fvz

Sunday, September 28, 2014

సత్యమేవ 'జయ'తే


జయరాం జయలలిత అసలు పేరు కోమలవల్లి (Komalavalli). మైసూరులో జన్మించిన జయలలితా తల్లి బలవంతం మీద 15 ఏళ్ళకే సినీనటిగా జీవితం ప్రారంభించింది. కన్నడ,తెలుగు,తమిళ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. గ్లామర్ హీరోయిన్ గా 70వ దశకంలో తమిళ సినీ ప్రపంచాన్ని ఏలింది. 1981లో  జయలలిత రాజకీయ ప్రవేశం చేసారు. All India Dravida Munnetra Kazhagam పార్టీ కార్యదర్శిగా పనిచేసారు. నాటి ముఖ్యమంత్రి రామచంద్రన్ కు సన్నిహిత నాయకురాలిగా పేరుపొందారు. రామచంద్రన్ మరణం తరువాత ఆయన సతీమణి జానకీరామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆమె రాజకీయాల్లో ఇమడలేకపోయారు. ఆమె స్థానంలో నాయకత్వం తీసుకున్న జయలలిత 1989లో పార్టీని అధికారంలోకి తీసుకు రాలేకపోయారు. 1991లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని విజయం సాదించారు. 43 ఏళ్ళ వయసులో తమిళనాడుకు సి.ఎం. అయ్యారు జయలలిత. తోలి తమిళ మహిళా సి.ఎం.గా చరిత్ర సృష్టించారు. 

'Puratchi Thalaivi'  అంటూ కీర్తిస్తారు అభిమానులు. నిరంకుశరాలు అని నిందిస్తారు ప్రత్యర్ధులు. అక్రమాస్తుల కేసులో దోషి అని తేల్చింది ప్రత్యేక కోర్ట్. విప్లవనయకురాలు అంటూ తమిళనాట జైహోలు అందుకున్న జయలలితా ఇప్పుడు జైలు శిక్షను అనుభవించటానికి సిద్దం అయ్యారు. అవినీతి భారతంలో నేనుసైతం అంటూ మరో అధ్యాయాన్ని సొంతం చేసుకున్నారు. అవినీతిమయ రాజకీయాల ఫై కొరడా ఝుళుపించింది బెంగళూరు ప్రత్యేక కోర్ట్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ళు జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించి ఆస్థుల కేసు లో వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది.

* 18 ఏళ్ళ పాటూ సాగిన కేసు.
* 14 మంది జడ్జిల సమక్షంలో విచారణ.
* 259 ప్రాసిక్యుషన్ సాక్షులు.
* 99 మంది డిఫ్ఫెన్సు సాక్షులు.

వెరసి 4 యేళ్ళు జైలు శిక్షా, 100 కోట్ల జరిమానా...






జయలలిత, శశికలా స్నేహం గురించి బయట ప్రపంచానికి తెలిసింది జయలలిత సి.ఎం. అయిన తెరువాతే. అంతకముందే వారి మధ్య స్నేహమున్నా అది Poes Garden కు మాత్రమే పరిమితమైంది. జయలలిత తోలి సారి సి.ఎం. అయిన అయిదేళ్ళలో వీరిద్దరి స్నేహం ప్రపంచానికి తెలిసింది. చీరల దగ్గరనుంచి ఆభరణాల వరకూ ఇద్దరూ ఒకే డిజైన్ ధరించేవారు. చివరకు చెప్పులు కూడా! జయలలితా ప్రస్తుత పరిస్థితికి శశికలా ప్రధాన కారణమన్న వాదన తమిళనాడులో బలంగా వినిపిస్తూ ఉంటుంది.

శశికలా కుమారుణ్ణి జయలలిత దత్తత తీసుకున్నారు. 1995 September 7 వ తేదిన దత్త పుత్రిడి వివాహాన్నిజయలలిత అత్యంత ఘనంగా నిర్వహించారు.ఆ రోజుల్లోనే ఈ వివాహాన్ని లక్ష్య యాబై వేల మంది బిగ్ స్క్రీన్స్ లో వీక్షించారు. జయలలిత కుమారుడి వివాహం రెండు గిన్నిస్ రికార్డ్లను కూడా సృష్టించిదని DMK సెటైర్స్ పెలుస్తుటుంది. ఎక్కువ మంది అతిధులు హాజరైన వివాహంగా, బారిస్థాయిలో భోజనాలు ఏర్పాటు చేసిన వివాహంగా గిన్నిస్ రికార్డ్లల కేక్కిందని DMK కాడర్ విమర్శిస్తూ ఉంటుంది.


2001 లో అన్నాడిఎంకే తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటికే భూముల కేసులో జయలలితకు ప్రత్యేక కోర్ట్ జైలు శిక్ష విధించింది. దీంతో ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. 2001 లో అన్నాడిఎంకే విజయం సాదించింది. M.L.A.గా పోటీచేయని జయలలితను M.L.A.లు తమ నేత గా ఎన్నుకున్నారు. M.L.A.గా గెలవకపోయినా 6 నెలలపాటు సి.ఎం.గా ఉండొచ్చు అన్న నిభందనను తమకు అనుకూలంగా వాడుకున్నారు. కానీ న్యాయ నిపులుణుల సలహాతో 2001 సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేసిన జయలలిత పన్నేర్ సెల్వం ను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. 2002 లో చెన్నై కోర్ట్ భూముల కేసును కొట్టివేయడంతో జయలలిత నిర్దోషిగా బయటపడ్డారు. ఉపఎన్నికల్లో పోటీచేసిగెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.


తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరోసారి జయలలితా కటకటాల పాలయ్యారు. 2001 లో పన్నేర్ సెల్వం చాలా తక్కువ సమయమే దొరికింది. కానీ ఈసారి సి.ఎం.గా జయలలితా స్థానంలో రెండో కృష్ణుడి పాత్ర పోషించే నేతకు ఎక్కువ సమయం ఉండొచ్చునని పరిశీలకుల అభిప్రాయం.



రాజకీయ అవినీతి చరిత్ర...

భారతదేశం లో రాజకీయ అవినీతికి అంతేలేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకోవడం అడ్డగోలుగా సంపాదించటం దాన్ని చట్టబద్ధం చేసుకోవడం కోసం నానా గడ్డీ కరవటం సర్వసాధారణమై పోయింది. అసలు భారతదేశానికి స్వాతంత్ర్యం తో పాటే 'రాజకీయ అవినీతి' కి పునాది పడింది. అప్పట్లో లక్షల్లో ఉన్న కుంభకోణాలు కాలంతో పాటే ఎదుగుతూ ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల రేంజ్ కి చేరాయి. లక్షలు పోయాయి, కోట్లు పోయాయి, లక్షల కోట్లు.... కుంభకోణాలు బయటపడుతున్నాయి. జనంలో మాత్రం అప్పుడు ఇప్పుడు అదే స్పందన. అమ్మో ఇంత అవినీతా అని!!! ఆ రోజున అది ఎక్కువ అయితే, ఈ రోజుకు ఇది అని సరిపెట్టుకుంటూ తమ ప్రియతమ నేతల్నిభరిస్తున్నారు. 



దేశానికి 1947 లో స్వాతంత్ర్యం వస్తే ఆ మరుసటి ఏడాదే 1948 లో మొట్టమొదటి భారీ కుంభకోణం జరిగింది. అదే Jeep Scandal 1948. బ్రిటన్లో భారత హైకమీషనర్ V.K. Krishna Menon దీని సూత్రధారి. ప్రోటోకాల్ నిభందాలను ఉల్లంగించి ఆర్మీ జీప్స్ కొనుగోలు కోసం ఆయన ఓ విదేశీ కంపెనీకి 80 లక్షల రూపాయలు చెల్లించారు. మొత్తం 4603 జీప్స్ కోసం డబ్బులు చెల్లించగా కేవలం 155 జీపులు భారతదేశానికి వచ్చాయి. 1955 September 30 న ఈ కేసు క్లోజ్ అయింది. కేసును ముసేస్తున్నాం అని ప్రతిపక్షాలు సంతృప్తి చెందకుంటే, ఎన్నికల అంశంగా మార్చి ప్రచారం చేసుకోవచ్చని అప్పటి నెహ్రు ప్రభుత్వం ప్రకటించింది. అంతటితో ఆగకుండా 1956 February 3న  V.K. Krishna Menon ను నెహ్రు తన కేబినేట్లోకి తీసుకున్నారు. ముందు పోర్ట్ పోలియో లేని మంత్రిగా తీసుకొని, ఆ తరువాత ఏకంగా 'రక్షణశాఖ' మంత్రిగా పదవిని కట్టబెట్టారు. స్వతంత్ర భారతంలో అలా మొదలైన 'రాజకీయ అవినీతి' ఊడల మర్రిలా విస్తరించి... ఇప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థకే ముప్పుగా పరిణమించింది.

నాటి నుంచి కుంభకోణాలు జరుగుతున్నా 2004 నుంచీ వీటి తీవ్రత పెరిగింది. అంతకముందు ఏటా సింగిల్ డిజిట్ లో బయటపడ్డ స్కామ్స్ 2004 తరువాత ఏడాదికి 20 నుంచి 30 స్కాముల వరకూ వెలుగు చూసాయి. 2012 లో అయితే  చిన్నా చితకా అన్నీ కలిపి 40 వరకూ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న స్కాములు వెలుగు చూసాయి. ఆ తరువాత నుంచీ ఈ సంఖ్య పెరుగోతోంది తప్పా...తగ్గడం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అన్నీ పార్టీలు ఈ పాపంలో తలా పిడికెడు పంచుకున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనం సొమ్ము దోచుకోవడానికి అన్నీ పార్టీల నేతలు పోటీ పడ్డారు.



భారతదేశంలో తోలి భారీ కుంభకోణంగా సంచలనం సృష్టించిన స్కాములలో Bofors ను చెప్పుకోవచ్చు. శతగ్జ్నుల కొనుగోలు సంభందించిన ఈ స్కాంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు బయటకొచ్చింది. 1.3 Billion Dollars విలువైన డీల్ లో 64 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ. స్వీడన్ కి చెందిన Bofors కంపెనీ తమ శతగ్జ్నులను కొనుగోలు చేసేందుకు భారత అత్యునత రాజకీయ నేతకు, మిలిటరీ అధికారులకు లంచాలు ముట్టజేప్పిందన్న వార్త అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఆరోపణలు ఎదుర్కొన్న రాజీవ్ గాంధీ, మధ్యవర్తిగా వ్యవహరించాడని చెబుతున్న ఇటలీ వ్యాపారవేత్త ఖత్రోచ్చి మరణించారు.


బిహార్ లో దానా కుంభకోణం (Fodder Scam)  దేశ వ్యాప్తంగా మరో సంచలనం. పశువుల కోసం ప్రభుత్వం దానా కొనుగోలు చేసే వ్యవహారంలో 940 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని  Comptroller and Auditor General (CAG)  బయటపెట్టడంతో అప్పటి ముఖ్యమంత్రి Lalu Prasad Yadav పదవి కోల్పోయారు. తరువాత తన భార్య రబ్రీ దేవిని సి.ఎం. ని చేసారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2013 అక్టోబర్ లో సి.బి.ఐ. కోర్టు లాలూకు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. అరెస్ట్ అయి జైలుకు వెళ్ళిన లాలూ ప్రసాద్ ప్రస్తుతం పేరోల్ మీద బయటకొచ్చారు. ఈ శిక్షతో లాలూ ఆరేళ్ళ పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాధ్ మిశ్రా కూడా ఇదే కేసులో నాలుగేళ్ల శిక్ష పడింది.

ఇక మాజీ ప్రధాని పి.వి.నరసింహా రావు హయాంలో టెలికాం కుంభకోణం సంచలనం రేపింది. ఓ ప్రైవేటు కంపెనీకి టెలికాం లైసెన్స్ ఇచ్చేందుకు 1996 లో నాటి టెలికాం మంత్రి సుఖ్ రామ్ 6 లక్షలు రూపాయలు లంచం తీసుకున్నారు. దీని మీద కూడా సుదీర్ఘ విచారణ జరిగిన అనంతరం సుఖ్ రామ్ కు 86 ఏళ్ళ వయసులో జైలు శిక్ష పడింది. 




టెలికాంకే సంబంధించిన మరో భారీ కుంభకోణం 2G. స్పెక్ట్రమ్ కేటాయింపుకు సంబంధించిన ఈ స్కాంలో భారీగా నిధులు చేతులు మారయన్నది అభియోగం.ఈ స్కాం విలువ 1760000000000 (లక్షా డెబ్బైఆరు వేల కోట్ల రూపాయలు) గా తేల్చింది CAG. స్వతంత్ర భారత చరిత్రలో అంత భారీ ఎత్తున అవినీతి జరగడం ఇదే మొదటిసారి. ఆ స్కాం బయట పడ్డాకే లక్షలు, కోట్లు పోయి లక్షల కోట్లు కుంభకోణాలు వరుసపెట్టాయి. సి.బి.ఐ. ఈ కేసు విచారణ జరుపుతుంది. ఇదే కేసులో నాటి టెలికాం మంత్రి Raaja, DMK Raajyasabha సభ్యురాలు Kanimoli జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ ఫై బయట ఉన్నారు.



ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి హయంలో జరిగిన తాజ్ కారిడార్ (Taj Corridor) కుంభకోణం ఆమెను రాజకీయంగా దెబ్బ తీసింది. తాజ్ మహల్ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించే ఈ ప్రాజెక్ట్ లో 175 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ.



దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా ప్రచారం జరిగిన బెంగళూరు ల్యాండ్ స్కాం దెబ్బకు అప్పటి ముఖ్యమంత్రి B.S. Yaddyurappa  పదవి కోల్పోవాల్సి వచ్చింది. భూముల డినోటిఫికేషన్, కేటాయింపులలో అవినీతి జరిగిందని ఇందులో Yaddyurappa కుటుంబ సభ్యులకు కోట్ల రూపాయల ముడుపులు అందడంతోపాటు ఇతరత్రా ప్రయోజనాలు కలిగాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయిన Yaddyurappa ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఆ తరువాత ఇదే కేసులో ఆయన జైలుకు  కూడా వెళ్లారు. 



ఇక అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోట్లు కొల్లగొట్టిన గాలి జనార్ధన రెడ్డిది స్పెషల్ ఎపిసోడు. ఏకంగా రాష్ట్రాల సరిహద్దులనే చెరిపేసి ఇనుప ఖనిజాన్ని తొవ్వి వేల కోట్లు వెనకేసారు అన్నది గాలి మీద ఉన్న ప్రధాన అభియోగం. ఈ అక్రమ మైనింగ్ కేసు లో జైలు కి వెళ్ళిన గాలి తన బెయిల్ కోసం బేరం పెట్టి మరో రకంగా ఇరుక్కు పోయాడు. ఇప్పటికీ ఆయన జైలులోనే  ఉన్నాడు.




తాజాగా సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న మరో స్కాం coal Scam. ప్రైవేటు కంపెనీలకు బొగ్గు బ్లాకులు కేటాయింపులలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలఫై సి.బి.ఐ. విచారణ జరుపుతోంది. ప్రభుత్వ ఆధీనంలోని నాలుగు మినహా మిగతా కేటాయింపుల మొత్తాని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కూడా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు  తెలిసే ఈ స్కాం జరిగిందన్న మాజీ CAG ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి. 

ఇలా శిక్షలు పడుతూ,అనర్హత వేటు వేస్తూ ఉన్నా నాయకులు అడ్డగోలు సంపాదనను వీడకపోవడంఫై ఆందోళన వ్యక్తమవుతుంది.ఇలా కాలానుగునం గా స్కాంల విలవ పెరుగుతూ వస్తుంది. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగు చుస్తూ జనం దిమ్మెర పోయేలా చేస్తున్నాయి. తరువాత జరిగేదేంటో అప్పుడే చూసుకుందాం, ముందు ఉన్నంతలో దోచుకొని దాచేసుకుందాం అన్న ధోరణి రాజకీయ నాయకుల్లో పెరిగిపోతుంది.


 సుబ్రమణ్యస్వామి ఎంటర్ఐతే, వార్ వన్ సైడే... 



 ఈయన కాషాయం వేసే స్వామి కాదు. జాతకాలు చెప్పే స్వామి అంతకన్నా కాదు. ఈ స్వామి లెక్కే వేరు. ఈయన కన్ను పడిందంటే వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. పెద్దోళ్ళతో మనకెందుకని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ స్వామి ఆ బాపతు కాదు. ఈయన పెద్దోల్లతోనే పెట్టుకుంటాడు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటాడు. కొమ్ములు తిరిగిన వాళ్ళకే చెమటలు పట్టిస్తాడు. చివరకి అందరితో ప్రదక్షిణాలు చేయించుకొనే 'అమ్మ' నే బోనులో నిలబెట్టాడు. జైలుకి పంపి ఈయన పవర్ ఏంటో చూఇంచాడు. ఈయనే సుబ్రమణ్య స్వామి.

'అమ్మ' జయమ్మ కరుణా కటాక్షాల కోసం ఎవరైన సాష్టాంగనమస్కారం చేయాల్సిందే. తలెత్తి ఆమె కళ్ళలోకి చూడటం కూడా సాహసమే. తమిళనాడును ఏలుతున్న జయలలితను జీవితంలో కోలుకోలేని దెబ్బ తీసారు సుబ్రమణ్య స్వామి. జయమ్మని జైలు పాలు చేసి మరో మారు భారతదేశ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకున్నారు ది గ్రేట్ స్వామి.


జగమెరిగిన బ్రామ్హనుడ్కి జంధ్యమేల అన్నట్లు సుబ్రమణ్య స్వామిని కొత్తగా పరిచయం చేయాల్సిన పనే లేదు. వివాదాల్లో ప్రముఖుడిగా కనిపించే ప్రముఖునిగా అందరికి ఈయన సుపరిచితమే. అచ్చు తప్పు పోకుండా చెప్పాలంటే ఈయన సుబ్రమణ్య స్వామి. చట్టాల్ని, న్యాయ పరమైన అంశాలను అవపోసన పట్టిన మహా మహా మేధావి. అందుకే సుబ్రమణ్య స్వామి ఎంటర్ఐతే వార్ వన్ సైడ్ అంటారు. ఈయన కంట్లో ప
కూడదని అంతా అనుకుంటారు. ఈయన నోట్లో నాన కూడదని రాజకీయ నాయకులంతా అనుకుంటారు. దేన్నైనా పట్టాడంటే ఓ పట్టాన ఒదిలిపెట్టడు. స్వామి సీన్లో ఉంటే అందరి ద్రుష్టి ఆ ఎపిసోడ్ ఫైనే.

మకుటంలేని మహారాణిగా తమిళనాడును ఏలుతున్న జయలలితకు జీవితంలోనే మరిచిపోలేని చేదు అనుభవం ఈ స్వామి గారి పుణ్యమే. అడుగులకు మడుగులోత్తే సేవకులు, అడిగితే ప్రాణలయన ఇచ్చే అనుచరులు, కనుసన్నల్లో పరుగులు పెట్టే అధికారులు... ఇంతటి రాజబోఘాన్ని అనుభవిస్తున్న జయలలితను జైలు గోడల మధ్య పంపింది సుబ్రమణ్య స్వామి పంతం. 1996 లో జయలలితఫై ఫిర్యాదు చేసిన సుబ్రమణ్యస్వామి ''వొదల బొమ్మాలి'' అంటూ ఇన్నేళ్ళు కేసును గట్టిగా లాక్కోచారు. 18 ఏళ్ళ పాటు ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా జయమ్మ కేసు మీద ఓ కన్నేసి పెట్టారు. మొదటనుంచి సుబ్రమణ్యస్వామి అంతే, ఎవరిమీద అయినా కన్నేస్తే వాళ్ళ అంతు చూసే దాకా నిద్ర పోనీ తత్వమే స్వామిని దేశ రాజకీయాల్లో ఓ విశిష్ట నేతగా నిలబెట్టింది. ఈయనకు తనా,మనా తేడాలేమీ లేవు. జయలలితను ఎలా చూస్తారో తమిళనాట రాజకీయ ప్రత్యర్థి కరుణానిధిని అలానే ట్రీట్ చేస్తారు. 2G కుంభకోణం విష్యం లో  కరుణానిధి ఫ్యామిలీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది ఈ స్వామే. ఇదే కేసులో కాంగ్రెస్ నేత చిదంబరాన్ని కూడా స్వామి కోర్టుకు ఇడ్చారు. చివరకు చిదంబరం పుత్ర రత్న్నాన్ని కూడా బజారుకు లాగారు. అది తప్పు అనిపిస్తే ఈయనకు ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు. తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా కుమ్మేస్తాడంతే.


ఎదుటి వారి వైపు ఓ వేలెత్తి చూపిస్తే మూడేళ్ళు మనవైపు చుపిస్తాయనేది జగమెరిగిన నానుడి. కానీ తనఫై ఎదురు దాడికి ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వడు సుబ్రమణ్యస్వామి. ముక్కు సూటి తనమే ఈయన బలం. మచ్చలేని రాజకీయ చరిత్ర తోనే స్వామికింతటి తెగువ. అందుకే కొండల్లాంటి వ్యక్తులను డీ కొట్టినా ఈయన తల ఎప్పుడూ బొప్పి కట్టలేదు. లోక్ నాయక్ సహచర్యం నుంచి అంది పుచ్చుకున్న పోరాట పటిమతో ఎవరిఫైన అయినా తోడ గోడుతుంటాడాయన. తన వ్యాఖ్యలతో ఎంతటి దుమారం రేగుతున్నా..మోహంలో ప్రశాంతత చెక్కు చెదరినివ్వకుండా అంతే మనో నిబ్బరంగా ఉండటం సుబ్రమన్యస్వమికే చెల్లింది. స్వామి వెనుక తండోపతండాలుగా అనుచరగణం ఉండదు. ఈయనోక్కడే. వన్ మాన్ ఆర్మీ లా దశాబ్దాలుగా అందరిమీదా అలుపెరగని పోరాటం సాగిస్తూనే ఉంటాడు ఈయన. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతాడని, గిల్లికజ్జాలు పెట్టుకుంటాడని, దారిన పోయే కంప తగిలించుకుంటాడని ఎవరెన్ని అనుకున్నా సుబ్రమణ్యస్వామి డోంట్ కేర్. నా దారి రహదారి అన్న టైపు ఈయన.


1939 లో చెన్నై లో పుట్టిన స్వామి తన విలక్షణ వ్యక్తిత్వంతో దేశమంతా పాపులర్. 1965 లో హార్వార్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో డాక్టరేట్ సాధించిన స్వామికి ప్రతి లెక్కా పక్కా గా తెలుసు. 1969 లో ఢిల్లీ ఐ.ఐ.టి. లో ఆర్థిక విభాగ ప్రొఫెసర్ గా చేరాకా స్వామి విశ్వరూపాన్ని ఐ.ఐ.టి. పాలకవర్గం అప్పుడే చూసింది. విద్యార్థుల పక్షాన నిలబడి మేనేజ్మెంట్ ఫై పోరాటానికి దిగటంతో స్వామికి ఉద్వాసన చెప్పారు. ఉన్నత న్యాయస్థానంలో పోరాడి 20 ఏళ్ళ తరువాత మళ్ళి ఉద్యోగంలో చేరినా ఏడాది లోపే కేబినేట్ మంత్రిగా అవకాశం రావడంతో బోధనా వృత్తి నుంచి వైదొలిగారు స్వామి. కేవలం రాజకీయ పరమైన అంశాల్లోనే కాదు  న్యాయ పరంగా అత్యంత క్లిష్టమైన విషయాలలో తల దూర్చడం స్వామికి ఆటవిడుపు. తమిళనాట చిడంబరంలోని నటరాజపు ఆలయ పాలక వర్గం సర్వస్వతంత్రమని ప్రభుత్వ జోక్యానికి తావే లేదని కోర్ట్ తీర్పు రావడానికి కారణం ఈ స్వామే. 1000 సంవస్తరాల చరిత్ర ఉన్న ఆ ప్రసిద్ద ఆలయ హక్కుల ఫై స్వామి జోక్యంతో ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటి తీర్పు వెలువరించింది. సునందా పుష్కర్ మరణంలో కొత్త కోణాన్నివెలుగులోకి తెచ్చి సి.బి.ఐ. విచారణకు డిమాండ్ చేసి శశిథరూర్ కు మనశ్శాంతి లేకుండా చేసింది కూడా ఈయనే. విదేశి బ్యాంకుల్లో నల్లదనం ఫై ఇటీవల స్వామి నేరుగా రాష్ట్రపతిని కలవడంతో బడా బాబులెందరో గతుక్కుమన్నారు. తనకి తెలిసిన బ్లాక్ మనీ నేతల పేర్లు కూడా రాష్ట్రపతి ముందు ఉంచారు.


దేశంలో ఇంతమంది నాయకులుంటే సుబ్రమణ్యస్వామికే ఎందుకు ఇంత ప్రత్యేకతా! చైనా పితామహుడితో ఆత్మీయ కరచాలనం. అమెరికన్ అధ్యక్షుడి ఆతిధ్యం. 
 దేశానికెళ్ళినా, ఏ ముఖ్యనేత దగ్గరకెళ్ళిన స్వామికి ప్రత్యేక ఆహ్వానం. వివాదాస్పదడు అయినందుకు కాదు. ఈయన మేధస్సుకు ముక్కుసూటితనానికి లభిస్తున్న "గౌరవం" అది. 
      

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top