fvz

Monday, May 19, 2014

ఎందుకాయన రాలేకపోయాడు ?

1. రోజా గారు  గెలిచినా, ఈవిడ గారి ఐరన్ లెగ్ 'కాటేసిందా' ?
2. క్రిస్టియన్స్ ని, ముస్లిం లను చూసుకొని, 'హిందువుల'ను మరిచాడా?
3. సీమలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలను చూసుకొని, అత్యుసాహం లో ఉండిపోయాడా?
4. జగన్ తన ఊకదంపుడు ప్రసంగాలతో ప్రజలను విసిగించాడా?
5. ఓదార్పు యాత్రల పేరిట జగన్ ఊరూర తిరిగి తప్పు చేసాడా?
6. ప్రతీ విషయానికి ఉద్యమాలు, దీక్షలు చేసి, జనం లో చవకబారి పోయాడా?
7. తనమీద తనుకున్న అతి ఆత్మవిశ్వాసంతో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చిందా?
8. సాక్షి ఛానల్ ఉన్న ప్రతిష్టని, పరువుని దిగజార్చిందా?
9. బెయిల్ వచ్చాక జగన్ ప్రతిష్టలు మసకబారి పోయాయా?
10. పార్టీలో సీనియర్ కేడర్ ని, వారి సలహాలు, సుచనలనూ ఉపయోగించుకో లేక పోయాడా?
11. 'ఒన్ మాన్ షో' గా వ్యవహరించి చతికలపడ్డాడా?
12. ఒంటిచేత్తో గెలవాల్సిన పార్టీని తన అహంతో మట్టికరిపించాడా?
13. గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల మీద పట్టు సాధించాలేకపోయడా?
14. మునిసిపాలిటీల మీద ఈయనగారికి మోహం లేదా?
15. జగన్ != వై.ఎస్.ఆర్ ఆ?

* సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పును చూస్తే "వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ" పరిస్థితి "1- Nenokkadiney" సినిమాలా తయారయింది. భారీ అంచనాలతో ప్రజల ముందుకొచ్చి అమాంతంగా చతికలపడటం. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్న చందాగా మారింది.


* సీమాంధ్ర లో ప్రజలకి కావాల్సింది పధకాలు, ఆఫర్లు, స్కీములు మరియు రుణాలమాఫీ. ఈ విషయాన్ని జగన్ అంతగా గ్రహించలేక పోయాడు. ప్రతీ విషయంపై అవసరం లేని నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేసి తన మీద జనాల్లో ఉన్న అభిమానాన్ని 'జగన్ అంటే ఇంతేనా అనేలా చేసుకున్నాడు'.

* "ప్రతీ సోదరడుకి, ప్రతీ అక్కకు, ప్రతీ తాతకు, ప్రతీ అవ్వకు" అంటూ పసలేని తన ఊకదంపుడు  ప్రసంగాలతో వెళ్ళిన ప్రతీ ఉళ్ళలో విసిగించి పారేసాడు. ఎన్నికలలో ప్రచారాలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఇతనిని ఒంటరిని చేయడం మీద కానీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీడాల్సి వచ్హిందని కానీ, ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులుగురించి కానీ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

వినడు.. కనడు... ఆతడే జగన్!!విజయం మాత్రమే కాదు ఓటమి కూడా ఒక్కోసారి స్వయం కృతమే. అతి ధీమా, లెక్కలేనితనం, అనుభవరాహిత్యం, మనను మించిన మొనగాడెవ్వడు అని అనుకోవడం లాంటి లక్షణాలు అవలీలగా అపజయాన్ని తీసుకొచ్చి నెత్తిన పెడతాయి. ఎదిగిన కొద్దీ ఒదగడం కాదు, ఎదగడానికి కూడా ఒదిగే వుండాలి..ఈ వైనం తెలియని వాడు వైఎస్ జగన్మోహన రెడ్డి. 

ఉడుకురక్తం, ఉరకలేసే వయసు, తనది అనుకున్నది తనకు అందకుండా పోయిందన్న ఉక్రోషం వెరసి అతగాడిని కష్టాల పాలు చేసాయి. వ్యాపార సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసాయి. జైలు గోడల మధ్య జీవితం గడిపేలా ప్రేరేపించాయి. ఒళ్లు హూనం అయ్యేలా జనం మధ్య తిరిగినా, ఆఖరికి మిగిలింది అపజయమే. అధికార పీఠం అల్లంత దూరంలో అందనంత తీరంలో మిగిలిపోయింది. అనుభవానికి, అత్యుత్సాహానికి నడుమ జరిగిన పోరులో, ఆఖరికి అంపశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది.  

అధికారం అనేది అనూచానంగా వచ్చేది మాత్రమే కాదు, దాన్ని సాధించాలన్నా, నిలబెట్టుకోవాలన్నా, చాలా చాకచక్యం కావాలన్న గుణపాఠాన్ని జగన్ కు నేర్పాయి ఈ ఎన్నికలు. వ్యాపారాలను విజయవంతంగా నడిపినవాడికి యాజమాన్య సూత్రాలు వంటపట్టే వుండాలి. కానీ రాజకీయాలకు అవి అక్కర్లేదని పక్కన పేట్టేసినట్లున్నాడు జగన్. అందుకే టీమ్ లీడర్ షిప్ అన్న అసలుసిసలైన విజయసూత్రాన్ని పక్కనపెట్టి, అన్నీ తానే..అంతా తానే..అనే సింగిల్ పాయింట్ ఫార్ములాను నమ్ముకుని, చివరకు ఇలా మిగిలాడు. విజయం ఒంటరిగా సాధించలేనంత అపురూపమైనది కాదు. కానీ విజయం తప్పని సరి అయినపుడు, తలపెట్టిన పని మందితో కూడిన వ్యవహారమైనపుడు కచ్చితంగా నలుగురి సాయం అవసరం. కొన్ని వ్యవహారాలు అనుభవంపైన కానీ తెలిసిరావు. కొందరు అభిమానంతో కానీ దగ్గరకారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విషయాలు తెలిసినవాడు. ముఖ్యమంత్రి కావడానికి దశాబ్ధాల కాలానికి ముందే ఆయనకు రాష్ట్రం నలుమూలలా అభిమానించే స్నేహితులు వుండేవారు. వారికి ఆయన సాయాలు అందేవి. ఆ సహాయాలు ఎవరికీ తెలిసేవి కాదు..అందుకున్న వారికీ, చేసిన ఈయనకూ తప్ప. అప్పటికి వైఎస్ కు ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యం ఇంకా చాలా దూరంగానే వుంది. కేవలం ఒకరిద్దరికి సాయం చేసినంత మాత్రాన అది దగ్గరైపోదు. కానీ అది ఆయన వే ఆఫ్ లైఫ్. సాయం ఆయన నైజం. స్నేహం ఆయన స్వభావం. అందుకే కావచ్చు..కెవిపి ఆత్మగా మారాడు.  

జగన్ తొలి పరాజయం, కెవిపి దగ్గర లేకపోవడంతోనే ప్రారంభమైంది. మూడేళ్ల క్రితం అనుకుంటాను..ఓ వ్యాసానికి నేను పెట్టిన శీర్షిక, జగన్ కు సలహా దారులు కావలెను. అప్పటికే తప్పటడుగులు వేస్తున్న జగన్ వ్యవహారం చూసి రాసిన వ్యాసం అది. వైఎస్ అవినీతిలో కెవిపి పాత్ర సంగతి ఎలా వున్నా, సాధించిన విజయాల వెనక ఆయన మంత్రాంగం చాలా వుంది. ఈ సంగతి వైఎస్ ఇంటి బయట వున్నవారికి, రాష్ట్ర రాజకీయాలు పరిశీలించేవారికి అర్థమైనపుడు, ఆ ఇంట్లొ వుండే జగన్ కు ఎందుకు తెలియకుండా వుంటుంది? తెలిసీ ఎందుకు దూరం చేసుకున్నట్లు? లేదా ఆయన దూరమైనట్లా? అంటే ఇద్దరి నడుమ పొసగలేదన్నది స్పష్టం. ఈయన దారికి ఆయన రాకపోవడమో, ఆయన దారిలోకి ఈయన వెళ్లకపోవడమో.  


నటుడు రాజశేఖర్ ను ఓ సారి కలిసినపుడు, వైకాపాతో ఎందుకు పొసగలేదు అని అడిగాను. 'నేను మేకప్ తో రాకూడదు..జీన్స్ వేసుకోకూడదు..గాగుల్స్ పెట్టుకోకూడదు..ఇలాచాలా కండిషన్లు..అందుకే' అని చెప్పుకొచ్చారాయన. అంటే జగన్ ముందు రాజశేఖర్ స్పెషల్ గా కనిపించకూడదన్న థాట్ అందులో వ్యక్తమయింది. ఇలా జగన్ దూరం చేసుకున్న వారి జాబితా చిన్నదేమీ కాదు. అంటె వీరివల్ల ఒదిగేదేముంది అని ఎవరైనా అనొచ్చు. లాభం లేకున్నా, బయటకు వెళ్లి ఇలాంటి వాళ్ల మాటల వల్ల జరిగే జగన్ వ్యక్తిత్వ హననం ఇంతా అంతా కాదు. అది అలా అలా చాపకింద నీరులా చేరుతూనే వుంటుంది. ఒక్క కెవిపి సంగతి అలా వుంచితే, రాజశేఖర్ రెడ్డి అంటే ప్రాణం ఇచ్చేంత నాయకులు చాలా మంది జగన్ పక్షాన ఎందుకు చేరలేదు. కాంగ్రెస్ నుంచి ఎవరూ రాకపోవడం అంటూ లేదుగా..చాలా మంది వచ్చారు. అలాగే 'దేశం'నుంచి. మరి ఉండవల్లి, శతృచర్ల, బాలరాజు, ఇలా చాలా మంది అభిమానులు ఎందుకు రాలేదు. వారిని ఎందుకు జగన్ చేరదీయలేదు? వారి సంగతి జనానికి తెలుసు. మరి జగన్ సంగతి వారికి తెలియడం వలనా?  


ఇందంతా ఎందుకు చెప్పడం అంటే, వరదలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కనిపించినా పట్టుకోవాల్సిందే.పనికి వస్తుందా,. రాదా అన్నది తరువాతి సంగతి.ఎన్నికలు అన్నాక రోడ్డెక్కి కనిపించి ప్రతి ఇంటా దూరి, ప్రతీ చోటా తిని, ప్రథి బుగ్గా నిమిరే యోచన వున్నవాడు, అవసరమైన వారిని కూడా చేరదీసి,ఓర్పుగా పని చేయించుకోవడం రాకపోతే ఎలా?  


ఆదిలోనే హంసపాదు !!

తోడుతూ తెలుగుదేశం నుంచి పార్టీలోకి తీసుకు వచ్చారు దాడి వీరభద్రరావును. దాంతో అక్కడ ఆగర్భ శతృవైన కొణతాల అలిగారు. దాంతో మళ్లీ అలాంటి ప్రయోగిం చేయలేదు జగన్. మరి బాబు పోయి పోయి, పరిటాల కుటుంబంతో భయంకరమైన వైరం వన్న జెసి వర్గాన్ని కూడా లోపలకు తెచ్చి ఎలా మేనేజ్ చేయగలిగారు. అయ్యన్నకు పడని గంటా వర్గాన్ని తీసుకువచ్చి, ఎలా నచ్చ చెప్పగలిగారు. ఆదికి ముందే జగన్ పదే పదే సర్వేల పేరిట తను నమ్మిన వారిని ఊళ్లపైకి తరిమారు. వాళ్లు టికెట్ మీకే అంటూ బోగస్ సర్వేలు చేసి, అక్కడ డబ్బులు తిని, జగన్ ను పక్కదారి పట్టించారు. దాంతో ఆయనకు తన మనుషులపైనే నమ్మకం పోయింది. సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా ఒకరేమిటి అందరూ జగన్ చేత కాస్త దూరం పెట్టబడ్డవారే. ఈ వ్యవహారం ఇలా సాగి సాగి, ఆఖరికి ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి జగన్ పక్కన అమ్మ, చెల్లి తప్ప మరెవరు కనిపించలేదు. కాదూ అంటే రిటైర్మెంట్ క్యాండిడేట్లు మైసూరా, లక్ష్మీపార్వతి వగైరాలు.  

ముంచిన నమ్మకం !!

జనం ఓట్లు వేయడానికి సిద్దంగా వున్నారు. వైఎస్ తనయుడిగా తనను ఆదరిస్తారు. ఎటొచ్చీ తాను చేయాల్సింది వారికి తగిన అభ్యర్థులను అక్కడ వుంచడమే ఇదీ జగన్ భావనగా కనిపించింది. అందుకు ఆయన తనను నమ్ముకున్న వారిని మందుగానే సిద్ధం చేసుకున్నారు. కానీ ప్రతి జిల్లాలోనూ రెండు మూడు కులాలు వుంటాయని, వాటికి నాయకులు వుంటారని వారిని కూడా చేరదీయాలనీ అనుకోలేదు. ఎన్నికల వేళ అన్ని వర్గాలకు టికెట్ లు ఇస్తే సరిపోతుందనుకున్నారు. ఉదాహరణకు వైకాపాకు హ్యాండిచ్చిన విజయనగరం జిల్లానే చూడండి..బొబ్బిలి వెలమలను మాత్రం నమ్ముకున్నాడు. వాళ్లు అక్కడ వైకాపా లీడర్లు అనే సరికి కాపులు హ్యాండిచ్చారు. అలాగే విశాఖ జిల్లాలో గవర్లు (దాడి, కొణతాల) లీడర్లు అనేసరికి అక్కడ కాపులు హ్యాండిచ్చారు.  పశ్చిమగోదావరి జిల్లాలో క్షత్రియులు ఏకతాటిపై తన అపజయానికి కృషి చేస్తున్నారని తెలిసినపుడు, ఎందుకు? ఏమిటి? ఎలా పరిష్కరించాలి అన్నది ఆలోచించాలి కదా? ఇలాంటి తప్పిదాలు జగన్ దగ్గర సవాలక్ష. వాటి ఫలితమే ఈ పరాజయం. ఎంతసేపూ జనం ఓట్లు వేయడానికి సిద్ధంగా వున్నారు. నన్ను చూసి వేస్తారు అనుకోవడమే కానీ, పోలింగ్ మేనేజ్ మెంట్ అనేది ఒకటి వుంటుందని గమనిస్తేగా?  

సలహాలకు దూరం !!

జగన్ కు సలహా చెప్పడం అంటేనే వైకాపాలో జరగని పని. ఇది అంతర్గత వర్గాలు చెప్పే సంగతి. ఆయన సలహాలు వినరు. కనీసం విన్నట్లు నటించరు. పోనీ తన తరపున సమస్యల పరిష్కారానికి ఎవరినీ పురమాయించరు. ఆఖరికి స్వంత సోదరినే రెండు పవర్ సెంటర్లు వద్దని చెప్పి, పక్కన వుంచారు. ఇలా అయితే ఎలా? మోడీ సైతం తన బలం తాను గుర్తించి, సల్మాన్, పవన్, రజనీ లాంటి వాళ్లను జట్టులోకి తెచ్చుకున్నారు. జగన్ మోడీ కన్నా ఎక్కువేమీ కాదు కదా? మరి జగన్ పార్టీకి బలం ఎక్కడ నుంచి వస్తుంది. ప్రత్యర్థిని చంపడానికి ఒక్క బులెట్ చాలు. మరి రివాల్వర్ లో ఆరు బులెట్ లకు స్థానం ఎందుకు? ఒకటి మిస్ ఫైర్ అయితే మరొకటి. మరి జగన్ తన పార్టీ సాధన సంపత్తిని ఆ విధంగా ఎందుకు పెంచుకోలేకపోయారు.  

ప్రచారాలకు పగ్గాలేవీ? 

రుణమాఫీ పథకం..జనాలకు పడుతుంది అని తెలుసు కదా. వైఎస్ ఫ్రీ కరెంట్ అన్నపుడు బాబు ఎద్దేవా చేస్తే ఏం జరిగిందో తెలుసుకదా..మరి జగన్ ఎందుకు రుణమాఫీని ఎద్దేవా చేయాలి? అది సాధ్యం కాదు అని చెప్పాలి. విజయమ్మ గెలిస్తే విశాఖ కాస్తా కడప అయిపోతుందన్న ప్రచారం సాగిస్తే, దాన్ని ఎందుకు ఖండించలేకపోయారు. అనుభవం వుంటేనే అభివృద్ధి సాధ్యం అన్నపుడు ఎందుకు కాదని రుజువు చేయలేకపోయారు. ఎంత సేపూ సాక్షి..సాక్షి..సాక్షి..అందులో  రాసుకుంటే చాలు..టీవీలో చెప్పుకుంటే చాలు. అంతే కానీ జనాల్లోకి బలంగా బదులుచెప్పగల నాయకులేరీ. తిరుపతి కొండపైకి చెప్పులతో వెళ్లారని అంటే నిజమో కాదో, తప్పయితే క్షమించమనడమో ఏదో ఒకటి చేయాలి కదా.. దొంగ నోట్లు పంచారు.కల్తీ లిక్కర్ పంచారు..ఇదీ ప్రచారమే..కానీ ఖండన ఏదీ..పైసా పైసా కలిస్తే, పది పైసలు..పదీ పదీ కలిస్తే, వంద..కానీ ఏదీ పట్టని తనమైతే ఎలా? నన్ను చూసి ఓట్లేస్తారు..నేను చేయగలిగింది తిరగడం ఒక్కటే అనుకుంటే ఫలితం ఇలాగే వుంటుంది. అసలు పార్టీ కార్యాలయం, దానికో స్వరూపం, అక్కడి నుంచి ప్రకటనలు, ఖండనలు, ఇలాంటివి ఏమేరకు ఆర్గనైజ్ చేసారని. జగన్ దగ్గర ఎవరు? ఏ మేరకు అన్నిది  వారికే తెలియదు. పనులు పురమాయించేవారేరీ..చేసేవారేరీ? 

మోడీ ప్రచారం !!

మోడీ ప్రచారం,పవన్ కళ్యాణ్ ప్రచారం తన విజయానికి అడ్డం పడతాయని జగన్ కు తెలియదా?  ఆ నష్ట నివారణకు చేసిందేమిటి? ప్రత్యేకంగా ఏమీ లేదు.మళ్లీ మామూలే,.,.ఊళ్లు పట్టుకు తిరగడమే. తెలియని వాడు మెట్లు ఎక్కి ఆయసపడతాడు.తెలిసన వాడు లిఫ్ట్ వాడుకుని సుఖపడతాడు. ఈ ఎన్నికల్లో జగన్, చంద్రబాబు చేసింది ఇదే. జగన్ కు తెలియదు..చెబితే వినరు..అసలు చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వరు. ఇచ్చి వుంటే, ఈ పరిస్థితి వచ్చి వుండేదే కాదేమో? పైగా మోడీ పట్ల ఓ సిద్దాంతం అన్నది వైకాపాకు లేనట్లే. జగన్ జైలులో వున్నపుడే భాజపా నుంచి రాయబారం వచ్చిందని వినికిడి. కాదన్నారు. ఓకె,. పోనీ నికార్సుగా మోడీకి వ్యతిరేకంగా వెళ్లారా..ఆ మాటలోనూ స్పష్టత లేదు. పొనీ యుపిఎ వైపు వెళ్లమని చెప్పగలిగారా అదీ లేదు. అంటే మీకు ముందు జాతీయ రాజకీయాలు ఎలా వుంటాయో, ఏ మలుపు తిరుగుతాయో అన్నదానిపై స్పష్టమైన అవగాహన లేదు. మరి అలాంటపుడు ప్రజలను ఎలా నమ్మించగలుగుతారు.  

పార్టీ నిలబడేనా? 

జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు వెంట వున్నవారిలో, నేటికి మిగిలిన వారు ఎందరు? ఇప్పుడు ఈ అరవై, డెభ్భై మందిని జగన్ కాసుకోగలరా? మోడీకి జగన్ బలం అక్కరలేదు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల నాటికి జగన్ అనే శక్తి వుండకూడదు. మరి ఈ రెండింటి నడుమ వ్యవహారాలను తట్టకుని జగన్ నిలదొక్కుకోగలడా? అలా వుండాలంటే మళ్లీ జగన్ కు మంచి సలహా దారుడు కావాలి. కెవిపి లాంటి తెలివైనవాడు..వైఎస్ లాంటి స్నేహశీలి..సుజనా చౌదరి లాంటి వ్యవహారకర్త..దొరికేనా?

Sunday, May 18, 2014

జగన్ చేసిన ఐదు తప్పులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణాలని విశ్లేషించే పని మొదలైపోయింది. ఎక్కడ సభలు పెడితే అక్కడ తండోపతండాలుగా రాలిపడ్డ జనాన్ని చూసి...అవన్నీ ఓట్లనo భ్రమల్లో మితిమీరిన ఉత్సాహాన్ని పెంచుకోవడం, దాంతో పాటు క్షేత్రస్థాయి ప్రజల మనోగతాల్ని అంచనాలు వేసుకోలేకపోవడం జగన్ చేసిన మొదటి తప్పు. పైగా సర్వేల పేరుతో ఆయనకు వచ్చి పడ్డ నివేదికలన్నీ తప్పుల తడకలేనంటూ పార్టీ సీనియర్ నాయకులు ఒకరు అసహనాన్ని వ్యక్తం చేశారు. సరైన శాంపిల్ సైజ్ తీసుకోకుండా నిర్వహించే సర్వేల ఫలితాలు కచ్చితంగా తప్పుడు అంచనాలకే దారితీస్తాయన్న నిజాన్ని జగన్ పట్టించుకోకపోవడం ప్రధాన కారణం. ఈ విషయంలో జరిగిపోయిన తప్పిదాన్ని ఇప్పటికీ పార్టీ అధినేత గుర్తించడం లేదన్నది ఆయన వాదన. 

ఇక రెండో కారణం... మొదటినుంచి (జైల్లో వున్నప్పుడు) కూడా జగన్ అభ్యర్ధుల ఎంపికలో చూపించిన అత్యుత్సాహం పార్టీ యంత్రాంగాన్ని పటిష్ట పర్చుకోలేకపోవడం, నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించుకోవడంతో పాటు వారి పని తీరుతెన్నులను బేరీజు వేసుకోవడానికి, విశ్లేషించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోవడం. 

ఇక మూడో కారణం...ఒకరిద్దరు జర్నలిస్టుల మీద అతిగా ఆధారపడి వాళ్లు చెప్పే మాటల్ని మాత్రమే తనకనుగుణంగా మల్చుకుని వ్యూహ రచనలో తప్పటడుగులు వేయడం. గతంలో ఈ వ్యవహారాల్ని కొంతమంది సీనియర్ నేతలు ఆయన దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆయననుంచి పెద్దగా స్పందన రాలేదు. దాంతో వారంతా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. కొంతమంది జగన్ స్నేహితులు కూడా నిస్సహాయులుగానే మిగిలిపోయారు. 

నాలుగో కారణం... పార్టీ అభ్యర్థులుగా ఎంపికైన వారినుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి అంతటితో సరిపెట్టేసి ఎన్నికలప్పుడు వుండే ఖర్చు విషయంలో సహాయం చేయలేకపోవడం. 

ఇక చివరిది...ఐదోది  జగన్ యాటిట్యూడ్ సమస్య. ‘టూకీగా చెప్పాలంటే అతని వ్యవహారశైలి!’. ఎవర్నీ నమ్మకపోవడం, పార్టీ కీలక యంత్రాంగాన్ని రూపొందించుకోవడం గానీ, వారికి బాధ్యతల్ని అప్పజెప్పడం గానీ, కనీసం వారితో తరచూ సమావేశాలు నిర్వహించి అభిప్రాయాల్ని తెలుసుకోవడంలో గానీ లోపాల్ని సవరించుకోవడంలో గానీ సరైన ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. అతని వ్యవహారశైలితో విసిగి వేసారిన కొంతమంది నేతలు బయటికొచ్చేస్తే మరికొంతమంది మాత్రం తమతమ అవసరాల కోసం మిన్నకుండిపోయారు. ఇవి జగన్ పార్టీ ఘోరపరాజయానికి ప్రధాన కారణాలు. 


Monday, May 12, 2014

Observe Counting Day With Sharmila In Los Angeles


Meet this defiant young woman on May 15 and observe counting day with her. 
The Venue:
On 15th May from 7.00 pm onwards 
Sheraton Cerritos Hotel, 12725 
Center Court Drive, Cerritos, CA 90703 

For additional information about YS Sharmila’s Los Angeles program, 
pleasecontact - ysrcpoverseas@gmail.com


Friday, May 02, 2014

ఈమె రెండో భార్య...ఆల్రెడీ 14యేళ్ల కొడుకున్నాడట..!


 కోలా కృష్ణమోహన్. తాజాగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. రావడం...రావడంతోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొడుకు నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. లోకేష్‌కు ఇదివరకే గుట్టుచప్పుడు కాకుండా పెళ్లయిపోయిందని, అతనికిప్పుడు 14యేళ్ల సంతోష్ అనే కొడుకున్నట్టు చెబుతున్నాడు. ‘గతంలో లోకేష్ ఒక అమ్మాయితో వెళ్లిపోయారు. బెంగళూరులో కొంతకాలం సంసారం కూడా చేశారు. 
1999లో వారిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఆ బిడ్డకు 14 ఏళ్ల వయసుంటుంది. ఈ విషయాలను రెండేళ్ల కిందట కూడా చెప్పాను. అప్పుడు చంద్రబాబు కుటుంబసభ్యులతో పాటు పార్టీకి చెందిన నేతలు ఎవరు కూడా ఖండించ లేదు’ అంటూ ఆయన గుర్తుచేస్తున్నాడు. ‘ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి వున్నాను. మరో రెండురోజుల్లో ఆ అమ్మాయిని మీడియా ముందుకు తీసుకువస్తాను. భద్రతా కారణాల రీత్యా ఆమె పేరును, ఇతర వివరాలను గోప్యంగా ఉంచుతున్నాను. ఆ అమ్మాయిని, లోకేశ్ కుమారుడు సంతోష్‌ను మీడియా ముందుకు తెచ్చిన తరువాత డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని దూరం చేయడానికే లోకేశ్‌ను అప్పట్లో అమెరికాకు చదువుల కోసం పంపారన్నారు. ఇదేమీ రహస్యం కాదని లోకేశ్ వ్యవహారం అందరికీ తెలిసిందేనని, ఒక పోలీసు అధికారికి కూడా ఇందులో ప్రమేయం ఉందని యూరో కోలా చెప్పుకొచ్చాడు. 

Thursday, May 01, 2014

Digvijay Singh Second Marriage Affair With Tv Anchor Amrita Rai

దిగ్విజయ్ సింగ్ అంటే అంత త్వరగా గుర్తుపట్టడం కష్టం ఏమో కాని డిగ్గీ రాజా అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీగా ఉండి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని ఫాస్ట్ ఫార్వర్డ్ మోడులో పరుగెత్తించి కొత్త రాష్ట్రాన్ని దగ్గరుండి మరీ ఏర్పాటు చేయించిన డిగ్గీ సారు ఇప్పుడు పర్సనల్ లైఫులో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఆల్రెడీ మనుమరాళ్ళు ఉన్న ఈ పెద్దమనిషి ఇప్పుడు ఓ టీవీ యాంకరమ్మతో రెండో పెళ్లికి సిద్దమైపోయాడు. 68 ఏళ్ల లేటు వయసులో ఈయన గారి రొమాన్స్ ముచ్చట్లు ఇప్పుడు హాట్ టాపికుగా మారాయి. డిగ్గీ రాజా గారు అమృతా రాయ్ అనే రాజ్యసభ టీవీ యాంకరమ్మతో గత కొంత కాలంగా క్లోజుగా ఉండడమే కాకునా అక్రమ సంబంధం కూడా నడుపుతున్నారు. ఈ విషయం మీద రాజకీయ పార్టీలు కూడా దిగ్విజయ్‌ని విమర్శిస్తున్నాయి. అయితే ఈ మధ్య వీరు బెడ్ రూంలో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు తీయించుకున్న ఫొటోలు ఇంటర్‌ నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇక ఏముంది ఈ విషయం మీద తీవ్ర దుమారం రేగింది.
నిండా మునిగాక చలేంటి అనుకున్నాడో లేక అది ఎన్నాళ్ళు దాచినా దాగదు అనుకున్నాడో కాని డిగ్గీ తన వ్యక్తిగత విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టాడు. తనకు, అమృతాకి సంబంధం ఉన్న మాట నిజమే అని ఆమెని త్వరలో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అమృతా తన భర్తతో విడాకులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకుందని కోర్టు నుండి ఆ విడాకులు రాగానే పెళ్లి ఉంటుందని ట్విట్ చేశాడు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరుగా చెలామణి అవుతూ, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా సేవలందించిన 68 సంవత్సరాల దిగ్విజయ్ సింగ్ ఇలా చేయడం అందరినీ షాక్కు గురి చేసింది. దిగ్విజయ్ సింఘుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉండగా ఆయన భార్య ఆశా సింగ్ గత ఏడాది అనారోగ్యంతో కన్ను మూసారు. లేటు వయసులో ఘాటు పెళ్లి... నువ్వు మాములోడివి కాదు డిగ్గీ...
 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top