fvz

Saturday, December 21, 2013

DEVYANI KHOBRAGADE

వామ్మో! ఈమె ఘటికురాలే!
భారత్, అమెరికా మధ్య దౌత్య యుద్ధానికి కారకురాలైన దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాదె అమాయకురాలేం కాదు! ఘటికురాలేనట! ఆమెకు మొత్తం 11 ఆస్తులు వున్నట్టు తేలింది. మహారాష్ట్రలో వివాదాలకెక్కిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్‌ను పొందేందుకు ఈమెకి అసలు అర్హత లేదని ఈ స్కామ్‌పై దర్యాప్తు జరిపిన కమిటీ తేల్చింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. గవర్నమెంట్ కోటా కింద ఎవరైనా ఫ్లాట్ పొందదలుచుకుంటే ఇక మరెక్కడా తమకు ఇతర ఫ్లాట్‌లు లేవని ధ్రువీకరించాల్సి వుంటుంది. అయితే ‘ఆదర్శ్’తో బాటు ఓషివారా ప్రాంతంలో ప్రభుత్వ కోటా కింద ఆమె మరో అపార్ట్‌మెంట్ పొందిందని తెలిసింది. ఇంతేకాదు! దేవయానికి మరో 10 స్థిరాస్తులు కూడా వున్నాయని గుర్తించారు. 2012 డిసెంబర్ 31 నాటికి తన ఆస్తులకు సంబంధించి ఆమె సమర్పించిన అఫిడవిట్ వివరాలను హోంశాఖ వెబ్‌సైట్ తెలిపింది. (ఈ వివరాలు ఆ వెబ్‌సైట్ వద్ద వున్నాయి).

ఈ ఆస్తుల్లో ఏడింటి విలువ రూ.78 లక్షలని, ఆదర్శ్ సొసైటీలోని ఫ్లాట్ విలువ రూ.90 లక్షలని ఆ అఫిడవిట్‌లో ఆమె పేర్కొంది. మూడు ఆస్తుల విలువని ఇందులో వివరించలేదు. తన తండ్రి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తులద్వారా ఈ అపార్ట్‌మెంట్లని పొందినట్టు దేవయాని అందులో పేర్కొంది. 11 ఫ్లాట్‌లలో ఐదింటి ద్వారా తనకు సంవత్సరానికి వచ్చే ఆదాయం రూ.1.26 లక్షలేనని, మహారాష్ట్రలో 8 ఆస్తులుండగా, కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో రెండు, ఉత్తరప్రదేశ్ గౌతమ బుద్ధనగర్‌లో ఒక ఫ్లాట్ వున్నట్టు ఆమె తెలిపింది. అసలు మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తన అఫిడవిట్‌లో దేవయాని సంతకమే లేని విషయాన్ని కూడా గుర్తించారు. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో 25 ఎకరాలు, రత్నగిరి జిల్లాలో 8 ఎకరాల వ్యవసాయ భూమి కూడా దేవయాని సొంతమట! ఆదర్శ్ సొసైటీ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన కమిటీ రిపోర్ట్‌ను మహారాష్ట్ర మంత్రివర్గం పక్కన పెట్టేయడం విశేషం. అంటే.. అంతా సక్రమంగానే వుందని సీఎంతో సహా మంత్రివర్యులంతా అభిప్రాయపడినట్టే..! మహారాష్ట్రలో దేవయాని బాగోతం గురించి అమెరికాకు తెలిస్తే మరి ఇంకేమైనా వుందా!

The Arrest of  Devyani Khobragade in New York has triggered a big Diplomatic Row between India and United States.  She was taken into custody by law enforcement authorities in New York in the morning of December 12, 2013 while she was dropping her daughter at school. She was later released that same evening. In this article we try to find out more about Devyani Khobragade.

Devyani is a 1999 Batch  Indian Foreign Service Officer currently working as India’s Deputy  Consul General (Economic, Commercial and Women’s Affairs) in New York.
Devyani has worked in the political divisions of the Indian Missions in Pakistan, Italy and Germany.  She originally hails from Mumbai Maharashtra. She studied at St. Joseph’s convent school, Jalgaon, Maharashtra.
She did her MBBS from Seth G.S Medical College and K.E.M Hospital, Parel in Mumbai. She is proficient in English, Hindi, German, and her mother tongue, Marathi.  She was an 2012 Rolls Royce Scholar. She is 39 years old.
Her passions  include travelling, reading, yoga, music and dancing. Apart from proudly raising two beautiful girls, she also wishes to contribute towards Gender Equality in India.
Devyani’s father Uttam Khobragade is a retired IAS officer from Maharashtra. Reports say that her husband is a Professor of Philosophy in some college.


తండ్రి హృదయం తల్లడిల్లింది

అమెరికాలో అరెస్టయి, ఘోర అవమానానికి గురైన భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాదే తండ్రి ఉత్తమ్ ఖోబ్రగాదే హృదయం తల్లడిల్లిపోయింది. తన కూతురికి న్యాయం జరగకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.
తన కుమార్తె అరెస్టుకు కారకుడైన యుఎస్ అటార్నీ ప్రీత్ భరారా భారత న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన- దానిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని సుప్రీంకోర్టును కోరారు. ‘ నా కుమార్తె గౌరవాన్ని నేను పరిరక్షించలేకపోతే, ఈ ప్రపంచంలో జీవించడమే వృధా’ అని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన ఉత్తమ్ ఖోబ్రగాదే వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. నేను నిరవధిక దీక్ష చేయడం ఖాయం అన్నారు. అయితే తన కూతురిపై వచ్చిన అభియోగాలను ఎప్పటిలోగా ఉపసంహరించాలన్న అంశంపై గడువును చెప్పేందుకు నిరాకరించారు.
బాధితురాలి(సంగీత) నోరుమూయించేందుకు ఇండియాలో లీగల్ ప్రాసెస్ ప్రారంభమైనందువల్లే బాధితురాలిని, ఆమె భర్తను ఆ దేశం నుంచి రప్పించామన్న  ప్రీత్ భరారా కామెంట్స్‌పై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ఇది భారత జుడిషియరీని శంకిస్తున్నట్టే కదా అన్నారు. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. దేవయానిని వేధించే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని, ఆమె అరెస్టుకు కొన్ని రోజులముందు కావాలనే సంగీత కుటుంబాన్ని ఇండియా నుంచి విమానంలో యుఎస్‌కు తరలించారని ఆయన ఆరోపించారు.బుద్ధిమంతురాలేమీ కాదట!

ఇండియన్ ఫారిన్ సర్వీస్...భారతదేశ అత్యుత్తమ కేడర్‌లలో ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ చాతా ప్రధానమైనది. ఎంతో కఠోర దీక్షతో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పాసైతేనే అంతటి అత్యుత్తమ పోస్టును సంపాదించగలుగుతాము. అటువంటి దౌత్యవేత్త పోస్టులో వున్న ఈ అధికారి దేవయాని చాలా చీప్‌గా ప్రవర్తించి మన దేశ గౌరవాన్ని పరదేశంలో మంటగలపిందంటు మండిపడుతున్నారు సీనియర్ అధికారులు. ఈమెపై అమెరికా అధికారుల ప్రవర్తనా తీరును భారత్ ముక్తకంఠంతో ఖండించినప్పటికీ ఆమె చేసిన తప్పు మాత్రం క్షమార్హం కాదంటున్నారు నిపుణులు. ఎవరికి పడితే వాళ్లకి దొంగ వీసాలు ఇచ్చేసుకుంటే ఉగ్రవాదులు చొరబడి...అమాయకులైన పౌరులను బాంబులతో చంపేస్తున్నారని..అలాంటి ఘటనలు అమెరికాలో చోటుచేసుకున్నందునే వారు ఇలాంటి పకడ్బంధీ చట్టాన్ని రూపొందించారని..అలా చేయడం భారత్‌ నేతలకు చేతకాలేదని వారు దుయ్యబడుతున్నారు.

అందుకే సాక్షాత్తు పార్లమెంట్‌పై...రైల్వే స్టేషన్‌లపై ఉగ్రవాదులు దాడులు చేసి బహిరంగంగా చంపేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే..ఆమె వీసా విషయంలో చేసిన తప్పేమీ తెలియకుండా చేసింది కాదంటున్నారు. మహరాష్ట్రలో అధికారినిగా వున్నప్పుడు కూడా ఆమె నిబంధనలకు విరుద్ధంగా ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్‌లు పొందినట్టు వారు విమర్శిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా వాళ్లు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ తుది నివేదికను పేర్కొంటున్నారు. సదరు నివేదికలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌తో పాటు ఈ అధికారిని దేవయాని పేరును కూడా కమిషన్ పొందుపర్చింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆమె తన బంధువులకు ఇష్టం వచ్చినట్లు ఫ్లాట్లను కేటాయించిందని కమిషన్ కూడా ఆరోపించింది. అర్హత లేకపోయినప్పటికీ ఫ్లాట్స్ పొందినవారిలో అమెరికాలోని భారత దౌత్యవేత్త దేవయాని పేరు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బంధువుల పేర్లు ఉన్నాయని పిటిఐ వార్తా సంస్థ ఓ వార్తాకథనంలో తెలిపింది. అయితే...సదరు నివేదికను మహరాష్ట్ర కేబినెట్ తిరస్కరించింది. దీంతో..బీజేపీ మండిపడింది. దోషులకు శిక్ష పడేవరకు తాము న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టుకే కాదు సుప్రీంకోర్టుకూ వెళ్తామని స్పష్టం చేసింది.0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top