సాక్షి "డింగ్ - డాంగ్" ఇక లేనట్టేనా??


ధర్మవరపు సుబ్రహ్మణ్యం - ఆనందో బ్రహ్మ అంటూ బుల్లితెరపై నవ్వులు పూఇంచాడు. మాకు తెలుసు బాబు అంటూ వెండి తెరపై కితకితలు పెట్టాడు. వెల్ కం టు డింగ్-డాంగ్ అంటూ సాక్షి బుల్లితెరపై రాజకీయ నాయకుల మీద కామెడీ చేసాడు. సాక్షి ఛానల్లో ఈ ప్రోగ్రాం ఎంతో ఆకట్టుకునే విధంగా, సగటు సామాన్య మానవుడికి రాజకీయ చమక్కులు, చురకలు అర్థం అయ్యేలా రూపొందించి, ధర్మవరపు చేత హోస్ట్ చేయించారు. సాక్షి ఛానల్ లో నాలుగు సంవత్సరాల పాటు ఏకధాటిగా ప్రసారమయిన డింగ్-డాంగ్ తో సగటు ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అయి ఎంజాయ్ చేసాడు.

ఎంతో ప్రాచుర్యం పొంది, అవార్డ్స్ తేచి పెట్టిన ఇలాంటి ప్రోగ్రాంని ధర్మవరపు అకాల మరణంతో సాక్షి ఛానల్ కనుమరుగు చేసింది. ఎంత గొప్ప నటుడు అయినా,కళాకారుడు అయినా, రాజకీయ నాయకుడు అయినా ఏదో ఒక రోజు ఇక్కడ నుంచి శాశ్వత కనుమరుగు ప్రయాణం చేయాల్సిన వాళ్లే. ఇది జగమెరిగిన సత్యం. వ్యక్తులు కనుమరుగు అయినంత మాత్రాన ఎంతో గొప్పగా ప్రసారం చేసి, కీర్తించబడ్డ ఇలాంటి ప్రోగ్రామ్స్ ను ఆపి వేయటం తగదు అని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.


సాక్షి ఛానల్ ఇప్పటికి అయినా కళ్ళు తెరుచుకొని, ధర్మవరానికి ప్రత్యానయంగా, వేరే ఒక హోస్ట్ చేత ఈ ప్రోగ్రాం మళ్ళి రెగ్యులర్ గా  టెలికాస్ట్ చేయిస్తే సగటు ప్రేక్షకులు  ఆనందిస్తారు.


Next Post Previous Post