fvz

Monday, June 30, 2014

తోటరాముడు-2


తోటలో పళ్లూ, కూరగాయలే కాదు రాజకీయాలు కూడా పండించవచ్చు. ఈ రహస్యాన్ని ముందెందరో చెప్పారు. ఈ యుగంలో మాత్రం తొలుత కేసీఆర్‌ నిరూపించారు. ఆ తర్వాత నిరూపించడానికి పవన్‌ కళ్యాణ్‌  సిద్ధమయ్యారు. పేరుకి ఎన్టీఆర్‌ సినిమాలో వేషం వేసి, ‘తోటరాముడ’య్యాడు కానీ అసలు తోటరాముళ్లు వీరే! నిజంగానే తోటల్లో నివాసం ఉంటారు. దాన్నే ముచ్చటగా ‘తోటబంగ్లా’ అనుకోవచ్చు, లేదా ‘ఫౌంహౌస్‌’ అనుకోవచ్చు. కేసీఆర్‌ ఉద్యమంలోనే కాదు ఉద్యానవనంలో కూడా రాజకీయాన్ని చూపగలరు. కానీ పవన్‌కు సాధ్యమా? జనసేనతో పోటీ చేయకుండా ప్రచారంలో పాల్గొని హల్‌చల్‌ సృష్టించి, మళ్లీ తోటలోకి వెళ్లిపోయారా? అయితే మాత్రం రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒకరి ‘ఫ్యూజు’ ఒకరు  లాగేస్తున్నా, గురుకుల ట్రస్టు భూముల్లో ఆకాశహర్మ్యాలు వదలి, పేదల ఇళ్లు పీకేస్తున్నా తోట రాముడు-2 బయటకు రావడం లేదు.  

రాజకీయం తెలిసిన పార్టీ 

జనసేన అచ్చమైన రాజకీయ పార్టీ. పుట్టకముందే రాజకీయం నేర్చిన పార్టీ. పవన్‌కు రాజకీయం తెలియదని అన్నది ఎవరు? ఆయనకు తెలిసినంతగా జగన్‌కు కూడా తెలియదు. ఎందుకంటే పార్టీ పెడుతున్న సంగతి తెలిసీ తెలియకుండా బయటకు తెలియచేసారు. ఆపైన కాస్లీ వేదికపై దాన్ని ఆవిష్కరించారు. ఆ సభ కోసమేమిటి? ఆ తరువాతి సభల నిర్వహణకు పి.వి.పి సంస్థ యజమానిని యథాశక్తి వాడేసుకున్నారు. ఎమ్మెల్సీ కూడా కాకుం డానే నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబు చేత, తన పార్టీకి ఫైనాన్షియర్‌, స్పాన్సరర్‌ అయిన పివిపికి ఏమీ చేయిం చలేదు పవను బాబు. మరి అదే రాజకీయం అంటే. ఎక్కి వచ్చి మెట్లను మరిచిపోకుంటే, మిగిలిన మెట్లను ఎక్కలేం కదా?  రాజకీయం అంటే మరో క్వాలిఫికేషన్‌ కూడా వుండాలి. 

మన మనసులో ఏముందో మనకు తప్ప వేరేవరికి తెలియకుండా మాట్లాడగలగాలి. పవన్‌కు ఆ క్వాలిఫికేషన్‌ కాస్త ఎక్కువే వుంది. ఆయన మనసులో ఏముందో కాదు, మాటల్లో ఏముందో కూడా ఎవరికీ అర్థం కాదు. అర్థంపర్థం లేని సినిమా పాటల్లా వుంటాయి అవి. రిథమ్‌ బాగుంటుంది. వేడి వేడి పకోడీల్లా అప్పటికప్పుడు భలేగా వుంటాయి. తరువాత ఆలోచిస్తే, అవును ఏముందీ అనిపి స్తుంది. అదే రాజకీయం అంటే. ముందు పవన్‌ బాబు పార్టీ పెడుతున్నా అన్నారు. ప్రాణానికి తెగిస్తున్నా అన్నారు. 

(అందుకే తోట బంగ్లాలో దాక్కున్నారని జనం అపార్థం చేసుకోరాదు సుమా,.). టైమ్‌ లేకున్నా ఎన్నికల రంగంలోకి ధభాలున దూకేస్తున్నా అన్నారు. అంతలో రెండో మీటింగ్‌ వేళకు మాట మారింది. అబ్బే..తూచ్‌..రాష్ట్రం గొడ్డు పోయింది. మంచి అభ్యరులే దొరకడంలేదు. దొరికినపుడు పోటీ అన్నారు. మంచిదే. మంచి ఆశయమే. కానీ ఇక్కడా రాజకీయం వుంది. మీకు మంచి అభ్యర్థులు దొరకలేదు. మరి భాజపా, తేదేపా అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు కదా. అంటే మీ దృష్టిలో వారంతా మంచి అభ్యర్థులేనా? అంటే ఆ పాటి కేండిడేట్‌లు మీకు దొరకలేదా? ఇదే రాజకీయం అంటే, పోటీ చేయనందుకు సరైన సాకు వెతికి జనం ముందు పెట్టడం. 

రెండో మీటింగ్‌ నాటికి కేవలం మద్దతు మాత్రమే..ఎవరికి అన్న ది తరువాత. ఆ తరువాత సమయానికి మోడీకి మాత్రమే మద్దతు. అంతలోనే మళ్లీ మారింది. తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతు. అలా అలా ఆఖరికి అసలు జనసేన ఆశయం బయటపడింది.  

ప్లీజ్‌...చూపించరూ 

అయితే అక్కడా మళ్లీ రాజకీయం. జనం అపార్థం చేసుకోవద్దు. ఈ ఎన్నికల వరకే ఈ మద్దతు. 2019కి మళ్లీ ఎన్నికల గెటప్‌తో మీ ముందుకు వస్తా. ఈలోగా అవసరమైతే ప్రశ్నిస్తా..అన్నట్లు.. జనసేన కేడర్‌ తయారవుతోంది. కంప్యూటీకరణ జరుగుతోంది. సభ్యత్వ నమోదు ప్రారంభమైంది..శిక్షణకు ఏర్పాట్లు జరగుతు న్నాయి. 

ఏదీ ఎక్కడ? ప్లీజ్‌..చూపించరూ..జనమేమో..అప్పుడేప్పుడో కామన్‌ మాన్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌ అన్నది పెద్ద ఫార్సయిందని దెప్పి పోడుస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే బాపతు వ్యవహారం ఇది అని అంటున్నారు.  కానీ పవన్‌ బాబుకు ఇదేమీ పట్టదే..తాను, తన తోట. తోటలో పళ్లు..వాటి వితరణ కార్యక్రమం. మొక్కలకు కలుపు తీయడం ఎలా? తోటను ఏపుగా పెంచడం ఎలా? మరి జనసేన ను ఎవరు పట్టించుకుంటారు. దాన్ని ఏపుగా ఎవరు పెంచుతారు. ఇదేమన్నా డ్రామా డ్రెస్‌ కంపెనీనా..నాటకం అయిపోగానే డ్రెస్‌ తీసి దాచి, మళ్లీ ఎన్నికల నాటికి తీసి వేసుకోవడానికి. స్వంత డ్రెస్‌ కదా..దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా.  

పశ్నించేదెప్పుడు? 

రాజకీయ పార్టీ అన్నాక మంచికో, చెడ్డకో తన అభిప్రాయాలు చెప్పాలి. ఖండిస్తే, ఖండిచాలి. సమర్థిస్తే సమర్థించాలి. మరి దేని పైనా స్పందించని పార్టీని పార్టీ అని ఎలా అంటాం? అంటే జన సేనకు అభిప్రాయాలు అనేవి వుండవా?  సామాన్యుడికి తినడానికి లేదు..నాకు అనిపిస్తోంది. అసలు మనం ఎలా బతుకుతున్నామా..అని. ఇలాంటి పడికట్టు స్పీచులు చాలా ఇచ్చిన పవన్‌ ఎప్పుడు వచ్చి ప్రశ్నించడం ప్రారంభిస్తారా అని చూస్తున్నారు జనం. ఒక్క ఉదుటున రైల్వే చార్జీలు పెంచినప్పుడు జనసేన తన అభిప్రాయం చెప్పాలి కదా? 

గ్యాస్‌ ధరలు పెంచబోయి, అందరూ వద్దు బాబోయ్‌ అనడంతో మూడు నెలలు వెనక్కు తోసిన వైనంపై మాట్లాడాలి కదా?  లేదూ..ఆంధ్ర పిల్లగాళ్లకి తెలంగాణలో ఫీజుకట్టం అని అక్కడి ప్రభుత్వం అంటే, తన మాట తాను చెప్పాలి కదా. గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్లో పెద్దోళ్ల ఇళ్లు వదిలేసి చిన్నోళ్లవి పడగొడుతుంటే అడగాలి కదా
రుణమాఫీ.....అవును..అసలు మాఫీ అన్న పదం సరైనదేనా? మాఫీ చేసే హక్కు కేవలం రుణం ఇచ్చిన వారికే వుంటుంది. ఎవడో ఇచ్చిన అప్పును..ఇంకెవరో ఎలా మాఫీ చేస్తారు. కావాలంటే రుణ తీర్మానం చేస్తాం..రుణం తీరుస్తాం.. అనొచ్చు. సరే మాఫీ అన్నారు. ఇప్పుడు వాయిదాల పొడిగింపు, ఇంకేదో..అంటున్నారు. మరి దానిపై కనీసం ఏం జరుగుతోంది అని కనుక్కోవాలి కదా?  

ఎవర్ని సంప్రదించి విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని అని డిసైడ్‌ అయిపోయారు. ఇద్దరు నాయకులూ...మరి ఆ ముక్క అడగాలి కదా పవన్‌ బాబూ.. ఇలా ఒకటేమిటి చాలా వున్నాయి. జగన్‌ బాబు అడిగితే.. రాజకీయం అని తిడతారు..అసలు అతగాడికి ఆ హక్కేలేదంటారు. పైగా మాట్లాడితే జైలు,,బెయిలు..స్కాము అంటారు. అవన్నీ కోర్టు వ్యవహారాలు. ఇప్పుడు అతగాడిని జనం ప్రతిపక్షనేత చేసారు అందుకైనా బదులిద్దాం అనుకోరు.  అందువల్ల పోనీ ఇక మిగిలిన మీరయినా ప్రశ్నించకుంటే ఎలా?  అందుకే పవన్‌ బాబూ..ప్రశ్నించు. లేదేంటే, మిమ్మల్నీ తోటరాముడి కింద జనం జమేస్తారు. మళ్లీ మాట్లాడితే తోటరాముడు 2 అంటారు జాగ్రత్త బాబూ..

Saturday, June 28, 2014

కోనసీమ ఘటన మీద కుళ్ళు జోకులేస్తున్న ఈనాడు.


* మృత్యువు  నుంచి తెలుగువాడు తప్పించుకోవటం అసంభవం అని కార్టూన్ ల రూపంలో ఎగతాళి.

* ఒళ్ళు, ఇల్లు, మూగ జీవాలను  కాల్చుకొని కోనసీమ తెలుగు ప్రజలు హాస్పిటల్లో హా హా కారాలు చేస్తుంటే, పత్రికా రూపం లో భరోసా రాతలు రాయాల్సింది పోయి, ఆంధ్రోడిని  బట్టలూడదీసి కాలిన గాయాలతో బెడ్ మీద పడుకోబెట్టి కార్టూన్ ల రూపంలో సామాన్య ఆంధ్రోడి మీద  జోకులు వేయడం ఈ తెలంగాణా పచ్చ పత్రికకే చెల్లింది.

* నీ  తల్లో చెల్లో ఆ బాధితులలో ఉంటే గీసే వాడివా వేసే వాడివా ఇలాంటి బొమ్మలు ?

*ఇలాంటి పిచ్చి,పిచ్చి బొమ్మలూ రాతలు రాసి ప్రజాప్రతినిధులను ఎగతాళి చేసినందుకే TV9, ఆంధ్ర జ్యోతి ఛానళ్ళు అడ్డం గా మూసేసారు తెలంగాణలో.  ప్రజాప్రతినిధులను అవమాన పరిచారు కాబట్టే అంత తొందరగా గా చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలనుద్దేశించి పత్రికా రూపం లో భరోసా ఇవ్వాల్సిన సమయంలో, ఆంధ్రోడి మీద ఎన్ని అడ్డమైన గీతలూ, రాతలూ, బొమ్మలూగీసినా అడిగే నాధుడేడి? వీడు గీసిందే బొమ్మ రాసిందే రాత? ఇంకెన్నాళ్ళు భరించాలి ఇలాంటి పచ్చ పిచ్చి రాతలను??

  

Friday, June 27, 2014

గెలిస్తే ఎంత: బాబును ఏకేసిన జగన్, జనం కోసం రోడ్డుపైకి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. కడప కార్పోరేటర్లతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు. అబద్దం చెప్పి ఉంటే తమ పార్టీ కూడా కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. ఒక్కసారి అబద్దం చెబ్బి సిఎం చైర్‌లో కూర్చొని ఉంటే ఐదేళ్లకే ప్రజలు మనలను ఇంటికి పంపించే వారన్నారు.కడప మేయర్ అభ్యర్థిగా సురేష్ బాబుకు మద్దతు పలకాలని కోరారు. అన్ని మతాలకు, కులాలకు తమ పార్టీ సమాన ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కడప నుండే తాను ఈ రాష్ట్రానికి సందేశం ఇస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు అబద్దాలు, మోసాలు బయటకు వస్తాయని చెప్పారు. సాధారణంగా ఓ సిఎంపై వ్యతిరేకతకు రెండేళ్ల వరకు పడుతుందని, కానీ చంద్రబాబు పైన 25 రోజుల్లోనే అది కనిపిస్తోందన్నారు. 

ఆ తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొందన్నారు. విశ్వసనీయత, విలువలకు తమ పార్టీ ప్రాధాన్యతనిస్తుందన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను లాక్కొని దుష్ట రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందన్నారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీలను కూడా లాక్కుంటోందన్నారు. ఇలాంటి ఆకర్షణలతో గెలిస్తే ఎంత.. గెలవకుంటే ఎంత అన్నారు. 

ఎమ్మెల్సీలను లాక్కోవడంలో నిజమైన ప్రతిపక్షం లేదన్నారు. నిజమైన ప్రతిపక్షం అంటే ప్రజలు అన్నారు. మోసం చేస్తే ప్రజలు తిరగబడతారన్నారు. ప్రస్తుతం ప్రజలు తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా భవిష్యత్తులో 160 స్థానాలు ఇచ్చి నిలబెడతారన్నారు. ఈ ఐదేళ్లు అందరం ప్రజలకు తోడుగా ఉందామన్నారు. మన పైన పోలీసుల కేసులు, ఒత్తిళ్లు అనేకం ఉంటాయన్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అందరం కలిసి పోరాడుదామన్నారు. మీ కోసం నేను రోడ్డు పైకి వచ్చేందుకు సిద్ధమన్నారు. 

ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు. విలువలు లేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. అమలు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నాలుగేళ్లు బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడాలని, పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.

Thursday, June 26, 2014

చందమామ ముఖంలో చంద్రోదయ పవనాలెక్కడా ?

ఆంధ్రుల ముఖంలో ఆనందం లేదుచంద్రబాబు... ఈరోజుల్లో ఈ బహుదూరపు బాటసారి పేరుని 13 జిల్లాలోని ఆంధ్రులు తలుచుకొని రోజంటూ ఉండదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కేవలం ఈ MA ఎకనామిస్ట్ చంద్రబాబు మాత్రమే ఆంధ్రా ని "సింగపూర్" గా చేయగలరని నమ్మిఅధికార పీటం ఎక్కించారు. ఒక వైపు ఆంధ్ర రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉండింది అని తెలిసి హంగూ  ఆర్భాటాలతో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించి దాదాపుగా నెల రోజులు కావస్తున్నా తాను చేయవలసిన పని ఏమిటో.. ప్రజా సంక్షేమం దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటో, చేయదలచుకున్న పనులు ఏమిటో ఆయన ఇప్పటిదాకా నిరూపించుకోలేదు. 

చెప్పుకోడానికి బాబుగారు  తన  ప్రమాణస్వీకారం నాడు  5 సంతకాలు అయితే చేశారు గానీ, వాస్తవంగా అందులో కార్యరూపంలోకి వచ్చినది ఒక్కటంటే ఒక్కటే. ఉద్యోగుల పదవీవిరమణ కాలాన్ని పెంచడం మాత్రం అయింది. ఇతరత్రా బాబుగారి  ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం పనిచేసిందంటే జవాబు చెప్పడానికి మనం మాటలు వెతుక్కోవాల్సిందే. ప్రపంచానికే  పాఠాలు చెప్పిన ఈ MA ఎకనామిస్ట్ మాష్టారు తను ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ఒక సామాన్యుడి ఆవేదనను ప్రతిపక్ష నేత ప్రశ్నించగా ఒక్కటి అంటే ఒక్కటి కూడా సమాధానం లేదు. ఆట మొత్తం అయ్యాక తూచ్ అన్న చంద్రబాబు ఈయన గారి మంత్రి వర్గాన్ని చూసి ఒక సామాన్య ఆంధ్రుడు మళ్ళి ఈ అయిదేళ్ళ ఆటలో ఓడిపోయాం అని నెత్తి నొరూ బాదుకుంటు న్నారు.


జగన్ గారు ఒక  ప్రతిపక్ష నేతగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాబు గారిని సూటిగా ఒక ప్రశ్నవేసారు. అదే రైతుల రుణ మాఫీ గురుంచి. ఫలానా తారికునుంచి రైతుల రుణాలు మాఫీ చేస్తాం అని ఒక్క మాట చెప్పండి మహాప్రభో అని. దానికి బాబు గారి MA ఎకనామిస్ట్ సంధానం చూసి ప్రతిపక్ష నేత గా జగనూ, టి.వి. లు చూసిన సామాన్య ఆంధ్రుడికి సైతం ఒక్కసారిగా మైండ్ లు బ్లాంక్ అయ్యాయి. ఆంధ్రా రైతులు రుణ మాఫీ ఫై ఆశలు ఒదులుకొని కనీసం ఎండలు అయినా తగ్గు ముఖం పడతాయని ఆకాశం వైపు చూసుకుంటున్నారు.  


ప్రశ్నించటానికే జనసేనా పార్టీ నెలకొల్పిన పవన్ ఎక్కడా?ఎక్కడున్నావయ్యా..పవనూ..ఫాంహౌస్ లో కూర్చుని మిత్రులకు మామిడి పళ్ల బుట్టలు పంపడం వరకు బాగానే వుంది..కానీ ఇక్కడ పశ్నించాల్సిన పనులు పెండింగ్ లో వుండిపోతున్నాయి. కాస్త ప్రశ్నించవా పవనూ.. కూత వేటు దూరంలో రైల్వే బడ్జెట్ వుండగా, ఆదరా బాదరా రైల్వే చార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందని మిత్రుడు మోడీని... కర్నూలుకు ఎయిమ్స్ అని కేంద్రం అంటే, తీసుకెళ్లి కృష్ణా-గుంటూరు జనాలు కైకర్యం చేసేస్తే... ఇదిగో రుణమాఫీ అన్నవాళ్లు, కమిటీలు, కేంద్ర సాయం ఆర్బీఐ అనే కుంటి సాకులు చెబుతుంటే.. ఆగిపోయిన పింఛన్లను తిరిగి ప్రారంభించేదిపోయి, మరో మూడు నెలల తరువాతకు వాయిదా వేస్తే.. నిత్యావసర ధరలు అయిన గ్యాస్ రేట్ పెరుగుదల ఫై, వడ గాల్పుల దెబ్బకి పిట్టల్లా రాలిపోతున్న ఆంధ్రులకి ప్రభుత్వం భరోసా ఇవ్వటం ఫై వచ్చి త్వరగా ప్రశ్నించు పవనూ..ప్రశ్నించు. లేకుంటే జనం మిమ్మల్ని ప్రశ్నించేసే ప్రయత్నం చేస్తారు.

Wednesday, June 25, 2014

Andhra Pradesh Student Patapati Saichand Ends Life In CanadaPatapati Saichand, a 27 year old, graduate student committed suicide on 18/June/2014. He completed his B.E in India and was pursuing his Masters at the Lambton College of Business Management in Toronto, Canada. 

He came to Canada on August 31st 2012 and his wife joined him on October 10th,2013. Saichand was on track to graduate this past Saturday but unfortunately ended his life just a day before on Friday night. According to his family he had no known issues, except he was concerned about getting a job upon graduation. He was allegedly duped by a consultancy run by an Indian, which took Rs 3 lakh from him promising a job. 

He is survived by his elder brother Chandra Mohan and parents Lakshmi Narayana and Maha Lakshmi. Saichand hails from a working middle-class agricultural family of Mallavarappadu village, Prakasam district. The family is currently not doing well as they have already spent their life savings on his education and sending him to Canada. Since repatriation is a very expensive process, they have requested TANA to assist financially and logistically.

Friday, June 13, 2014

ఈ తుప్పాసి మీడియా మీద ఫైర్

అసలు టీవీ9 వారి వార్తా కథనం.తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు టీవీ9 దుమ్ము దులిపాడు. ప్రమాణ స్వీకారం రోజున తెలంగాణ శాసనసభ, సభ్యుల ప్రవర్తన, మంత్రుల వైఖరి గురించి టీవీ9 వారు ప్రత్యేక కార్యక్రమం ఒకటి నిన్న ప్రసారం చేయడం జరిగింది. శత్రు రాష్ట్రం పాకిస్తాన్ పై కామెంట్లు వేయాలంటే ఆలోచించే మనస్తత్వం మన భారతీయులది. అలాంటిది ఒక తెలుగు వాడు ఇంకో తెలుగు వాడి గురించి తప్పుగా మాట్లాడటం ఎంత తప్పు అని ఒక్కసారి అలోచించి విజ్ఞతతో వ్యవహరించి వుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఏదో సంచలనం సృష్టించాలి, TRP రేటింగులు పెంచుకోవాలనే ధ్యాస తప్ప మనం చేసే వ్యాఖ్యలతో పక్కవాడి మనసు ఎంత క్షోభ పడి ఉంటుంది, ఆ వ్యాఖ్యలు ఎవరికీ మంచి చేయకపోయిన పర్వాలేదు కాని ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అలోచించి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది...


కేసీఆర్ ఊరికే ఏదైనా అంటే సహించే వ్యక్తి కాదు, అలాంటిది సదరు టీవీ వారు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ప్రతి తెలుగువాడు తల దించుకునేలా మాట్లాడే సరికి కెసిఆర్ తాట తీసి వదిలాడు ఆ ఛానల్ యాజమాన్యన్ని. తమిళనాడులో మీడియాపై ఉన్నటువంటి ఆంక్షలు విధించడానికి కూడా నెరవమని కెసిఆర్ చెప్పడం జరిగింది.


కేవలం టీవీ9నే కాదు, ఆంధ్రజ్యోతి పత్రికను, ఛానలుని ఈడ్చి అవతల పడేసాడు. నేను వ్యాఖ్యానించని మాటలను తెలుగు వారిని విడగొట్టేలా ఏదో స్వయంగా వారికి చెప్పినట్టు తప్పుడు రాతలు ఎలా రాస్తారు, అని తీవ్రంగా విమర్శించారు.


ఏవండి ఒకడిని కొట్టి, తప్పయింది వదిలి పెట్టండి అంటే సరిపోతుందా. టీవీ9 వారు చేసింది కూడా అలాగే ఉంది. అసెంబ్లీలో కెసిఆర్ సీరియస్ అయిం తర్వాత సదరు మీడియా ఛానల్ క్షమాపణ చెప్పటం జరిగింది. కానీ, కొన్ని గుండెలకి తగిలిన గాయం ఆ ఒక్క క్షమాపణ మాన్పిస్తుందా!

కెసిఆర్ ఏ రేంజ్ లో ఫైర్ అయ్యాడో ఈ వీడియో చూడండి.

Thursday, June 12, 2014

‘పలికించెడి వాడు’ చంద్రబాబేనా?తెలుగు రాజకీయాల్లో ఇవాళ ఓ సంచలన ఘట్టం చోటు చేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నాయకుడు దాడి వీరభద్రరావు... పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మీద నిశితమైన తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఘోరంగా ఆడిపోసుకున్నారు. తల్లి విజయమ్మ ఓడిపోవడానికి కూడా జగన్‌ స్వయంగా కారకుడు అనడం కంటె పెద్ద ఆరోపణ వేరొకటి ఉండకపోవచ్చు. ఆయన ఇవాళ వైకాపా కు రాజీనామా చేశారు. వైకాపా కాలగర్భంలో కలసిపోయే పార్టీ అని... అలాంటి పార్టీలో ఉండి ఇంకా తప్పు చేయదలచుకోలేదని.. ఇంకా మనిగిపోవడం తనకు ఇష్టం లేదని దాడి వీరభద్రరావు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. షర్మిల ఎంపీ అయితే.. పార్టీలో తనకు పోటీగా మరో పవర్‌ సెంటర్‌ తయారవుతుందనే ఉద్దేశంతోనే ఆమెను వాడుకుని, ఎదగకుండా తొక్కేశారని పేర్కొన్న దాడి, తల్లిని చెల్లినే నమ్మనివాడు.. ఇక ప్రజలను ఎలా నమ్ముతాడంటూ.. చెరిగేయడం విశేషం.  ప్రతిసారీ ఎన్నికల తర్వాత.. అధికారంలోకి రాకుండా ఓడిపోయిన పార్టీకి ఇలాంటి ఎదురుదెబ్బలు కొన్ని తగులుతూనే ఉంటాయి. 

రాజకీయాల్లో అది సహజం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సీనియర్లంతా రాజశేఖరరెడ్డి పట్ల అభిమానం ముడిపెడితే.. ఒక్క పార్టీలో చేరిన వారే తప్ప.. ఇతరత్రా ఎజెండాల్తో వచ్చిన వారు కాదు గనుక.. ఆ పార్టీలో ఇంకా ఇలాంటి ఇబ్బందులు బయటకురావడం లేదు. అయిదే దాడి వీరభద్రరావు పరిస్థితి వేరు. ఆయన తొలిసారిగా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. బజార్న పెట్టారు.  ఇప్పుడు ఆరోపిస్తున్న వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ విషయానికి వద్దాం. దాడి వీరభద్రరావు మొన్నమొన్నటివరకూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు. ఎమ్మెల్సీగా కూడా పదవిని అనుభవించిన వ్యక్తి.  ఆ పదవిని చంద్రబాబు మళ్లీ కొనసాగించలేదనే అలకంతో పార్టీని వీడి, జగన్‌ను జైలులో కలిసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాను విన్న జగన్‌.. జైలులో కలిసిన జగన్‌ ల మధ్య ఎంతో తేడా ఉన్నదని ఆనాడు చెప్పారు. (ఇప్పుడు- జైలులో చూసిన జగన్‌, బయట ఉన్న జగన్‌ వేర్వేరు అని చెబుతున్నారు.) అయితే ఇదే దాడి వీరభద్రరావు తెలుగుదేశంలో ఉండగా.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మీద ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు గుప్పించారు. అన్నీ చాలా తీవ్రమైనవి. ఆయన వైకాపాలో చేరగానే.. వాటి గురించి అందరూ ఆయన్ను ప్రశ్నించారు. 

‘అప్పట్లో తెదేపాలో ఉన్నాను గనుక.. ఆ పార్టీ విధానాల ప్రకారం అలా విమర్శించానే తప్ప.. అవి తన వ్యక్తిగత అభిప్రాయాలు కాదంటూ’ దాడి సమర్థించుకున్నారు. తద్వారా.. ‘తాను పార్టీ పలకమన్నట్లు పలికే చిలకను మాత్రమే’ అని దాడి పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది.  సరిగ్గా ఈ పాయింటు గుర్తున్న వారికి.. ఇప్పుడు ఆయన జగన్‌ మీద చేసిన విమర్శల విషయంలోనూ కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఎవరి విధానాలకు అనుగుణంగా ఈ విమర్శలు చేస్తున్నారో అని అనిపిస్తోంది. దాడితో ఇలాంటి విమర్శలు చేయిస్తున్నవారు, తద్వారా వైకాపా పనైపోయింది అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ట్రై చేస్తున్న వారు వేరే ఉన్నారని అంతా అనుకుంటున్నారు.  అప్పట్లో దాడి వీరభద్రరావును చేర్చుకోవడం ద్వారా జగన్‌ చాలా పెద్ద త్యాగం చేశాడని చెప్పాలి. పార్టీకి పెద్దదిక్కుగా... పార్టీనే నమ్ముకుని ఉన్న వైఎస్సార్‌ ఆప్తుల్లో ఒకరు కొణతల రామకృష్ణ ఎంతగా వ్యతిరేకించినా.. జగన్‌ పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రలో ఈ ఇద్దరు నాయకులు రెండు గ్రూపులుగా మారితే.. అది పార్టీకి చేటు చేస్తుందనే హెచ్చరిక అందినప్పటికీ పట్టించుకోలేదు. దాడిని చేర్చుకున్నారు. 

అప్పుడు హితవాక్యములను పెడచెవిన పెట్టినందుకు ఫలితం అనుభవిస్తున్నాడా అన్నట్లుగా ఇప్పుడు దాడి వీరభద్రరావు జగన్‌ మీదనే అస్త్రాలు ఎక్కుపెట్టాడు. తమాషా ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాడి వీరభద్రునికి పాత యజమాని.. అనగా నారా చంద్రబాబునాయుడు.. విశాఖపట్టణంలో కేబినెట్‌ మీటింగ్‌ పెట్టడానికి వెళుతున్న రోజునే.. ఆయనను సంతుష్టుడిని చేసే విధంగా.. దాడి వీరభద్రరావు ఈ విమర్శలు చేయడం విశేషం. భవిష్యత్తు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అంటున్నారు గానీ.. బహుశా ఈ టూరులో చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. ‘‘పలికెడిది భాగవతమట... పలికించెడి వాడు రామభద్రుండట’’ అని పోతన సవినయంగా మనవి చేసుకున్నట్లుగా.. ‘పలికెడిది వీరభద్రుడట.. పలికించెడిది చంద్రబాబుయట’’ అని పాడుకోవాల్సి వస్తుంది. Tuesday, June 10, 2014

తెలుగు నేలకి చంద్రగ్రహణం పట్టిందా !

కోటి ఆశలు గల్లంతయ్యాయి. కలల సౌధాలు కుప్పకూలాయి. తమ ఆరో ప్రాణాలు అనంతవిశ్వంలో ఆవిరైపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌కు స్టడీ టూర్ కోసం వెళ్లి కానరాని లోకాలకేగిన కన్నబిడ్డలు లేని ఈ ప్రపంచం ఆ తల్లిదండ్రులకు కటిక చీకటిలా అనిపిస్తోన్నది. కడుపు కోతతో ఉబికివస్తున్న ఆ కన్నీటి సాగరాన్ని ఆపడం ఎవరి తరం? వారికి ఏ మాటలు వినపడడం లేదు. ఎవరి ఊరడింపులు సాంత్వననివ్వడం లేదు. ఇక మిగిలింది ఒకే ఒక్క కోరిక..కనీసం చివరి చూపయినా చూసుకోవాలని.. మరోవైపు క్షేమంగా ఉన్నవారి కుటుంబీకులు తమ పిల్లలను ఎప్పుడెప్పుడు చూస్తామా అని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అర్ధరాత్రి 12 గంటలకు 24 మంది విద్యార్థులతో విమానం చేరుకోగానే ఒక్కసారిగా బోరున విలపించారు. గుండెలకు హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చారు.


Here is the list of students of VNR Vignana Jyothi Institute of Engineering and Technology who were found missing in the Himachal Pradesh Kullu tragedy.
1. Akulla Vijetha
2. Ashish Mantha
3. Bairineni Ritwik
4. Banothu Rambabu
5. Dasari Sreenidhi
6. Devashish Bose
7. Gampala Aishwarya
8. Baswaraj Sandeep
9. Gonoor Arvind Kumar
10. Kalluri Sree Harsha
11. Kasarla Rishita Reddy
12. Laxmi Gayatri Appanabotla
13. M. Siva Prakash Varma
14. M. Vishnu Vardhan Reddy
15. Macharla Akhil
16. Mittapally Akhil
17. Muppidi Kiran Kumar
18. Nerudu Jagadish Mudiraj
19. P. Venkata Durga Tarun
20. Mohammed Sabir Hussain Shaikh
21. P. Ridhima
22. B. Mahen Sai Raj
23. T. Upendar
24. Ch. Parameshwar
25. Prahlad – tour operator
Saturday, June 07, 2014

జగన్ దగ్గర రెండే వైనాలు. ఒకటి అతిగా దగ్గరకు తీయడం, రెండోది దూరం పెట్టడం.


జగన్ తో రాజకీయ కాపురం చేయటం కష్టమా!!! 

* మాట్లాడింది 3 నిమిషాలే, అందులో 'మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు' అనే నామ స్మరణ 12 సార్లు.

* మైకు దొరికింది కదా అని సమయం సందర్భం పరిణితి లేని ప్రసంగాల తో ఎలపరం పుట్టిస్తున్న జగన్.

* వెనకటికి ఎవడో ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి కాలో చేయో పోగుట్టుకొని, ఆపరేషన్ చేయించుకోకుండా ఫార్ముల-ఒన్, ఒలింపిక్ రేస్ లో పాల్గొనాలి అన్నాడంట. జగన్ నోట జాతీయ పార్టీ అనే మాట వింటుంటే ఇదే చందాన ఉంది.

మొదటగా ఇక్కడ ఒక్కసారి 'రాజశేఖర రెడ్డి' (పెద్దాయన) గారిని గుర్తు చేసుకుందాం. తన తుది శ్వాస వరకూ రాజకీయ జీవితంలో ఇద్దరు వ్యక్తులనే అమితంగా ఇష్టపడ్డాడు, అభిమానించాడు. వాళ్లే మన దేశపు మాజీ ప్రధానులు 'ఇందిరా' మరియు 'రాజీవ్' గాంధీలు. విచిత్రంగా ఈ ఇద్దరు గాంధీలు (తల్లీ,కొడుకు) భారత దేశపు ప్రధాన మంత్రులు గా పదవుల్లో కొనసాగుతుండగా హత్యగావించబడ్డారు. 

పెద్దాయన ముఖ్యమంత్రి అయిన తరువాత కొన్ని పధకాలకు (రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ... ) వీళ్ళ పేర్లు పెట్టి తన గుండెల్లో ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి తన రాజకీయ ప్రాసంగాలలో ఎక్కడా కూడా గాంధీలు అలా, ఇలా దేశాన్ని డెవలప్మెంట్ చేసారు, ఈ పధకాలు పెట్టారు అని ఊక దంపుడు ప్రసంగాలు  ఏనాడు చెప్పలేదు. ఇదే మన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి లో కొనసాగుతుండగా హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. తమ నాయకుడు ఇక ఈ లోకం లో లేరు అని తెలుసుకున్న సగటు 600 ఫై చిలుకు అభిమానులు తమ ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలేసారు. చనిపోయిన ఏ ఒక్క కుటుంబం వాళ్ళు , తమ దగ్గరికి వచ్చి ఒదార్చమని అడగలేదు. ఈ 600  ఫై చిలుకు ప్రాణాలను అడ్డం పెట్టుకొని, ఓదార్పు రాజకీయ ఊరేగింపులు సాగించాడు మన జగన్. ఎంతగా అంటే ఒక్క రోజులో 'రాజశేఖర రెడ్డి' గారి పేరుని 600 సార్లు స్మరించి సగటు అభిమాని గుండెల్లో పెద్దాయన పట్ల ఉన్న ఇష్టాన్ని తుడుచుకు పోయేలా చేసాడు. 


600 ఫై చిలుకు కుటుంబాలను ఓదార్చటానికి ఎంత సమయం కావాలీ ? ఒక నాయకుడికి ఆరు వందల ఫైగా కుటుంబాలను ఓదార్చటానికి ఎంత సమయం పడుతుంది. మహా ఐతే మూడు నెలలు, ఆరు నెలలు లేదా సంవత్సర కాలం సరిపోదా!! ఎవరూ వచ్చి తమని ఒదార్చమని అడగకుండానే, జగన్ తనంతట తానే ఇచ్చిన మాట కోసం కట్టుబడాలి అని ఓదార్పు ఊరేగింపులు సంవత్సరాలు, సంవత్సరాలు  మొత్తం చేసుకుంటూ పోతుంటే జనాల్లో చవకబారిపోయి, ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోయింది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే విధంగా వ్యవహరించాడు. జగన్ కి తోడుగా సాక్షి పేపర్, ఛానల్ నిలిచింది. 

ప్రతీ క్షణం, ప్రతీ గంటా, ప్రతీ రొజూ ఒక నేత  గారి గురించి చర్చలు, స్మృతులు, పద్యాలు,పాటలు, జగన్, షర్మిలా, విజయమ్మ   ప్రసంగాలు  వేసి వేసి సగటు ప్రేక్షకుడికి  అసహ్యం కలిగేలా చేయటానికి సాక్షి పూర్తిగా తోడు నిలిచింది. ఉరూరా విగ్రహాలు పెడితేనో, ఒక మనిషి పేరు రోజులో 600 సార్లు స్మరిస్తోనో, ఒక మనిషి ఫోటో రోజు పత్రికల్లో, టి.విల్లో ప్రింట్ చేస్తేనో  చెప్పిందే పదే పదే చెప్తోనో, విశ్వాసం, విలువలు, విశ్వసనీయత  ఉంది అని నమ్మరు జనాలు.

అభిమానం అనేది సామాన్యుడికైన, నాయకుడి కైన  వాళ్ళ మనస్సు, గుండె లోతుల్లో ఉంటుంది, దాన్ని ఎప్పటికీ ఎవరూ చేరపలేరు. ఈ చిన్న విషయాన్ని గుర్తించకుండా ఒక మహానేత పేరుని పదే,పదే,పదే జపించడం, ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని పదే,పదే,పదే తిట్టడం మానుకోవాలి.


ఓటమి అన్నది జీవితంలో చివరి అధ్యాయం కాదు. ఇంకా చాలా పుటలు, చాలా అధ్యాయాలు వుంటాయి. అయితే ఆ పుటలు, అధ్యాయాలు ఎవరికి వారే రచించుకోవాలి. విజయగీతాలుగా మలుచుకోవాలి.  అలా కాకుంటే పదేళ్లు ప్రతిపక్షంలో వున్న చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాగలిగేవారు కాదు. కానీ ఇంతటి సామర్ధ్యం వైఎస్ జగన్ కు వుందా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే పరస్థితులు అలాంటివి. జగన్ వైఖరీ అలాంటిదే.

ముందు పరిస్థితులను చూదాం. ఏ రాజకీయ పార్టీకైనా, నాయకులకైనా అధికార వియోగం అన్నది అత్యంత బలహీనక్షణం కింద లేక్క. ఆ బలహీనక్షణంలో నాయకులు ఏం చేస్తారో,పార్టీ ఏమవుతుందో ఎవరికీ తెలియదు. నాయకుడు బలమైన వాడయితేనే ఈ పరిస్థితిని తట్టుకోగలడు. వచ్చే అయిదేళ్లు రాజకీయపార్టీలకు ఓ విధంగా విరామ కాలం లాంటివి. ఎందుకంటే, ఎప్పుడూ లేనట్లగా, దాదాపు అన్ని ఎన్నికలు ఒకేసార కట్టకట్టుకు జరిగిపోయాయి. పంచాయతీ, మండల, జిల్లాపరిషతల్, మున్సిపల్, కార్పొరేషన్, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోయాయి. మహా అధ్భుతం జరిగితే తప్ప ఇప్పట్లో ఎన్నికలు వచ్చే దాఖలాలు లేవు. ఎన్నికలు అనే కార్యక్రమమమే పార్టీల మనుగడకు చాలా చాలా కీలకమైనది.

ఆ లక్ష్యం దగ్గరలో వుంటేనే, నాయకులు పార్టీని, పార్టీ ప్రజలను అలక్ష్యం చేయకుండా ముందుకు సాగుతుంది. ఇప్పుడు దేని కోసం కార్యకర్తలు, చోటా మోటా నాయకులు వైకాపాతో అంటకాగాలి? ఎమ్మెల్యేలు సరే, ఏదో వారి వారి పరిచయాలు, వారికి వున్న అవకాశాల బట్టి, అలా అలా ముందుకు పోతారు. పైకి ఎన్ని చెప్పినా, అవసరమైతే, అధికార పక్షంతో అంటకాగుతారు. వీళ్లని చేరదీస్తాం..వాళ్లని చేరదీయం..బద్ధ వైరుథ్యాలున్నాయి లాంటి పదాలు ఇప్పుడు గాలికి కొట్టుకుపోయాయి.  ఎవరు వస్తే వారిని చేరదీయడమే లక్ష్యంగా చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే వైరి వర్గాన్ని ఎలాగైనా కూకటి వేళ్లతో లేపాలి. అందువల్ల వీరు వెళ్తారు..వారు వెళ్లే అవకాశం లేదు అనే శషభిషలు వుండేందుకు వీలు లేదు. ఈ పరిస్థితి నుంచి పార్టీని కాపాడుకోవడం అంటే కేవలం నాయకుడి వైఖరి పైనే ఆధారపడి వుంటుంది. ఆ సంగతి తర్కించే ముందు ఇంకో పరిస్థితి చూదాం.

టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు నిర్మొహమాటంగా కొన్ని వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ నానా భ్రష్టు పట్టిపోవడంతో, ప్రజలు విసిగిపోయి, తెలుగుదేశాన్ని ఎన్నుకున్నారన్న సంగతి విస్మరించరాదన్నారు. నిజంగా ఇది నికార్సయిన పరిశీలన. విజయం సాధించిన ఏ పార్టీ అయినా ఎందుకు విజయం సాధించాం అన్నది గుర్తెరికి, ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం అన్నది కీలకం. అంటే చంద్రబాబు ప్రజల మనోగతాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో వున్నారన్నది స్పష్టమవుతోంది. అంటే దాదాపు ప్రజా వ్యతిరేకంగా వెళ్లే ఆలోచన ఆయనలో లేదు. మరోపక్క ఆయన ఏయే వర్గాలు ఈ సారి తమకు కొత్తగా సహకరించాయన్నది కూడా గుర్తించారు. ఎన్జీవోలు, బ్రాహ్మణులు తొలిసారిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసారని బాబే చెప్పారు. వారిని విస్మరించమని ఆయన సభాముఖంగా మహానాడులో వెల్లడించారు. దానా దీనా అర్థమయ్యేదేమిటంటే, ప్రజలు లేదా, వివిధ వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా, పార్టీ పట్ల వారి అభిమానం చెదరకుండా పాలన సాగించాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలిసిపోతోంది.

అంటే జగన్ లేదా వైకాపాకు అటు కాలం సహకరించే అవకాశం ఎలాగూ లేదు. అధికారపక్షం అవకాశం ఇచ్చే ఆలోచనలో లేదు. నిజంగా ఇది క్లిష్ట పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో నాయకులను నిభాయించి, కార్యకర్తలను సమీకరించి, కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాల్సి వుంది. కానీ కార్యక్రమాలంటే ఏముంటాయి. ప్రభుత్వం ధరలు పెంచితే ఆందోళన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమించడం. కానీ తెలుగుదేశం పార్టీ అటువంటి అవకాశం ఇచ్చేలా లేదు. ఒక వేళ పొరపాటున ధరల పెంపు లాంటి వ్యవహారాలున్నా, అది మరో రెండేళ్ల తరువాత కానీ ఇప్పట్లో వుండదు.  అంతవరకు నాయకులు, కార్యకర్తలను పట్టి వుంచడం ఎలా? ఇందుకు ఒక్కటే మార్గం, జగన్ నాయకుల, కార్యకర్తల మనసెరిగి ప్రవర్తించడమే. ఒక నికార్సయిన రాజకీయ వేత్తగా ఎదగడమే.

నిజానికి ఇక్కడ జగన్ కు వున్న అవరోథాల సమస్య కూడా వుంది. తెగించి మాట్లాడేందుకు, నిర్ణయం తీసుకునేందుకు అతగాడికి కేసుల గుదిబండ అడ్డువస్తోంది. వాటి నుంచి ఇప్పట్లో తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. కానీ అలా అని మరీ అడ్డగోలుగా, దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటే పార్టీ ప్రజల్లో పల్చనవుతుంది. మోడీ ప్రధాని కాగానే అభినందించడం వరకు ఓకె.. కానీ మా మద్దతు కూడా మోడీకే అని హడావుడిగా, ప్రకటిస్తే, ప్రజలు ఏమనుకుంటారు? కేసుల కోసం శరణుజొచ్చారు అనుకుంటారు. మరి అంత హడావుడి పడినవారు, పోలవరం ఆర్డినెన్స్ పై అందరూ తలా మాట అంటుంటే, పార్టీ విధానం ఇది అని ఎందుకు ప్రకటించలేదు. పోనీ తెలంగాణలో వున్నా నాయకులతో సమస్య వస్తుంది అనుకుంటే, మధ్యేమార్గంగా నైనా జగన్ ఎందుకు మాట్లాడ లేదు. ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక పార్టీ వదిలి పోతున్నపుడు, ప్రకటనలు చేస్తుంటే, పార్టీ నాయకుడిగా తన మాట తాను ఎందుకు చెప్పలేదు. ఎక్కడో బెంగుళూరులో కూర్చోవడం అంటే అది జనాలకు దూరమైనట్లు వుంటుందని అర్థం చేసుకోవాలి కదా?

మీడియాకు దూరం దూరం

అంతెందుకు రాజకీయనాయకుడి బతుకు సగం మీడియాలోనే వుంటుంది. కానీ సాక్షి అనే పత్రిక పెట్టడం ద్వారా జగన్ మిగిలిన మీడియాను శతృవుగా చేసుకున్నారు. బాబు అనుకూల మీడియా సంగతి అలా వుంచండి. మిగిలిన మీడియా అంటే సంస్థలు కాదు జర్నలిస్టులు. మీడియా వ్యవహారాలు చిత్రంగా వుంటాయి. సాక్షి పత్రిక చాలా వరకు ఓ వర్గం జర్నలిస్టులను దగ్గరకు తీసింది. అదీ కాకుండా జర్నలిస్టుల్లో రెండు మూడు వర్గాలున్నాయి. యూనియన్లున్నాయి. ఎప్పటి నుంచో, జర్నలిస్టు నేతలమని చెప్పుకుంటూ, అధికార పార్టీకి దగ్గరగా వుంటూ వారి భోగాలు వారు అనుభవిస్తున్నవారి పట్ల మిగిలిన జర్నలిస్టులకు కినుక వున్నమాట వాస్తవం.

జగన్ ఆ తరహా జర్నలిస్టులనే దగ్గరకు తీయడంతో మిగిలిన వారికి సహజంగానే తెలియని వ్యతిరేకత ఏర్పడింది. వీరు ఏం చేస్తారు అనుకోవడం పెద్ద విషయం కాదు. కానీ నీటి బొట్టు నీటిబొట్టు కలిసిన చందంగా, ప్రజల్లో ఈ తరహా జనం తమను ఎవరైనా అడిగితే జగన్ కు వ్యతిరేకంగా చెబుతారు కానీ, అనుకూలంగా కాదు. ఈ అభిప్రాయాలు ఇలా ఇలా జనాల్లోకి వెళ్లిపోయి, కొండలై కూర్చున్నాయి,. చిత్రమేమిటంటే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏ వర్గం మీడియా నేతలైతే జగన్ వెనుక వున్నారో, వాళ్లే వెళ్లి ముందుగా కలిసి అభినందించి, నవ్వుతూ ఫొటోలు దిగి, ఫేస్  బుక్ ల్లో షేర్ చేసి, ఇప్పుడూ తాము అధికారం వైపే వున్నామని చెప్పకనే చెప్పేసారు. అయితే బాబుది జగన్ టైపు వ్యవహారం కాదు, ఆయన ఏ ఒక్కరినీ గుడ్డిగా ఎంటర్టైన్ చేయరు.

అసలు సాక్షి తన పేరుతో పెట్టడమే జగన్ చేసిన పెద్ద తప్పిదం. తను చేస్తున్నది తప్పు లేదా, వివిధ వర్గాల పెట్టుబడులు అందులోకి రప్పిస్తున్నాం అన్నప్పుడు బుర్ర వున్నవాడు ఎవరైనా ఆ సంస్థను తన పేరిట వుంచుకుంటాడా? హత్య చేసిన వాడు కత్తిని బొడ్లో  దోపుకు తిరిగినట్లు? దాంతో మిగిలిన మీడియా సంస్థలన్నీ వ్యతిరేకం అయిపోయాయి. పైగా సాక్షి అనేది జగన్ పత్రిక,.అన్నది జనాల్లోకి వెళ్లడంతో, దాని క్రెడిబులిటీ తగ్గిపోయింది. ఒక్కోసారి నిజాలు గొంతు చించుకున్నా జనం నమ్మే స్థితిలో లేకుండా పోయింది. ఇదే వేరెవరి పేరుతో అయినా వుండి వుంటే, ఈ కేసుల్లో సగం వుండేవి కాదేమో? ఇప్పటికీ జగన్ మీడియాకు దూరమే. ఎన్నికల ముందు కానీ, ఎన్నికల సమయంలో కానీ, ఆ తరువాత కానీ జగన్ ఇంటర్వూ అన్నది ఎక్కడైనా చదివారా..చూసారా.. ఎంత సేపూ జాతీయ మీడియానే.  నోరు తెరిచి ఇంటర్వూ అడిగానా ఇవ్వని వ్యవహారం. అసలు పార్టీకి అంటూ మీడియా సెల్ వుందా..దాన్ని ఎవరు చూస్తున్నారు..అదెలా నడుస్తోంది అన్నది జగన్ కు పట్టిన దాఖలాలు లేవు.

సర్వేలే సర్వేలు

ఇక జగన్ పార్టీకి పట్టిన మరో జాఢ్యం సర్వేలు. గడచిన మూడేళ్లుగా వైకాపా చేసినన్ని సర్వేలు మరే పార్టీ కూడా చేయదేమో? ఒక్కోసారి ఒక్కో నాయకుడు, ఒక్కోసారి ఒక్కో అనుచరుడు. వెళ్లడం సర్వేలు చేసి రావడం. పనిలో పనిగా చిలక్కొట్టులు కొట్టి రావడం. దాంతో సర్వేకి సర్వేకి పొంతన లేకుండా పోయింది. అదే సమయంలో జగన్ కు తన చుట్టూ వున్న ఏ ఒక్క నాయకుడిపైనా నమ్మకం లేకుండా పోయింది. నా అనుకున్నవాళ్లంతా సర్వేలను అడ్డుపెట్టుకుని తినేసిన వాళ్లే అని పార్టీ వర్గాల టాక్. దాంతో జగన్ కు ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. అంటే తన స్వంత మనుషులు కూడా నిజయతీ, తన పట్ల విశ్వాసంగా పనిచేసేలా జగన్ వ్యవహరించలేకపోయారు. జగన్ దగ్గర రెండే వైనాలు. ఒకటి అతిగా దగ్గరకు తీయడం, రెండోది దూరం పెట్టడం. రెండూ మంచివి కావు.

నాయకులను తన కనుసన్నలలో, తన భయ భక్తులలో వుంచుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు. కొణతాల లాంటి విశ్వాస పాత్రుడి అభీష్టానికి వ్యతిరేకంగా దాడి వీరభద్రరావును తెచ్చారు. పోనీ నిలబెట్టుకున్నారా...ఎన్నికలు కాగానే దాడి దారి దాడిదే. మరి ఇప్పుడు ఎవరు దిక్కు మళ్లీ కొణతాలే. ఇలాంటి తప్పిదాలు,.జగన్ చాలా చేసారు. నాయకులు జగన్ తమ వాడు అన్న నమ్మిక కలిగించలేపోయారు. దగ్గరకు వెళ్లాలంటే భయం. మూడ్ ఎలా వుంటుదో అని అనుకునేలా వుంటుంది అక్కడి పరిస్థితి అని చెబుతుంటాయి వైకాపాలోని వర్గాలు. అదెంతవరకు నిజమో? చిత్రమేమిటంటే, జగన్ కు తెలిసో, తెలియకుండానో అతని చుట్టూ, బంధువులు, సన్నహితుల వర్గాలు కొన్ని వున్నాయి. బయట వీరు జగన్ పై ప్రేమతో వారి వ్యవహారాల వారు నడుపుతుంటారు. 

కానీ చివరి నిమిషం వచ్చేసరికి, ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలనేసరికి వాళ్లకి ఏమీ అవకాశం వుండదు. దాంతో ఆ వ్యవహారాల బెడిసి కొడతాయి. ఇప్పుడిప్పుడే పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్న ఓ వెబ్ సైట్ ఓనర్ని ఈ తరహా వర్గాలు ఓ క్లబ్ లో కలిసాయి. జగన్ కు అనుకూలంగా రాయమని అడిగాయి. ఆ పెద్ద మనిషి, అసలు జగన్ ను ఓసారి కలవనివ్వడం చూదాం అన్నాడట. అలాగే, దానికేం భాగ్యం అని మరి కనిపించలేదు. ఎందుకంటే వారికి జగన్ ను కలిపించడం అన్నది అసాధ్యం. ఇలాంటి కృష్ణానగర్ కబుర్లు చాలా వినిపిస్తుంటాయి. వీళ్లు చేసే అరకొర ప్రయత్నాలు కూడా అలాగే బెడిసి కొట్టి పార్టీకి చేటు తెచ్చాయి.

ఖండనలేవీ?

వైకాపాపై వచ్చిన ఏ ఆరోపణని జగన్ తన నోటితో ఖండిచిన పాపాన పోలేదు. సభల్లో ఎన్నడూ లేనిది చంద్రబాబు చాలా ఆగ్రహంతొ ఊగిపోయిన సంఘటనలు వున్నాయి. కానీ జగన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తేగా. విశాఖలో కడప ముఠాలు దిగాయి అన్నది ప్రచారం. జగన్ వెళ్లి జగదాంబ జంక్షన్ లో కూర్చుని, ఒక్క కడప రౌడీని లేదా, ముఠా వాడిని ఇక్కడకు తీసుకువచ్చి చూపించండి, నేను, నా తల్లి, విశాఖ బరి నుంచి తప్పుకుని వెళ్లిపోతాం అని, సవాల్ చేసి వుంటే? కనీసం కొంతయినా ప్రజల్లో రియాక్షన్ వచ్చేదిగా. ఓ పూట లేదా ఓ రోజు అలా దీక్షగా అక్కడే వుండిపోతే, ఎలా వుండి వుండేది. తిరుపతి కొండపైకి చెప్పులతో వెళ్లారని వార్తలు వినవచ్చినపుడు, 'నేను వెళ్లలేదు' అని ఎందుకు స్పష్టం లేయలేదు. వైకాపా క్రిస్టియన్ల పార్టీ అని బ్రాహ్మణులు దూరం అవుతున్నపుడు, మీరూ..నా వాళ్లే అన్న ప్రకటన ఎందుకు చేయలేదు. ఇలాంటి రిపేర్లు చేయాల్సినవి ఎన్నో, ఏ ఒక్కటీ జగన్ పట్టించుకోలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి.

అన్నింటికి మింది ఆర్థిక వ్యవహారాలు. జగన్ ఓదార్పు యాత్రలకు, షర్మిల యాత్రలకు ఎక్కడి ఏర్పాటు అక్కడి నాయకులు చేస్తూ వచ్చారు. ఓ విధంగా చెప్పాలంటే, చేసి చేసి ఆరపోయారు. తాము చేసింది చెప్పి, ఇంకా ఖర్చుచేస్తామని చెప్పి, టికెట్ లు తెచ్చుకున్న వారు ఎన్నికల వేళ చేతులెత్తేసారు. అప్పులు చేసిన వారు చేసారు. లేని వారు లేదు. వైకాపా వాళ్లు వేలు పంచుతున్నారట అన్నది ప్రచారం. తీరా చూస్తే పైసా తీయని వైనం. 'అంటే మాకు మాత్రమే ఇవ్వలేదన్నమాట,. అని ఎవరికి వారు అనుకుని' కేండిడేట్ లపై కోపాలు పెంచుకున్నారు. పోనీ ఖర్చు చేసి గెల్చిన వారు ఏమన్నా బావుకున్నారా అంటే బుట్టా రేణుక పరిస్థితి. బాకీ దారులందరికీ నోట్లు రాసిచ్చి, ఇళ్లమీదకు తెచ్చుకున్నారని వినికిడి. ఆ బాధలు తట్టుకోలేక పార్టీ వీడిై, అధికార పార్టీ వైపు అడుగులేయబోయి అభాసయ్యారు. ఇప్పుడు ఆమె బాధ ఎవరు తీరుస్తారు?

ఎక్కడుంటారు?

జగన్ ఎక్కడుంటారు..అన్నది ఇప్పటికీ కార్యకర్తలకు తెలియదు. పార్టీ ఆఫీసు, రోజులో ఇంత సమయం అక్కడుండడం, తనను కలవాలనుకునే వారికి ఓ మార్గదర్శనం చేసే వ్యవస్థ ఏదీ వైకాపా వున్నట్లు కనిపించదు. దీంతో నాయకులకు, కార్యకర్తలకు జగన్ కు మధ్య దూరం పెరిగిపోయింది. పార్టీలో టికెట్ లు ఆశించిన వారిని జగన్ ను కలుస్తుంటారా అంటే ఒకటే సమాధానం, ఓసారి ఎప్పుడో కలిసాం..ఒక్కసారి మించి ఎక్కువగా జగన్ ను పార్టీ కార్యాలయంలో దగ్గరగా చూసిన నాయకులను వేళ్ల మీద లెక్కపెట్టుకొవాల్సిందే.

ఏం చేయాలి ?

ఇప్పుడు అయిదేళ్లు పార్టీ నిలబడాలంటే జగన్ ముందు తన జనం లో వుండాలి. పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుండాలి. నాయకుల వ్యక్తిగత సమస్యలు కూడ చూడాలి. వ్యక్తిగత సమస్యలు వుంటే తీర్చే ప్రయత్నం చేయాలి. నాయకులను వీలయినంత బిజీగా వుంచుతూ, ఖర్చులు వారి నెత్తిన రుద్దేయకుండా చూసుకోవాలి. పదేళ్ల పాటు టీడీపీ బతికి వుండడానికి  పార్టీ కార్యాలయ నిర్వహణది కీలక భాగస్వామ్యం అంటే కాదనేందుకు లేదు. నాయకులకు ఖర్చులు చెల్లించడం, పార్టీ కార్యాలయంలో భోజన, వసతి సదుపాయాలు అందించడం వంటివి నిరంతరం జరుగుతుంటాయి. అక్కడ పార్టీ ఎలా ఆదుకునే వారిని అలా ఆదుకుంటూనే వుంటుంది. జగన్ కూడా ఈ తరహా వ్యవహారాలపై దృష్టి సారించాలి. చురుకైన వారిని ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి, అధికార ప్రతినిధులుగా తయారుచేసుకోవాలి. నాయకులకు ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ అందించాలి.

కానీ ఇవన్నీ జగన్ చేయగలరా అంటే అనుమానమే. ఎందుకంటే ఆయనకు ప్రతి ఒక్కటీ స్వయంగా పర్యవేక్షించాలి. ఎవర్నీ నమ్మలేరు. నమ్మినవారు సక్రమంగా వుండేలా చూడలేరు. రైట్ పర్సన్ ఎట్ రైట్ ప్లేస్ అన్నది జగన్ కు చాతకాని విద్య. ఎన్టీఆర్, చంద్రబాబు తమ సామాజిక వర్గం వారిని చేరదీసినా, వారు ఆ స్థానానికి నిష్ణాతులుగా పనికి వస్తారంటేనే తెచ్చారు. దాని వల్ల ఉభయత్రా ప్రయోజనం వుంటుంది. నార్ల తాతారావు, కాకర్ల సుబ్బారావు, కోనేరు రామకృష్ణారావు, ఇలా ఎన్ని ఉదాహరణలైనా వుంటాయి. వారిని కాదని మరో దీటైన వారిని చూపించండి అంటే చెప్పలేని పరిస్థితి. పార్టీ వ్యవహారాల్లో కూడా అంతే సుజన, నామా, కంభపాటి, గరికపాటి, ఇలా అందరూ అందరే. 

జగన్ కు కూడా సామాజిక వర్గ ప్రేమ వుంటే వుండొచ్చు. కానీ దుర్భిణీ వేసి వెతుక్కుని తెచ్చుకోవాలి. అంతే కానీ, చివర్న రెండు అక్షరాలున్నవాడినల్లా చేరడదీయడం కాదు. అసలు సమస్య,..ఇవన్నీ జగన్ కు ఎవరు చెబుతారు? ఎవరికి ఆయన ఆ అవకాశ ఇస్తారు. మీడియా వార్తలు, వ్యాసాలు చదివే అవకాశం వుందా..అన్నీ అనుమానాలే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మారతారని, మారి పార్టీని పటిష్టం చేసుకుంటారని, చేసుకుని, వచ్చే ఎన్నికల దిశగా నడిపిస్తారని ఆశించడం, అత్యాశే అవుతుందేమో? తెలుగుదేశం పార్టీ చేజేతులా పాడుచేసుకుంటే తప్ప, బాబు ఆ పని ఈ సారి ఛేయరు గాక చేయరనే అనుకోవాలి.

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top