జననేత జగన్ అక్రమ అరెస్ట్ కాంగ్రెస్, TDP వారి కుట్ర అని, రాజకీయం అంటే ప్రజల్ని కన్విన్స్ చేయటమే, అలా చేయకుండా రాజకీయ కక్షలకు పాల్పడటం మంచిది కాదు అని అన్నారు.
న్యాయమూర్తులను, న్యాయవాదులను మేనేజ్ చేసి న్యాయ వ్యవస్థను కాంగ్రెస్ హై కమాండ్ అపహాస్యం చేసిందని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. సిబిఐ విచారణ కాంగ్రెస్ ఆదేశాలకనుగుణంగా జరగడం బాధాకరం, దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడ్డారు. పక్షపాతపూరితమైన దర్యాప్తు ఆధారంగా రాష్ట్ర ప్రభుతం ఆలోచనారహితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను గృహ నిర్భంధం చేయడం సమంజసం కాదన్నారు.
ప్రజాదరణ ఉన్న జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కాంగ్రెస్ హై కమాండ్ వేధిస్తోందని..గత రెండు సంవత్సరాలుగా ఒంటరి వాడిని చేయాలని చేయని ప్రయత్నం అంటూ లేదని, జగన్ అభిమానుల్ని, అనుకూలంగా ఉన్న ఎంఎల్ఏలను, ఎంపీలను పలు విధాలుగా బ్లాక్మెయిల్కు పాల్పడటం ప్రజలు గమనిస్తూనే వున్నారని వారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, రాజకీయ నాయకులను లొంగదీసుకోవచ్చునేమో కాని, ప్రజల్ని మభ్య పెట్టలేరని ఇటీవల కాలంలో రుజువైందన్నారు. కడప, కొవ్వూరులో ప్రజల తీర్పు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెంపపెట్టని వారన్నారు. త్వరలో జరుగనున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ప్రజలు అఖండమైన మెజారిటీతో గెలిపించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పై కుటుంబం ఫై వున్నా అభిమానాన్ని చాటుకొనున్నారని ఎన్నారైలు జోస్యం చెప్పారు.
జగన్ ను కస్టడీలోకి సీబీఐ తీసుకున్న రోజున విజయమ్మ, భారతి, షర్మిలా పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి జరిగిన అవమానంగా కాకుండా, తెలుగు ఆడపడుచులకు జరిగిన అవమానంగా భావించామని హిమబిందు బండ్లపల్లి, పద్మిని గూడ, సురేఖ మరియు జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే జగన్ నిర్దోషిగా బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రవి బల్లాడ, వెంకట్ గౌతం, శ్రీనివాస రెడ్డి చింత, అగ్గి రామయ్య, ప్రవర్ధాన్ చిమ్ముల, మురళీధర్ బండ్లపల్లి, శ్రీనివాస్ సన్నపు, రఘు సిద్దపు, రామ హనుమంతు, సచి ముత్తురులు హాజరై, తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. కార్యక్రమానికి హాజరు కాని మహిళలు ఫోన్ ద్వారా జగన్ కు, విజయమ్మకు, వైఎస్ఆర్ సీపీ నాయకులకు తమ సంఘీభావాన్నితెలియచేశారు.