Monday, September 29, 2014

MAKE IN INDIA* Manufacturing Sector (తయారీ రంగం) ఫై ఫైకెల్తేనే ఇక్కడ ఉద్యోగాలోస్తాయి. ఇక్కడ ఉత్పాదకత పెరిగితేనే అనుకున్న అభివృద్ధి సాధ్యపడి పోతుందనే గట్టి మార్కు వాదనతో ముందుకెల్లిపోతున్న మోది పిలుపుకు భారతదేశంలో ఉన్న టాప్ 500 C.E.O.లు  ఎలా స్పందించారు? 

* ఇన్నేళ్ళు ఇంచ్ కూడా ముందుకు జరగని మన పరిశ్రమలు ఇప్పుడు కదుల్తుందా? 

* మోది అనుకున్నది సాధిస్తారా? 

* ఆయనకున్న న్యూ ఇమేజ్ భారతదేశాన్నికొత్త పుంతలు తోక్కిస్తుందా? 

ఇవ్వన్నీ షరా మాములుగా అందరూ అడిగే ప్రశ్నలే! ఎందుకంటే ఇవే అందరికీ వచ్చే డౌట్స్ కాబట్టి. మంచి మాటలదేముంది ఎవరైనా చెప్తారు.. కావాల్సింది మంచి చేతలే! మాది చేతల ప్రభుత్వం అని చెప్పినోళ్ళు  చేయిచ్చి (కాంగ్రెస్ గవర్నమేంట్)వెళ్ళిపోయిన తరువాత వచ్చిన మోది సర్కార్ ఆ ఎన్నికల ముందునుంచీ శంఖాలు పూరిస్తూనే ఉంది..ఊరిస్తూనే ఉంది...!

MAKE IN INDIA - మనమే తయారుచేసుకుందాం అంటూ న.మో. లేటెస్ట్ గా ఊదిన శంఖం మాకేవ్వరికి వినిపించలేదని చెప్పటానికి వీల్లేనంత గట్టిగా పూరించేసారాయన. ఫైగాఎవరి దగ్గర పూరించాలో కూడా వాళ్ళందరిని (ముఖేష్ అంబాని, ప్రేమ్ జీ, రతన్ టాటా...etc) పిలిచిమరీ చెవులు తుప్పు ఒదిలి పోయేలా పూరించేసారు. అంతే కాదు ఆ అమెరికోడు పిలిచాడని, వాడి దగ్గరకెళ్ళే ముందు ఈ శంఖారావం వాడిక్కుడా వినిపించేలా ఇరగాదీసిన వైనమిది.

మంచి పరిపాలన ఒక్కటే కాదు..సరళమైన సుపరిపాలన నా ప్రయత్నం అంటున్నారు మోది. ఇంతకీ సరళమైన పాలన అంటే ఏంటో? సింపుల్ గవర్నెస్... ఇదేదో కొత్తగా ఉందే నిబంధనల బంధనాల్లో రూళ్ళ చట్ట్రాల్లో బిగించి ఆ ఉచ్చులతోనే మెడలు బిగించి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసే రూల్స్ ఇండియాలోమార్పులా... అసంభవం అంటూ చేతులెత్తిసిన వాళ్ళంతా ఇప్పుడు ఆ మోది వైపు అదోరకంగా చూడటం మొదలుపెట్టారు. తొమ్మిదింటికే ఆఫీసులకి రాకపోతే ఉద్యోగాలకు ఊస్టింగే అంటూ ఘీంకరించిన న.మో. కు భయపడిపోయి ఇప్పుడు ఆ రాజధాని నగరంలో  ఆఫిసులన్నీ వణికిపోతున్నాయా? మళ్ళి మన దేశ మీడియాలో దీని గురించి ఒక్కటంటే ఒక్క ఫాలోఅప్ వార్త కనబడితే ఒట్టు. వాళ్ళ కార్యాలయాల్లో ఏమోగానీ మోది టీంమేట్స్ అయిన మంత్రులు మాత్రం నిద్రలు ఖరాబు చేసుకుంటున్నమాట అయితే ముమ్మాటికి నిజం.ఇవాళ మేక్ ఇన్ ఇండియా అంటూ పిలుపునిచ్చుకుంటే.. అవును మా మోది సాధించుకోగలరు.. సాధిస్తారు కూడా. రోజుకు పద్నాలుగు గంటలు పనిచేసే ఈ కష్టజీవికి అసాధ్యం ఏమీ లేదంటూ కితాబులిచ్చుకున్నారు అంబానీలు. ప్రపంచంలోని నెంబర్ ఒన్ రిచెస్ట్ మాన్ ఆ అంబానీయే మోది పక్కన వచ్చి నిలబడితే సాధ్యం కాక పోవడానికి ఏముంటుందో! మనకున్నచట్టాల్ని మార్చేసి పారదర్శకంగా చేస్తే ఎన్ని అసాద్యాలనైనా సుసాధ్యాలు చేయోచ్చంటూ ఆ టాటాలే పక్కన నుంచి సన్నాయినొక్కులు నోక్కేసారు. 

25 పారిశ్రామిక రంగాలను గుర్తించి వాటి నుంచి తైలం పిండాలని సంకల్పించుకున్నట్లు ఒక ప్రకటన కూడా జారీ అయిపొయింది. భారత్ ను ఒక మార్కెట్ గానే చూస్తున్న పశ్చిమ దేశాలకు  MAKE IN INDIA సింహా గర్జన వినపడాలనే యావతోనే అమెరికోడి టూర్ ముందు పెట్టుకున్నమీటింగ్ ఇది. ఒబామా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ పిలుపునిచ్చిన మోది, ఆ ఒబామా ఆలోచనలన్నింటిని ఆదర్శంగా భావించాలంటారా? దేశంలో కునారిల్లుతున్న తయరీ రంగాన్నిపరిగెత్తించాలి అంటే మోది చేసిన సింహా గర్జన ఒక్కటే సరిపోదు. భయంకరమైన చట్టాలు పోవాలి, కార్మిక లోకం హర్సించేలా మార్పులూ రావాలి. సంస్ఖరనాభిలాష సరే, సంస్ఖరావంతమైన పాలకులు రావాలి.. కావలి.. వాళ్ళ ఆలోచనలోనూ మార్పులూ రావాలి. లేకపోతే ఎన్నెన్ని శంఖారావాలైనా ఆ బధిరుల ముందు ఊదినట్టే. సింహం సరే. దాని అరుపులూ సరే.. అది కనిపించి వినిపిస్తేనే ఫలితం.

అల్ ది బెస్ట్ టూ న.మో.

0 comments :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2021. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top