fvz

Monday, January 20, 2014

లౌక్యం తెలియని మూర్ఖపు పొలిటీషియనా జగన్ ?

తండ్రిని తలచుకొని కొడుకు పెట్టిన వై.సి.పి. కి దగ్గరవ్వాలని వచ్చినవారందరికి జగన్ చుక్కలు చూపిస్తున్నాడా?? గడిచిన రెండు సంవత్సరాలలో మెల్లగా ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు. ఇలా వై.సి.పి. నుంచి బయటకు వచ్చి రాగానే మొదటగా జగన్ తీరు, వ్యవహారశైలి మీద బాణాలు ఎక్కుపెడుతూ తమకు వై.సి.పి. లో జరిగిన అన్యాయం, అవమానాలను మీడియా ముందు ఏకరువు పెడుతున్నారు. 




 చాదస్తపు మొగుడు చెబితే వినడు, తిడితే ఏడుస్తాడు అన్న చందనా, జగన్ పార్టీలో సీనియర్ నాయకులు సలహాలు చెబితే వినడు, చిన్న నాయకుల మాట అసలే వినడు. సినిమా హీరో రాజశేఖర్,జీవితాలను పెద్దాయన రాజశేఖర రెడ్డి అక్కున చేర్చుకున్నారు. ఆదరించారు. అదే హీరో రాజశేఖర్,జీవితాలు జగన్ కి దగ్గరవ్వాలి అని విపరీతంగా ప్రయత్నం చేసారు. విగ్గులు పెట్టుకొని, సినిమా డ్రెస్సులు వేసుకొని జగన్ పెట్టిన రైతు సభలలో రావొద్దు అంటూ గట్టి సంకేతాలు జగన్ నుంచి వెళ్లాయి. దెబ్బకి రాజశేఖర్,జీవితాలు వై.సి.పి. కి గుడ్ బై చెప్పారు. పైగా సినిమా వాళ్ళ గ్లామర్ కన్నా, జగన్ కి తన మీద జనాలలో రెట్టింపు గ్లామర్, అభిమానం ఉందన్న గట్టి మూర్ఖపు నమ్మకం ఉంది. ఇలాంటి నమ్మకం ఉన్నప్పుడు ఒక్కప్పటి నటి రోజా గారిని ఎందుకు వై.సి.పి. ఆదరించింది. ఒకరికి ఒక న్యాయం, మరి కొందరికి వేరొక న్యాయం. ఇదెక్కడి సోద్యం జగనూ ? రాజశేఖర రెడ్డి సినిమా వాళ్ళ విషయంలో ఇలా ఎప్పుడూ నియంతలా ప్రవర్తించలేదు. 



తండ్రి మీద ఉన్న అభిమానంతో, కొడుకు పెట్టిన వై.సి.పి. పార్టీ లోకి కొండా దంపతులు మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచి, నిస్వార్ధంతో పార్టీకి, ప్రజలకి సేవ చేద్దామని వస్తే, ఒక్క M.L.C.సీటు కోసం, కొండా దంపతుల్ని శాస్వతంగా దూరం చేసుకున్నాడు జగన్. 

గడిచిన ఇరవై ఏళ్ళలో మచ్చ లేని నాయకుడు సబ్బం హరి గారు అకస్మాత్తుగా పార్టీకి, జగన్ కి దూరం అవటం వెనుక కారణాలేంటో ఆయన మాటలలోనే వినండి.

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top