fvz

Sunday, May 13, 2012

MANA SAKSHI MANA ANDARI SAKSHI

ఎప్పుడూ ఏక ధ్యానంతో దీక్షగా, నిశ్శబ్దంగా పనిచేసుకుపోతుండే‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కొద్దిరోజులుగా... మోగిన ఫోను మోగినట్లే ఉంటోంది!
‘‘సార్... సాక్షిని మూసేస్తారా? నాలుగేళ్లుగా చూస్తున్నాం... ఏంట్సార్ మీకిన్ని కష్టాలు?’’ ‘‘అన్నా ఏందే ఇది! సాక్షి మీద ఏమేమో ఇంటున్నం!’’ ‘‘నాయ్‌నా పానంబోతా ఉంది. అంతా ఒక్కటై, ఒక్కన్నీ జేసి తుగులుకుంటా ఉండారు? బిడ్డని బతకనీయరా ఏంది?’’ ‘‘అంకుల్... సాక్షికి ఏమయింది? టీవీలో ఎందుకు చూపిస్తున్నారు?’’ ‘‘బాబూ... కావాలంటే నా పెన్షన్ డబ్బంతా ఇచ్చేస్తా. సాక్షి పేపర్ మాత్రం ఆగకూడదు.’’ ‘‘జగనన్న మీద కోపం సాక్షి పేపర్ మీద చూపిస్తున్నారు!’’ ‘‘మనసుకి కష్టంగా ఉందయ్యా. చిన్నపిల్లాడి మీద ఏమిటింత కసి! సాక్షికేంకాదు. ధైర్యంగా ఉండండి. మేమున్నాం. ఆ ప్రభువున్నాడు.’’ ఇంత అభిమానానికి, అత్మీయతకు, ఇంత అండకు, ఆదరణకు, ఇన్నీ దీవెనలకు, దైవ ప్రార్థనలకు ‘సాక్షి’ సిబ్బంది కదిలిపోతున్నారు. ‘‘థ్యాంక్యూ సార్’’ అంటున్నారు. ‘‘పెద్దమ్మా నీకు ధన్యవాదాలు’’ అని చెబుతున్నారు. ‘‘పాపా.. రేపు పేపర్ వస్తుంది. అందులో నీకిష్టమైన కిడ్స్ పేజీ కూడా ఉంటుంది. కావాలంటే చూడు’’ అని భరోసా ఇస్తున్నారు. ‘‘విరాళాలు వద్దు, మీ అభిమానం చాలు’’ అని నచ్చజెబుతున్నారు. నిజమే. ‘సాక్షి’కి ఇప్పుడు కాలూచెయ్యీ ఆడే పరిస్థితి లేదు. బ్యాంకు ఖాతాలను నిలిపేసింది సి.బి.ఐ. నిజమే. ‘సాక్షి’కి ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరులు లేవు. ప్రకటనల్ని ఆపేసింది ప్రభుత్వం. నిజమే. ‘సాక్షి’ని చంపే కుట్ర జరుగుతోంది. నాయుడు, ఈనాడు... ఆకూవక్క, పచ్చచొక్కా ఇచ్చిపుచ్చుకున్నారు. కానీ - ఈ పశు బలాలకు... ‘సాక్షి’ ఏనాటికీ తల వంచదు. తిరగబడి కొమ్ములు విరుస్తుంది. ఈ విష ప్రయోగాలకు, దుష్ర్పచారాలకు తలవాల్చదు. సత్యమేవ జయతే అని తిప్పికొడుతుంది. ‘సాక్షి’ - రెండక్షరాలే. నినదిస్తే, ‘ఏది నిజం?’ అని నిగ్గదీస్తే... ఆ ప్రతిధ్వని కోటీ నలభై లక్షల గళాక్షరాలు. అవి - కుట్రదారుల నిజస్వరూపాలను బట్టబయలు చేసే గవాక్షరాలు! నిన్నగాక మొన్న పుట్టి... కురువృద్ధ కాంగ్రెస్‌కు, దుర్బుద్ధ ‘దేశ ’శక్తులకు, ఎల్లో మీడియా అబద్ధాల ప్రబుద్ధులకు చెమటలు పట్టిస్తున్న ‘సాక్షి’కి ఇంత శక్తి ఎక్కడిది? ఇంత పాఠకబలం, ఇంత ప్రజాబలం ఎలా సాధ్యమైంది? ఇదే ఈవారం మన బయోగ్రఫీ.

‘సాక్షి’ పుట్టిన ఆనందంలో ఉన్నాం అందరం.
పురుటి గుడ్డు ఎలా ఉందంటే -
వెన్నెల్లో కాసిన హరివిల్లులా ఉంది.
కను కాటుకతో కొనగోట దిద్దిన కావ్యంలా ఉంది.
ఇంకా ఎలా ఉందంటే -
పుట్టడమే కనక కౌమారాలతో పుట్టినట్లుంది!
ఆనందం కాక ఏమిటి? అబ్బురం కాక మరేమిటి?
ఆవేళ -
మార్చి నెలాఖరు ఎండకు ఆకాశంలో ఎవరో అకస్మాత్తుగా మేఘవస్త్రం కప్పారు.
ఎవరో వెలుగు బూర ఊదారు. పశ్చిమాన ఎవరో తూర్పు వాకిళ్లను తెరిచారు!
చినుకులు శుభాశీస్సులై రాలాయి.
మెరుపులు మసక చీకట్లను చీల్చాయి.
ఉరుములు మంగళస్వరాలయ్యాయి.
నార్త్ - ఈస్ట్ - వెస్ట్ - సౌత్!
దిక్కులకు ప్రాణాలు లేచి వస్తున్నాయి.
సత్యమేవ జయతే! సత్యమేవ జయతే!
రెక్కలు ఆర్చుకుంటోంది ‘సాక్షి’!!
‘బై ఆర్డర్ అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్’... పది కోట్ల ప్రజానీకం - కొత్త సంతకంతో మర్నాటినుంచీ ఉదయాలన్నీ సూర్యుణ్ణి నిద్రలేపబోతుంటే...
ఇవాళ మాకెలా నిద్రపడుతుంది?
ఎదురు చూస్తున్నాం - తెల్లారడం కోసం.
ఎదురు చూస్తున్నాం - నిజంగా తెల్లారడం కోసం!
ఎదురు చూస్తున్నాం - పన్నెండు లక్షల పావురాలు ఒక్కసారిగా ఎగిరితే... రాబందులు, తీతువులు, గబ్బిలాలు, గుడ్లగూబలు, శకుని పక్షులు, అక్కు పక్షులు భయంతో కిటికీల్లోంచి నక్కి నక్కి తొంగి చూసే దృశ్యం కోసం.

*********

ఒకనాటి యాగమా? ఒకనాటి హోమమా?
ఒక ‘అతిరాత్రమా’?
అక్షర సైనికులు పదును తేలుతున్నారు. సుశిక్షిత సేనాపతులు అదను చూస్తున్నారు.
ఒక బిగ్ అరైజ్, ఒక బిగ్ అవేక్ కావాలి ‘సాక్షి’.
ఇదీ లక్ష్యం!
‘గోబెల్స్’ని గోడకు దిగ్గొట్టి, పైన సున్నం కొట్టాలి.
ఇదీ ధ్యేయం!
నిజాన్ని నిప్పులా ఊది రాజేయాలి. అబద్ధాన్ని ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టాలి. ఇదీ ిసిద్ధాంతం
రంగుల్లో ఉండాలి. ఫిరంగులై పేలాలి. ఇదీ వ్యూహం!
ఇంకా?!
దౌర్భాగ్యాలను తొలగించాలి. చీడపీడల్ని దులిపేయాలి. కొమ్ముల్ని వంచేయాలి. కోరల్ని పీకేయాలి. తోకల్ని కత్తిరించాలి.
ఇంకా?!
అడగలేనివారి మౌత్‌పీస్ అవ్వాలి. బడుగు బతుకుల మీదికొచ్చే బుల్‌డోజర్ల నడుములు విరగ్గొట్టాలి. ఆడపడుచులకు ధీమా ఇవ్వాలి.

కౌంట్ డౌన్ మొదలైంది!
‘సాక్షి’ ఎలా ఉండబోతోంది? పాఠకులలో కుతూహలం. ‘సాక్షి’ ఏలాంటి మార్పు తేబోతోంది? పాలకుల మౌన వీక్షణం. ‘సాక్షి’ ఏం చేయబోతోంది? ‘లార్జెస్ట్’ బోర్డ్ మీటింగుల్లో కలకలం.

కౌంట్ డౌన్ మొదలైంది!
లక్షల మంది ‘సాక్షి’కి చందాలు కడుతున్నారు.
లక్షల సర్యులేషన్ ఉన్నవాళ్లు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు.
పుట్టీపుట్టగానే ‘సాక్షి’ని చంపేయడానికి బ్లూప్రింట్ లాంటి ‘ఎల్లో ప్రింట్’ రెడీ అయింది!
హాకర్లొచ్చి చెబుతున్నారు. ప్యాకర్లొచ్చి చెబుతున్నారు.
‘‘సార్... సాక్షిని బైటికి రానివ్వరట. సార్... సాక్షిని లేట్ చేయిస్తారట. సార్... సాక్షిని మేము వెయ్యడానికి లేదట’’.

కౌంట్ డౌన్ మొదలైంది!
త్రీ... టూ... వన్...
23 మార్చి 2008.
సండే. ‘సాక్షి’ డే. ఎ బిగ్ డే.
సైమల్టేనియస్‌లీ ఫ్రమ్ -
హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, ముంబై, ఢిల్లీ, అనంతపూర్, గుంటూరు, కడప, ఖమ్మం, కరీంనగర్, కర్నూల్, మెహబూబ్‌నగర్, నల్గొండ,నెల్లూరు, నిజామాబాద్, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ - యువర్స్ లవింగ్‌లీ - ‘సాక్షి’.
మూడు రీజియన్‌లు, నాలుగు మెట్రోలు, పన్నెండు లక్షల లోగిళ్లు. కోట్లాది ఆశీర్వచనాలు.
సాక్షి మెయిన్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి స్పోర్ట్స్, సాక్షి బిజినెస్, సాక్షి లిటరేచర్, సాక్షి సినిమా, సాక్షి కెరియర్, సాక్షి టాబ్లాయిడ్, సాక్షి ఫన్ డే...
మాదాపూర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సంప్రదాయబద్ధంగా సాక్షి ఆవిర్భావ వేడుకలు.
ఎల్సీడీ ప్రొజెక్టర్ స్క్రీన్‌పై సాక్షి పేజీల ఆవిష్కరణలు.
సాక్షి పొలిటికల్ పేజీల్ని వీరప్ప మొయిలీ, సినిమా పేజీల్ని చిరంజీవి, మహిళల పేజీల్ని నాగార్జున, వెబ్ ఎడిషన్‌ని రామలింగరాజు, బిజినెస్ పేజీల్ని రాణిరెడ్డి, స్పోర్ట్స్ పేజీల్ని పుల్లెల గోపీచంద్, మిథాలీరాజ్... రిమోట్‌తో ఆన్ చేశారు.
అంతే!
ముప్పై నాలుగేళ్ల రొడ్డ కొట్టుడుకి, ముప్పై నాలుగేళ్ల అడ్డగోలు రాతలకి, ముప్పై నాలుగేళ్ల మసిపూతలకి, ముప్పై నాలుగేళ్ల రాజకీయ రాశి ఫలాలకు తెరపడింది!!

‘సాక్షి’ సామాజిక ఉద్యమ సారథి అవ్వాలి.
- గవర్నర్ ఎన్.డి.తివారీ.

‘సాక్షి’ ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకి సాక్షి అవుతుంది.
- ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి.


‘సాక్షి’ సమాజానికి అంతర్‌సాక్షి కావాలి.
- వీరప్ప మొయిలీ.

‘సాక్షి’ నిష్పక్షపాతంగా ఉంటుంది.
- బి.వి.రాఘవులు.

అసలు ఆవగింజంత, కొసరు కొండంత రాతలకు భిన్నంగా ఉండాలి ‘సాక్షి’.
- నారాయణ.

‘సాక్షి’ నిజాలకు ప్రతిబింబంగా ఉండాలి.
- బండారు దత్తాత్రేయ.

‘సాక్షి’ ఒక కొత్తదానికి సంకేతం.
- సచిన్ టెండూల్కర్.

‘సాక్షి’ అచ్చంగా మీరంతా ఆకాంక్షించినట్లే, ఆశించినట్లే, అభిలషించినట్లే, సూచించినట్లే ఉంటుందని, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన మాత్రమే ఉంటుందని ‘సాక్షి’ ఛైర్మన్ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ‘‘నేను కాంగ్రెస్ అయినా, నా తండ్రి సి.ఎం. అయినా ‘సాక్షి’ మాత్రం నిష్పక్షపాతంగా, పార్టీకి అతీతంగా స్వతంత్రంగా ఉంటుంది’’ అని చెప్పారు.
కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
ఏకకాలంలో 23 ఎడిషన్లలో దీపాలు వెలిగాయి!

***********
మార్చి 23 భగత్‌సింగ్ వర్థంతి.
అదే రోజు... ఈస్టర్.
‘‘భగత్‌సింగ్ అమరత్వాన్ని స్మరించుకుంటూ, సముజ్వలమైన ఆ దేశభక్తుని అకళంకిత చరిత్రను మననం చేసుకుంటూ, దేశ సేవకులందరినీ పేరుపేరునా కృతజ్ఞతాభావంతో తలచుకుంటూ ‘సాక్షి’ మీ దర్శనం చేసుకొంటోంది, ఆశీర్వదించండని’’ వై.ఎస్. జగన్ తన ప్రత్యేక సంపాదకీయంలో పాఠకులకు కోరారు.
‘‘ఇవాళ ఈస్టర్ పర్వదినం కూడా. కరుణామయుడైన ఏసుక్రీస్తు పునరుత్థానం పొందిన రోజు. లుప్తమయి పోతున్న పత్రికా సత్సంప్రదాయాలు, కొనప్రాణంతో ఉన్న వార్తా సంస్కృతీ ‘సాక్షి’ ద్వారా మళ్లీ జవశక్తులు పుంజుకుంటాయని మీరు నిశ్చయంగా ఆశించవచ్చు’’ అని జగన్ భరోసా ఇచ్చారు. పాఠకుల అభిమానాన్ని ఆపేక్షించారు.
భగత్‌సింగ్‌ను షహీద్ భగత్‌సింగ్ అంటారు. ‘షహీద్’కు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి: అమరవీరుడు. ఇంకోటి: సాక్షి.
సత్యంకోసం, ప్రజా స్వేచ్ఛ కోసం ‘సాక్షి’ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని...
‘సాక్షి’పై ఎన్ని విష ప్రచారాలు, ఎన్ని విష ప్రయోగాలు జరిగినా పునరుత్థానం చెందుతూనే ఉంటుందని ‘సాక్షి’ ఇవాళ్టికీ... ఇవ్వాళ్టికీ నిరూపిస్తూనే ఉంది!
నాలుగేళ్లుగా నాలుగు వైపుల నుంచి... దాడులను, దాష్టీకాలను, దౌర్జన్యాలను, దుష్ర్పచారాలను, అధికార దురహంకారాలను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్న ‘సాక్షి’కి ప్రతిరోజూ పునరుత్థాన దినమే! ‘సాక్షి’ దినదిన ప్రవర్థమానమే!!
మళ్లీ పదవిలోకి రావాలని చంద్రబాబు...
మరో పత్రిక మార్కెట్‌లోకి రాకూడదని రామోజీ...
తోడుగా ఒక చిల్లర పత్రిక...
దాని నీడగా ఒక చిలవల చానెల్...
పనికట్టుకుని, అధికారపక్షంతో నడుం కట్టుకుని ‘హమ్ ఏక్ హై’ అంటూ ‘సాక్షి’పై పదే పదే వేస్తున్న నిందలు,
‘సాక్షి’పై పదే పదే వేస్తున్న చిందులు నిష్కళంక ‘సాక్షి’ని ఏమీ చేయలేకపోయాయి. ‘సాక్షి’కి ఉన్న ప్రజాబలం, పాఠక బలం ముందు ఎంతోసేపు కుప్పిగంతులు వెయ్యలేకపోయాయి.

‘సాక్షి’ పై వీళ్లకు ఎందుకింత కక్ష?
ఎందుకింత కసి? ఎందుకింత ద్వేషం?
ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కారణం.
ఒక్కొక్కరిదీ ఒక్కొక్క స్వార్థం.

నెంబర్ 1 : చంద్రబాబు.
చంద్రబాబుకి మళ్లీ పదవి కావాలి. అందుకు వేదాలు వల్లించాలి. కానీ, తొమ్మిదేళ్లు భూముల్ని బీళ్లుగా మార్చి, ‘బూమ్’ల్ని పెంచిపోషించిన బాబు అసలు స్వరూపం ఏమిటో ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. బాబు కొత్త నీతుల్ని మాట్లాడినప్పుడల్లా పాత ఫైల్స్ తీసి చూపిస్తోంది. అందుకే ఆయన ‘సాక్షి’ ఉండకూడదని, ‘సాక్షి’ మిగలకూడదని కోరుకుంటున్నారు. తన మీద ‘సాక్షి’ కక్ష కట్టిందని, తనపై కార్పణ్యాలతోనే ‘సాక్షి’ ఆవిర్భవించిందని ఆరోపిస్తున్నారు. ‘సాక్షి’పై అక్కసును, ఆగ్రహాన్ని వై.ఎస్. కుటుంబం మీద చూపిస్తున్నారు.

నెంబర్ 2 : రామోజీ.
ఈ ఎల్లో మీడియా ముఠా మేస్త్రికి ఏం కావాలి?
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ‘సాక్షి’ మూత పడాలి.
బాబు సి.ఎం. అయితే రాష్ట్రం రామోజీదే. ‘సాక్షి’ మూత పడితే వేదం తను చెప్పిందే. విలువల్లేని వ్యాపారి ఆయన.
తన ముందు ఇంకో పేపర్ ఎదగ కూడదు. తన జర్నలిస్టు ఇంకో పేపర్‌లోకి ఎదగకూడదు. కానీ ఏమైంది?
‘సాక్షి’ గేట్లు తెరవగానే తెలుగు జర్నలిస్టుల వరద వెల్లువెత్తింది. నిజమైన పేపర్ ఏదో, నిజమైన జీతం ఏదో, నిజమైన జీవితం ఏదో, నిజమైన స్వేచ్ఛ ఏదో, నిజమైన ఆత్మగౌరవం ఏదో పాత్రికేయులకు తెలిసి వచ్చింది. నాన్ జర్నలిస్టు సిబ్బందికి కూడా ‘సాక్షి’ శుభ్రమైన జీవితాన్ని ఇచ్చింది. మరీ ముఖ్యంగా - పేపర్‌బాయ్ కమిషన్ పెంచింది.
ఇవేమీ లేని చోట ఎవరుంటారు? ఎంతకాలం ఉంటారు?
ముప్పై నాలుగేళ్లుగా చెలాయిస్తున్న మూడక్షరాల దురహంకార ఆధిపత్యానికి ‘సాక్షి’ అప్రమేయంగా, అసంకల్పితంగా ఇలా తగిన శాస్తి చేసింది!‘లార్జెస్ట్‌సర్క్యులేటెడ్ డెయిలీ’ని వదిలి వచ్చిన వాళ్ల జీతాలు పెరిగాయి. విధిలేక లోపలే ఉండిపోయిన వారి జీతాలూ పెరిగాయి! ‘సాక్షి’ ఎఫెక్ట్. ‘‘అవును. సాక్షి పుణ్యమే’ అని స్వయంగా ఆ పత్రిక ఉద్యోగులే చెప్పుకున్న సందర్భాలున్నాయి. ‘సాక్షి’కి కృతజ్ఞత తెలుపుకున్న క్షణాలున్నాయి.
అలాంటి ఒక ఉద్వేగ సందర్భం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. ఇప్పుడీ వ్యాసం రాస్తున్న ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధికి ఎదురైన ఒక అనూహ్యమైన ‘అప్రీసియేషన్’ అది!
ఆ రోజు ఆదివారం.
22 జనవరి 2012.
సోమాజిగూడా ప్రెస్‌క్లబ్ ప్రాంగణంలో జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతోంది. క్లబ్ ఆవరణలో చెట్టు కింద వేసిన కుర్చీలలో ఈ ప్రతినిధితో పాటు కొంతమంది జర్నలిస్టులు తమ వంతు పరీక్షల కోసం వేచి చేస్తున్నారు. ఎదురుగా ‘బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ వారి మొబైల్ క్యాంప్ వెహికల్. అందులో ఒక వైపు స్కానింగ్, ఇంకో వైపు ఎక్స్‌రే యూనిట్లు. పిలుపు రాగానే లోపలికి వెళ్లాలి.
ఈలోపు - పక్క కుర్చీలోంచి స్నేహపూర్వకంగా ఒక స్వరం.
‘‘సార్... మీరు సాక్షి ఎంప్లాయా?’’
అసలైతే -‘‘ఏం బాబూ... నువ్వు సాక్షి ఎంప్లాయా?’’ అని ఏకవచనంలో సంబోధించడానికి సంకోచ పడనవసరం లేని వయసులో ఉన్నారాయన. పక్కనే ఆయన భార్య.
‘‘అవును సర్’’ - ఈ ప్రతినిధి సమాధానం.
‘‘మీరు చల్లగా ఉండాలి. మీరు చల్లగా ఉంటే మేం సంతోషంగా ఉంటాం’’ అన్నారాయన!
ఎంత ఎమోషన్! ఎంత కృతజ్ఞత!! మళ్లీ ఆయనే అన్నారు. ‘‘సాక్షి వచ్చాక, నా జీతం ఒక్కసారిగా... నాలుగు వేలు పెరిగింది. నా-లు-గు-వే-లు!’’. ప్రెస్ క్లబ్ ఎదురుగానే వాళ్ల పత్రికా కార్యాలయం. ‘సాక్షి’కి తన పత్రిక దీవెనలూ అందుతుంటే - ఆ పత్రికాధిపతికి సెగ తగలకుండా ఉంటుందా?
ఆర్థిక వనరుల్ని దెబ్బతీసి, పైకొస్తున్న పత్రికల్ని మూత వేయించడంలో ఎక్స్‌పర్ట్ అయిన పెద్ద మనిషి ‘సాక్షి’ని మాత్రం వదిలిపెడతాడా? పైగా పక్కలో బల్లెం. అందుకే ‘సాక్షి’పై ఇన్ని దాడులు, దారుణమైన ఆరోపణలు, బ్యాంక్ అకౌంట్ల స్తంభనకు, ప్రకటనల నిలిపివేతకు ఇన్ని కుయుక్తులు.

నెంబర్ 3 : చిల్లర పత్రిక!
‘సాక్షి’ అంటే ఈ పత్రిక్కి ఎందుకంత ఏడుపు? ఇంతుంటే అంత రాయడం దాని నైజం అనుకున్నా... అసలేమీ లేకున్నా అబద్ధాలను వండి వార్చడమెందుకు? దాని దుష్ర్పచారానికి పరాకాష్ట... సర్కులేషన్ ప్రమోటర్ల చేత ‘సాక్షిని మూసి వేస్తున్నారని’ - ఫ్రమ్ ది డే వన్ - చెప్పించడం! దీనిపై ప్రభు గుప్తా అనే ‘సాక్షి’ కస్టమర్ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘నీ పత్రిక గురించి ఎంతైనా చెప్పుకో. సాక్షిని ఆపేయమని, మూసేస్తున్నారని చెప్పడం ఏంటి?’’ అని గుప్తా అన్నందుకు చిల్లర పత్రిక ప్రమోటర్ ఆయనతో గొడవకు దిగాడు.
వై.ఎస్.ఆర్. ప్రభుత్వం తనకు యాడ్స్ ఇవ్వలేదని ఆ పత్రిక యజమాని ‘సాక్షి’ వచ్చిన కొత్తల్లో చేసిన గొడవ కూడా అచ్చంగా ఈ స్థాయిలోదే! ఇప్పటికీ దానిది ‘చిల్లర’ గొడవే. ‘చిల్లర’ గగ్గోలే. సొంత టీవీలో ప్రతి ఆదివారం వచ్చే తన సొంత ప్రోగ్రామ్‌లో గెస్టుల్ని ఆ పత్రికాధిపతి అడిగే నేలబారు ప్రశ్నల్లాగే, చవకబారు నవ్వుల్లాగే, ఉంటాయి ‘సాక్షి’పై ఆ పత్రిక తీసే ఆరాలు, అది నూరే కారాలు మిరియాలు.
‘సాక్షి’ ప్రజ్వలన జ్యోతితోనే అది తన తోకకు నిప్పంటించుకుంది. ‘సాక్షి’ని ఏదో చేసేయాలని తన తోకకు కంకణం కట్టుకుంది.

నెంబర్ 4 : చిలవల చానెల్.
‘సాక్షి’పై కత్తి కట్టిన నాలుగో క్యారెక్టర్ - ఈ చిలవల చానెల్.
నాలుగు డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసే ఏ దిగజారుడు చానెల్‌కూ తక్కువ గానీ ఈ చిలవల చానెల్... ‘సాక్షి’ కుటుంబ ప్రయోజనాలను దెబ్బతీయడమే ధ్యేయంగా రోజుకో ‘మెరుగైన’ అబద్ధాన్ని పాడిందే పాటగా పాచిపళ్లతో ప్రసారం చేస్తూ వస్తోంది.

********
బ్లాక్‌మెయిళ్లకు, బెదిరింపులకు, గోబెల్స్ ప్రచారాలకు బెదిరిపోయేది కాదు ‘సాక్షి’.
నాలుగేళ్ల ‘సాక్షి’ బయోగ్రఫీలో నలభై అధ్యాయాలకు సరిపడా అవరోధాలున్నాయి, అడ్డంకులున్నాయి, న్యాయపోరాటాలున్నాయి. విజయాలున్నాయి, విజయోత్సవాలున్నాయి. ఎదిగిన క్రమం ఉంది. ఒదిగిన వైనం ఉంది. ఇచ్చుకున్న వివరణలు, చేసుకున్న చిన్నచిన్న సవరణలు ఉన్నాయి. ఇవన్నీ ‘సాక్షి’ని శక్తిమంతం చేశాయి. చేస్తున్నాయి. ‘సాక్షి’కి ఇప్పుడు కోటీ 42 లక్షల 29 వేల మంది పాఠకుల ఆదరణ ఉంది. ‘సాక్షి’ కట్టుబడిన విలువలు ‘సాక్షి’కి అండగా ఉన్నాయి. ‘సాక్షి’ నెలకొల్పిన సత్సంప్రదాయాలు ‘సాక్షి’కి దీవెనలయ్యాయి. అకౌంట్లు మూయించి, అడ్వర్‌టైజ్‌మెంట్‌లు ఆపించి ‘సాక్షి’ నోరు నొక్కేందుకు, సాక్షిపై ఆధారపడిన అరవై వేల మంది ఉద్యోగుల, వారి కుటుంబసభ్యుల పొట్టకొట్టేందుకు జరుగుతున్న కుట్ర ప్రజలకు అర్థమౌతూనే ఉంది. చీకటి జీవోలతో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి పన్నాగాలతో చంద్రబాబు నాయుడు చీకటి ఆదేశాలతో సి.బి.ఐ చీకటి ఉద్దేశాలతో ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలు ‘సాక్షి’ వెలుగును మింగేయలేవు. ప్రజాదరణ అనే చమురుతో వెలుగుతున్న దీపం... ‘సాక్షి’. ఆ దీపాన్ని ఆర్పేందుకు దగ్గరికొచ్చే వారెవరైనా శలభాల్లా మాడి మసైపోవలసిందే. ఇది సత్యం. సత్యమేవ జయతే. అంతిమ విజయం ‘సాక్షి’దే. - సాక్షి ఫ్యామిలీ ‘సాక్షి’ ప్రతిన, ‘సాక్షి’ పునరుద్ఘాటన ప్రారంభం (2008) ప్రజా సంక్షేమానికి విఘాతం కలిగించే పనులేవైనా ప్రభుత్వం చేస్తే మేము నిస్సందేహంగా ప్రజల తరఫున దానిని ఖండిస్తాం. రాజకీయ దుష్ట చింతనతో ప్రభుత్వం మీద కత్తికట్టి, ప్రభుత్వ పతనమే ప్రజాస్వామ్య పరమావధి అని, మనకు నచ్చిన వారి పాలనే రామరాజ్యం అనీ నిస్సిగ్గుగా వ్యవహరించే పత్రికల సరసన మేము చేరబోము. ప్రజల మనస్సాక్షిగా వ్యవహరిస్తూ మొత్తం సమాజంలో జరిగే సకల కార్యకలాపాలనూ ప్రజాకోటికి యథాతథంగా నివేదిస్తాం. రెండో సంవత్సరం (2009) పలికెడిది భాగవతమట. పలికించెడివాడు రామభధ్రుండట. భాగవతం రాసింది పోతనే అయినా, రాయించుకున్నది రామచంద్రుడే అన్నది ఆయన నమ్మకం. అలాగే ‘సాక్షి’ని సంకల్పించినది మేమే అయినా అందుకు ప్రేరణ మీరే అని మా విశ్వాసం. ఇందులో అక్షరం మాది... భావం మీది. పదం మాది... పథం మీది. వాక్యం మాది.. వాక్కు మీది. వ్యాఖ్యానం మాది... వివేచన మీది. మూడో సంవత్సరం (2010) ‘సాక్షి’ వస్తూనే పత్రికారంగంలోని గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టింది. అబద్ధాల మసిపూసిన వార్తలు, వ్యాఖ్యలతో నాణేనికి ఒక వైపే కనిపిస్తున్న స్థితిలో రెండోవైపు చూడగలిగే అవకాశం పాఠకులకిచ్చింది. తెలుగు పత్రికల నట్టింట విశ్వసనీయత అనే దీపం పెట్టింది. పది గొంతుల రావణుని చెర నుండి నిజాల సీతను విడిపించింది. నాలుగో సంవత్సరం (2011) ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లపై ఏ రాష్ర్టంలోనూ ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో దర్యాప్తు సంస్థల చేత వరుస దాడులు చేయించి, వారిని భయోత్పాతానికి గురి చేశారు. పాలకపక్షం, ప్రతిపక్షం కలిసి ఆడుతున్న ఈ డ్రామా మీకందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అన్ని పక్షాలూ ఒక్కటై మాపై దాడి చేస్తున్న వైచిత్రి మీ కళ్లకు కడుతూనే ఉంది. ఈ ఆపత్కాలంలో మాకు నిజమైన ఊరట ఒక్కటే. ఎవరెన్ని కుట్రలు చేస్తున్నా, ఒక్క పాఠకుడు కూడా ‘సాక్షి’ని విడలేదు సరి కదా... ఆ సంఖ్య మరింత పెరిగింది. ‘సాక్షి’కి మేమున్నామంటూ మీరు కురిపిస్తున్న ఈ ఆత్మీయతే మాకు కొండంత బలం. ప్రస్తుతం (2012) కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ‘ఎల్లో’ మీడియా ముఠా కలిసిపోయాయి. వీళ్లంతా ఒక్కటై ‘సాక్షి’ని మూయించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ‘సాక్షి’ పత్రిక గానీ, ‘సాక్షి’ టీవీ గానీ లేకపోతే ఎల్లో ముఠా రాసిందే రాత, చూపిందే నిజం అని జనాల్ని నమ్మించవచ్చని వీళ్ల ఆశ. ఆ ఆశ నెరవేరదు. వీళ్లపై ‘సాక్షి’ పోరాటం ఆగదు. సాక్షికి... ఈనాడుకు ఇదీ తేడా! వ్యక్తిపై కక్ష కడితే ఆ వ్యక్తి వార్తలను తొక్కి పెడుతుంది ఈనాడు. వ్యక్తితో సంబంధం లేకుండా వాస్తవాన్ని ప్రెజెంట్ చేస్తుంది సాక్షి. తనకు అనుకూలంగా వాస్తవాలను వక్రీకరిస్తుంది ఈనాడు. వక్రీకరణలోని వాస్తవాలను ప్రముఖంగా ఎత్తిచూపుతుంది సాక్షి. గిట్టని పార్టీల ప్రజాదరణ వార్తా విశేషాలను సెన్సార్ చేస్తుంది ఈనాడు. అన్ని పార్టీల ‘వాయిస్ ఆఫ్ స్పీచ్’లకు సమానంగా స్పేస్ ఇస్తుంది సాక్షి. ఉదా: 1 జగన్ సభలకు లక్షలమంది వచ్చినా ఈనాడు ఆ ముక్క రాయదు. చంద్రబాబు ఏం మాట్లాడినా ముక్క వదలకుండా సాక్షి రాస్తుంది. ఉదా: 2 రామోజీపై 420 కేసు వార్తను ఈనాడు వెయ్యిజన్మలెత్తినా వేసుకోలేదు. జగన్‌పై వచ్చే ఆస్తుల ఆరోపణల వార్తలను ఒక్కటైనా సాక్షి మిస్ చెయ్యదు. అంతెందుకు? నిన్నటికి నిన్న - ‘గబ్బర్‌సింగ్’ సినిమాను రివ్యూ చేస్తూ అది చిరంజీవి తమ్ముడిదైనా సరే సినిమా బాగుందని ఉన్న విషయాన్ని సాక్షి రాసింది. అదే ఈనాడు .... దాసరితో విభేదాలొచ్చి ఏళ్లపాటు ఆయన్ని బ్యాన్ చేసింది.

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top