WRITTEN BY RAJU . . .
వీరచరిత్ర వారసత్వంగా కలిగిన పలనాడులో జననేతపై అభిమానం పోటెత్తుతోంది.
మాటిచ్చి, దాన్ని నిలబెట్టుకుంటున్న వైనాన్ని పౌరుషాలకు ప్రాణంపెట్టే జనం కీర్తిస్తున్నారు.
ఆయన వ్యక్తిత్వానికి సలాం చెబుతున్నారు. మహానేత బిడ్డపై వెలకట్టలేని అనురాగాన్ని కురిపిస్తున్నారు.
రాళ్లు నిండిన నేలపై పూలు పరుస్తున్నారు. ఇదంతా మహానేతపై చెరగని ప్రేమకు తార్కాణం.
ఆ ప్రేమను కురిపించేందుకు వయోభేదం లేదు.. పలనాడు ఆడపడుచుల ఆప్యాయతలు.. యువకుల కేరింతలు.. వృద్ధుల దీవెనలు.. అభిమానుల అభివాదాలు..
సంప్రదాయ నృత్యాల నడుమ ఓదార్పుయాత్ర కదులుతోంది.