కష్టాల నుంచి గట్టేక్కించే నాయకుడే ప్రజానేత

నాయకుడికి ప్రజలంతా బిడ్డలే. నేతకు దేశమంతా ఇల్లే. దేశ్‌కి నేతకు ప్రజలే పంచ ప్రాణాలు . ఏ ఒక్కరికి గాయం తగిలినా విలవిలలాడేవాడే నిజమైన నాయకుడు. ఏ ఒక్కరికి భోజనం లేకపోయినా తన కడుపు కాలినట్లు ఫీలయ్యేవాడే నిజమైన ప్రజానేత. తనకు ఉన్నంతలో సాయపడి ప్రజలను కష్టాల నుంచి గట్టేక్కించే నాయకుడే ప్రజానేత అవుతారు..

కాలింది షాపు కాదు..ఓ కుటుంబం భవిష్యత్తు. ఇక్కడ కాలింది వస్తువులు కాదు...ఈ షాపు యజయాని ఆశలు, కలలు. ఇలా వందల మంది భవిష్యత్తు ఇక్కడ బూడిదై కనిపిస్తోంది. తమ ఆవేదన తీర్చడానికి..కన్నీళ్లు తుడవడానికి ఏ ఒక్క నాయకుడు రాలేదని వీరు చెప్పే మాటలు వినేనా ప్రభుత్వ పెద్దల మనసు కరగాలి. సెక్యులర్ పార్టీ తమదే అని చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు తమ దగ్గరకు రాకుండా ఎక్కడున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌వి కుహాన సెక్యులర్‌ విధానాలని బాధితులు మండిపడుతున్నారు.

7వ తేదీ వరకు ఉప ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వచ్చిన జగన్ ఒక్క రోజు విశ్రాంతి అనంతరం సంగారెడ్డి వెళ్లారు. బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు చెప్పకుంటుంటే జగన్‌ మౌనంగా విన్నారు. జిరాక్స్‌ మిషనే తమ కుటుంబానికి ఆధారం అది తగలబడింది ఎలా బతకాలి అని ఓ సోదరుడు వేసిన ప్రశ్న. ఇక్కడ మాత్రం ఒక్కటి నిజం.. తగలబడింది జిరాక్స్‌ మిషన్‌ కాదు..భారత సెక్యులర్‌ వ్యవస్థని లౌకిక వాదులు అంటున్నారు.

కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధితులందరిని ఓదార్చే ప్రయత్నం చేశారు జగన్. అండగా ఉంటానని చెప్పారు. ఎప్పుడు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. నష్ట పరిహారం వచ్చే వరకు ప్రభుత్వంపై పోరాడుదామన్నారు. ఎంత నష్టపోతే అంతా నష్ట పరిహారం వచ్చే వరకు ఫైట్ చేద్దామన్నారు. వాజిద్‌, బుచ్చయ్యలకు ధైర్యం చెప్పారు జగన్. అందరిలో ప్రవహించేది రక్తమన్నారు జగన్‌. అల్లర్లు జరుగుతుంటే ఏమాత్రం స్పందించని పోలీసులపై చర్యలు తీసుకుని ప్రజల్లో భయాన్ని పారద్రోలన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసిన అల్లర్లు కాబట్టి ఆగవని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెప్పారు.

భారతీయ అంటే ఐకమత్యం, భారతీయత అంటే సోదరభావం. భారతీయత అంటే ఏకత్వం. భారతీయత అంటే తెలియని వాళ్లే అల్లర్లకు పాల్పడుతరని లౌకిక వాదులు అంటున్నారు.
Next Post Previous Post