రాజకీయ కక్ష సాధించేందుకే ప్రభుత్వం సాక్షి మీడియాపై దాడులు చేస్తోందని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియాను (సేవ్ సాక్షి) కాపాడండి అంటూ అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులు ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తున్నాయని అమెరికాలోని తెలుగువాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియా ఆస్తుల్ని అటాచ్ చేస్తూ నల్ల జీవోలను జారీ చేయడం సిగ్గు చేటని ప్రవాసాంధ్రులు విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్దని నినదిస్తూ.. లాస్ ఎంజిల్స్‌లో వైఎస్‌ఆర్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు నిరసన తెలిపారు. సాక్షిని రక్షించుకుంటామని నినదిస్తూ.. లాస్ ఎంజెలెస్‌లో వైఎస్‌ఆర్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు నిరసన తెలిపారు. సాక్షిని రక్షించుకుంటామని నినదిస్తూ సేవ్ సాక్షి అంటూ పోస్టర్లు పట్టుకొని సంఘీభావం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరి కారణంగా పారిశ్రామిక వేత్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వైఎస్‌ఆర్ ఫ్యాన్ క్లబ్ సభ్యుడు నాగేశ్వరరావు అన్నారు.





0 Comment :
Post a Comment