
జగన్‌ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోందంటూ గురువారం రాత్రి టీవీల్లో వచ్చిన వార్తను చూసిన ఖమ్మం జిల్లా పాల్వంచలోని నెహ్రూనగర్‌కు చెందిన కాల్వ లక్ష్మయ్య (65) అదే విషయాన్ని భార్యాబిడ్డలతో చర్చిస్తూ కుప్పకూలిపోయాడు. దీంతో వారు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం గుడిపాడుకు చెందిన గరికిముక్కు రంగారావు (39) కూడా టీవీలో వార్తలు చూసి తీవ్ర మనోవ్యధకు గురయ్యూడు. దీంతో గురువారం రాత్రి గుండెపోటుకు గురయ్యూడని అతని తమ్ముడు రవి తెలిపాడు. బాధితుడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. మరో ఘటనలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సిద్దారెడ్డిపాళెం గ్రామానికి చెందిన సిగినం చినసుబ్బయ్య(42) కూడా జగన్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందన్న కథనాలకు కలతచెంది టీవీ చూ స్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందాడు.
0 Comment :
Post a Comment