మతం పేరుతో దుష్ర్పచారం: జగన్

చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 కలిసి కాంగ్రెస్‌తో కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నారు.
నేను తిరుపతికి వెళ్లి ఆ దేవుడి దర్శనం చేసుకుంటే.. దాంట్లో కూడా రాజకీయాలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ నీచమైన మనుషులు. ఇవాళ పత్రికలో నేను చదివా.. చంద్రబాబు అంటున్నారట.. పీఠాధిపతుల దగ్గరకు వెళ్తారట.. (జగన్‌కు వ్యతిరేకంగా)వారిని కదిలిస్తారట. అయ్యా చంద్రబాబూ.. ఎందుకయ్యా మీరు పీఠాధిపతుల దగ్గరకు వెళ్తున్నారు? ఎందుకయ్యా వారిని కదిలిస్తున్నారు? నేను చేసిన తప్పేంటయ్యా..? చెప్పండయ్యా అని చంద్రబాబును అడగదలచుకున్నా. నన్ను ఒక్కడిని చేసి.. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు, ఈనాడు, టీవీ-9, ఆంధ్రజ్యోతి అందరూ ఒక్కటై కుట్రలు చేస్తున్నారు. అప్పటికప్పుడు కథలు అల్లుతున్నారు. వారే కథలు అల్లి.. వాటిపై వారే మాట్లాడేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలారా.. తిరుపతిలో వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి 2009లో కూడా నేను వెళ్లా. నాడు ముఖ్యమంత్రి కొడుకుగా నేను వెళ్లా. ఆ వేళ ఎవ్వరూ కూడా డిక్లరేషన్ ఇవ్వాలని అడగలేదు. ఈ రోజు ఎందుకు అడుగుతున్నారయ్యా అని ప్రశ్నిస్తున్నా. జగన్‌ను ఓడించడానికి, జగన్‌ను నాశనం చేయడానికి ఇంతమంది కలిసి దుష్ర్పచారం చేస్తున్నారు.. కుట్ర చేస్తున్నారు.
ప్రజల సమస్యలు గాలికొదిలేశారు.. రోజూ పేపర్ చూస్తే.. రోజూ టీవీ చూస్తే.. జగన్‌ది ఆ మతం.. జగన్‌ది ఈ కులం.. జగన్ అలా చేశాడు.. జగన్ ఇలా చేశాడు.. చనిపోయిన వైఎస్ ఇది చేశాడూ.. అది చేశాడూ.. అని ఎప్పుడూ కూడా ఒక కుటుంబం గురించి నోరుపారేసుకుంటున్నారేగాని.. ప్రజల దగ్గరకు వెళ్లి... వారికేం కావాలి అన్న ఆలోచన చేశారా? ఆ ప్రజల కోసం పోరాడదాం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడదాం అన్న ఆలోచన అధికార పక్ష నేతలకైనా వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నా.
Next Post Previous Post