తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక వై ఎస్ జగన్ మోహన్

అలనాటి ఎన్ టి రామా రావు గారిని మరపిస్తూ మన రాజన్న తనయుడు ఢిల్లీ అహంకారానికి బుద్ది చెప్పిన తీరు నభూతో న భవిష్యత్తు. ఈ విజయానికి ఉప్పొంగని తెలుగు గుండె అంటూ లేదు. కడప ప్రజలారా మీకు కృతఙ్ఞతలు.మీరు మొదలుపెట్టిన ఈ నూతన శకాన్ని రాష్ట్ర ప్రజలందరూ కొనసాగిస్తూ తెలుగు నేలను పులకింపజేస్తారు.

ఈ నూతన YSR కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రజల కనీస అవసారాలని తీరుస్తూ,తెలుప్రజల అభివృద్దికి పాటు పడుతూ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ను ముందుకు తీసుకు వెళ్తుంది అని ఆశిస్తున్నాను.

ఇప్పటికి పేదరికం తో అల్లాడుతూ,సరి అయిన అభివ్రుద్దిలేక అలమటిస్తున్న బహు జన ,తాడిత, పీడిత, కర్షక, కార్మిక వర్గాల తో పాటు మిగిలిన సమాజంలోని అన్ని వర్గాలను బహుముఖ అభివృద్ధి వైపు నడిపిస్తుంది అని ఆశిస్తున్నాను. ఈ YSR కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలని కాపాడుతూ,ఎ ఒక్క వర్గానికి కొమ్ము కాయకుండా,సమాజం లో అందరిని కలుపుకోనిపోతూ నవ సమాజానికి దిక్సూచి కావాలి.

కృష్ణుడు పుట్టగానే పురిటిలోనే చంపాలని చూసిన కంసుడి మాదిరిగా అన్ని రకాల ప్రజాస్వామ్య విలువలని కాల రాస్తూ అనధికార పొత్తుతో వ్యవహరించిన ఈ అధికార,ప్రతిపక్ష పార్టీలకు మీరు బుద్ది చెప్పిన తీరు అభినందనీయం. మీడియా విలువలని కాల రాస్తూ అందరు ఏకమై జగన్ యొక్క క్యారెక్టర్ అస్సాసినేసన్ చెయ్యడానికి ప్రయత్నించిన ఈ పచ్చ మీడియాకు మీరు ఇచ్చిన విలువ నాలుగు తరాలు గుర్తు పెట్టుకుంటారు.
ఇప్పటికయినా మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రం యొక్క విశాల ప్రయోజనాలకోసం పాటు పడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి. YSR కాంగ్రెస్ పార్టీ విజయ గర్వం తలకి ఎక్కించు కోకుండా,ప్రజా సమస్యల పై తమదయిన ఒక constructive ప్లాన్ తో ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలు మెచ్చే,రాష్ట్ర ప్రజలకి మేలు కలిగే పనులు చెయ్యాలని వినతి.

ఈ సందర్భంగా రికార్డు మెజారిటీ తో గెలిచన జగన్ గారికి,వారి పార్టీకి నా అభినందనలు.మీ రెండు సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కింది. సత్యమేవ జయతే.

ధన్యవాదములు,

వై ఎస్ జ"గన్" అభిమానిగా
మీ
జూలూరు వెoకట సురేష్ కుమర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
దుబాయ్
Next Post Previous Post