రాజన్న మీరు మాకు మల్లీ కావాలీ. . .

మాట తప్పకపోవడమే, నువ్వు చేసిన తప్పా? ఇచ్చిన మాట కు కట్టుబడి ఉండటమే నువ్వు చేసిన తప్పా? పేద ప్రజల కన్నీళ్ళు తుడవటమే, నువ్వు చేసిన తప్పా? ప్రతి ఒక్క తెలుగు గడప సుఖంగా, సౌభాగ్యాలతో ఉండాలనుకున్నావ్. . వ్యవసాయం అంటే దండగ కాదు. . అది రైతులకి పండగ అని రుచి చుపించావ్. . అన్న అనే మాటకి, ప్రతి రూపం గా నిలిచావ్. .ప్రతీ తెలుగు చెల్లి సుఖంగా ఉండాలి అనుకున్నావ్ . . లీడర్ అనే పదానికి అర్థం చేప్పావు . .నాయకుడంటే నాలాగే ఉండాలి అని చూపించావు . . . ఆరోగ్యమే మహా భాగ్యం . .ప్రతీ పేద వాళ్ళు ఆరోగ్యం గా ఉండాలి అని పరి తపించావు. . . చదువు తో కుటుంభం, ఊరు, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది, ప్రతీ పేద వాళ్ళు గొప్ప చదువులు చదవాలి అని తలపించావు. . . హీరో లు అంటే తెరపై కనిపించే వాళ్ళు కాదు. . నిజమైన హీరోలు జానాల మనసులోంచి పుట్టడమే అని చూపించావు. . . సమస్యని ఎంత సున్నితంగా పరిక్షరించాలో నేర్పించావు . . పేద వాళ్లకి ఏమి అవసరమో, అవి వాళ్ళకి అందాయ లేదా అని ఆలోచన చేసావు. . ఏది నువ్వు మాకు, చేయ్యనిది? ఏది నువ్వు మాకు ఇవనిది?ఎందుకు ఆ దేవుడు మిమ్మల్ని మాకు అర్థంతరంగా గా దూరం చేసాడు?

ఒక మనిషి మరణం మాకు శాపం అయితే, ఆ మరణం మాకొద్దు , మీరు లేని ఈ తెలుగు రాష్ట్రం మాకు ఒక ప్రత్యక్ష నరకం, మీరు లేరు అనే , ఆ ఊహ ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము , కోట్ల మంది తెలుగు ప్రజల నమ్మకాన్ని ఆ దేవుడి వమ్ము చేస్తాడు అని ఆలోచించలేక పోయాము, మా ప్రతి రూపాన్ని మాకు , కాకుండా చేస్తాడు అని కలలో కుడా అనుకోలేదు, కోట్ల మందికి మంచి చేయాడమే, దేవుడి దృష్టిలో తప్పు అనిపిస్తుందని మేము తెలుసుకోలేకపోయాము, నీ లీల ఏమిటో, నీ జనణ, మరణం రహస్యం ఏమిటో మాకు అంతు చిక్కకుండా ఉంది, అసలు దేవుడి దృష్టిలో మంచి చేయాడమే తప్పా? రాజన్న మీరు మాకు మల్లీ కావాలీ. . .
Next Post Previous Post