YSRCP DETROIT NRI's CELEBRATIONS

ఉపఎన్నికల ద్వారా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వాసాన్ని ప్రకటించారని డెట్రాయిట్‌లోని ఎన్నారైలు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నిలకొన్నాయి. వీటిని అధిగమించి రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు వేళ్లేలా చేయగల సత్తా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని వారు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయాన్ని అర్ధం చేసుకుని అన్ని పార్టీలు వైఎస్‌జగన్‌కు మద్దతు పలకాలని వారు సూచించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన 15 మంది వైఎస్‌ఆర్ పార్టీ ఎమ్మెల్యేలతోపాటు నెల్లూరు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన మేకపాటి రాజమోహన రెడ్డికి ఈ సందర్భంగా అభినందనలు తెలియచేశారు.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు శుక్రవారం తెల్లవారుజామున సంబరాలు జరుపుకున్నారు. అధికార, ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాతోపాటు సీబీఐ ఎన్ని కుట్రలు చేసిన, కక్ష సాధింపు చర్యలకు దిగిన ప్రజలే అసలు న్యాయనిర్ణేతలని ఈ ఎన్నికల ద్వారా రుజువు చేశారని డెట్రాయిట్ ఎన్నారైలు అభిప్రాయపడ్డారు.

ఎన్నారై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల హరి ప్రసాద్ రెడ్డి, యుంగధర్ భుమిరెడ్డి, వెంకట్ బీరం, సునీల్ మండుటి, వినోద్ ఆత్మకూర్,పురుషోత్తం కూకటి, టీ శ్రీధర్, జగన్, దేవనాథ్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, శ్రీనివాస్ పిడపర్తి, రమణ కొనుగంటి,శ్రీనివాస్ బర్ల, సాంబిరెడ్డి, బీవీరెడ్డి, నరేష్ పూల, వేణు కాగితాల, కొండారెడ్డి, ప్రదీప్, డాక్టర్ అశోక్ రెడ్డి ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
Next Post Previous Post