అజా :
అది కుట్రనో, ప్రమాదమో తెలియదు కాని ఆంధ్ర ప్రదేశ్ చేసుకున్న దురదృష్టానికి సరిగ్గా రెండేళ్ళు .. నిరంతర ప్రజా సేవలో పరితపిస్తూ వారి జీవితాలను,
కష్టాలను, నష్టాలను దగ్గరనుంచి పరిశీలించడానికై రచ్చబండ పేరుతో పేద ప్రజలను అక్కున చేర్చుకొని ఆదరించాల్సిన తరుణములో రాజశేఖరుడు మరణించినాడన్న వార్త విని గుండె బరువెక్కింది,
ప్రజల సంక్షేమము కోసం ప్రాణాలను ఆనందము గా అర్పించి నింగికెగసిన అపర భాగీరతుడి లేని లోటు తీర్చడము అనితర సాధ్యం. అవి “దూర దృష్టి 2020″ పేరుతో సామాన్య రైతు ని
భూమి నుంచి వేరు చేసి, వ్యవసాయం దండగ అంటూ, ప్రాజెక్టులు కట్టమంటే ఇంకుడు గుంతలు తవ్వించి, నీటి తీరువా సంఘాలు వేసి, ఇన్ని సార్లు కరెంటు చార్జీలు పెంచడము
అన్యాయమంటే నిర్దాక్షిణ్యం కాల్చిన ఏలికలు ఏలుతున్న నికృష్టపు రోజులవి. మేధావినని ఊహ లోకంలో విహరిస్తూ సామాన్యుడి మాటవినని ఏలిక, మీడియా మాయాజాలముతో
మయసభను మరిపించే రీతిలో గాలి మేడలు కట్టి పేద రైతుల కష్టాలను పట్టించుకోకుండా అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ని ఆకలి ఆంద్రప్రదేశ్ గా మార్చి ప్రజల ని ప్రయోగాలకు బలి పసువులను
చేసి ప్రాణాలను హరిస్తున్న వేళ నేనున్నానని ప్రజా ప్రస్తానముతో ప్రజలను కదిలించి వారి కష్టాలను గౌతమ బుద్ధిడి వలె తెలుసుకొని చలించి వారికోసమై ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి
అనూహ్యమైన ఆహారోత్పత్తికి రాజశేఖరుడు కారణమైనాడు. అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చగల దీరోధాత్తుడు మన రాజశేఖరుడు. ఉచిత కరెంటు తో తీగల మీద కరెంటు ఆరబెట్టు కోవచ్చు అన్న
నాయకుల కళ్ళు తెరిపించి రోజుకు ఏడు గంటల కరెంటునిచ్చి, పండిచిన ధాన్యానికి గిట్టు బాటు ధర కల్పించి, ఆత్మహత్యలను ఆపిన మహనీయుడు. జల యజ్ఞం పేరుతో రైతుల కష్టాలను శాశ్వతం గా
తీర్చడానికి వాటికి పెద్ద పీట వేసి, బూజు పట్టివున్న ఎన్నో ప్రాజెక్టులకు మోక్షం ప్రసాదించి, కృష్ణా నదిని గోదావరితో అనుసంధానము చేయ సంకల్పించిన అభినవ రాయలు. సామాన్య ప్రజలు ఇల్లు లేకపోతే
ఇందిరమ్మ ఇల్లు, ఆడ వారికి పావలా వడ్డికే రుణాలిచ్చి సమాజం లో గౌరవ స్థానాన్ని కల్పించినాడు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేద విద్యార్థికి ఫీజు చెల్లింపులు, స్కాలర్షిప్పు లు,
ఉన్నత విద్యకై IIIT లు, పరిశ్రమల అభివృద్ధి కోసం రాయితీలనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి చూపించినాడు. తెలుగు వెలిగింది ఈ స్వర్ణ యుగం లోనే, ప్రాచీన హోదా కలిగించి,
తర తమ భేదం లేకుండా పేద ముస్లిం విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించి ఎవరు కూడా ఆలోచన చెయ్యని పథకాలను ప్రవేసపెట్టిన నిత్య శ్రామికుడు రాజన్న. దాతలు దయ చూపండి అని పత్రికలలో
చూసి చలించి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీ, 108 మరియు 104 సర్వీసులు తెచ్చిన మనసున్న డాక్టరు. గెలిచినా, ఓడినా నాదే భాద్యత అని ఊరూరా తిరిగి తిరిగి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లో,
దేశం లో అధికారము లోనికి రావడానికి శ్రమించిన యోధుడు మన రాజశేఖరుడు. స్వర్ణ యుగాన్ని తలపించిన పాలన రాబోవు తరానికి ఒక నిఘంటువు .. ఆతని కి మరణం లేదు,
ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలచిన అజరామరునికి అశ్రు నయనాలతో నివాళులర్పిస్తూ .. స్మరిస్తూ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
- By Ranga Raju