వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దివంగత వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అణచివేత వైఖరులకు సింగపూర్ ఎన్నారైలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో 72 గంటలపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం నాయకులు చేసిన దీక్షలకు వారు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సింగపూర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు, నాయకులు అయిన జయప్రకాశ్ రెడ్డి, నరేష్, జయప్రకాశ్, సత్యంశేఖర్, శివకేశవ్, ఈశ్వరరావు, సూర్యనాయుడు, గుంటిరామ్, జానకీరాం, చిన్నా, సురేష్, చెన్నారెడ్డి, లక్ష్మణ్, రామచంద్ర, సుబ్బారెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు జగన్ కు తమ సంఘీభావాన్ని తెలిపారు. హైదరాబాద్ లో దీక్ష చేసిన వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ కన్వీనర్ చల్లా మధుసూదన్ రెడ్డి, సభ్యుడు హర్షవర్థన్ రెడ్డి తదితరులకు తమ సంపూర్న మద్దతు ప్రకటించారు. జగన్ కు న్యాయం జరిగేంతర వరకు తాము కూడా పోరడతామని స్పష్టం చేశారు. ఆంధ్రా ప్రజలు ఇప్పటికీ, ఎప్పటికీ జగన్ తోనే కలసి నడుస్తారని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ లు చేస్తున్న కుట్రలకు రానున్న ఉప ఎన్నికల్లో ప్రజలు తమ బలం చూపించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే గెలుపు అని వారు పేర్కొన్నారు.





0 Comment :
Post a Comment