fvz

Tuesday, April 24, 2012

ఏ రైతు పరిస్థితి చూసినా . . .ఏమున్నది గర్వకారణం ?

‘రాజశేఖరరెడ్డి సువర్ణయుగంలో పొగాకు ధర కేజీ రూ.120 పలికింది. ఇవాళ అదే పొగాకు ధర హైగ్రేడ్ అయితే రూ.110, లోగ్రేడ్ అయితే రూ.40 కూడా రావడంలేదు. సగటున 60, 70 రూపాయలు కూడా ధర రావడం లేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో పొగాకు రైతు సాగు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. పత్తి వేసుకున్న రైతు నుంచి చెరకు రైతు దాకా అందరి పరిస్థితీ ఇలాగే ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో రైతన్నా ఎలా ఉన్నావని అడిగితే ఇవాళ ఉన్న స్థితిలో వ్యవసాయం చేసే కన్నా ఉరి వేసుకుంటే మంచిదని చెబుతున్నాడని ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. రైతు కూలీల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉందన్నారు. చదువుకుంటున్న పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉందని, రంగారెడ్డి జిల్లాలో వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజు రీయింబర్స్‌మెంటు అందక, ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు, రైతులకు అండగా బాలరాజు సహా 17 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి తమ పదవులను సైతం వదులుకున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల్లో పేదలు, రైతుల బాధలు పాలకులకు తెలిసొచ్చేలా ఓటేయాలని ప్రజలను కోరారు.

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top