Srikakulam

constituency: Narsannapeta
Age: 64
Education: B. Com
రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
Vizianagaram
![]() constituency: Cheepurupalli Age: 61 Education: B.A. రాజకీయ అనుభవం: నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. |
![]() constituency: Kurupam Age: 31 Education: B.Sc. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. |
Visakhapatnam

constituency: Bhimili
Age: 52
Education: Intermediate
రాజకీయ అనుభవం: ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యే
Age: 52
Education: Intermediate
రాజకీయ అనుభవం: ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యే
East Godavari
![]() constituency: Mandapeta Age: 69 Education: B.Sc. రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యే, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. |
![]() constituency: Amalapuram Age: 55 Education: B.Sc., B.Ed రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. |
![]() constituency: Kakinada Rural Age: 46 Education: B.Com, B.A. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యంలో కీలక నేతగా పనిచేశారు. |
West Godavari
![]() constituency: Kovvur Age: 45 Education: M.Sc. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
![]() constituency: Achanta Age: 66 Education: Intermediate రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
![]() constituency: Eluru Age: 49 Education: B Com రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం. కాంగ్రెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. |
Krishna
![]() Age: 47 Education: 10th Class రాజకీయ అనుభవం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
![]() constituency: Vijayawada (West) Age: 48 Education: 10th Class రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం. ప్రజారాజ్యం, కాంగ్రెస్, భాజపాలో పనిచేశారు. |
![]() constituency: Machilipatnam Age: 49 Education: B.Com. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. |
Guntur
![]() constituency: Prathipadu Age: 41 Education: B.A.Caste: SC రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. |
![]() constituency: Repalle Age: 55 Education: B.Com. రాజకీయ అనుభవం: మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. |
Prakasam
![]() constituency: Ongole Age 55 Education: Intermediate రాజకీయ అనుభవం: ఐదుసార్లు ఎమ్మెల్యే, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. |
![]() constituency: Yerragondapalem Age: 45 Education: I R S రాజకీయ అనుభవం: మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పీఏసీ సభ్యుడిగా, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. |
Nellore
![]() constituency: Atmakur Age: 45 Education: M.Sc. (Textiles) రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
![]() constituency: Nellore City Age: 39 Education: B D S రాజకీయ అనుభవం: ఒకసారి కార్పొరేటర్‌గా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు |
Kurnool
![]() constituency: Dhone Age: 47 Education: B.E. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం. పీఏసీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. |
![]() constituency: Alur Age: 51 Education: 10th Class రాజకీయ అనుభవం: జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. |
Chittoor
![]() constituency: Punganur Age: 67 Education: M.A. P. hd (Sociology) రాజకీయ అనుభవం: ఆరు సార్లు ఎమ్మెల్యే, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రి. |
![]() constituency: Gangadhara Nellore Age: 51 Education: B. Sc. రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. |
Kadapa

constituency: Kadapa
Age: 48
Education: B.A.
రాజకీయ అనుభవం: కార్పొరేటర్‌గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Anantapur

constituency: Penukonda
Age: 54
Education: B.Com. LLB
రాజకీయ అనుభవం: అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
Nani..Nani..Nani...
కొడాలి నాలుగోసారి..
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) నాలుగోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనే హ్యాట్రిక్ రికార్డు నమోదు చేసిన ఆయన నాలుగోసారి విజయం సాధించి తనకు తిరుగులేదనిపించుకున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన నాని తర్వాత వైకాపాలో చేరారు. 2014లో వైకాపా తరఫున గెలుపొందారు. తాజా ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేశారు. తెదేపాలో ఉన్నప్పుడు చురుకుగా వ్యవహరించేవారు. వైకాపాలో చేరిన తర్వాత దూకుడు పెంచారు.
ముచ్చటగా మూడోసారి ఆళ్ల
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆళ్లనాని వరుసగా మూడో సారి విజయం సాధించారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్ల నాని వరుసగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన సమీప ప్రత్యర్ధి, తెదేపా అభ్యర్థి అయిన మరడాని రంగారావుపై 33,053 ఓట్ల మెజార్టీని సాధించారు. 2009 ఎన్నికల్లో ఆళ్ల సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం అభ్యర్థి బడేటి బుజ్జిపై 13,682 ఓట్ల మెజార్టీని సాధించారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైకాపా తరఫున పోటీ చేశారు. ఆయన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి బడేటి బుజ్జిపై ఓటమి పాలవగా బడేటి బుజ్జికి ఆ ఎన్నికల్లో 24780 ఓట్ల మెజార్టీ లభించింది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైకాపా తరఫున పోటీచేసి గెలుపొందిన సంగతి విధితమే. ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి బడేటి బుజ్జిపై ఆళ్ల నానికి కేవలం 4072 ఓట్లు మెజార్టీ మాత్రమే దక్కింది.
నువ్వా నేనా అన్నంతగా పేర్ని
కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వైకాపా అభ్యర్థి పేర్ని వెంకట రామయ్య ( నాని) సమీప ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,590 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో 15 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన పేర్ని నాని..తాజా ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు తనకు మరింత బలాన్నిస్తాయని ఆయన ప్రగాఢ నమ్మకంతో ఉండేవారు. తాజాగా అదే నిరూపితమైంది. సామాజికంగానూ ఆర్థికంగానూ ఇద్దరు ప్రత్యర్థూలు బలంగా ఉండడం, ఇద్దరూ వివాదాలకు దూరంగా ఉండడంతో పోటీ కూడా అదే స్థాయిలో జరిగింది. చివరకు పేర్ని వెంకట్రామయ్య మరోసారి విజయం సాధించారు. పేర్ని నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికి పుచ్చుకున్న ఆయన 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున బందరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు.