YSR FANS CLUB CELEBRATIONS IN USA

ఉప ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ లోక్‌సభ స్ధానాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల లాస్ ఏంజిల్స్‌లోని వైఎస్‌ఆర్ ఫ్యాన్స్ క్లబ్ హార్షం వ్యక్తం చేసింది. లాస్ ఏంజిల్స్‌లో టోర్రన్స్‌లోని బాంబే తండూరీ బోకె హాల్‌లో శనివారం మధ్యాహ్నాం వైఎస్‌ఆర్ ఫ్యాన్స్ క్లబ్ విజయోత్సవాల సంబరాలు జరుపుకుంది.

ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ప్రజలు ఇచ్చిన కానుకగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నంద్యాల వీరారెడ్డి అభివర్ణించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయ్యాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు కాలగర్భంలో కలిసి పోతాయని హెచ్చరించారు.
ఈ ఉప ఎన్నికల తీర్పు ద్వారా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఈ వేడుకల్లో భాగంగా వైఎస్‌ఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నంద్యాల వీరారెడ్డి, సలహాదారులు ధర్మారెడ్డి గుమ్మడి, నగేష్‌లు కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమాని ఆర్థికంగా తోడ్పాటు అందించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్లాస్‌మెట్, అమెరిన్ బిలియనీర్ డాక్టర్ ప్రేమ్‌రెడ్డికి ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నంద్యాల వీరారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించిన ఆరు జెట్ విమానాలు, హెలికాప్టర్‌లతో ఆకాశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయోత్సవాలను జరుపుకుంది. ఇవి ఆకాశంలో విన్యాసం చూపరులను అకట్టుకుంది.
ఈ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ విజయం ప్రజా విజయమని లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ తెలుగు నాయకుడు నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాకోర్టు అసలు సిసలు తీర్పును వెలువరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విజయం చేకూర్చిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించిన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అక్రమంగా వైఎస్ జగన్ అరెస్ట్, విజయమ్మ, షర్మిలా ప్రసంగాలు ఈ ఉప ఎన్నికల విజయానికి దోహాదపడిన అంశాలని నాగేశ్వరరావు పేర్కొన్నారు.

లాస్ ఏంజిల్స్‌లోని తెలుగు మహిళ నాయకులు పుష్పారెడ్డి, దివ్యా రెడ్డి బొమ్మారెడ్డి, ఉమాదేవి, కిరణ్మయి. సంధ్యలతోపాటు వైఎస్‌ఆర్ ఫ్యాన్స్‌క్లబ్ సభ్యులు రాజశేఖర రెడ్డి కసిరెడ్డి, అనిల్ మనేపల్లి, లక్ష్మణ్ రెడ్డి, సందీప్, ఇనగంటి శ్రీను, శ్రీకాంత్ రెడ్డి, సుధీర్ ఒబులం, మాధవ్ రెడ్డి, గౌతమ్, సుధీర్, మోహన్ రెడ్డి, రాజరెడ్డిలు ఈ కార్యక్రమ నిర్వహాణకు కీలక పాత్ర పోషించారు.


Next Post Previous Post