన్ని పాడిందే పాటగా పాచిపళ్లతో ప్రసారం చేస్తూ వస్తోంది.

********
బ్లాక్‌మెయిళ్లకు, బెదిరింపులకు, గోబెల్స్ ప్రచారాలకు బెదిరిపోయేది కాదు ‘సాక్షి’.
నాలుగేళ్ల ‘సాక్షి’ బయోగ్రఫీలో నలభై అధ్యాయాలకు సరిపడా అవరోధాలున్నాయి, అడ్డంకులున్నాయి, న్యాయపోరాటాలున్నాయి. విజయాలున్నాయి, విజయోత్సవాలున్నాయి. ఎదిగిన క్రమం ఉంది. ఒదిగిన వైనం ఉంది. ఇచ్చుకున్న వివరణలు, చేసుకున్న చిన్నచిన్న సవరణలు ఉన్నాయి. ఇవన్నీ ‘సాక్షి’ని శక్తిమంతం చేశాయి. చేస్తున్నాయి. ‘సాక్షి’కి ఇప్పుడు కోటీ 42 లక్షల 29 వేల మంది పాఠకుల ఆదరణ ఉంది. ‘సాక్షి’ కట్టుబడిన విలువలు ‘సాక్షి’కి అండగా ఉన్నాయి. ‘సాక్షి’ నెలకొల్పిన సత్సంప్రదాయాలు ‘సాక్షి’కి దీవెనలయ్యాయి. అకౌంట్లు మూయించి, అడ్వర్‌టైజ్‌మెంట్‌లు ఆపించి ‘సాక్షి’ నోరు నొక్కేందుకు, సాక్షిపై ఆధారపడిన అరవై వేల మంది ఉద్యోగుల, వారి కుటుంబసభ్యుల పొట్టకొట్టేందుకు జరుగుతున్న కుట్ర ప్రజలకు అర్థమౌతూనే ఉంది. చీకటి జీవోలతో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి పన్నాగాలతో చంద్రబాబు నాయుడు చీకటి ఆదేశాలతో సి.బి.ఐ చీకటి ఉద్దేశాలతో ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలు ‘సాక్షి’ వెలుగును మింగేయలేవు. ప్రజాదరణ అనే చమురుతో వెలుగుతున్న దీపం... ‘సాక్షి’. ఆ దీపాన్ని ఆర్పేందుకు దగ్గరికొచ్చే వారెవరైనా శలభాల్లా మాడి మసైపోవలసిందే. ఇది సత్యం. సత్యమేవ జయతే. అంతిమ విజయం ‘సాక్షి’దే. - సాక్షి ఫ్యామిలీ ‘సాక్షి’ ప్రతిన, ‘సాక్షి’ పునరుద్ఘాటన ప్రారంభం (2008) ప్రజా సంక్షేమానికి విఘాతం కలిగించే పనులేవైనా ప్రభుత్వం చేస్తే మేము నిస్సందేహంగా ప్రజల తరఫున దానిని ఖండిస్తాం. రాజకీయ దుష్ట చింతనతో ప్రభుత్వం మీద కత్తికట్టి, ప్రభుత్వ పతనమే ప్రజాస్వామ్య పరమావధి అని, మనకు నచ్చిన వారి పాలనే రామరాజ్యం అనీ నిస్సిగ్గుగా వ్యవహరించే పత్రికల సరసన మేము చేరబోము. ప్రజల మనస్సాక్షిగా వ్యవహరిస్తూ మొత్తం సమాజంలో జరిగే సకల కార్యకలాపాలనూ ప్రజాకోటికి యథాతథంగా నివేదిస్తాం. రెండో సంవత్సరం (2009) పలికెడిది భాగవతమట. పలికించెడివాడు రామభధ్రుండట. భాగవతం రాసింది పోతనే అయినా, రాయించుకున్నది రామచంద్రుడే అన్నది ఆయన నమ్మకం. అలాగే ‘సాక్షి’ని సంకల్పించినది మేమే అయినా అందుకు ప్రేరణ మీరే అని మా విశ్వాసం. ఇందులో అక్షరం మాది... భావం మీది. పదం మాది... పథం మీది. వాక్యం మాది.. వాక్కు మీది. వ్యాఖ్యానం మాది... వివేచన మీది. మూడో సంవత్సరం (2010) ‘సాక్షి’ వస్తూనే పత్రికారంగంలోని గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టింది. అబద్ధాల మసిపూసిన వార్తలు, వ్యాఖ్యలతో నాణేనికి ఒక వైపే కనిపిస్తున్న స్థితిలో రెండోవైపు చూడగలిగే అవకాశం పాఠకులకిచ్చింది. తెలుగు పత్రికల నట్టింట విశ్వసనీయత అనే దీపం పెట్టింది. పది గొంతుల రావణుని చెర నుండి నిజాల సీతను విడిపించింది. నాలుగో సంవత్సరం (2011) ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లపై ఏ రాష్ర్టంలోనూ ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో దర్యాప్తు సంస్థల చేత వరుస దాడులు చేయించి, వారిని భయోత్పాతానికి గురి చేశారు. పాలకపక్షం, ప్రతిపక్షం కలిసి ఆడుతున్న ఈ డ్రామా మీకందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అన్ని పక్షాలూ ఒక్కటై మాపై దాడి చేస్తున్న వైచిత్రి మీ కళ్లకు కడుతూనే ఉంది. ఈ ఆపత్కాలంలో మాకు నిజమైన ఊరట ఒక్కటే. ఎవరెన్ని కుట్రలు చేస్తున్నా, ఒక్క పాఠకుడు కూడా ‘సాక్షి’ని విడలేదు సరి కదా... ఆ సంఖ్య మరింత పెరిగింది. ‘సాక్షి’కి మేమున్నామంటూ మీరు కురిపిస్తున్న ఈ ఆత్మీయతే మాకు కొండంత బలం. ప్రస్తుతం (2012) కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ‘ఎల్లో’ మీడియా ముఠా కలిసిపోయాయి. వీళ్లంతా ఒక్కటై ‘సాక్షి’ని మూయించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ‘సాక్షి’ పత్రిక గానీ, ‘సాక్షి’ టీవీ గానీ లేకపోతే ఎల్లో ముఠా రాసిందే రాత, చూపిందే నిజం అని జనాల్ని నమ్మించవచ్చని వీళ్ల ఆశ. ఆ ఆశ నెరవేరదు. వీళ్లపై ‘సాక్షి’ పోరాటం ఆగదు. సాక్షికి... ఈనాడుకు ఇదీ తేడా! వ్యక్తిపై కక్ష కడితే ఆ వ్యక్తి వార్తలను తొక్కి పెడుతుంది ఈనాడు. వ్యక్తితో సంబంధం లేకుండా వాస్తవాన్ని ప్రెజెంట్ చేస్తుంది సాక్షి. తనకు అనుకూలంగా వాస్తవాలను వక్రీకరిస్తుంది ఈనాడు. వక్రీకరణలోని వాస్తవాలను ప్రముఖంగా ఎత్తిచూపుతుంది సాక్షి. గిట్టని పార్టీల ప్రజాదరణ వార్తా విశేషాలను సెన్సార్ చేస్తుంది ఈనాడు. అన్ని పార్టీల ‘వాయిస్ ఆఫ్ స్పీచ్’లకు సమానంగా స్పేస్ ఇస్తుంది సాక్షి. ఉదా: 1 జగన్ సభలకు లక్షలమంది వచ్చినా ఈనాడు ఆ ముక్క రాయదు. చంద్రబాబు ఏం మాట్లాడినా ముక్క వదలకుండా సాక్షి రాస్తుంది. ఉదా: 2 రామోజీపై 420 కేసు వార్తను ఈనాడు వెయ్యిజన్మలెత్తినా వేసుకోలేదు. జగన్‌పై వచ్చే ఆస్తుల ఆరోపణల వార్తలను ఒక్కటైనా సాక్షి మిస్ చెయ్యదు. అంతెందుకు? నిన్నటికి నిన్న - ‘గబ్బర్‌సింగ్’ సినిమాను రివ్యూ చేస్తూ అది చిరంజీవి తమ్ముడిదైనా సరే సినిమా బాగుందని ఉన్న విషయాన్ని సాక్షి రాసింది. అదే ఈనాడు .... దాసరితో విభేదాలొచ్చి ఏళ్లపాటు ఆయన్ని బ్యాన్ చేసింది.
 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top