CHICAGO NRI's STANDS FOR YS JAGAN DEEKSHA

రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్న యువనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు షికాగోలోని వైఎస్ అభిమానులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆదివారం షికాగోలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 200 మందిపైగా వైఎస్ మద్దతుదారులు హాజరయ్యారు. కడప లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన జననేత జగన్‌కు ఈ సందర్భంగా వారు అభినందనలు తెలిపారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ప్లీనరీకి మద్దతు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, సినీ నటి రోజా టెలీకాన్ఫెరెన్స్ ద్వారా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. కొండపల్లి సత్యనారాయణ, కాశిరెడ్డి శ్రీనివాసరెడ్డి, స్థానిక తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Post Previous Post