ఉప ముఖ్యమంత్రి పదవికి 'వైఎస్.జగన్' సమ్మతం! ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉంటూ తన అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ రహస్య మంతనాలు జరుపుతున్న విషయం తెల్సిందే. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనికి తోడు మూడు రాష్ట్రాల ఎన్నికల ముగియడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. ఉప ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ ఆఫర్ చేయగా, దీనికి జగన్‌తో పాటు ఆయన కుటుంబ ఆప్తమిత్రుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు కూడా మౌనంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఈనెల 22వ తేదీన జగన్‌ను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీకి పిలిచి చెప్పనున్నట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా కె.రోశయ్యను కొనసాగించాలనే కృత నిశ్చయంతో అధిష్టానం ఉంది. అయితే, రోశయ్య వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు సహాయకుడిగా జగన్‌ను చేయాలని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల జగన్ వర్గాన్ని కొంతమేరకు సంతృప్తి పరుస్తూనే.. తాము చెప్పినట్టుగా రోశయ్య పాలన సాగించేలా చర్యలు తీసుకోనుంది.
Next Post Previous Post