సత్తి బాబు. . | బిగ్ బాసు

జిల్లాలో గురువు ప్రాపకం ఇచ్చాడని
అదే ప్రపంచం అనుకొన్నాడా.. లేదు
పెనమత్సనే పెనం నుండి తోసేసాడు

గురువును మార్చి గురి
పాదయాత్ర రాజన్నకు పెట్టి
పట్టాడు భారీ శాఖను
జనాలు సొమ్ములు పొతే
పోనాది ఏవిటి సేత్తాం అని సెప్పి
ఎత్తి సెప్పిన వాళ్ళను
మా యాస మీదే మీ వెటకారమా అని
సెంటిమెంటుతో యాష్ట పోయాడు

ఇక అయిపొయింది అనుకొని
అందరూ అంచనా వేస్తె
ఆశ్చర్యంగా బంధుగణ పరివారాన్ని
పదవుల్లో పెట్టాడు

గురువు అర్ధాంతరంగా పోతూనే
కుర్చీని ఆశించాడు
అధిష్టానం అనుష్టించిన ఆయనకు సరే అన్నాడు

పడి పోయే స్టాకు మార్కెట్లో
ఎదురు పడి కొనుగోలు చేసే ఎవ్వారం నేర్చిన వాడిలా
వేర్పాటు వాదం తప్పులేదని
మీడియాలో నానాడు
నాని నాని అందరివాడు అయ్యి
శాఖను మార్చిన కొత్త మేష్టారు పై గుర్రు మంటూనే
మనం మనం ఒకటి అని
మరో అందరివాడిని అక్కున చేర్చుకొని
విశ్వసనీయతను అధిష్టానానికి మార్చాడు
అంతే పార్టీ ఎ పి బ్రాంచికి బిగ్ బాసుగా వచ్చాడు.

అందుకే విశ్వసనీయతను
సమయానుకూలంగా మార్చాలి

Next Post Previous Post