భారీ మెజార్టీతో గెలిపించండి: ఎన్నారైలు విజ్ఞప్తి

త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ లభించేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని వాషింగ్టన్ డీసీ ఎన్నారైలు ఆంధ్రపదే శ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడికి ఉపయోగపడేలా రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ గృహాలు,.... వంటి తొమ్మిది పథకాలను రూపొందించి అమలు పరిచిన మహా మనిషి దివంగత రాజశేఖర రెడ్డిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం చేస్తున్న క్షద్ర రాజకీయాలకు ముగింపు పలకాలని వారు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ప్రొద్భలంతో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. కిర ణ్ కుమార్ రెడ్డి మహానేత ప్రవేశ పెట్టిన ఒకోక్క పథకాన్ని కొండెక్కిస్తున్నారని అన్నారు.

ఈ ఎన్నికలు చిన్న సైజ్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని వారు తెలపారు. కడప పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో జగన్ అత్యధిక మెజార్టీతో ఎన్నికై రికార్డు సృష్టించారని, అదే విధంగా ఈ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మేజార్టీ వచ్చేలా ప్రజలు ఓట్ల వర్షం కురిపించాలని వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్‌లు తమకు ఎదురైన ఎన్నో అటాంకాలను అంకితభావం, ధైర్యం, తెలివితేటలు, బుద్దిబలంతో అధిగమించారని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గడపలో మహానేత ఫోటోని ఉందని, ప్రజలు ఆయనని ఎంతగా అభిమానిస్తున్నారో దీని ద్వారా తేటతెల్లం అవుతుందని చెప్పారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు తెలిపారు.

19 అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు జూన్12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Post Previous Post