Thursday, April 24, 2014
Tuesday, April 22, 2014
Saturday, April 12, 2014
Wednesday, April 02, 2014
పవన్ కళ్యాణ్ "పసుపు సేన"
* ఫ్లూటు రామోజీరావు, పవన్ కళ్యాణ్ ముందు ఊదూ..
జనాల ముందు కాదూ...
* జూబ్లీహిల్స్ లో ఎ/సి గదుల్లో కూర్చొని పుస్తకాలు బట్టికోడ్డడం కాదు తమ్ముడూ.. ప్రజల సమస్యలు తెలుసుకో ముందు!
* నువ్వు రాసిన 'ఇజం' పుస్తకంలో ఒక్క ముక్క అర్థం ఐతే ఒట్టు అని జుట్టులు గీక్కునేలా చేసావ్ జనాలని, అంతేలే అది ఏమైనా రామాయణమా అంత ఈజీగా 'ఇజం' తిక్క ఎక్కడానికి !
* రామోజీఎమో ఫిలిం సిటీ కొండ మీద, నువ్వేమో జూబ్లీహిల్స్ కొండ మీద కూర్చొని మీకున్న పసుపు జెండా తిక్కతో, మళ్ళి జనాలను తిక్కలోల్లని చేయటానికి కంకణం కట్టుకున్నారా !
* ఏది ఏమైనా మేము మీ పసుపు గ్యాంగ్ని నమ్మము గాక నమ్మము...
దీనికి ఫిక్స్ అయిపో బ్రదరూ ...!
ఆల్‌ఫూల్స్ డే రోజు పవన్ తీన్‌మార్
స్కాంలకు ఆద్యుడైన బాబును నెత్తినెత్తుకొని చిందులు
* ‘సత్యం’వధ ఏమైంది..? ఏలేరు ఎటెళ్లింది? ఐఎంజీ మాటేంటి?
* ఏకంగా రూ.1.60 లక్షల కోట్ల భూసంతర్పణ సంగతేంటి?
* బాబును పొగిడేముందు తొమ్మిదేళ్ల నెత్తుటి గాయాలు గుర్తుకురాలేదా?
* ఆ పాలన వద్దంటూనే కదా జనం ఆయన్ను రెండుసార్లు
తిరస్కరించింది.. జనానికి తప్పైంది... పవన్‌కెలా ఒప్పనిపించింది?
మంథా రమణమూర్తి: బాపుగారి సినిమాలో ఓ సీను. ‘‘అసలు కృష్ణాష్టమి అంటే..’’ అంటాడు ఏవీఎస్. ఆయన మాట పూర్తికాకముందే... ‘‘ఆహా! అద్భుతం’’ అంటూ భజన మొదలెట్టేస్తారు బృందగాళ్లు. ఆయన చెప్పేందుకు ప్రయత్నిస్తున్నకొద్దీ భజన పీక్‌కు చేరుతుంటుంది. చివరికి ‘‘కృష్ణాష్టమి అంటే కృష్ణుడి బర్త్‌డే..’’ అని ముగిస్తాడు ఏవీఎస్. ఆ జీవిత సత్యం చెప్పినందుకు అంతా ముగ్ధులైపోయి తారస్థాయిలో భజన చేసేస్తారు. ఇక్కడా అచ్చంగా అదే జరుగుతోంది. తన అవిభక్త కవల లాంటి చంద్రబాబుకు భజన చేయటానికి ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు తరహాలో క్యారెక్టర్లను ప్రవేశపెడుతున్నారు రామోజీరావు! వాళ్లేం చెప్పినా దాన్ని భజన పాటలా మార్చడానికి తన విషపుత్రిక ‘ఈనాడు’ ఉంది మరి!!
‘ఏప్రిల్-1న... ఆల్ ఫూల్స్ డే’ నాడు ఒకటిన్నర పేజీల పొడవున సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూను అచ్చేసింది ‘ఈనాడు’. అది ఎంత పొడవున్నా దాని సారాంశం మాత్రం రెండు ముక్కలే. చంద్రబాబు సూపరు. జగన్ వేస్టు. అంతే!! చిలకల మాస్టర్ రామోజీరావు ‘ఈనాడు’ పుట్టిన దగ్గర్నుంచి ఇలా తన చిలకల చేత పలికిస్తూనే ఉన్నారు. కొన్నాళ్లు జనాన్ని నమ్మించారు కూడా. కానీ రోజులు మారాయి. ‘ఏది నిజమో’ జనం తెలుసుకోవటం మెదలెట్టారు. అందుకే పదేళ్లుగా ‘ఈనాడు’ ఎన్ని అబద్ధాలు రాస్తున్నా, ఎంత విషం కక్కినా జనం దాన్ని పట్టించుకోవటం మానేశారు. జనం విజ్ఞతపై ఏమాత్రం నమ్మకం లేని రామోజీ... తన మాటలు నమ్మేవాళ్లంతా ఫూల్సని భావించే రామోజీ... ఆ రాతలు మాత్రం సాగిస్తూనే ఉన్నారు. బహుశా.. అందుకే పవన్ ఇంటర్వూను ఏప్రిల్- 1న వేసి ఉండొచ్చు!
జనానికి ఒప్పు.. పవన్‌కు తప్పా..?
చంద్రబాబుకు ఇంకాస్త పాలనా సమయం ఇవ్వాల్సిందని పవన్‌కు అనిపించిందట. ఏం! బాబు పాలించింది తొమ్మిది రోజులా? తొమ్మిది నెలలా? కాదే..!! అక్షరాలా తొమ్మిదేళ్లు! ఒక జాతి చరిత్ర మార్చడానికి, ఒక దేశాన్ని సృష్టించడానికి సరిపోయేంత ఈ సమయం బాబుకు చాల్లేదా? ఈ తొమ్మిదేళ్లలో రూ.20 వేల కోట్లకు పైగా సొంత ఆస్తులు పోగేసుకున్న బాబు... సింగపూర్‌లో హోటల్‌తో సహా మరో 50 వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని రహస్యంగా కూడబెట్టిన బాబు... మురళీమోహన్, సుజనా చౌదరి, సి.ఎం.రమేష్, నామా నాగేశ్వర్రావు వంటి బినామీలకు లక్షల కోట్లు దోచిపెట్టిన బాబు... ఇంకాస్త సమయం ఇచ్చి ఉంటే ఏం చేసేవారో పవన్‌కు తెలియదా? రాష్ట్రాన్ని లూటీ చేసి విదేశాలకు తాకట్టు పెట్టేసిన బాబును ఏ ఒక్క క్షణం అధికారంలో కొనసాగనిచ్చినా తాము కనీసం అన్నం కూడా తినలేమని భావించబట్టే జనం ఆయన్ను అర్జెంటుగా దించేశారు. మరి జనానికి రైటనిపించింది పవన్‌కు ఎందుకు అనిపించలేదు? రెండుసార్లు ఓట్లేసి గద్దె దించేసిన జనం నిర్ణయం పవన్‌కు తప్పని ఎందుకు అనిపించింది? బాబు పాలన బాగుందని పవన్‌కు అనిపించటం వెనక మతలబేంటి? తెరవెనక ఏం జరిగింది? రామోజీ మూవీలో పవన్ తన పాత్ర పోషిస్తున్నట్లు అర్థం కావటం లేదా? ఐఎంజీ స్కాంకు తండ్రి బాబు కాదా?
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రీడా ప్రాంగణాల కోసమంటూ ఐఎంజీ అకాడమీస్ (భారత) అనే బోగస్ సంస్థకు 10 వేల కోట్ల రూపాయల విలువ చేసే 850 ఎకరాల్ని కట్టబెట్టేశారు బాబు. ఆఫీసు కూడా లేని కంపెనీకి... ఏర్పడిన మూడు రోజుల్లోనే ధారాదత్తం చేసేశారు. 2003లో... అదీ అధికారానికి దూరమవుతున్న చివరి క్షణాల్లో ఆగమేఘాలమీద ఫైళ్లు నడిపిన ఈ సంగతి పవన్‌కు తెలియదా? ఆ మాత్రం తెలుసుకోకుండా బాబుకు ఎందుకు సర్టిఫికెట్ ఇస్తున్నారు? ఇజ్రాయెల్ టెక్నాలజీ పేరిట కుప్పంలో టోపీ పెట్టిన తన బినామీలు బిల్లీరావు, పేట రావులకే ఈ భూమిని కూడా అప్పగించిన బాబు బరితెగింపును పవన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? తెరవెనక జరిగిందేమిటి? కుంభకోణాలన్నిటికీ అమ్మలాంటి ఈ ఐఎంజీ స్కామ్‌పై దర్యాప్తు జరిపే విషయంలో సీబీఐ సైతం బాబుతో లాలూచీ పడిందంటే బాబు ఏ స్థాయిలో మేనేజ్ చేశారో తెలియదా? దీనిపై సీబీఐ దర్యాప్తు కోసం అప్పట్లో వైఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చినా... తమకు సిబ్బంది లేరంటూ నాటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ పేర్కొనటం ఎవరికి తెలియదని? ఇదంతా పవన్‌కు కనిపించదా?
ఇవేకాదు... పవన్‌కు కనిపించని బాబు
స్కాంలు చెప్పాలంటే పేజీలు చాలవు
ఏలేరు గురించి ఏం చెప్పాలి?
ఏలేరు కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం సరిపోలేదని, దాన్ని పెంచి చెల్లించాలన్న పేరుతో నేతలు, ఉన్నతాధికారులు కోట్లు మింగేశారు. వీళ్లకోసం బాబు స్వయంగా సంతకం పెట్టి నిధులు విడుదల చేయటం ఆయన కుమ్మక్కుకు పరాకాష్ట. దీనిపై వేసిన ఓ కమిషన్ నిజానిజాలను నిగ్గు తేలిస్తే... చివరకు ఆ కమిషన్‌నే రద్దు చేసిన ఘనత బాబుది.
ఎయిర్‌పోర్టుకు 5,500 ఎకరాలా?
ఎయిర్‌పోర్టుకు 2 వేల ఎకరాలు చాలంటూ కేంద్ర ప్రభుత్వమే నివేదికలిచ్చినా... శంషాబాద్ విమానాశ్రయానికి 5,500 ఎకరాలు కేటాయించారు బాబు. దానిచుట్టూ తన అనుయాయులతో వేల ఎకరాలు కొనిపించారు. దీని అనుమతుల కోసం, రాయితీల కోసం చంద్రబాబు ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ ముడుపుల వ్యవహారంపై ఆరోపణలు రహస్యమేమీ కావు.
ఈ దోపిడీ కనబడదా..?
రహేజా, విశాఖ ఫార్మాసిటీతో సహా ఐటీ కంపెనీలు, ఎయిర్‌పోర్టు, గంగవరం పోర్టు, ఐఎంజీ, ఎమ్మార్, బీచ్‌శాండ్ ట్రైమెక్స్‌లకు ఏకంగా 26,634 ఎకరాలు కేటాయించారు బాబు. వాటి విలువ ఏకంగా లక్షా అరవైవేల కోట్ల రూపాయలు. మరి బాబు పాలన పవన్‌కు బాగుండటం వెనక కారణమేంటి?
విద్యుత్ ఒప్పందాల గోల్‌మాల్
ప్రభుత్వ రంగంలోని జెన్‌కోను పట్టించుకోని చంద్రబాబు... ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను మాత్రం ప్రోత్సహించారు. చివరకు వారు విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా డబ్బులు చెల్లిస్తామనేదాకా వెళ్లారు. రాష్ట్ర ప్రజలపై ఇప్పుడు ఏకంగా రూ.7 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీల భారాన్ని మోపారు. గ్యాసు సరఫరా లేకపోయినప్పటికీ విద్యుత్ కొనుగోలు కోసం నాలుగు (గౌతమి, కోనసీమ, వేమగిరి, జీవీకే) ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ల(ఐపీపీ)తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలు రాష్ట్రాన్ని ఎలా దెబ్బతీశాయన్నది పవన్‌కు తెలియకపోవచ్చేమో!! చార్జీల్ని భరిస్తున్న ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం స్పష్టంగా తెలుసు.
- ప్రభుత్వ సంస్థలు... పప్పుబెల్లాలు..
రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా ఉంచకుండా తన అనుయాయులకు తెగనమ్మేందుకు వీలుగా వాటిని ఖాయిలా పరిశ్రమలుగా మార్చేందుకు చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. హెరిటేజ్ డైరీ కోసం చిత్తూరు డైరీని బొందపెట్టడంతో పాటు... వస్త్ర పరిశ్రమలపై పన్నులు పెంచి స్పిన్నింగ్ మిల్లుల్ని సంక్షోభంలోకి నెట్టారు. ఈ నష్టాల సాకుతో 71 సహకార చక్కెర, స్పిన్నింగ్ మిల్లులను దశల వారిగా ప్రైవేటు పరం చేసేశారు. రూ.వేల కోట్లు విలువ చేసే 20 మిల్లులను కేవలం రూ.300 కోట్లకు అమ్మేశారు. వాటిలో ఒకటి నామాకిస్తే... మరోటి సీఎం రమేష్‌కు. ఒకటి దేవేందర్‌గౌడ్ బంధువులకిస్తే మరొకటి మండవకు. పవన్ ఇవేవీ కనిపించవా..?
- ‘సత్యం’ వధ... ధర్మం చెర
సత్యం కుంభకోణానికి మూలాలన్నీ టీడీపీ పాలనలోనే ఉన్నాయి! ఈ కుంభకోణం ఎన్డీయే హయాంలోనే బయటికి పొక్కినా... అప్పటి ఆర్పీఐ ఎంపీ రాందాస్ అథవాలే ఈ విషయాన్ని 2003 మార్చి 13న లోక్‌సభలో ప్రస్తావించి విచారణకు పట్టుబట్టినా... బాబు ముందుకు కదలనివ్వలేదు. కారణమేంటంటే ఇంటర్ అత్తెసరు మార్కులతో పాసైన తన కుమారుడు లోకేష్‌కు అమెరికన్ యూనివర్సిటీలో రూ.25 కోట్లు పెట్టి సీటు కొన్నది ఆ సంస్థే కాబట్టి. పార్టీకి ఫ్రీగా ఐటీ సేవలు, కార్యకర్తలకు ఐడీ కార్డులు, ఎన్టీఆర్ ట్రస్టుకు కోట్ల రూపాయల విరాళాలు... అన్నీ సత్యం సంస్థే ఇచ్చింది కాబట్టి. రాష్ట్రానికి ఖ్యాతితెచ్చిన ఐటీ సంస్థను ఈ రకంగా భ్రష్టు పట్టించి పతనం చేసిన బాబును శిక్షించాలని అడగాల్సింది పోయి పవన్ మద్దతిస్తున్నారు ఎందుకని?
- బాబు రాగానే... లూటీ మొదలు..
ముఖ్యమంత్రి కాగానే బాబు వేసిన ప్లాన్... తన సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు రాయితీలిచ్చుకోవటం. ఇలా రూ.15 కోట్ల మేర ట్యాక్స్ డిఫర్‌మెంట్‌కు తనే సంతకం చేశారు బాబు. మొత్తమ్మీద 28 ఏళ్ల పాటు రూ.15 కోట్లు ఖజానాకు చేరకుండా బాబు కంపెనీలో ఉండిపోయాయి. బ్యాంకు వడ్డీ చూసుకున్నా ఈ మొత్తం రూ.100 కోట్ల పైనే అవుతుంది. అదీ బాబు మాస్టర్ ప్లాన్. పవన్‌కు ఇవేవీ పట్టవు మరి.
- రామోజీకి దక్కింది ఎవరి వాటా?
నష్టాల్లో ఉన్న రామోజీ గ్రూపులోకి డబ్బా కంపెనీలు సృష్టించి అడ్డదారిలో రూ.2,200 కోట్ల పెట్టుబడుల్ని రిలయన్స్ సంస్థ ఎందుకు పెట్టిందనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అదంతా బయటకు పొక్కడంతో ఆ పెట్టుబడికి గాను నష్టాల్లో ఉన్న రామోజీ చానళ్లు కొన్నిటిని తీసుకుని బయటపడటమూ తెలియందేమీ కాదు. బాబు తన సొంత ఆస్తి మాదిరిగా కేజీ బేసిన్లోని గ్యాస్ నిక్షేపాలను రిలయన్స్‌కు ధారాదత్తం చేసినందుకే రిలయన్స్ ఇలా చేసిందని, అది ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడినా చూసీ చూడనట్టు ఊరుకోవటం వల్లే ఇన్ని కోట్లు ముడుపులు సమర్పించుకుందని పవన్ తెలుసుకోకపోవటం దారుణమే.
పవన్! ఈ ప్రశ్నలకు బదులుందా?
* ‘‘జగన్‌పై అభియోగాలున్నాయి. అన్ని కేసుల నుంచి బయటపడ్డాక ప్రయత్నిస్తే మంచిది..’’ ఇదీ పవన్ సలహా. అయినా ఈ అభియోగాలొచ్చింది ఆయన రాజకీయాల్లో లేనప్పుడు కాదే. ఈ ఆరోపణలతో శంకర్రావు కోర్టుకు లేఖ రాసేనాటికే జగన్ ఎంపీ. ఈ ఆరోపణలకు తెలుగుదేశం జత కలిసేనాటికి ఆయన కడప పార్లమెంటు సభ్యుడు. ఆరోపణలొచ్చింది ఎప్పుడు? వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి బయలుదేరినప్పుడు కాదా? ఆ యాత్ర ఆపేయాలని, జగన్‌ను జనంలోంచి చెరిపేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తే... దాన్ని ధిక్కరించిన నేరానికి కాదూ జగన్‌పై కేసులు పెట్టింది? ఈ కేసులెలా పుట్టాయో, ఎవరు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా?
* ఒక గది నిండా నిండే అభియోగపత్రాలున్నాయి కాబట్టి అవన్నీ నిజాలా? మరి 2,424 పేజీలతో, ఆధారాలతో సహా వైఎస్ విజయమ్మ చంద్రబాబుపై పిటిషన్ వేస్తే... దానిపై కోర్టు దర్యాప్తునకు ఆదేశించినా, లక్ష్మీనారాయణ నేతృత్వంలోని సీబీఐ ముందుకు కదలలేదెందుకు? చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టి చివరకు దర్యాప్తును కోర్టు నిలిపేసే దాకా సీబీఐ వేచి చూసిందెందుకు?
* ఏ కోర్టయినా, ఎన్నడైనా చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచ్చిందా? ఆఖరికి విజయమ్మ కేసులో సైతం... రాజకీయ కారణాలతో వేశారు కాబట్టి కొట్టివేశామని, కేసులోకి తాము వెళ్లబోమని కోర్టు చెప్పిందిగా? అది క్లీన్ చిట్ ఇచ్చినట్టా? జగన్‌మోహన్‌రెడ్డి కేసులోనూ రాజకీయ ఉద్దేశాలతోనే వేశారనే వాదన వచ్చినా... అది నిజమే కావచ్చు కానీ ఆ కారణంతో కొట్టివేయలేమంటూ కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది? ఇదంతా కనిపిస్తున్నా జగన్‌ను నిందించటం వెనక మతలబేంటి హీరో గారూ?
* ‘చంద్రబాబు రైతుల్ని ఇంకాస్త పట్టించుకుంటే బావుండేది. బషీర్‌బాగ్ సంఘటనలో ఆందోళనకారుల్ని చంపటం బాధనిపించింది!!’ అన్నారు పవన్. అసలు ఈ రెండూ ఎంత పెద్ద సమస్యలో తెలుసా పపన్? ఈ రాష్ట్రంలో 60 శాతం మంది ఆధారపడింది వ్యవసాయం మీదే. దీనికి అన్నపూర్ణ అని పేరు వచ్చింది వ్యవసాయం వల్లే. అలాంటి వ్యవసాయాన్ని దండగంటూ కాలికింద వేసి నలిపేశారు బాబు. ఈ తొమ్మిదేళ్లలో ఏకంగా 15,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంటలు దారుణంగా పడిపోయాయి. లక్షల మంది వలసలు పోయారు. ఇది చాలా చిన్న విషయంగా కనిపించిందంటే మిమ్మల్నెలా అర్థం చేసుకోవాలి? చార్జీలు తగ్గించాలంటూ వచ్చిన ఆందోళనకారులపై తుపాకీ ఎక్కుపెట్టింది ప్రభుత్వం? అలాంటిది బాబు ప్రభుత్వాన్ని నిందించటం మాని, ఆందోళనకారుల్ని తీసుకెళ్లిన సీపీఐ, కాంగ్రెస్‌లదే తప్పు... అనటం ఏ రకం వాదన?
* అసలు ఎప్పుడూ ఇంటర్వ్యూలివ్వని పవన్... పనిగట్టుకుని ‘ఈనాడు’నే ఎందుకు పిలిచినట్టు? తాను చెప్పాలనుకున్నది ప్రెస్‌మీట్ పెట్టి అందరికీ చెప్పొచ్చుగా? అక్కడ వచ్చే ప్రశ్నలు తట్టుకోవటం కష్టమనా? లేక నీల్సన్ సర్వే ఫలితాలతో గుండె జారిన రామోజీ తన శరణు జొచ్చినందుకా?
* వైఎస్ వల్లే తెలంగాణ వాదం బలపడి ందట!! అదంతా ఈయనగారి దగ్గరకు షూటింగుల్లో కుర్రాళ్లు వచ్చి చెప్పారట!! అసలు పవన్ షూటింగుల్లో ఎక్కడైనా కుర్రాళ్లను అనుమతించేంత సీన్ ఉందా? చుట్టూ ప్రయివేటు ఆర్మీ... బౌన్సర్లేగా? ఆఖరికి పార్టీ పెడుతున్నానని చెప్పినపుడు, ఆ తరవాత సభల్లో కూడా జరిగింది అదేగా? చెప్పాలనుకున్నది చెప్పేసి పరిగెత్తి పారిపోవటమేగా? మరి పవన్ మాట్లాడింది ఏ కుర్రాళ్లతో?
* చాలా మంది బ్యూరోక్రాట్లు... ైవె ఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఏం పనులు చేయమంటుందో అని పవన్ దగ్గరకు వచ్చి భయపడుతున్నారట!! అసలు వైఎస్ హయాంపై లేనిపోని కేసులు పెట్టి... వాటిల్లో కొందరిని ఇరికించినా, వారిని కావాలని టార్గెట్ చేసి వేధిస్తున్నా... ఎవ్వరూ వైఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మరి అలాంటి పవన్ దగ్గరకు బ్యూరోక్రాట్లు ఎందుకు వెళుతున్నారు? వాళ్లకు వేరే పని లేదా? ఆయనేమైనా పదవిలో ఉన్నారా? ఒకవేళ అదే నిజమైతే ఏ పదవీ లేకుండా పవన్ బ్యూరోక్రాట్లను తన చుట్టూ ఎందుకు తిప్పించుకుంటున్నట్లు?
* తెలంగాణ ఉద్యమంపై వైఎస్ బతికి ఉన్నపుడు ఎవ్వరూ నోరు మొదపలేదని చెప్పిందీ పవనే. తెలంగాణ వాదం వైఎస్ వల్లే ఊపిరిపోసుకుందని చెబుతున్నదీ పవనే. మరి ఈయన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి?
* అభియోగాలున్న జగన్ స్వచ్ఛమైన పాలన ఎలా అందిస్తాడనేది పవన్ ప్రశ్న. ఆ విషయాన్ని పతాక శీరికల్లో ప్రచురించేది మాత్రం... వందల కేసులు పెండింగ్‌లో ఉండి, వేల అభియోగాల్ని ఎదుర్కొంటూ... బినామీలతో రాజ్యం చేస్తున్న రామోజీ! పవన్ సర్టిఫికెట్ ఇచ్చేది కూడా ఆ రామోజీ చెప్పిన... ప్రతి కేసునూ కుట్ర మార్గంలోనే ఎదుర్కొన్న చంద్రబాబుకు!! ఏం విచిత్రం!!
* పజాసేవ చేయడానికి అధికారమే అక్కర్లేదు... అనేది పవన్ మాట. మరి కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి స్వచ్ఛంద సంస్థ ఉండగా దాన్ని బొందలో పడేసి జనసేన పేరిట రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినట్లు? దాని పేరిట సభలెందుకు? బాబుకు మద్దతివ్వటానికి ఈ డొంక తిరుగుడంతా ఎందుకు?
ఈ మాటలు ఏమయ్యాయి?
వివిధ సందర్భాల్లో టీడీపీపై పవన్‌కళ్యాణ్ చేసిన విమర్శలివి...
Tuesday, April 01, 2014
Eenadu, Pawan Kalyan's April Fool Article
* ఏప్రిల్ 1 న జనాలను ఫూల్స్ ని చేసిన ఈనాడు బూడిద కథలు !!
* ఎన్ని వందల కోట్లు తీసుకున్నావు బాబూ చిట్టీ ఈ ఇంటర్వ్యూకి ???
* మరీ ఇంతగా దిగజారిపోయవా నాయనా?
* నీలో అంత పవరూ, పలుకుబడి ఉంటే డైరెక్ట్ గా ఎన్నికలలో నీ దమ్ము చూపించవచ్చుగా? ఈ దొంగ ఎల్లో ఇంటర్వ్యూలు దేనికి?
Yellow Gang Behind Pawan Kalyan
1. పరిటాల రవి గుండు గీఇంచినప్పుడు ఏమయిందీ నీ ఆవేశం ?
2. రాజకీయాల్లోకొచ్చాక 'రాజకీయం వేరు.. వ్యక్తిగతం వేరు' అని ఎలా అంటావు ? అంటే జనాలు నిన్నూ, నీ పార్టీ జెండాని చూసి ఓట్లు వేయాలా? జనాలు అంత పిచ్చి వాళ్లుగా పచ్చ రంగులో కనిపిస్తున్నారా?
3. ఎల్లో గ్యాంగ్ లో ఒక వ్యక్తిని గెలిపించటానికి 'సేన' అవసరమా బాబూ చిట్టీ?
4. ఒక అన్యాయన్ని ఎదుర్కోవడానికి, మరో అరాచకమైన 'సేన' ని అప్పుతెచ్చుకోవటం పోరాటం అనిపించుకోదు చిట్టీ !
5. మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే రాజకీయాల్లోకి రాకూడదా అని ప్రశ్నించావే ! పైగా ఇది నీ వ్యక్తి గతం అంటావు. మరి జగన్ మీద ఎలాంటి రాజకీయ ఆరోపణలు ఉన్నాయని ఎల్లో విషం కక్కావు.. కేసుల ఆరోపణలు జగన్ వ్యక్తిగతం చిట్టీ. ఏ నువ్వు ఆరాధించే మోడి మీద లేవా ఆరోపణలు ? లేవని నిరూపించాగలవా? మోడి మతత్వవాది అని అమెరికా వాళ్ళు వీసా నిరాకరించినప్పుడు ఏమయిందీ నీ ఆవేశం?
6. వై ఎస్. వై ఎస్.. వై ఎస్... చనిపోయిన మనిషి గురించి నీ పైత్యం ముదిరి, పచ్చ విషం కక్కుతున్నావే, వై ఎస్ హయాంలో భూముల ధరలు పెరిగి, లాభాలకు అమ్ముకున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, మరి అప్పుడు ఏమయిందీ నీ ఆవేశం? చనిపోయిన మనిషి ఎలా తిరిగి రాడు, సమాధానం చెప్పలేడు అని పిచ్చి ముదిరి ఒళ్ళు అంతా పచ్చ రంగు వేసుకొని మైకంలో ఉన్నట్టుగా ఉన్నావు చిట్టీ !
7. రెండు పుస్తకాలు కొనుక్కొని, మూడు డైలాగ్స్ చదివి, నాలుగు మాటలు మైకు ముందు ఆవేశపడి అరిస్తే క్లాప్స్ కొడతారు కానీ, ఓట్లు రాలవు చిట్టీ.. నిన్ను నమ్మము...
8. రెండు భారీ రాజకీయ సభలు పెట్టడానికి ఫండ్ ఏ ఎల్లో పార్టీ నుంచి వచ్చింది చిట్టీ ?
9. మెగా బ్రదర్స్ ముసుగులు (అన్న కాంగ్రెస్, తమ్ముడు ఎల్లో పార్టీ ) జనాలకి తెలియదు అనే బ్రమలో ఉన్నారా చిట్టీ?
Subscribe to:
Posts
(
Atom
)