fvz

Wednesday, March 26, 2014

పార్టీలు పెట్టి అమ్ముకోవడంలో అన్నాదమ్ముళ్ల స్టైలే వేరట

'' పార్టీలు పెట్టి అమ్ముకోవడంలో అన్నాదమ్ముళ్ల స్టైలే వేరు. పార్టీలు పెట్టి అమ్ముకోవడంలో అన్నాదమ్ముళ్ల తర్వాతే ఇంకెవరైనా. అయినా ఎవరైనా ఫ్లాట్లు కొని అమ్ముకుంటారు.. లేదంటే ఇళ్లు కట్టి అమ్ముకుంటారు కానీ వీళ్లెవరండీ బాబు పార్టీలు పెట్టి బేరం చూసి అమ్మేసుకుంటున్నారు ''. ఇదంతా ఎవరో చెబుతున్న మాటలు కావు.. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ రాసుకుంటున్న రాతలు. అందుకు చక్కటి ఉదాహరణే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో. 
ఇదే తరహా సెటైర్లు ఇంటర్నెట్‌లో అనేకం కనిపిస్తున్నాయి. ఆయా పోస్టుల్లో వున్న వాళ్లని అభిమానించే వారికి ఇది అంతగా మింగుడుపడకపోవచ్చేమో గానీ మిగతావాళ్లు మాత్రం లైకులు, షేర్లు కొట్టుకుంటూ ఆయా పోస్టులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాపం ఈ పోస్టుల బారిన పడుతున్న వాళ్ల దురదృష్టం ఏంటంటే... వాళ్లని అమితంగా అభిమానించే వాళ్లలో కూడా కొంతమంది '' అరే ఇదిగో మనోడిని పలానా వర్గపోడు ఇలా అన్నాడు.. అలా అన్నాడు '' అంటూ ఆ పోస్టుల్ని నలుగురికీ పంచుతున్నారు(షేర్లు కొడుతున్నారు). ఫలితంగా వాటి గురించి తెలియని మరో నలుగురికి కూడా అవి చేరిపోతున్నాయి. '' మీ అభిమానం తగలెయ్య... మీ కామెంట్లు, ప్రతికామెంట్లతో మమ్మల్ని వెనకేసుకొచ్చినట్లే వేసుకొచ్చి నలుగురి ముందు మరింత నవ్వులపాలు చేస్తుర్రు కదరా '' అని ఆయా పోస్టులబారిన పడిన బాధితులు ఫీలవుతున్నారట.

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top