fvz

Monday, December 23, 2013

కాస్త లౌక్యం నేర్చుకో జగనూ..!

జగన్ ఎవరితో మంచిగా ఉంటారు...? 

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు.   ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్ తనతో మంచిగా ఉంటారని చెప్పిన నాయకుడెవరూ కనిపించలేదు. పార్టీపై పట్టు సాధించే క్రమంలో జగన్ పార్టీలో ముఖ్యనేతలెవర్నీ తనకు చేరువ కానివ్వడం లేదు. స్వంతంత్రంగా వ్యవహరించే అవకాశం ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఓ ముఖ్యమైన స్థానానికి చేరవలసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైన రెండవశ్రేణి నాయకత్వం ఏదీ కనిపించడం లేదు. 

ఫలానా నాయకుడితో మాట్లాడితే పార్టీకి సంబంధించిన విధి విధానాలపై అవగాహన వస్తుంది. వారి ద్వారా జగన్‌కు మన మనసులోని అభిప్రాయాలను చెప్పవచ్చు. ఏదైనా ముఖ్యమైన విషయంపై హామీ పొందవచ్చుననే భరోసా కార్యకర్తలకు కనిపించడం లేదు. పార్టీ విస్తరిస్తున్న క్రమంలో నాయకత్వానికి సంబంధించి ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి నాయకత్వం అవసరం. పార్టీ విధివిధానాలపై ప్రతినిధులకు తోడుగా సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయాలి. 

అందుకు పార్టీ అధినేత అవకాశామివ్వాలి. వైఎస్‌ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి చాలాకాలం పాటు జగన్‌కు సన్నిహితంగా మెలగుతూ పార్టీ వైఖరిని ఖరారు చేయడంలో సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, కరుణాకర రెడ్డి, సబ్బం హరి తదితరులు ఎందరో కీలకపాత్ర పోషించారు. పార్టీ భవిష్యత్ విధానాల గురించి మీడియాకు తెలియజేసేవారు. అలాంటి సబ్బం హరి తమ పార్టీ సభ్యుడు కాదని జగన్ ప్రకటించుకున్నారు. ఆ తరువాత సుబ్బారెడ్డిని పక్కన పెట్టారన్న వార్తలు వినవచ్చాయి. కొణతాల రామకృష్ణను కేవలం అనకాపల్లి లోక్ సభకు పరిమితం చేసారు. దాడి తండ్రీ కొడుకులను విశాఖకు మార్చారు. ఇలా ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేసారు.   జగనన్న వదిలిన బాణం ఎక్కడా ...?

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మహాప్రస్థానం నిర్వహించి జనంలో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను పెంచిన సోదరి షర్మిల ఒక్కసారిగా పార్టీ సమావేశాల్లో కనిపించకుండా పోయారు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీలో నాయకత్వలోటు ఉండకుండా విజయమ్మ, షర్మిల యాత్రలు జరిపి జనం మద్దతు సంపాదించారు. అలాంటి వారిని ఒక్కసారిగా పక్కకు తీసేయకూడదు. పైగా ప్రత్యర్థులు వేయికళ్లతో చూస్తున్నపుడు, వారికి అవకాశం ఇచ్చేలా ప్రవర్తించకూడదు.   

రాజశేఖర రెడ్డి వ్యవహారం ఇలా కాదు. ఆయన ఎక్కడిక్కడ కొంతమంది నమ్మకస్తులను ఏర్పాటు చేసుకునేవారు. వారి ద్వారా పనులు నడిపేవారు. వారికి కూడా స్వంత పనులు చేసుకునే అవకాశం ఇచ్చేవారు. రాజకీయాల్లో ఇది సహజం. ఇలా చేయకుంటే రాజకీయాలు నడపలేరు. జగన్ వ్యవహారం ఇలా కాదు. మీకేం కావాలి.. మీ వ్యవహారం మీరు చూసుకోండి..పార్టీ వ్యవహరాలు, పక్క నియోజకవర్గాలు సంగతి మీకు అనవసరం అన్న వైఖరి.  

నిజానికి చంద్రబాబు ది కూడా ఇదే వైఖరి.కానీ ఆయన ఇంత మొరటుగా, మోటుగా వ్యవహరించరు. లౌక్యంగా వుంటారు. అందరి నుంచి సమాచారం అందుకుని తెలివిగా తన నిర్ణయం తాను తీసుకుంటారు. ఏ ఒక్కరిని దూరం పెట్టరు.దగ్గరగా వున్నట్లే అనిపిస్తారు. కానీ నిర్ణయాలు అన్నీ తనమే. ఇది రాజకీయ లౌక్యం. జగన్ కు ఇదే కొరవడినట్ల కనిపిస్తోంది. గతంలో నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా వేసిన వారిలో కొందరి పనితీరు బాగాలేదన్న సాకుతో తప్పించి వారి స్థానంలో కొత్తవారిని వేశారు. దీంతో పార్టీ నేతల్లో అభద్రతా భావం పెంపొందే అవకాశం ఉంది. ఎప్పుడు ఎవర్ని ఎక్కడ ఉంచుతారో? తీసేస్తారో తెలియని పరిస్థితి ఉంటే పార్టీ నాయకులు కృతనిశ్చయంతో పనిచేసే అవకాశం ఉంటుందా?  


ఇలా అయితే ఎలా...? 

రాజకీయాలు నడపడం వేరు, వాటిని ఎంతవరకు వెల్లడించాలో, అంతవరకే వెల్లడించడం వేరు. ఇప్పుడు ఎన్జీవోల రాజకీయాలు కూడా ఇదే. అసులు ఇందులో జగన్ ఇప్పుడు వేలు పెట్టాల్సిన అవసరం ఏముంది? వేలు పెట్టినా బహిరంగంగా బయటపడాల్సినంత అగత్యం ఏముంది. అశోక్ బాబు కిరణ్ మనిషి అని ముద్రపడ్డారు. ఆ ముద్ర అలా వుండనిస్తే ఆయనే తగ్గిపోయి వుండేవారు. గడచిన పదిహేను రోజులుగా నిజానికి అశోక్ బాబు చాలా వరకు తగ్గిపోయారు. అలా వదిలేసి వుంటే బాగుండేది. ఇప్పుడు ఆయన కాస్తా హీరో అయిపోయారు. జగన్ వర్గంతోనే ఫైట్ చేస్తున్నంతగా వైకాపా ప్రత్యర్థులు బిల్డప్ ఇస్తున్నారు. 

ఈ ఎన్నికల్లో కాస్త తేడా జరిగిందంటే, జగన్ ఓడిపోయినంత ప్రచారం సాగుతుంది. ఈ సంగతి జగన్ గుర్తించలేదా లేక, గుర్తించి ధీమా పడుతున్నారా అన్నది అనుమానం. ఎన్జీవోల వంటి పెద్ద వర్గం రాజకీయాల్లో వేలు పెట్టడం వేరు, వేలు పెట్టినట్లు చాటు కోవడం వేరు. తెలంగాణ జేఎసిలో వున్నవాందరి మధ్య ఐక్యత, ఏక రూపత వుందని అనుకోవడం భ్రమ. కానీ ఓ తాటిపై వుండాల్సిన అవసరం కాబట్టి వున్నారు. అదేవిధంగా ఎన్జీవొల జెఎసి సభకు వెళ్లి వస్తే పోయిందేముంది? ఆదికి ముందే అశుభం పలకడం ఎందుకు? సమైక్యం ఎజెండా కాని వారికి అక్కడ స్థానం వుండాలో వద్దో అటు ఎన్జీవోలు లేదా ఆ పార్టీలు నిర్ణయించుకుంటాయి. మధ్యలో వైకాపా బద్నామ్ కావడం ఎందుకు?  

మీడియా మేనేజ్మెంట్...? 

మీడియాలో సింహభాగం జగన్ కు వ్యతిరేకం అన్న సంగతి చెప్పనక్కరలేదు. జగన్ తన స్వంత మీడియాను నమ్మకున్నారు. మరి కొంత మంది పార్టీ అనుకూలురు వున్నారు. కానీ వీరంతా నేరుగా పబ్లిసిటీ వ్యవహారాలు చూస్తున్నారు కానీ, పరోక్ష ప్రచారాన్ని సాగించడం లేదు.  నెట్ సర్వేలు, నెట్ వార్తల పట్ల కూడా జగన్ వర్గం నిమ్మకు నీరెత్తినట్లు వుంటోంది. టీవీ పోల్ సర్వేలు, నెట్ సర్వేలు వంటి వాటిలో తెలుగుదేశానిదే పైచేయిగా వుంటోంది. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు వున్నాయి. 

నెటిజన్లు అంతా తెలుగుదేశం అనుకూల వైఖరితో వున్నారని కొందరు. లేదు తెలుగుదేశం ఐటి వింగ్ ఇలాంటి వాటిని బాగా మేనేజ్ చేయగలదని మరికొందరు అంటున్నారు. ఏది నిజమైనా జగన్ పార్టీ ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఇండియా టుడే మామూలుగా సర్వే చేస్తే వచ్చిన ఫలితాలకు, ఆన్ లైన్ సర్వేకు శత సహస్రం తేడా వచ్చిందంటే ఏమని అనుకోవాలి? ఎక్కడో ఏదో జరుగుతోంది అనుకోవాలి.  ఇప్పటికైనా జగన్ తన వైఖరి కాస్త మార్చుకోవాలి. రాజకీయాలు చేయడం, రాజకీయాల్లో వుండడం అంటే ముఖానికి ఎప్పుడూ నవ్వు పులుముకోవాలి అన్న సత్యం తెలిస్తే చాలదు..ఆచరణలోకి కూడా రావాలి. ఆ విషయంలో జగన్ కన్నా బాబు, కిరణ్ లే బెటరన్న దాంట్లో అనుమానం లేదు.

Saturday, December 21, 2013

DEVYANI KHOBRAGADE

వామ్మో! ఈమె ఘటికురాలే!
భారత్, అమెరికా మధ్య దౌత్య యుద్ధానికి కారకురాలైన దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాదె అమాయకురాలేం కాదు! ఘటికురాలేనట! ఆమెకు మొత్తం 11 ఆస్తులు వున్నట్టు తేలింది. మహారాష్ట్రలో వివాదాలకెక్కిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్‌ను పొందేందుకు ఈమెకి అసలు అర్హత లేదని ఈ స్కామ్‌పై దర్యాప్తు జరిపిన కమిటీ తేల్చింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. గవర్నమెంట్ కోటా కింద ఎవరైనా ఫ్లాట్ పొందదలుచుకుంటే ఇక మరెక్కడా తమకు ఇతర ఫ్లాట్‌లు లేవని ధ్రువీకరించాల్సి వుంటుంది. అయితే ‘ఆదర్శ్’తో బాటు ఓషివారా ప్రాంతంలో ప్రభుత్వ కోటా కింద ఆమె మరో అపార్ట్‌మెంట్ పొందిందని తెలిసింది. ఇంతేకాదు! దేవయానికి మరో 10 స్థిరాస్తులు కూడా వున్నాయని గుర్తించారు. 2012 డిసెంబర్ 31 నాటికి తన ఆస్తులకు సంబంధించి ఆమె సమర్పించిన అఫిడవిట్ వివరాలను హోంశాఖ వెబ్‌సైట్ తెలిపింది. (ఈ వివరాలు ఆ వెబ్‌సైట్ వద్ద వున్నాయి).

ఈ ఆస్తుల్లో ఏడింటి విలువ రూ.78 లక్షలని, ఆదర్శ్ సొసైటీలోని ఫ్లాట్ విలువ రూ.90 లక్షలని ఆ అఫిడవిట్‌లో ఆమె పేర్కొంది. మూడు ఆస్తుల విలువని ఇందులో వివరించలేదు. తన తండ్రి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తులద్వారా ఈ అపార్ట్‌మెంట్లని పొందినట్టు దేవయాని అందులో పేర్కొంది. 11 ఫ్లాట్‌లలో ఐదింటి ద్వారా తనకు సంవత్సరానికి వచ్చే ఆదాయం రూ.1.26 లక్షలేనని, మహారాష్ట్రలో 8 ఆస్తులుండగా, కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో రెండు, ఉత్తరప్రదేశ్ గౌతమ బుద్ధనగర్‌లో ఒక ఫ్లాట్ వున్నట్టు ఆమె తెలిపింది. అసలు మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తన అఫిడవిట్‌లో దేవయాని సంతకమే లేని విషయాన్ని కూడా గుర్తించారు. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో 25 ఎకరాలు, రత్నగిరి జిల్లాలో 8 ఎకరాల వ్యవసాయ భూమి కూడా దేవయాని సొంతమట! ఆదర్శ్ సొసైటీ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన కమిటీ రిపోర్ట్‌ను మహారాష్ట్ర మంత్రివర్గం పక్కన పెట్టేయడం విశేషం. అంటే.. అంతా సక్రమంగానే వుందని సీఎంతో సహా మంత్రివర్యులంతా అభిప్రాయపడినట్టే..! మహారాష్ట్రలో దేవయాని బాగోతం గురించి అమెరికాకు తెలిస్తే మరి ఇంకేమైనా వుందా!

The Arrest of  Devyani Khobragade in New York has triggered a big Diplomatic Row between India and United States.  She was taken into custody by law enforcement authorities in New York in the morning of December 12, 2013 while she was dropping her daughter at school. She was later released that same evening. In this article we try to find out more about Devyani Khobragade.

Devyani is a 1999 Batch  Indian Foreign Service Officer currently working as India’s Deputy  Consul General (Economic, Commercial and Women’s Affairs) in New York.
Devyani has worked in the political divisions of the Indian Missions in Pakistan, Italy and Germany.  She originally hails from Mumbai Maharashtra. She studied at St. Joseph’s convent school, Jalgaon, Maharashtra.
She did her MBBS from Seth G.S Medical College and K.E.M Hospital, Parel in Mumbai. She is proficient in English, Hindi, German, and her mother tongue, Marathi.  She was an 2012 Rolls Royce Scholar. She is 39 years old.
Her passions  include travelling, reading, yoga, music and dancing. Apart from proudly raising two beautiful girls, she also wishes to contribute towards Gender Equality in India.
Devyani’s father Uttam Khobragade is a retired IAS officer from Maharashtra. Reports say that her husband is a Professor of Philosophy in some college.


తండ్రి హృదయం తల్లడిల్లింది

అమెరికాలో అరెస్టయి, ఘోర అవమానానికి గురైన భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాదే తండ్రి ఉత్తమ్ ఖోబ్రగాదే హృదయం తల్లడిల్లిపోయింది. తన కూతురికి న్యాయం జరగకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.
తన కుమార్తె అరెస్టుకు కారకుడైన యుఎస్ అటార్నీ ప్రీత్ భరారా భారత న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన- దానిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని సుప్రీంకోర్టును కోరారు. ‘ నా కుమార్తె గౌరవాన్ని నేను పరిరక్షించలేకపోతే, ఈ ప్రపంచంలో జీవించడమే వృధా’ అని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన ఉత్తమ్ ఖోబ్రగాదే వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. నేను నిరవధిక దీక్ష చేయడం ఖాయం అన్నారు. అయితే తన కూతురిపై వచ్చిన అభియోగాలను ఎప్పటిలోగా ఉపసంహరించాలన్న అంశంపై గడువును చెప్పేందుకు నిరాకరించారు.
బాధితురాలి(సంగీత) నోరుమూయించేందుకు ఇండియాలో లీగల్ ప్రాసెస్ ప్రారంభమైనందువల్లే బాధితురాలిని, ఆమె భర్తను ఆ దేశం నుంచి రప్పించామన్న  ప్రీత్ భరారా కామెంట్స్‌పై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ఇది భారత జుడిషియరీని శంకిస్తున్నట్టే కదా అన్నారు. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. దేవయానిని వేధించే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని, ఆమె అరెస్టుకు కొన్ని రోజులముందు కావాలనే సంగీత కుటుంబాన్ని ఇండియా నుంచి విమానంలో యుఎస్‌కు తరలించారని ఆయన ఆరోపించారు.బుద్ధిమంతురాలేమీ కాదట!

ఇండియన్ ఫారిన్ సర్వీస్...భారతదేశ అత్యుత్తమ కేడర్‌లలో ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ చాతా ప్రధానమైనది. ఎంతో కఠోర దీక్షతో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పాసైతేనే అంతటి అత్యుత్తమ పోస్టును సంపాదించగలుగుతాము. అటువంటి దౌత్యవేత్త పోస్టులో వున్న ఈ అధికారి దేవయాని చాలా చీప్‌గా ప్రవర్తించి మన దేశ గౌరవాన్ని పరదేశంలో మంటగలపిందంటు మండిపడుతున్నారు సీనియర్ అధికారులు. ఈమెపై అమెరికా అధికారుల ప్రవర్తనా తీరును భారత్ ముక్తకంఠంతో ఖండించినప్పటికీ ఆమె చేసిన తప్పు మాత్రం క్షమార్హం కాదంటున్నారు నిపుణులు. ఎవరికి పడితే వాళ్లకి దొంగ వీసాలు ఇచ్చేసుకుంటే ఉగ్రవాదులు చొరబడి...అమాయకులైన పౌరులను బాంబులతో చంపేస్తున్నారని..అలాంటి ఘటనలు అమెరికాలో చోటుచేసుకున్నందునే వారు ఇలాంటి పకడ్బంధీ చట్టాన్ని రూపొందించారని..అలా చేయడం భారత్‌ నేతలకు చేతకాలేదని వారు దుయ్యబడుతున్నారు.

అందుకే సాక్షాత్తు పార్లమెంట్‌పై...రైల్వే స్టేషన్‌లపై ఉగ్రవాదులు దాడులు చేసి బహిరంగంగా చంపేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే..ఆమె వీసా విషయంలో చేసిన తప్పేమీ తెలియకుండా చేసింది కాదంటున్నారు. మహరాష్ట్రలో అధికారినిగా వున్నప్పుడు కూడా ఆమె నిబంధనలకు విరుద్ధంగా ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్‌లు పొందినట్టు వారు విమర్శిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా వాళ్లు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ తుది నివేదికను పేర్కొంటున్నారు. సదరు నివేదికలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌తో పాటు ఈ అధికారిని దేవయాని పేరును కూడా కమిషన్ పొందుపర్చింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆమె తన బంధువులకు ఇష్టం వచ్చినట్లు ఫ్లాట్లను కేటాయించిందని కమిషన్ కూడా ఆరోపించింది. అర్హత లేకపోయినప్పటికీ ఫ్లాట్స్ పొందినవారిలో అమెరికాలోని భారత దౌత్యవేత్త దేవయాని పేరు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బంధువుల పేర్లు ఉన్నాయని పిటిఐ వార్తా సంస్థ ఓ వార్తాకథనంలో తెలిపింది. అయితే...సదరు నివేదికను మహరాష్ట్ర కేబినెట్ తిరస్కరించింది. దీంతో..బీజేపీ మండిపడింది. దోషులకు శిక్ష పడేవరకు తాము న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టుకే కాదు సుప్రీంకోర్టుకూ వెళ్తామని స్పష్టం చేసింది.Sunday, December 08, 2013

Telugu actor Dharmavarapu Subramanyam dies of bone cancer at 53 : R.I.P...

Popular Telugu comedian Dharmavarapu Subramanyam, 53, passed away on Saturday night at his residence in Dilsukhnagar. He was suffering from bone cancer since some months.
After his first film Jayammu Nischayammura, he went on to act in over 800 films. He shot into fame with Anando Brahma, a popular TV serial on DD in the 1980s. He stayed away from Film Nagar as he did not want his sons to enter the field.
The film fraternity was shocked at the death.
Initially worked as a government employee, Dharmavarapu Subramanayam, was popular when he directed and acted in ‘Anando Brahma’, a very popular comedy serial on Doordarshan in 1980s. Later director Jandhyala spotted Dharmavarapu’s talent and introduced him in his film ‘Jayammu Nischayammura’ in 1989.
Born on September 20, 1960, in Komminenivani Palem, Prakasham district, Dharmavaram has his own unique style of dialogue delivery. Dharmavaram has won many accolades in his film career.
He won the prestigious awards like Raghupathi Venkaiah Award, BN Reddy and NTR National Award in his film career. His last film was ‘Shadow’ that was released in this year. He directed only one film ‘Thokaleni Pitta’ with Allari Naresh as the lead actor.
He joined in Congress in 2004 and also campaigned for the party. He also served as Chairman for the AP Cultural Association.
Generally many film personalities lives around Film Nagar area, where all the film studios, shootings will be held, but Dharmavaram lives near Dilsukhnagar too far to that place.
Many of his film friends asked him to come to Film Nagar area, but he refused. He says that he doesn’t like to his sons connected to film industry, that’s the reason he stays too far to the industry.
The film personalities shocked to hear the demise of Dharmavarapu. Director Puri Jagannath who is a close friend to Dharmavarapu says, that he can’t believe about it. “I had a great rapport with him.
Even recently he called me and told me that he will comeback and act in my film. He has a very good sense of humour. He always used to listen old songs. If he is not shooting he will spend the time with listening music. He almost acted in all my films,” says Puri Jagannath.

Saturday, December 07, 2013

RGV Sensational Twitter Comments On KCRతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై వర్మ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో కేసీఆర్ లాంటి నాయకులు లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవేమోవని పేర్కొన్నాడు. కేసీఆర్ తన మకాం అమెరికాకు మార్చి ఆ దేశ పౌరులకు విభజన భావనలు, ఆలోచనల గురించి చెప్పాలని సూచించాడు. ఇలాంటి నాయకులు అమెరికాను విభజించాలని వాదించగలరని అభిప్రాయపడ్డాడు. వర్మ ఇంకా ఏం ట్వీట్ చేశాడంటే...
  • అమెరికాలో ఏ రాష్ట్రం కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.
  • భారత్ లోని రాష్ట్రాలు ఎప్పుడూ సమైక్యంగా లేకపోవడం లేదా సమైక్యంగా ఉంచగల సామర్థ్యం భారతీయులకు లేకపోవడం విభజనకు కారణం కావచ్చు.
  • రాష్ట్రాలను ఎలా సమైక్యంగా ఉంచాలో మనం అమెరికాను చూసి నేర్చుకోవాలి.
  • అమెరికన్లు మద్యం, శృంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. వేర్పాటు రాజకీయాల గురించి ఆలోచించేంత తీరిక వారికి ఉండదు.
  • అమెరికాలో ఏ రాష్ట్రం కూడా విడిపోవాలని ఎందుకు అడగడం లేదు? అక్కడ కేసీఆర్ లాంటి సమర్థులైన నాయకులు లేకపోవడం వల్లేమో?
  • కెసీఆర్ ఒకవేళ అమెరికా పౌరుడిగా వాషింగ్టన్ లో జన్మించినట్టయితే.. ఆయన తన జీవితంలో ఏం సాధించావారో చూడాలనివుంది.

Monday, November 18, 2013

'రాజకీయ నాయకులు 'ఇడియెట్స్', ఐటీ నిపుణులు 'అసంతృప్తి మూక'


ప్రముఖ శాస్త్రవేత్త, భారత రత్న సీఎన్ఆర్ రావు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను 'అసంతృప్తి మూక' , రాజకీయ నేతలను 'ఇడియెట్స్' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'కేవలం డబ్బు కోసమే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పనిచేస్తారు. వాళ్లు ఒక అసంతృప్తికి గురైన గుంపు' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ నిపుణుడు, హత్య గురైన టెకీ, విడాకులు తీసుకున్న ఐటీ ప్రొఫెషనల్ అనే హెడ్డింగ్ లతో పేపర్లో రోజు వార్తలు చదువుతాను అని అన్నారు. చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ అసంతృప్తితో జీవితం గడుపుతున్నారు. వారి జీవితం చాలా దుర్భరంగా ఉంది అని వ్యాఖ్యానించారు. అంతేకాక వాళ్లు తమ పనిని ఎంజాయ్ చేయలేరని.. తాను 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంత ఆనందంగా ఉన్నానో చూడండి అన్నారు. 
 
కేవలం క్రీడలకు, ఆర్మీ ఇతర అంశాలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారని.. సైంటిస్టులకు ఈ దేశంలో గుర్తింపు లేదు అని అన్నారు. 2005లో నోబెల్ బహుమతికి సమానంగా ఉండే డాన్ డేవిడ్ పురస్కారం తనకు లభించిందని, దాని విలువ ఒక మిలియన్ డాలర్లు అని అన్నారు. తనకు లభించిన పురస్కారం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు అని అన్నారు. ఎప్పుడో ఒక్కసారి ఇచ్చే ఈ పురస్కారం ఇతర దేశాల్లో కూడా ఎవరికి లభించలేదని.. అలాంటిది తనకు లభిస్తే ఈ దేశంలో గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శాస్త్రీయ రంగానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని.. రాజకీయ నాయకులు ఇడియెట్స్ అని అన్నారు. శనివారం సీఎన్ఆర్ రావుకు సచిన్ తోపాటు భారత రత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Wednesday, November 13, 2013

Sunday, November 03, 2013

జగన్‌... ఒక్క అడుగు!

ఒక్క అడుగు కీలకం.. మడమ తిప్పకుండా ముందుకెళ్లి ఆయన ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాలి!
ఒక్క అడుగు కీలకం.. అదేదో ప్రజలనే అడిగి ఆయన తన పట్ల విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి!!
ఒక్క అడుగు కీలకం.. ప్రస్థానం చెల్లిపోయిందని ప్రపంచం గేలిచేస్తున్న వేళ.. తెలంగాణ బరిలో తన విధానంలోని నిజాయితీని చాటుకోవడానికి వేసే ప్రతి ఒక్క అడుగూ కీలకం!!!తొలి అడుగులు ఎలా పడతాయో అదే కీలకం అని అదే ముచ్చట అని అనుకుంటాం మనం. కానీ మలి అడుగులు కీలకం అవుతున్నాయిప్పుడు. ఇంతకాలం పార్టీని నడిపిన తర్వాత.. జగన్మోహనరెడ్డి ఇప్పుడు ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. ‘తెలంగాణ కూడా నాక్కావాలి..’ అని జగన్‌ అంటుండవచ్చు గాక కానీ తెలంగాణ వారు కూడా ‘జగన్‌ మాక్కావాలి’ అనుకోవాలి. అలాంటి వారు అనల్పంగా ఉన్నారని జగన్‌ నమ్మిక. తన తండ్రి వైఎస్సార్‌ వేసిన ప్రగతి పునాదులు ప్రజలప్రేమను పటిష్టంగా నిర్మించాయని ఆయన విశ్వాసం.

అయితే.. విజయమ్మ కారు మీదకు విసరబడిన కోడిగుడ్లు జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయగలిగేవి కాదు! అల్లరిని ఉద్యమం అనుకుని జడిసే స్థితిలో జగన్‌ ఉండకపోతే గనుక.. ఆయన తాను కూడా తన సమైక్య సిద్ధాంతాన్ని నిరూపించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలో తాను స్వయంగా ఆయన పర్యటనకు పూనుకోవచ్చు. జగన్‌ తెలంగాణలో అడుగుపెట్టడానికి యాత్రకు సిద్ధమవుతున్నాడంటేనే.. జడుస్తున్న వారో.. పోరాడుతున్న వారో... ఆయనకు పదేపదే ‘మానుకోట’ను గుర్తుచేస్తుండవచ్చు! భయపెట్టగలమని ప్రయత్నిస్తుండవచ్చు. కానీ వేచిచూడాలి... ఆయన రాళ్లకు వెరచి ఆగుతారో.. ఎదురు నిలిచి పోరుతారో.. ఒడుపుగా వాటిని పట్టుకుని.. తనకంటూ ఓ దుర్గం నిర్మించుకుంటారో...!!


తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాలనే వాంఛ  ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధమైన అభివృద్ధి కలలు వారి కనుల ముందు సాక్షాత్కరిస్తాయనే విషయంలో ‘కోరుకుంటున్న ప్రజల్లో’ ఎందరికి స్పష్టమైన అవగాహన ఉన్నదనే సంగతి లెక్కవెయ్యలేం. ఏం జరుగుతుందో తెలియదు గానీ, అందరూ రాష్ట్రం వస్తే మంచి జరుగుతుందని అంటున్నారు గనుక.. ఆ మాటలు నమ్ముతూ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారు అనేకులు. ‘అందరూ’ కొందరిని విలన్లుగా చిత్రీకరిస్తూ పదేపదే ప్రచారం చేస్తున్నారు గనుక.. తాము కూడా విలన్లుగా భావిస్తున్న వారు అనేకులు. తెలంగాణకు జరిగిన అన్యాయాలు, దోపిడీలు, కబ్జాలు ఇత్యాది విషయాలలో ఎన్ని అవాస్తవాలైనా ప్రచారం అవుతుండవచ్చు గాక.. కానీ, పైన చెప్పుకున్న వీరందరిలోనూ నిజంగానే తెలంగాణ రాష్ట్రం కావాలనే కోరిక ఉన్నది. కానీ యావత్తు తెలంగాణ ప్రాంతంలో ‘వీరు’ ఎందరున్నారు? అదే ఇప్పుడు పెద్ద చిక్కుముడి.

తెలంగాణలోని మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ‘వీరి’ వాటా ఎంత? మిగిలిన వాటా ఎంత? ఆ మిగిలిన వాటాలో ఎందరున్నారు? వారు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకుంటున్నారు? తమ ఆశలను తీర్చగల చుక్కానిగా ఎవరిని ఎంచుకుంటున్నారు? వేరే ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు? సమైక్యాంధ్ర ఉద్యమానికి, సమైక్యాంధ్ర భావజాలానికి బయటకు కనపడని మూలాలు అనేకం తెలంగాణలోనే ఉన్నాయనడానికి వారికి తమ అవ్యక్త ఆశలను నెరవేర్చగల రాజకీయ ఆశాదీపంగా సమైక్య శంఖారావం పూరించి.. సోనియాను హెచ్చరించిన జగన్మోహన్‌రెడ్డి కనిపిస్తున్నారని వాస్తవమూలాల్ని వివరించేందుకు ఈ వ్యాసం..

అవ్యక్త బాధాసర్పదష్టులు అనేకులు...
‘తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వచ్చి ఒదిగిపోయారు. కానీ తెలుగువాళ్లు కలవడం లేదు. అందుకే ఇప్పుడీ విభజన తగాదాలు వస్తున్నాయి’ అని ఈ మధ్య కొందరు పెద్దలు వాక్రుచ్చారు. కానీ వారు అయితే మూలాలు తెలియకుండా మాట్లాడి ఉండాలి. లేదా, ఉద్దేశపూర్వకంగా విద్వేషాలను ప్రచారంచేసేందుకు అలా మాట్లాడి ఉండాలి. తెలంగాణలో ఎన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలైన వచ్చి కలిసిపోయి ఉండవచ్చు గాక.. కానీ వారి మాటల్లో ‘తెలుగువారు’ వాస్తవానికి సీమాంధ్రకు చెందిన వ్యక్తులు ఇక్కడి జనజీవితంలో మిళితం అయినట్లుగా మరొకరు మనకు కనిపించరు. సోకాల్డ్‌ తె-వాదపు పెద్దలు  చెబుతున్న మాటల్లో ‘ఇక్కడ కలిసిపోయిన ఇతర రాష్ట్రాల వారు’ ప్రధానంగా హైదరాబాదు నగరంలో కేంద్రీకృతం అయిన వారు. అంటే వ్యాపార అవకాశాలు ఎక్కడ విస్తారంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే వారు వచ్చి స్థిరపడ్డారు.. కలిశారు. కానీ సీమాంధ్రులు అలా కాదు. వారు తాము మరో ప్రాంతానికి వెళుతున్నాం అనే భావన లేకుండానే ఇది మనదే అనే ఉద్దేశంతోనే ఇక్కడి సామాన్య జనజీవితంలో తామూ ఒక భాగంగా కలిశారు. వీరు కేవలం హైదరాబాదు నగరం మీది మోజుతో వచ్చి స్థిరపడిన వారు కాదు. ఇరుగుపొరుగు భావనలతో యావత్తు తెలంగాణ ప్రాంతంలోని అనేక కుగ్రామాలలో సైతం సేద్యం పనులు చేసుకుంటూ సొంతానికి కొంత  వ్యవసాయం ఏర్పాటు చేసుకుని స్థిరపడిన వారు. వారికి సీమాంధ్ర తెలంగాణ పేరుకు రెండు ప్రాంతాలే తప్ప వేరువేరు అనే భావన ఉండదు. ఆ మాటకొస్తే సీమాంధ్ర ప్రాంతంనుంచి వచ్చి స్థిరపడిన రైతు, వృత్తిపనివాడు లేని పల్లె మనకు యావత్తు తెలంగాణలో దుర్భిణి వేసి వెతికినా దొరకదన్నది వాస్తవం.

ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ బాగా కలిసిపోయారంటూ చిలకపలుకులు పలికే మేధావులు గమనించాల్సిన మరో వాస్తవం కూడా ఉంది. హైదరాబాదులో వారి దామాషా ఎంత? తెలంగాణ పల్లెపట్టుల్లో స్థిరపడిన సీమాంధ్రుల దామాషా ఎంత? చూస్తే తెలిసిపోతుంది. సీమాంధ్ర ప్రాంతీయులు కేవలం ఇక్కడి వ్యాపారపరమైన ఆకర్షణకు ఎగిరి వచ్చారో.. లేదా, తెలంగాణ ప్రాంతపు జనజీవన మూలాల్లో తాము కూడా ఒక భాగంగా బతకడానికి వచ్చారో తేలిపోతుంది.

వారికి తమ జన్మమూలాలు ఎక్కడున్నాయో తెలుసు. సదరు సీమాంధ్ర ప్రాంతంతో తమ అనుబంధం ఏమిటో తెలుసు. శ్రీకాకుళంనుంచి వలస వచ్చిన కుటుంబ వారసుడు కేసీఆర్‌కు ఆ మూలాల మీది అనుబంధం లేదని అనలేం. ఆ అనుబంధాన్ని తోసిరాజని.. సీమాంధ్రులందరినీ దోపిడీ దొంగలుగా చిత్రించేయడానికి, కేసీఆర్‌కు కనిపించినట్లుగా కనులముందు ఈ ప్రజలందరికీ అధికార పీఠాలు కనిపిస్తూ ఉండకపోవచ్చు. అందుకే వారు తమ మూలాలున్న ప్రాంతంతో బంధం తెగిపోవడం అంటే.. మనస్సు ఎక్కడో చివుక్కు మంటున్నదని బాధపడుతున్నారు. తల్లిపేగు కత్తిరించినట్లుగా ఉన్నదని వేదన చెందుతున్నారు.

అలాంటి జనం యావత్‌ తెలంగాణలో ఏ కులం కంటె, ఏ మతం కంటె, ఏ వర్గం కంటె కూడా అధిక సంఖ్యలో ఉన్నారన్న మాట ఇవాళ కఠోరమైన వాస్తవం. పెద్దసమస్య తలెత్తినప్పుడు, ఉన్న సమస్య చిన్నదైపోయినట్లుగా.. విభజన అనే అంశం తెరమీదకు వచ్చినప్పుడు కులమతాలకు అతీతంగా వారంతా ఇప్పుడు ఒక్కటే జాతి అనుకుంటున్నారు. మరి వారి వేదన పరిమార్చే ప్రత్యామ్నాయం ఏంటి? తెలంగాణ ప్రాంతంలో స్థిరపడి బతుకుతున్నందుకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వాంఛను వ్యక్తం చేయలేని బతుకులు ఈ ప్రాంతంలో కొన్ని లక్షలున్నాయి. వారి చుక్కాని ఎవ్వరు?

ఉద్యమవేళల్లో తమ కోరికను చెప్పలేకపోవచ్చు గానీ.. ఓటు పర్వం అంటూ వస్తే.. రహస్యబ్యాలెట్‌ రాజ్యం చేసే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో సమైక్యవాదానికి దన్నుగా నిలవగలమని వారు భావిస్తున్నారు. అలాంటి వారందరికీ ప్రస్తుతానికి సమైక్య వాదాన్ని వినిపిస్తున్న ఏకైక నాయకుడిగా వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఒక్కరే కనిపిస్తుండడం గమనార్హం. ఎన్నికల పర్వం వరకు ఈ రాష్ట్రం ముక్కలైపోకుండా ఉంటే గనుక.. జగన్‌ దిశగా తామంతా కలసి కట్టుగా ఒక్క అడుగు వేయాలనే ఉద్దేశంతోనే పైన పేర్కొన్న నిర్దిష్టమైన జనవాహిని ఉన్నది. సరిగ్గా వారి ఆశ ఆలోచినస్తున్న దిశగానే.. వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రయత్నం కూడా నడుస్తున్నది.

తెలంగాణలో అస్తిత్వం అవశ్యం...
వైఎస్‌ జగన్మోహనరెడ్డి తను సమైక్యవాదాన్ని స్పష్టంగా స్వీకరించిన రోజున దాని నిర్వచనాన్ని కూడా వివరించారు. అవకాశవాద మీడియాల విశృంఖల రూపాల్లో అది మరుగున పడిపోయి ఉండొచ్చు గానీ.. ‘సమైక్యాంధ్ర అంటే కేవలం రాయలసీమ, కోస్తాంధ్ర కాదు. తెలంగాణ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే నేను రాష్ట్రం కలిసిఉండాలని కోరుతున్నాను’ అంటూ ఆయన స్పష్టీకరించారు. కానీ వైకాపా తన ధోరణిని నిర్ణయించుకున్న రోజున క్షేత్రస్థాయిలోని వాస్తవాల్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేక మంది నాయకులు కంగారు పడ్డారు. వారు పార్టీని వీడి వెళ్లిపోయారు. కానీ జగన్మోహనరెడ్డి మాత్రం ఏమాత్రం తొణకలేదు. బెణకలేదు. తాము సంకల్పించిన విధానానికే కట్టుబడ్డారు.

తెలంగాణలో తమ పార్టీ అస్తిత్వం అవశ్యం ఉండాల్సిందేనంటూ ఆయన పట్టుపట్టారు. ఈ వ్యాసం తొలిభాగంలో చెప్పుకున్న లక్షలాది మంది జనానికి కనీసం తమలోని కోరికను ఓటు రూపంలో వ్యక్తం చేయాలనుకున్నా కూడా వారికి ఒక మార్గం లేకుండా పోతున్నదని జగన్‌ గుర్తించారు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా.. ప్రజల్ని ఓట్లుగా మాత్రమే చూస్తున్నాయి తప్ప.. వారిలోని అసలైన ఆకాంక్షలను గుర్తించి వాటికి న్యాయం చేసే దిశగా ఆలోచన చేయడంలేదనే.. వైఖరిని కూడా జగన్‌ అర్థం చేసుకున్నారు.  ఆ శూన్యాన్ని తాను భర్తీ చేయాలని అనుకున్నారు.

‘పోగా మిగిలింది ఆస్తి’ అనే సామెత తరహాలో.. పోయినవారు పోగా మిగిలిందే పార్టీ అనే సిద్ధాంతానికి కట్టుబడ్డారు జగన్‌. ఎవరు మిగిలారో వారే ఎన్నికల్లో తలపడతారు. ప్రజల ఆశలకు దన్నుగా నిలుస్తారు అనే వాదనతో ఆయన పార్టీ నిర్మాణానికి సిద్ధ పడ్డారు. ఇవాళ మళ్లీ తెలంగాణ ప్రాంతంలో కూడా వైకాపా రాజకీయ పునాదులు నేల పొరల్లోంచి పొడుచుకు వస్తున్నాయి. అవి తె-వాదులకు కంటినలుసులా తయారవుతున్నాయి. వాటిని వారు చూడలేకపోతున్నారు. ఎలా ‘డీల్‌’ చేయాలో బోధపడని కంగారులో తప్పుడు దారులు తొక్కుతున్నారు.

అల్లరి అభాసుపాలు కావాల్సిందే... 
వైఎస్‌ విజయమ్మ వరద బాధిత రైతుల పరామర్శకు ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు జరిగిన అల్లరి ద్వారా ఏం సాధించామని తె-ఉద్యమకారులు సంతసిస్తూ ఉంటారో గానీ.. నిజానికి మనం తొలుత చెప్పుకున్న వర్గానికి చెందిన ప్రజల్లో ఈ అల్లరి ఐక్య భావనను హెచ్చించి ఉంటుందని అనుకోవచ్చు. నిజానికి రైతుల కన్నీటిని తుడవడానికి ఒక రాజకీయ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ రాకను వ్యతిరేకించడాన్ని వారు ఎలా సమర్థించుకుంటారు. వైకాపా తెలంగాణ రాష్ట్రం కావాలనే రాజకీయ డిమాండును వ్యతిరేకిస్తుంది తప్ప తెలంగాణ ప్రాంతాన్ని కాదు. ప్రజల్ని కాదు. తెలంగాణ ప్రజల్లో విజయమ్మ పట్ల వ్యతిరేకత ఉన్నదనడానికి వీల్లేదు. తె-నాయకులు టముకు  వేస్తున్నట్లుగా ‘మీ సమైక్యవాదుల సానుభూతి మాకు అక్కర్లేదు’ అంటోంది ఎవరు? రాజకీయ ముసుగులో పోరుతున్న వారు మాత్రమే. ప్రజల్లోనే నిజమైన భావన అదే అయితే గనుక.. విజయమ్మ యాత్ర కోడిగుడ్లు విసిరిన వారి అల్లరి వలన కాదు... జనస్పందన లేక అర్థంతరంగా వెనుతిరిగి ఉండాలి. ఆర్తిలో ఉన్న జనంలో నిజమైన వైకాపా వ్యతిరేకత ఉంటే.. విజయమ్మ తమ పల్లెకు వచ్చినప్పుడు.. ఆమె చెంతకు రావడానికి వారు విముఖత ప్రదర్శించి ఉండాలి. అలాంటిది ప్రజల్లో ఉండే భావనను చెబుతుంది. అలాకాకుండా.. మధ్యలో కార్లను అడ్డుకుని కొంత అల్లరి చేస్తే ఏం జరుగుతుంది. అంతా  ఉత్తిదే. ఐక్యంగా ఉండే జాతిలో సమైక్యవాదం ఆవశ్యకత మరింత స్పష్టంగా అర్థం కావడానికి ఇలాంటి అల్లరి ఉపకరిస్తుంది.

మరింత జాగ్రత్తగా మలి అడుగులు...
తెలంగాణ ప్రాంతంలో కూడా దూసుకెళ్లడానికి అక్కడి జనస్పందనను- ధిక్కార తిరస్కారాదులను బేరీజు వేయడానికి విజయమ్మ యాత్ర రూపంలో జగన్‌ చేసిన ట్రయల్‌ రన్‌ ఇది అని పలువురు విమర్శించవచ్చు గాక! దాన్ని కాదనడానికి వీల్లేదు. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆమాత్రం అప్రమత్తత ఉండదనలేం.సమైక్యవాదానికి కట్టుబడిన తర్వాత.. తెలంగాణ ప్రాంతంలో తొలి అడుగుల్లో విజయమ్మకు ఎదురైన స్పందనను బట్టి.. వైఎస్‌ జగన్‌ ఇప్పుడు మలి అడుగులను మరింత పటిష్టంగా ప్లాన్‌ చేసుకుంటారు. ఎవరు కాదనగలరు? మానుకోటలాగా రాళ్లు విసురుతాం అని.. పైనపల్లిలాగా కోడిగుడ్లు చెప్పులు విసురుతాం అని ఎన్నాళ్లు బెదరగొడతారు. ప్రజాస్వామిక ప్రపంచంలో ఇలాంటి చర్యలు ఎలా సాధ్యం?

మన వ్యాసంలో తొలినుంచి ప్రస్తావిస్తున్న తెలంగాణలోని ప్రత్యేక జాతికి ఇప్పుడు జగన్‌ ఒక్కడే ఆశాదీపం కనిపించడం నిస్సంశయం. ఇతర పార్టీలు రాజకీయంగా ప్రజలతో గేమ్‌ ఆడుతున్నాయని ప్రజలందరూ గుర్తించారు. వీరి ఆకాంక్ష వైపుగానే జగన్‌ నడుస్తున్నారు. అది తనకు రాజకీయంగా కూడా లబ్ధి చేకూరుస్తుందని ఆయనకు తెలుసు. సరిగ్గా అక్కడే తె-పార్టీలకు కంగారు పుడుతోంది. జగన్‌ తెలంగాణలో తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటే  గనుక యావత్‌ తెలంగాణ వాదం పేరిట తాము చేస్తున్న ప్రచారం... నిర్మించిన అభూత కల్పనలన్నీ కుప్పకూలిపోతాయని వారు భయపడుతున్నారు. అందుకే జగన్‌ పర్యటనల పట్ల దాడులు ప్లాన్‌చేస్తున్నారు.

కానీ  ఇప్పుడే కోర్టు అనుమతులు పొందిన తరువాత.. పర్యటనలకు సిద్ధం అవుతున్న జగన్‌ యావత్‌ తెలంగాణ మీద కూడా తన దృష్టి సారించడం మాత్రం తథ్యం. ఎన్నికల లోగా చీల్చేసి.. ఓట్లు సీట్ల రాజకీయ యావ ముందు మరే ప్రజాకాంక్షలూ నిలవలేని కాంగ్రెసు నిస్సిగ్గుగా నిరూపించుకుంటే తప్ప.. ఎన్నికల బరిలో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో ఎవరు చెప్పగలరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా పడే ఓటును పార్టీలు పంచుకుంటాయి గానీ.. జగన్‌కు పడే ప్రతి ఒక్క ఓటు.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నదే అవుతుంది.

తెలంగాణ ప్రాంతంలో జగన్‌.. 2014 ఎన్నికలు పూర్తయ్యే సరికి తానొక అనధికార ప్లెబిసైట్‌ ఫలితంలాగా ఆవిర్భవిస్తారనడంలో సందేహం లేదు.

దుర్భేద్యమైన రాతిదుర్గం తయారవుతోంది...
తెలంగాణప్రజల్లో వైఎస్‌ జగన్‌కు ఒక దుర్భేద్యమైన సానుకూలాంశం ఉంది. అది వైఎస్సార్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన పట్ల సామాన్యుల్లో ఉన్న ప్రేమ. ఇవాళ రోడ్ల మీద వైఎస్‌ విగ్రహాల్ని కాలబెట్టి ఉండవచ్చు. కానీ పూర్తిగా వైఎస్‌ ఆనవాళ్లను తుడిచేయాలనుకుంటే.. కొన్ని లక్షల మంది హృదయాలను తగలబెట్టాల్సి ఉంటుందని అల్లరి మూకలుగుర్తించాలి. ఆ వైఎస్‌ అభిమానం..  ప్రాంతీయ వైషమ్యామలకు, దురభిమానాలకు అతీతమైనది. ఇవాళ ప్రతికూల వాతావరణంలోనూ జగన్‌ను స్వాగతిస్తున్నది కూడా అదే!స్వానుభవాల్లోని చేదును విస్మరించి, అవకాశవాద ఆత్మవంచనతో వెర్రెత్తిపోయే నేత కాదు జగన్‌. మానుకోటలో పడిన రాళ్లు ఆయనకు గుర్తుంటాయి. ఇప్పుడు తమ పార్టీ గౌరవాధ్యక్షురాలి మీద పడిన కోడిగుడ్లు, చెప్పులు కూడా ఆయనకు గుర్తుంటాయి.
తత్వరీత్యా జగన్‌ ఎలాంటి వారంటే.. అప్పుడు పడిన రాళ్లతో ఓ దుర్గం నిర్మించుకుంటారు. దుర్భేద్యమైన ఆ రాతి దుర్గంలో జనాభిమానాన్ని ఆయన పదిలం చేసుకుంటారు.  ఇప్పుడు పడిన చెప్పుల స్థానే పూలను కూడా కురిపించుకునే రోజుకోసం ఆయన పరిశ్రమిస్తారు.

ఈ రాష్ట్రం చీలిపోబోతున్నదని మనం అనుకుంటున్నాం-
కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటుంది-
చీలిక ఇప్పటికే జరిగిపోయింది-
ఆ చీలిక, నిజానికి తెలంగాణలోని జనంలోనే ఉంది-
ఒక వర్గం- రాళ్లు, గుడ్లు పోగేసుకుని అల్లరిచేస్తోంది-
ఒక వర్గం- ఓటును పదిలంగా పట్టుకుని నిరీక్షిస్తోంది-
అంతిమవిజయం- నిజాయతీగల జనకాంక్షనే వరిస్తుంది!!


Source: greatandhra

Thursday, October 31, 2013

Court Relaxes Bail Conditions of Jagan Reddy

The Nampally court on Wednesday relaxed the bail conditions of YSR Congress Party chief YS Jagan Mohan Reddy enabling him to tour Andhra Pradesh and visit Delhi.
The court took this decision after hearing the arguments from the both sides. Jagan had filed a memo in a CBI special court seeking court permission to relax bail conditions, which prevent him leaving Hyderabad. 
In the petition, Jagan apprised the court that a precarious situation prevailing in the State direly needs his presence, since he leads a political party and also he is an MP. He must sail with the emotions of the people and also bound to know their problems while being part of their stir.
He also told the court that he ought to complete Odarpuyatra (condolence tour) to go and meet the bereaved families, who lost their bread-earners in a shock on the news of his father and late YSR's sudden demise.
He sought the court permission to tour AP and visit Delhi to deal with the issue of resignation, which was rejected by the Speaker on technical grounds.

Thursday, October 03, 2013

Telangana India's 29th State Cleared - Hyderabad Shared Capital


The cabinet cleared major steps for carving out a separate Telangana state from Andhra Pradesh. Hyderabad will be shared for 10 years as the capital of the old and new state. Two cabinet ministers, Pallam Raju and KS Rao, registered their strong dissent at today's meeting.

Over two months after the Congress Working Committee put its seal of approval, the Union Cabinet approved the proposal of the Home Ministry for creation of the 29th state and decided to set up a Group of Ministers (GoM) to work out modalities.

Wednesday, October 02, 2013

Chittoor MP SIVAPRASAD as old lady protesting State division


Who Brought Freedom, Gandhi or Netaji?

Recent research shows that Netaji Subhas Bose and the INA were responsible for the British leaving in 1947 in a hurry. The Fall of Singapore to the Japanese in 1942 rather than Mahatma Gandhi’s Quit India Movement was the beginning of the end of the British Empire. Dr. N.S. Rajaram finds out more.


There is a story that the late Mao Zedong, when asked his opinion about Napoleon as a leader replied: “How can I say? He is too recent.” Napoleon’s career ended in the Battle of Waterloo in 1815 and Mao died only in 1976. So what could Mao have meant when he said that Napoleon was too recent? He meant that a certain amount of time has to pass before we can view historical events and personalities objectively. Our reading of recent events is bound to be colored by our closeness to them. This truth was brought home to me a few years ago when I was visiting Penang in Malaysia as the guest of some veterans of World War II, but first some background.

In India, people are brought up on the story that Mahatma Gandhi and Jawaharlal Nehru—with others receive grudging notice if at all—led a heroic struggle freeing India from the British rule. Miraculously, the whole thing was accomplished without resort to violence, by the application of a mighty spiritual force called ahimsa (non-violence) unleashed by the Mahatma. If true it is a tribute not only to the power of Gandhi’s (and Nehru’s) spiritual vision, but also a lasting tribute to the spiritual sensitivity of the British rulers. Like the tiger in the children’s poem (govina kathein Kannada), which killed itself rather than eat the calf, the British gave up the empire and left.


This received a jolt during a recent trip to Southeast Asia where I had occasion to visit some people who had served with my late father during World War II. Their account of their experience in the period from 1942 to 45 casts serious doubt on this beautiful story. Here we are faced with a dilemma— the conflict between what we read in history books and what the people actually saw on the ground. The usual story is that after some initial reverses the British defeated the Japanese. But those who actually served there, now in their late 70s and 80s, remember it quite differently. Uniformly, this is what I heard everywhere and from everyone.
“When the Japanese attacked, the British ran away. They were very clever. They had a wonderful life with bungalows and butlers and cooks and all that, but as soon as the Japanese came, they ran away. And once they got back to India, they sent Gurkhas, Sikhs, Marathas and other Indians to fight the Japanese. They knew it was too dangerous for them. That is how we got independence in Malaya.” Malaysia was then called Malaya and Singapore was its capital.

Not one of them remembered the British fighting the Japanese— only running away. They remember also Indian soldiers coming and fighting; some of them stayed back in countries like Malaya (as it was then called), Singapore and other places. One man, who as a youngster had been my father’s orderly during the War, invited me to his home in Penang for the 60th anniversary of the liberation of Singapore. What he told me took my breath away.

“That is why the British left India also. When the war was over, all the Indian soldiers who had defeated the Japanese returned to India, and the British got scared. They didn’t want to fight the Indians who had just fought and defeated the Japanese. So they ran away from India also.” I tried to explain to him that Gandhiji’s nonviolence was the force that convinced the British to leave. But this man, not an intellectual but a battle-hardened soldier with sound commonsense would have none of it.          

“If it was non-violence, why didn’t they leave earlier? Gandhi and the nonviolence were there before the war also. Did they have to wait for the Japanese to come and teach them non-violence?” One may smile at this simple way of looking at history, but as will be seen later, this revisionist view has good support. The ‘authorized’ version with Gandhi and Nehru as central figures continues to be taught in India because it benefits those in power. It shows the British also in favorable light as a magnanimous and even spiritual people, which of course they don’t mind. But history shows a different picture.

The year 1942 was momentous. It was the year in which the British Empire suffered a massive defeat at the hands of an Asiatic people (Japanese); it was also the year in which Mahatma Gandhi launched his famous but ill-fated Quit India Movement. Subhas Bose also entered the picture at about that time, first in Germany and later in Southeast Asia. But first it is necessary to get an idea of the momentous impact of the Japanese victory on the psyche of the colonized people as well as on that of the colonizing powers. What triggered it was the Fall of Singapore.

The fall of Singapore in 1942 heralded the end of the British Empire and of European colonialism in general. Indian independence came in 1947, but what really ended the Empire was the fall of Singapore. This has received scant notice by Indian historians who remain trapped in Eurocentric thinking, but there is ample evidence supporting it. Among Indian historians, only R.C. Majumdar has seen its significance: the fall of Singapore broke the spirit of Imperial Britain. As we shall soon see British historians have themselves admitted it. Let us look at what really happened to the British in 1942.

When the Japanese attacked Singapore in February 1942, its large and well-equipped British garrison surrendered without a fight. These well-attended ‘pukka sahibs’—used to good living—had little stomach for war. For decades, the ruling authorities had avoided facing the truth that they were not a fighting force. They had deluded themselves with resounding slogans— calling Singapore the ‘Bastion of the Empire,’ ‘Impregnable Fortress,’ ‘Gibraltar of the East’ and such. None of it helped when Singapore fell to a Japanese army less than a third the size of the defending forces.
Yet, so far removed from reality were Singapore’s British residents, that even on the verge of surrender, a gunnery officer was refused permission to mount guns on the golf links for defending the city. He was told that he needed permission from the golf club committee. And the golf club committee would not be meeting for at least a week, so he better hold off!

In the fall of Singapore, its symbolic significance was infinitely greater than the military defeat. It destroyed the myth of European superiority over the Asiatics once and for all. Historian James Leasor wrote in his Singapore, the battle that changed the world:

“Dazed by the incredible superiority of the Japanese, the defenders’ will to win had withered. …The psychological damage was even greater than the military defeat— and this had been grotesque enough.  …Under the lowering Singapore sky lit by the funeral pyres of the British Empire … a door closed on centuries of white supremacy … ” Actually the Japanese had planned it that way— to break the sense of superiority exuded by the Europeans, by the British in particular, in their dealings with the Asiatics. 

Leasor wrote:
“At the start of the campaign, each Japanese soldier had been issued with a pamphlet that set out Japan’s reasons for fighting the British and the Americans. Her [Japan’s] claim was that she would liberate East Asia from white rule and oppression,” for since “We Japanese, as an Eastern people, have ourselves for long been classed alongside the Chinese and the Indians as an inferior race, and treated as such, we must at the very least, here in Asia, beat these Westerners to submission, that they may change their arrogant and ill-mannered attitude.”

The Japanese attack on Singapore accomplished much more: it ended the British Empire to be followed swiftly by the end of European imperialism itself. To return to the fall of Singapore, as with the fall of Hong Kong a few weeks earlier, the only worthwhile resistance had come from the Indian garrisons— the Sikh and the Gurkha regiments. The prestige and the mystique associated with the British Empire were shattered by these ignominious defeats.

And this is how my gracious host in Penang and his friends, men who had seen it at first hand, remember it. As they saw it, the massive defeat destroyed the British morale. It was the specter of the whole nightmare being reenacted in India, with nearly three million Indian soldiers just returned from war, which made the British leave India. “They ran away,” the old soldier kept telling me repeatedly.
I may point out that this is also the view of many Indians who saw action in the war— both in the Indian Army and those who fought in Subhas Bose’s INA. Indian soldiers saw that their British officers were frightened to death of the Japanese, while they themselves were prepared to fight them.

After the War, the British defeat in Singapore was followed by the French defeat in Dien Bien Phu at the hands of Ho Chi Min’s soldiers in Vietnam. This laid the groundwork for the American defeat in all of Vietnam and their inglorious flight from Saigon. No one today talks about the superiority of the ‘White Race’. The first nail in coffin was driven by the Japanese in Malaya in 1942. It was this changed perception, that the British were just ordinary mortals like the rest that allowed Netaji Subhas Bose to recruit Indians in Southeast Asia into the Indian National Army (Azad Hind Fauz or the INA). Subhas Bose saw that the Indian armed forces were the prop of the Empire— not just in India but everywhere the British went. But Gandhi and Nehru, preoccupied with their utopian dreams of nonviolence failed to realize its significance. When the opportunity arose, Bose seized it to transform the armed forces into a nationalist force, while Gandhi and Nehru started the Quit India Movement which collapsed in a few weeks.

Before we look further, we need to ask: what support do we have for this revisionist view, that Subhas Bose and the INA brought freedom to India? The evidence is ample and impeccable. Several have noted it, but the most distinguished historian to highlight Bose’s contribution was the late R.C. Majumdar, one of modern India’s greatest historians. In his monumental, three-volume History of the Freedom Movement in India (Firma KLM, Calcutta) Majumdar provided the following extraordinary evidence:

“It seldom falls to the lot of a historian to have his views, differing radically from those generally accepted without demur, confirmed by such an unimpeachable authority. As far back as 1948 I wrote in an article that the contribution made by Netaji Subas Chandra Bose towards the achievement of freedom in 1947 was no less, and perhaps, far more important than that of Mahatma Gandhi…”
The ‘unimpeachable authority’ he cited happened to be Clement Attlee, the Prime Minister of Britain at the time of India’s independence. Since this is of fundamental importance, and Majumdar’s conclusion so greatly at variance with the conventional history, it is worth placing it on record (Volume III, pages 609 –10).

When B.P. Chakravarti was acting as Governor of West Bengal, Lord Attlee visited India and stayed as his guest at the Raj Bhavan for three days. Chakravarti asked Attlee about the real grounds for granting independence to India. Specifically, his question was, when the Quit India movement lay in shambles years before 1947, where was the need for the British to leave in such a hurry. Attlee’s response is most illuminating and important for history. Here is Governor Chakrabarti’s account of what Attlee told him:
“In reply Attlee cited several reasons, the most important were the activities of Netaji Subhas Chandra Bose which weakened the very foundation of the attachment of the Indian land and naval forces to the British Government. Towards the end, I asked Lord Attlee about the extent to which the British decision to quit India was influenced by Gandhi’s activities. On hearing this question Attlee’s lips widened in a smile of disdain and he uttered, slowly, putting emphasis on each single letter— ‘mi-ni-mal.” (Emphasis added.)

Another point worth noting: after the fall of Singapore that ended the British Empire, the most dramatic national event was the INA Trial at the Red Fort— not any movement by Gandhi or Nehru. This led to the mutiny of the naval ratings, which, more than anything helped the British make up their minds to leave India in a hurry. They sensed that it was only a matter of time before the mutiny spread to other parts of the armed forces and the Government. None of this would have happened without Subhas Bose and the INA.

The crucial point to note is that thanks to Subhas Bose’s activities, the Indian Armed Forces began to see themselves as defenders of India rather than of the British Empire. This, more than anything else, was what led to India’s freedom. This is also the reason why the British Empire disappeared from the face of the earth within an astonishingly short space of twenty years. Indian soldiers, who were the main prop of the Empire, were no longer willing to fight to hold it together. This is the essence of leadership.
This brings us back to Mao’s half joking reply— that it takes time to get the proper historical perspective. It is now more than sixty years since India became free. We can afford to look back and see the real reasons for British leaving India in a hurry. To sum up, by the end of the War, Gandhi was a spent force, and Subhas Bose was India’s most popular leader.

Now, sixty years and more later it is time to recognize the truth: first, it was the Fall of Singapore in 1942, not the Quit India Movement that was the beginning of the end of the British Empire; and finally, it was Netaji Subhas Chandra Bose more than anyone else who was responsible for India’s freedom in 1947.

Courtesy : www.folks.co.in

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top