fvz

Monday, December 23, 2013

కాస్త లౌక్యం నేర్చుకో జగనూ..!

జగన్ ఎవరితో మంచిగా ఉంటారు...? 

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు.   ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్ తనతో మంచిగా ఉంటారని చెప్పిన నాయకుడెవరూ కనిపించలేదు. పార్టీపై పట్టు సాధించే క్రమంలో జగన్ పార్టీలో ముఖ్యనేతలెవర్నీ తనకు చేరువ కానివ్వడం లేదు. స్వంతంత్రంగా వ్యవహరించే అవకాశం ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఓ ముఖ్యమైన స్థానానికి చేరవలసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైన రెండవశ్రేణి నాయకత్వం ఏదీ కనిపించడం లేదు. 

ఫలానా నాయకుడితో మాట్లాడితే పార్టీకి సంబంధించిన విధి విధానాలపై అవగాహన వస్తుంది. వారి ద్వారా జగన్‌కు మన మనసులోని అభిప్రాయాలను చెప్పవచ్చు. ఏదైనా ముఖ్యమైన విషయంపై హామీ పొందవచ్చుననే భరోసా కార్యకర్తలకు కనిపించడం లేదు. పార్టీ విస్తరిస్తున్న క్రమంలో నాయకత్వానికి సంబంధించి ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి నాయకత్వం అవసరం. పార్టీ విధివిధానాలపై ప్రతినిధులకు తోడుగా సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయాలి. 

అందుకు పార్టీ అధినేత అవకాశామివ్వాలి. వైఎస్‌ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి చాలాకాలం పాటు జగన్‌కు సన్నిహితంగా మెలగుతూ పార్టీ వైఖరిని ఖరారు చేయడంలో సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, కరుణాకర రెడ్డి, సబ్బం హరి తదితరులు ఎందరో కీలకపాత్ర పోషించారు. పార్టీ భవిష్యత్ విధానాల గురించి మీడియాకు తెలియజేసేవారు. అలాంటి సబ్బం హరి తమ పార్టీ సభ్యుడు కాదని జగన్ ప్రకటించుకున్నారు. ఆ తరువాత సుబ్బారెడ్డిని పక్కన పెట్టారన్న వార్తలు వినవచ్చాయి. కొణతాల రామకృష్ణను కేవలం అనకాపల్లి లోక్ సభకు పరిమితం చేసారు. దాడి తండ్రీ కొడుకులను విశాఖకు మార్చారు. ఇలా ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేసారు.   జగనన్న వదిలిన బాణం ఎక్కడా ...?

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మహాప్రస్థానం నిర్వహించి జనంలో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను పెంచిన సోదరి షర్మిల ఒక్కసారిగా పార్టీ సమావేశాల్లో కనిపించకుండా పోయారు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీలో నాయకత్వలోటు ఉండకుండా విజయమ్మ, షర్మిల యాత్రలు జరిపి జనం మద్దతు సంపాదించారు. అలాంటి వారిని ఒక్కసారిగా పక్కకు తీసేయకూడదు. పైగా ప్రత్యర్థులు వేయికళ్లతో చూస్తున్నపుడు, వారికి అవకాశం ఇచ్చేలా ప్రవర్తించకూడదు.   

రాజశేఖర రెడ్డి వ్యవహారం ఇలా కాదు. ఆయన ఎక్కడిక్కడ కొంతమంది నమ్మకస్తులను ఏర్పాటు చేసుకునేవారు. వారి ద్వారా పనులు నడిపేవారు. వారికి కూడా స్వంత పనులు చేసుకునే అవకాశం ఇచ్చేవారు. రాజకీయాల్లో ఇది సహజం. ఇలా చేయకుంటే రాజకీయాలు నడపలేరు. జగన్ వ్యవహారం ఇలా కాదు. మీకేం కావాలి.. మీ వ్యవహారం మీరు చూసుకోండి..పార్టీ వ్యవహరాలు, పక్క నియోజకవర్గాలు సంగతి మీకు అనవసరం అన్న వైఖరి.  

నిజానికి చంద్రబాబు ది కూడా ఇదే వైఖరి.కానీ ఆయన ఇంత మొరటుగా, మోటుగా వ్యవహరించరు. లౌక్యంగా వుంటారు. అందరి నుంచి సమాచారం అందుకుని తెలివిగా తన నిర్ణయం తాను తీసుకుంటారు. ఏ ఒక్కరిని దూరం పెట్టరు.దగ్గరగా వున్నట్లే అనిపిస్తారు. కానీ నిర్ణయాలు అన్నీ తనమే. ఇది రాజకీయ లౌక్యం. జగన్ కు ఇదే కొరవడినట్ల కనిపిస్తోంది. గతంలో నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా వేసిన వారిలో కొందరి పనితీరు బాగాలేదన్న సాకుతో తప్పించి వారి స్థానంలో కొత్తవారిని వేశారు. దీంతో పార్టీ నేతల్లో అభద్రతా భావం పెంపొందే అవకాశం ఉంది. ఎప్పుడు ఎవర్ని ఎక్కడ ఉంచుతారో? తీసేస్తారో తెలియని పరిస్థితి ఉంటే పార్టీ నాయకులు కృతనిశ్చయంతో పనిచేసే అవకాశం ఉంటుందా?  


ఇలా అయితే ఎలా...? 

రాజకీయాలు నడపడం వేరు, వాటిని ఎంతవరకు వెల్లడించాలో, అంతవరకే వెల్లడించడం వేరు. ఇప్పుడు ఎన్జీవోల రాజకీయాలు కూడా ఇదే. అసులు ఇందులో జగన్ ఇప్పుడు వేలు పెట్టాల్సిన అవసరం ఏముంది? వేలు పెట్టినా బహిరంగంగా బయటపడాల్సినంత అగత్యం ఏముంది. అశోక్ బాబు కిరణ్ మనిషి అని ముద్రపడ్డారు. ఆ ముద్ర అలా వుండనిస్తే ఆయనే తగ్గిపోయి వుండేవారు. గడచిన పదిహేను రోజులుగా నిజానికి అశోక్ బాబు చాలా వరకు తగ్గిపోయారు. అలా వదిలేసి వుంటే బాగుండేది. ఇప్పుడు ఆయన కాస్తా హీరో అయిపోయారు. జగన్ వర్గంతోనే ఫైట్ చేస్తున్నంతగా వైకాపా ప్రత్యర్థులు బిల్డప్ ఇస్తున్నారు. 

ఈ ఎన్నికల్లో కాస్త తేడా జరిగిందంటే, జగన్ ఓడిపోయినంత ప్రచారం సాగుతుంది. ఈ సంగతి జగన్ గుర్తించలేదా లేక, గుర్తించి ధీమా పడుతున్నారా అన్నది అనుమానం. ఎన్జీవోల వంటి పెద్ద వర్గం రాజకీయాల్లో వేలు పెట్టడం వేరు, వేలు పెట్టినట్లు చాటు కోవడం వేరు. తెలంగాణ జేఎసిలో వున్నవాందరి మధ్య ఐక్యత, ఏక రూపత వుందని అనుకోవడం భ్రమ. కానీ ఓ తాటిపై వుండాల్సిన అవసరం కాబట్టి వున్నారు. అదేవిధంగా ఎన్జీవొల జెఎసి సభకు వెళ్లి వస్తే పోయిందేముంది? ఆదికి ముందే అశుభం పలకడం ఎందుకు? సమైక్యం ఎజెండా కాని వారికి అక్కడ స్థానం వుండాలో వద్దో అటు ఎన్జీవోలు లేదా ఆ పార్టీలు నిర్ణయించుకుంటాయి. మధ్యలో వైకాపా బద్నామ్ కావడం ఎందుకు?  

మీడియా మేనేజ్మెంట్...? 

మీడియాలో సింహభాగం జగన్ కు వ్యతిరేకం అన్న సంగతి చెప్పనక్కరలేదు. జగన్ తన స్వంత మీడియాను నమ్మకున్నారు. మరి కొంత మంది పార్టీ అనుకూలురు వున్నారు. కానీ వీరంతా నేరుగా పబ్లిసిటీ వ్యవహారాలు చూస్తున్నారు కానీ, పరోక్ష ప్రచారాన్ని సాగించడం లేదు.  నెట్ సర్వేలు, నెట్ వార్తల పట్ల కూడా జగన్ వర్గం నిమ్మకు నీరెత్తినట్లు వుంటోంది. టీవీ పోల్ సర్వేలు, నెట్ సర్వేలు వంటి వాటిలో తెలుగుదేశానిదే పైచేయిగా వుంటోంది. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు వున్నాయి. 

నెటిజన్లు అంతా తెలుగుదేశం అనుకూల వైఖరితో వున్నారని కొందరు. లేదు తెలుగుదేశం ఐటి వింగ్ ఇలాంటి వాటిని బాగా మేనేజ్ చేయగలదని మరికొందరు అంటున్నారు. ఏది నిజమైనా జగన్ పార్టీ ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఇండియా టుడే మామూలుగా సర్వే చేస్తే వచ్చిన ఫలితాలకు, ఆన్ లైన్ సర్వేకు శత సహస్రం తేడా వచ్చిందంటే ఏమని అనుకోవాలి? ఎక్కడో ఏదో జరుగుతోంది అనుకోవాలి.  ఇప్పటికైనా జగన్ తన వైఖరి కాస్త మార్చుకోవాలి. రాజకీయాలు చేయడం, రాజకీయాల్లో వుండడం అంటే ముఖానికి ఎప్పుడూ నవ్వు పులుముకోవాలి అన్న సత్యం తెలిస్తే చాలదు..ఆచరణలోకి కూడా రావాలి. ఆ విషయంలో జగన్ కన్నా బాబు, కిరణ్ లే బెటరన్న దాంట్లో అనుమానం లేదు.

Saturday, December 21, 2013

DEVYANI KHOBRAGADE

వామ్మో! ఈమె ఘటికురాలే!
భారత్, అమెరికా మధ్య దౌత్య యుద్ధానికి కారకురాలైన దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాదె అమాయకురాలేం కాదు! ఘటికురాలేనట! ఆమెకు మొత్తం 11 ఆస్తులు వున్నట్టు తేలింది. మహారాష్ట్రలో వివాదాలకెక్కిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్‌ను పొందేందుకు ఈమెకి అసలు అర్హత లేదని ఈ స్కామ్‌పై దర్యాప్తు జరిపిన కమిటీ తేల్చింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. గవర్నమెంట్ కోటా కింద ఎవరైనా ఫ్లాట్ పొందదలుచుకుంటే ఇక మరెక్కడా తమకు ఇతర ఫ్లాట్‌లు లేవని ధ్రువీకరించాల్సి వుంటుంది. అయితే ‘ఆదర్శ్’తో బాటు ఓషివారా ప్రాంతంలో ప్రభుత్వ కోటా కింద ఆమె మరో అపార్ట్‌మెంట్ పొందిందని తెలిసింది. ఇంతేకాదు! దేవయానికి మరో 10 స్థిరాస్తులు కూడా వున్నాయని గుర్తించారు. 2012 డిసెంబర్ 31 నాటికి తన ఆస్తులకు సంబంధించి ఆమె సమర్పించిన అఫిడవిట్ వివరాలను హోంశాఖ వెబ్‌సైట్ తెలిపింది. (ఈ వివరాలు ఆ వెబ్‌సైట్ వద్ద వున్నాయి).

ఈ ఆస్తుల్లో ఏడింటి విలువ రూ.78 లక్షలని, ఆదర్శ్ సొసైటీలోని ఫ్లాట్ విలువ రూ.90 లక్షలని ఆ అఫిడవిట్‌లో ఆమె పేర్కొంది. మూడు ఆస్తుల విలువని ఇందులో వివరించలేదు. తన తండ్రి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తులద్వారా ఈ అపార్ట్‌మెంట్లని పొందినట్టు దేవయాని అందులో పేర్కొంది. 11 ఫ్లాట్‌లలో ఐదింటి ద్వారా తనకు సంవత్సరానికి వచ్చే ఆదాయం రూ.1.26 లక్షలేనని, మహారాష్ట్రలో 8 ఆస్తులుండగా, కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో రెండు, ఉత్తరప్రదేశ్ గౌతమ బుద్ధనగర్‌లో ఒక ఫ్లాట్ వున్నట్టు ఆమె తెలిపింది. అసలు మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తన అఫిడవిట్‌లో దేవయాని సంతకమే లేని విషయాన్ని కూడా గుర్తించారు. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో 25 ఎకరాలు, రత్నగిరి జిల్లాలో 8 ఎకరాల వ్యవసాయ భూమి కూడా దేవయాని సొంతమట! ఆదర్శ్ సొసైటీ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన కమిటీ రిపోర్ట్‌ను మహారాష్ట్ర మంత్రివర్గం పక్కన పెట్టేయడం విశేషం. అంటే.. అంతా సక్రమంగానే వుందని సీఎంతో సహా మంత్రివర్యులంతా అభిప్రాయపడినట్టే..! మహారాష్ట్రలో దేవయాని బాగోతం గురించి అమెరికాకు తెలిస్తే మరి ఇంకేమైనా వుందా!

The Arrest of  Devyani Khobragade in New York has triggered a big Diplomatic Row between India and United States.  She was taken into custody by law enforcement authorities in New York in the morning of December 12, 2013 while she was dropping her daughter at school. She was later released that same evening. In this article we try to find out more about Devyani Khobragade.

Devyani is a 1999 Batch  Indian Foreign Service Officer currently working as India’s Deputy  Consul General (Economic, Commercial and Women’s Affairs) in New York.
Devyani has worked in the political divisions of the Indian Missions in Pakistan, Italy and Germany.  She originally hails from Mumbai Maharashtra. She studied at St. Joseph’s convent school, Jalgaon, Maharashtra.
She did her MBBS from Seth G.S Medical College and K.E.M Hospital, Parel in Mumbai. She is proficient in English, Hindi, German, and her mother tongue, Marathi.  She was an 2012 Rolls Royce Scholar. She is 39 years old.
Her passions  include travelling, reading, yoga, music and dancing. Apart from proudly raising two beautiful girls, she also wishes to contribute towards Gender Equality in India.
Devyani’s father Uttam Khobragade is a retired IAS officer from Maharashtra. Reports say that her husband is a Professor of Philosophy in some college.


తండ్రి హృదయం తల్లడిల్లింది

అమెరికాలో అరెస్టయి, ఘోర అవమానానికి గురైన భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగాదే తండ్రి ఉత్తమ్ ఖోబ్రగాదే హృదయం తల్లడిల్లిపోయింది. తన కూతురికి న్యాయం జరగకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.
తన కుమార్తె అరెస్టుకు కారకుడైన యుఎస్ అటార్నీ ప్రీత్ భరారా భారత న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన- దానిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని సుప్రీంకోర్టును కోరారు. ‘ నా కుమార్తె గౌరవాన్ని నేను పరిరక్షించలేకపోతే, ఈ ప్రపంచంలో జీవించడమే వృధా’ అని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన ఉత్తమ్ ఖోబ్రగాదే వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. నేను నిరవధిక దీక్ష చేయడం ఖాయం అన్నారు. అయితే తన కూతురిపై వచ్చిన అభియోగాలను ఎప్పటిలోగా ఉపసంహరించాలన్న అంశంపై గడువును చెప్పేందుకు నిరాకరించారు.
బాధితురాలి(సంగీత) నోరుమూయించేందుకు ఇండియాలో లీగల్ ప్రాసెస్ ప్రారంభమైనందువల్లే బాధితురాలిని, ఆమె భర్తను ఆ దేశం నుంచి రప్పించామన్న  ప్రీత్ భరారా కామెంట్స్‌పై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ఇది భారత జుడిషియరీని శంకిస్తున్నట్టే కదా అన్నారు. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. దేవయానిని వేధించే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని, ఆమె అరెస్టుకు కొన్ని రోజులముందు కావాలనే సంగీత కుటుంబాన్ని ఇండియా నుంచి విమానంలో యుఎస్‌కు తరలించారని ఆయన ఆరోపించారు.బుద్ధిమంతురాలేమీ కాదట!

ఇండియన్ ఫారిన్ సర్వీస్...భారతదేశ అత్యుత్తమ కేడర్‌లలో ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ చాతా ప్రధానమైనది. ఎంతో కఠోర దీక్షతో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పాసైతేనే అంతటి అత్యుత్తమ పోస్టును సంపాదించగలుగుతాము. అటువంటి దౌత్యవేత్త పోస్టులో వున్న ఈ అధికారి దేవయాని చాలా చీప్‌గా ప్రవర్తించి మన దేశ గౌరవాన్ని పరదేశంలో మంటగలపిందంటు మండిపడుతున్నారు సీనియర్ అధికారులు. ఈమెపై అమెరికా అధికారుల ప్రవర్తనా తీరును భారత్ ముక్తకంఠంతో ఖండించినప్పటికీ ఆమె చేసిన తప్పు మాత్రం క్షమార్హం కాదంటున్నారు నిపుణులు. ఎవరికి పడితే వాళ్లకి దొంగ వీసాలు ఇచ్చేసుకుంటే ఉగ్రవాదులు చొరబడి...అమాయకులైన పౌరులను బాంబులతో చంపేస్తున్నారని..అలాంటి ఘటనలు అమెరికాలో చోటుచేసుకున్నందునే వారు ఇలాంటి పకడ్బంధీ చట్టాన్ని రూపొందించారని..అలా చేయడం భారత్‌ నేతలకు చేతకాలేదని వారు దుయ్యబడుతున్నారు.

అందుకే సాక్షాత్తు పార్లమెంట్‌పై...రైల్వే స్టేషన్‌లపై ఉగ్రవాదులు దాడులు చేసి బహిరంగంగా చంపేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే..ఆమె వీసా విషయంలో చేసిన తప్పేమీ తెలియకుండా చేసింది కాదంటున్నారు. మహరాష్ట్రలో అధికారినిగా వున్నప్పుడు కూడా ఆమె నిబంధనలకు విరుద్ధంగా ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్‌లు పొందినట్టు వారు విమర్శిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా వాళ్లు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ తుది నివేదికను పేర్కొంటున్నారు. సదరు నివేదికలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌తో పాటు ఈ అధికారిని దేవయాని పేరును కూడా కమిషన్ పొందుపర్చింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆమె తన బంధువులకు ఇష్టం వచ్చినట్లు ఫ్లాట్లను కేటాయించిందని కమిషన్ కూడా ఆరోపించింది. అర్హత లేకపోయినప్పటికీ ఫ్లాట్స్ పొందినవారిలో అమెరికాలోని భారత దౌత్యవేత్త దేవయాని పేరు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బంధువుల పేర్లు ఉన్నాయని పిటిఐ వార్తా సంస్థ ఓ వార్తాకథనంలో తెలిపింది. అయితే...సదరు నివేదికను మహరాష్ట్ర కేబినెట్ తిరస్కరించింది. దీంతో..బీజేపీ మండిపడింది. దోషులకు శిక్ష పడేవరకు తాము న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టుకే కాదు సుప్రీంకోర్టుకూ వెళ్తామని స్పష్టం చేసింది.Sunday, December 08, 2013

Telugu actor Dharmavarapu Subramanyam dies of bone cancer at 53 : R.I.P...

Popular Telugu comedian Dharmavarapu Subramanyam, 53, passed away on Saturday night at his residence in Dilsukhnagar. He was suffering from bone cancer since some months.
After his first film Jayammu Nischayammura, he went on to act in over 800 films. He shot into fame with Anando Brahma, a popular TV serial on DD in the 1980s. He stayed away from Film Nagar as he did not want his sons to enter the field.
The film fraternity was shocked at the death.
Initially worked as a government employee, Dharmavarapu Subramanayam, was popular when he directed and acted in ‘Anando Brahma’, a very popular comedy serial on Doordarshan in 1980s. Later director Jandhyala spotted Dharmavarapu’s talent and introduced him in his film ‘Jayammu Nischayammura’ in 1989.
Born on September 20, 1960, in Komminenivani Palem, Prakasham district, Dharmavaram has his own unique style of dialogue delivery. Dharmavaram has won many accolades in his film career.
He won the prestigious awards like Raghupathi Venkaiah Award, BN Reddy and NTR National Award in his film career. His last film was ‘Shadow’ that was released in this year. He directed only one film ‘Thokaleni Pitta’ with Allari Naresh as the lead actor.
He joined in Congress in 2004 and also campaigned for the party. He also served as Chairman for the AP Cultural Association.
Generally many film personalities lives around Film Nagar area, where all the film studios, shootings will be held, but Dharmavaram lives near Dilsukhnagar too far to that place.
Many of his film friends asked him to come to Film Nagar area, but he refused. He says that he doesn’t like to his sons connected to film industry, that’s the reason he stays too far to the industry.
The film personalities shocked to hear the demise of Dharmavarapu. Director Puri Jagannath who is a close friend to Dharmavarapu says, that he can’t believe about it. “I had a great rapport with him.
Even recently he called me and told me that he will comeback and act in my film. He has a very good sense of humour. He always used to listen old songs. If he is not shooting he will spend the time with listening music. He almost acted in all my films,” says Puri Jagannath.

Saturday, December 07, 2013

RGV Sensational Twitter Comments On KCRతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై వర్మ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో కేసీఆర్ లాంటి నాయకులు లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవేమోవని పేర్కొన్నాడు. కేసీఆర్ తన మకాం అమెరికాకు మార్చి ఆ దేశ పౌరులకు విభజన భావనలు, ఆలోచనల గురించి చెప్పాలని సూచించాడు. ఇలాంటి నాయకులు అమెరికాను విభజించాలని వాదించగలరని అభిప్రాయపడ్డాడు. వర్మ ఇంకా ఏం ట్వీట్ చేశాడంటే...
  • అమెరికాలో ఏ రాష్ట్రం కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.
  • భారత్ లోని రాష్ట్రాలు ఎప్పుడూ సమైక్యంగా లేకపోవడం లేదా సమైక్యంగా ఉంచగల సామర్థ్యం భారతీయులకు లేకపోవడం విభజనకు కారణం కావచ్చు.
  • రాష్ట్రాలను ఎలా సమైక్యంగా ఉంచాలో మనం అమెరికాను చూసి నేర్చుకోవాలి.
  • అమెరికన్లు మద్యం, శృంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. వేర్పాటు రాజకీయాల గురించి ఆలోచించేంత తీరిక వారికి ఉండదు.
  • అమెరికాలో ఏ రాష్ట్రం కూడా విడిపోవాలని ఎందుకు అడగడం లేదు? అక్కడ కేసీఆర్ లాంటి సమర్థులైన నాయకులు లేకపోవడం వల్లేమో?
  • కెసీఆర్ ఒకవేళ అమెరికా పౌరుడిగా వాషింగ్టన్ లో జన్మించినట్టయితే.. ఆయన తన జీవితంలో ఏం సాధించావారో చూడాలనివుంది.
 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top