fvz

Thursday, January 10, 2019

నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటా: వైఎస్‌ జగన్‌





















పగటిపూటే 9 గంటల ఉచిత కరెంట్‌..
రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. 

పగటి పూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. 

ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం.. బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తాం. 


రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తాం.
పంట ఇన్సూరెన్స్‌ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆక్వా రైతుకు రూపాయిన్నరకే కరెంటు ఇస్తాం. 

గిట్టుబాటు ధరల కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం.

ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. 

ఈ రోజు లీటర్ పాలు రూ.26కు అమ్ముకుంటున్నారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు డైరీలను నాశనం చేశాడు. హెరిటేజ్‌లో మాత్రం అర లీటరు పాలు రూ.45కు అమ్ముతున్నారు. పాడి ప్రోత్సాహం కోసం.. లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తాం. సహకార రంగం డైరీలను ప్రతి జిల్లాలో ప్రోత్సహిస్తాం. 

వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తాం. 

ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా.. రూ. 4 వేల కోట్లు(రూ. 2వేల కోట్లు రాష్ట్రం ప్లస్ రూ. 2 వేల కోట్లు కేంద్రం ఇస్తుంది) ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెడతాం. కొబ్బెరి చెట్లుకు పరిహారం రూ. 3 వేలు ఇస్తాం. జీడి చెట్లకు ఇప్పుడు ఇస్తున్న రూ. 30 వేలును రూ.50 వేలుకు పెంచుతాం. 

రైతన్నకు జరగకూడని నష్టం ఏమైనా జరిగితే.. వైయస్ఆర్ బీమా కింద రూ. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబానికి ఇస్తాం. ఆ నష్టపరిహారం పూర్తిగా ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా చూసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. దాంతో అప్పుల వాళ్ళు లాక్కొనే అవకాశం ఉండదు. 

ప్రతి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తాం.’  అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
  • డ్రాక్రా మహిళల కోసం వైఎస్సార్‌ ఆసరా.. 89 మంది లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు ప్రస్తుతం ఎంత రుణం ఉందో దాన్ని నాలుగు విడతలుగా చెల్లింపు.
  • ఫించన్లు: ప్రస్తుతం ఉన్న ఫించన్ల వయస్సు 65 నుంచి 60కు తగ్గింపు. అవ్వతాతకి రూ.2000 ఫించన్‌, వికలాంగులకు రూ. 3000.
  • అమ్మఒడి : పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడొద్దు. పిల్లలను బడికి పంపితే చాలు ఏడాదికి ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు రూ. 500, ఇద్దరు పిల్లలకు రూ. 1000. ఆరో తరగతి నుంచి పదో తరగతి వారికి ఒక్కోక్కరి రూ.1000 చొప్పున ఇద్దరికి రూ. 2 వేలను నేరుగా తల్లలుకే అందజేత.
  • హౌసింగ్‌: పేదలకు 25 లక్షల ఇళ్లు, జన్మభూమి కమిటీలతో పనిలేకుండా ఇళ్ల కేటాయింపు
  • ఆరోగ్యశ్రీ : ఆరోగ్య శ్రీకి బడ్జెట్‌లో అవసరమైన నిధుల కేటాయింపు. సంపాదించే వ్యక్తికి ఆపరేషన్‌ అయితే విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్‌.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్: ప్రతి పేదవాడికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేల సాయం.
  • జలయజ్ఞం : పోలవరం సహా అన్ని ప్రాజెక్ట్‌లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి.
  • మద్య నిషేధం: మూడు దశల్లో మద్య నిషేధం, మొదటి దశలో దుకాణాల సంఖ్య తగ్గింపు. ఊరురా వెలిసిన బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం. షాక్‌ కొట్టేలా మద్యం ధరల పెంపు. రెండో దశలో పేద మధ్యతరగతికి మద్యం అందుబాటులోలేకుండా నిషేధం. మూడో దశలో ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో మాత్రమే మద్యం. తయారు చేసినా అమ్మినా ఏడేళ్లు జైలు శిక్ష పడేలా చట్ట సవరణ.
  • ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం
    పాదయాత్ర కవిటికి చేరుకున్న సమయంలో ఆటో డ్రైవర్లు జననేతను కలిసి తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఇన్సురెన్స్‌, ఫైన్లు, ఫిట్‌నెస్‌ ఫీజులను ప్రభుత్వం పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు.. వాటిని తగ్గించాలని వైఎస్‌ జగన్‌ను కోరారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జననేత హామీపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. 
ప్రజా సంకల్పం.. ప్రకాశం పరవశం
ఈ జిల్లా ప్రజలకు జగన్‌ వరాల జల్లులు కురిపించారు. బహిరంగ సభల్లో వాటిని ప్రకటించారు.అధికారంలోకి రాగానే రామాయపట్నం పట్నం పోర్టును నిర్మిస్తామని, రాళ్లపాడు ప్రాజెక్టును సైతం పూర్తి చేసి ఈ ప్రాంతవాసులకు  నీళ్లిస్తామని జగన్‌ కందుకూరు సభలో ప్రకటించారు.

♦ ఒంగోలు డెయిరీని అభివృద్ధి చేస్తానని, రైతులకు లీటరుకు 4 రూపాయలు సబ్సీడీ ఇచ్చి ఆదుకుంటామని  కొండపిలో జరిగిన రైతుసదస్సులో జగన్‌ హామీ ఇచ్చారు. పొగాకు రైతులను ఆదుకుంటామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. పంటలు నష్టపోయినవారిని ఆదుకొనేందుకు ప్రకృతి విపత్తుల నిధిని  ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

♦ సురక్షిత తాగునీరు అందించి కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకుంటామని కనిగిరి సభలో చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంతో పాటు పింఛన్లు అందజేస్తామన్నారు.

♦ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని పొదిలి సభలో జగన్‌ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు.

♦ గ్రానైట్‌ క్వారీలతో పాటు ఫ్యాక్టరీలకు రాయల్టీలో, విద్యుత్‌ చార్జీల్లో సైతం సబ్సీడీ ఇస్తామని చీమకుర్తి సభలో జగన్‌ హామీ ఇచ్చారు. 

♦ అధికారంలోకి వచ్చిన వెంటనే దొనకొండలో పరిశ్రమలు నెలకొల్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

♦ భవనాశి రిజర్వాయర్‌ పూర్తిచేసి అద్దంకి ప్రాంతానికి సాగు నీరందిస్తామని జగన్‌ అద్దంకి సభలో హామీ ఇచ్చారు.

♦ రైతులకు అన్ని పంటలకు గిట్టు బాటుధరలు కల్పిస్తామని ఈ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని జగన్‌ ఇంకొల్లు సభలో చెప్పారు.

♦ చేనేతలను ఆదుకుంటామని చీరాల సభలో జగన్‌ హామీ ఇచ్చారు.
వీటితో పాటు.. ప్రభుత్వం రాగానే వారం రోజులో సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించారు. మాల మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఆశ వర్కర్లుకు మిగిలిన రాష్ట్రాలలో కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతం లా అందిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాలని కందుకూరు సభలో నిర్ణయించారు. హోదాపై పోరు కోసం ఢిల్లీ యాత్రను ప్రారంభించారు. మార్చి 12 చివరి రోజున చీరాల రూరల్‌ మండలం ఈపురుపాలెం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో ప్రకాశం జిల్లాలో యాత్ర ముగిసింది. 

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top