fvz

Saturday, January 03, 2015

క్రికెట్టా ప్లీజ్ ఛానల్ మార్చేయరా బాబూ...!!!

అప్పుడెప్పుడో సుమారు పది సంవత్సరాల క్రితం అనుకుంటా టీంఇండియా వెస్ట్ ఇండీస్ దీవుల్లో, సౌత్ఆఫ్రికా లో  టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే తెల్లవారుజామున టి.వీ లు పెట్టుకొని మన వాళ్ళు సిరీస్ గెలవడం కోసం కలిసి కట్టుగా ఆడే ఆట తీరు వేకువఝామునే నిద్ర లేపేది.

"మేము ఆస్ట్రేలియా కి బోర్డర్ గవాస్కర్ సిరీస్ గెలవటానికి వచ్హాము, అంతే కానీ ఆటగాల్లతో నెంబర్లు నింపటానికో, డ్రెస్సింగ్ రూంలో కబుర్లు చెప్పుకోవటానికో, ఆస్ట్రేలియా టూర్ ని ఎంజాయ్ చేయటానికో, ఇక్కడకి రాలేదు" - ఇవీ మన టీం ఇండియా డైరెక్టర్ రవి 'శాస్త్రి' గారి మీడియా ఉపోద్ఘాతాలు.

గ్రౌండ్ లో సెంచరీ కొట్టాలంటే గాలరీ లో గర్ల్ ఫ్రెండ్ ఉండాలీ,
ఒకవేల లక్ బాగుండి సెంచరీ బాదితే, బ్యాట్ తో ఫ్లయింగ్ కిస్ ఇవ్వటానికి గాలరీ లో గర్ల్ ఫ్రెండ్ ఉండాలీ, పొరపాటున క్యాచ్ పట్టుకుంటే నేనే పట్టుకుంది అని టి-షర్టు కాలర్ మడతేట్టి చూపించటానికి గాలరీ లో గర్ల్ ఫ్రెండ్ ఉండాలీ, రోడ్ల మీద బలాదుర్లు తిరగటానికి, నైట్ క్లబ్ లకి, పబ్ లకి, న్యూ ఇయర్ జరుపుకోవటానికి, చేపలు పట్టుకోవటానికి .... ఇలా ఒకటేమిటి ప్రతీ దానికీమన టీం ఇండియా మరియు తింగరి టెస్ట్ కెప్టెన్ గారి దగ్గర ఒక కారణం ఉంది.

ఆ కంగారూ ప్రైమ్ మినిస్టర్ న్యూ ఇయర్ ముందు రోజు టీ పార్టీ కి పిలిస్తే, అదేదో వేరే ప్లానెట్ లో ఉండే ప్రైమ్ మినిస్టర్ పిలిచినట్టుగా తయారు అయి వెళ్లారు మన టీం-ఇండియా బాబులు.పొద్దుల్ల మొత్తం బలాదుర్లు తిరగటం, గర్ల్ ఫ్రెండ్స్ మీద పెట్టే శ్రద్ధ, పార్టీల కోసం పడే ఆరాటం, ఆటలో ఏ మాత్రం ఉండదు. అదేంటో జట్టులో ఆడేది పూజార నో, రహనే నో అర్థం కాదు...చూడటానికి అందరి మొహాలు, ఎత్తు, లావు, రంగు, ఒకే రకంగా ఉంటాయి. (ఇషాంత్ మరియు అశ్విన్ మినహా)

"సిరీస్ గెలిస్తే మన కుర్రాళ్ళు కుమ్మేసారు, లేదంటే మన పిల్లలు (ఆటగాళ్ళు) ఇప్పుడిప్పుడే  కొంచం పాలు తాగటం, నడవడం నేర్చుకుంటున్నారు...మెల్లగా గాడిలో పడతారు...." ఇదీ మన టీం-ఇండియా రవి 'శాస్త్రి' గారి ఫైనల్ చరితం.

ఆ కంగారూ వాడిని ఆటలో కంగారు పెట్టి సిరీస్ ఎత్తుకోచ్చేయండ్రా బాబులు అని పంపిస్తే, వీళ్ళలో వీళ్ళే డ్రెస్సింగ్ రూములో మాటలతో కొట్టుకు చస్తారు, తన్నుకు చస్తారు.

ఇదేం టీం ఇండియారా నాయనా !!
క్రికెట్టా - చూడటం వళ్ళ కాదురా బాబూ...!!!

Written By - Ravi Chiguruganti

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top