ఓ.కళ్యాణ్.. సినీ పరిశ్రమలో చాలామందికి సుపరిచితుడు. అందరితో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి కూడా. పలు సినిమాల్లో నటించినా, ఈయన ఎవరో ప్రేక్షకుల్లో చాలామందికి తెలియదు. ‘మా’ అధ్యక్ష ఎన్నికల పుణ్యమా అని ఓ.కళ్యాణ్ పేరు ప్రముఖంగా తెరపైకొస్తోంది. ‘మా’ ఎన్నికలు అక్రమమంటూ ఆయన కోర్టును ఆశ్రయించడమే అందుక్కారణం. గత నెలలో జరిగిపోయిన ఎన్నికల ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదంటే, అంతా ఓ.కళ్యాణ్ పుణ్యమే. ఎట్టకేలకు ఓ.కళ్యాణ్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం, ఎన్నికల ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయనగారికి చీవాట్లు పెట్టి, ఫైన్ కూడా వేసేసింది న్యాయస్థానం. అయినా ఓ.కళ్యాణ్ తగ్గలేదు. హైకోర్టును ఆశ్రయించారు. రేపు ఉదయాన్నే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈలోగా న్యాయస్థానం ఓ.కళ్యాణ్ పిటిషన్‌పై సానుకూలంగా స్పందిస్తే, ఆయనగారి పంతం నెగ్గినట్టవుతుంది. కింది కోర్టే నాలుగు చీవాట్లు పెట్టిందంటే, హైకోర్టు తక్కువలో తక్కువ పది చీవాట్లయినా పెట్టకుండా వుంటుందా.? అని ఓ.కళ్యాణ్ తీరు గురించి సినీ రంగంలో చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఓ.కళ్యాణ్ పట్టుదల దేనికోసం.? ఆయన ఉద్దేశ్యం ఏమిటి.? ఇదే ఎవరికీ అర్థం కావడంలేదు. ఇదో టైపు పబ్లిసిటీ స్టంట్ కాదు కదా.!!!
Friday, April 17, 2015
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comment :
Post a Comment