వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై (ప్రవాస భారతీయుల) విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన కువైట్‌లోని ఖదసియా స్టేడియంలో ‘గల్ఫ్ ప్రవాసాంధ్ర ప్రస్థానం’ మహాసభ జరుగుతుందని కన్వీనర్ మేడపాటి వెంక ట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వైఎస్సార్ కాంగ్రెస్ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో ఇలియాస్ బి.హెచ్ సమన్వయకర్తగా జరుగుతున్న ఈ మహాసభకు పార్టీ ముఖ్య నేతలు జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, అంబటిరాంబాబు, హెచ్.ఏ.రెహ్మాన్, సురేష్‌బాబు, రాజ్ ఠాగూర్, రామ్మోహన్ హాజరవుతారని ఆయన తెలిపారు. వీరంతా 22న కువైట్‌కు ప్రయాణం అవుతున్నట్లు ఆయన వివరించారు. గల్ఫ్ ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభను ఒక వేదికగా ఉపయోగించుకుంటామనీ భవిష్యత్తులో మరిన్ని దేశాల్లో ఇటువంటి సదస్సు నిర్వహించబోతున్నామనీ ఆయన తెలిపారు.